Breaking News

Health

కామారెడ్డికి మరో అంబులెన్సు

కామారెడ్డి, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎంపీ నిధుల‌ నుండి 17 ల‌క్షల విలువగల‌ అంబులెన్స్‌ను ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి ఎంపీ బిబిపాటిల్‌, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అందజేశారు. అలాగే రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో 10 స్ట్రేచర్‌ల‌ ను ప్రభుత్వ ఆసుపత్రికి అందజేశారు.

Read More »

నేను మీ మంత్రి ప్రశాంత్‌రెడ్డిని…

కామారెడ్డి, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేను మీ మంత్రి ప్రశాంత్‌ రెడ్డిని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ మీ యోగక్షేమాలు తెలుసుకొమ్మని నన్ను ఇక్కడికి పంపించారు. మీరు త్వరలోనే పూర్తిగా కోలుకుంటారు. ధైర్యంగా ఉండండి. మీకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసాం. ఆందోళన చెందొద్దు. ప్రభుత్వం మీకు పూర్తి అండగా ఉంటుంది. డాక్టర్లు, నర్సులు మీ బాగోగులు చూసుకుంటున్నారు. మీరు ఎంత ధైర్యంగా ఉంటే అంత త్వరగా కోలుకుని ఇంటికి వెళ్తారు. అని మంత్రి కోవిడ్‌తో ఐసియులో చికిత్స పొందుతున్న ...

Read More »

ఆరోగ్యానికి మేలు చేసే ఆకుకూరలు

నిజామాబాద్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పొన్నగంటి కూర: కంటి చూపును మెరుగుపరిచి, శరీరానికి చలువనిస్తుంది. ముల్లంగి: సర్వరోగ నివారిణిగా పనిచేస్తుంది. చింత చిగురు: రక్తాన్ని శుద్ధి చేసి కాలేయానికి పుష్టినిస్తుంది. చామకూర: కిడ్నీ, మూల‌వ్యాధుల‌ను అరికడుతుంది. పుదీన: గ్యాస్‌ సమస్యను నివారిస్తుంది. పాల‌కూర: కంటి సమస్యలు పోతాయి. తోటకూర: రక్తం పెరుగుదల‌కు ఉపయోగపడుతుంది. మెంతికూర: మూత్రాశయంలోని రాళ్లు కరిగిపోతాయి.

Read More »

గర్భిణీకి రక్తదానం

కామారెడ్డి, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ పట్టణ కేంద్రానికి చెందిన సల్మా బేగం అనే గర్భిణీ రక్త హీనతతో బాధపడుతుండటంతో వారికి కావసిన రక్తం దొరకక పోవడంతో బంధువులు కామారెడ్డి రక్తదాతల‌ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. కాగా వెంటనే వారికి కావల‌సిన ఏబి పాజిటివ్‌ రక్తాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ఎవరికైనా ఏ గ్రూపు రక్తం అయినా 9492874006 నంబర్‌కి సంప్రదించినట్లయితే వారికి కావాల్సిన రక్తాన్ని అందజేసి ప్రాణాల‌ను కాపాడుతామని అన్నారు. ...

Read More »

నిర్ణయించిన చార్జీలు మాత్రమే వసూలు చేయాలి

నిజామాబాద్‌, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలోని ప్రైవేటు ల్యాబ్‌ యాజమానులు కరోనా టెస్టుల‌ పేరుతో ఇష్టానుసారంగా డబ్బు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నందున జిల్లా కలెక్టర్‌ జిల్లా వ్యాప్తంగా ఆరు టాస్క్‌ ఫోర్స్‌ టీంల‌ను ఏర్పాటు చేసి మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. 23 కేంద్రాల‌లో తనిఖీలు చేసి కొన్ని కేంద్రాల‌లో సరియైన సౌకర్యాలు కల్పించట్లేదని విచారణలో తేలింది. వీటి విషయమై విచారణ అనంతరం చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని జిల్లా ...

Read More »

అధిక వసూలు చేస్తే కఠిన చర్యలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో అంబులెన్స్‌ డ్రైవర్లు అధిక రుసుము వసూలు చేస్తే చర్యలు తీసుకోవాల‌ని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఆదేశించినట్లు కామారెడ్డి ఆర్‌టివో వాణి ఒక ప్రకటనలో తెలిపారు. అంబులెన్స్‌ డ్రైవర్లు కోవిడ్‌ రోగుల‌ బంధువుల‌ వద్ద అధిక రుసుము వసూలు చేస్తే సెల్‌ నెంబర్‌ 9959106776 కు కాల్‌ చేసి ఫిర్యాదు చేయాల‌ని ఆమె కోరారు. నిబంధనలు ఉల్లంఘించి అధిక సొమ్ము వసూలు చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ...

Read More »

డాక్టర్లు కావలెను

కామారెడ్డి, ఏప్రిల్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో అలాగే జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి పరిధిలోని ఆయా పిహెచ్‌సిల‌లో కోవిడ్‌ 19 ఐసోలేషన్‌ వార్డులలో పనిచేయడానికి మూడునెల‌ల కొరకు కాంట్రాక్టు పద్దతిలో పనిచేయుటకు అర్హులైన వైద్యులు కావాల‌ని కామారెడ్డి జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పిఏఎస్‌ అనస్తియస్ట్‌ ఒక పోస్టు, సిఏఎస్‌ జనరల్‌ మెడిసిన్‌ ఒక పోస్టు, సిఏఎస్‌ జిడిఎంవో ఒక పోస్టు జిల్లా ఆసుపత్రి కామారెడ్డిలో అవకాశముందన్నారు. అలాగే పిహెచ్‌సిలో సిఏఎస్‌ ...

Read More »

కోవీడు కంట్రోల్‌ రూమ్‌ ప్రారంభించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ వైరస్‌కు సంబంధించి ప్రజల‌ నుండి ఫిర్యాదులు స్వీకరించడానికి జిల్లాస్థాయి, డివిజన్‌ స్థాయి కంట్రోల్‌ రూమ్‌ల‌ను జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ప్రారంభించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆయన జిల్లాస్థాయి కంట్రోల్‌ రూమ్‌ను పరిశీలించి వచ్చిన కాల్స్‌ వివరాల‌ను అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్‌ లో కాల్‌ చేసిన వారి వివరాల‌ను, సమస్యను నమోదు చేయాల‌ని సంబంధిత అధికారుల‌కు ఆ విషయాల‌ను తెల‌పాల‌ని 24 గంటలు కంట్రోల్‌ రూమ్‌ పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాల‌ని, అందుకు ...

Read More »

స్వీయ నియంత్రణ, మాస్కు దరించడమే శ్రీరామ రక్ష

కామారెడ్డి, ఏప్రిల్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై జిల్లా కలెక్టర్‌ కార్యాల‌యంలోని జనహిత సమావేశపు హాల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల‌తో రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల‌ శాఖ మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలోని పలు నిర్ణయాల‌ను మంత్రి మీడియాకు వెల్ల‌డించారు. కోవిడ్‌ రెండవ దశలో వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల‌ మేరకు ప్రధానంగా నాలుగు అంశాల‌పై చర్చించారు. జిల్లాలో అధిక సంఖ్యలో ...

Read More »

అసత్య ప్రచారం చేస్తే చట్టరీత్యా చర్యలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం పోసానిపెట్‌ గ్రామంలో కోవిడ్‌ టీకాతో ఓ వ్యక్తి మరణించారని అసత్య ప్రచారం చేస్తుండడంతో దీనికి వైద్యాధికారి, ఎస్‌ఐ, గ్రామ సర్పంచ్‌ స్పందించి వెంటనే అక్కడికి వెళ్లి విచారించారు. మరణ కారణం కోవిడ్‌ టీకా కాదని, ఇంటి సమస్యల‌తో ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు. కానీ కొందరు ఇలా అసత్య ప్రచారం చేశారు. ఇలా అసత్య ప్రచారాలు చేస్తే వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోబడుతాయని, ప్రజలు ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మవద్దన్నారు. కోవిడ్‌ ...

Read More »

కరోన సమయంలో రక్తదానం చేయడం అభినందనీయం

కామారెడ్డి, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన సువర్ణ అనే మహిళకు ఏ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకులు బాలుని సంప్రదించారు. వారికి కావల‌సిన రక్తాన్ని పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది బండారి సురేందర్‌ రెడ్డి మరియు దోమకొండకు చెందిన గణేష్‌ సహకారంతో రెండు యూనిట్ల రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడినట్టు తెలిపారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ ప్రస్తుతం కరోణ వ్యాధి విజృంభిస్తోన్న నేపథ్యంలో రక్తదానానికి ...

Read More »

కోటగిరిలో కోవిడ్‌ నిబంధనల‌పై అవగాహన

బాన్సువాడ, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోటగిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రచ్చగల్లి, చావిడి గల్లి, బస్టాండు, మార్కెట్‌, బిసి కాల‌నీ, వినాయక్‌ నగర్‌లో ప్రజల‌కు, దుకాణ యాజమానుల‌కు ‘‘కోవిడ్‌ 19’’ నిబంధనలు ప్రజలు అందరూ తప్పనిసరిగా పాటించాల‌ని నిజామాబాద్‌ పోలీస్‌ కళా బృందం వారి ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రజలు అందరు మాస్క్‌ తప్పకుండా ధరించాల‌ని, సోషల్‌ డిస్టెన్స్‌ తప్పకుండా పాటించాల‌ని, సానీటైజర్‌ వాడాల‌ని సూచించారు. అలాగే ప్రజలు అనవసరంగా బయట తిరుగవద్దని, ఎవరికైనా కరోన ...

Read More »

మాక్లూర్‌ క్వారంటైన్‌ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవీడ్ ల‌క్షణాలున్న వారికి చికిత్స అందించడానికి ఏర్పాటుచేసిన మాక్లూర్‌లోని క్వారంటైన్‌ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి పరిశీలించారు. శనివారం ఆయన వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ అధికారుల‌తో కలిసి పర్యటించి కోవిడ్‌ పాజిటివ్‌ ఉన్న పేషెంట్లకు ఏర్పాటుచేసిన సదుపాయాల‌పై ల‌క్షణాలున్న పేషెంట్లతో మాట్లాడి తెలుసుకున్నారు. వారికి త్రాగునీరు, ఆహారం, బెడ్స్‌, దుప్పట్లు, ఇతర సదుపాయాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాల‌న్నారు. 24 గంటలు వైద్యం అందుబాటులో ఉండే విధంగా సిబ్బందిని నియమించాల‌ని ఆదేశించారు. ...

Read More »

దేగాంలో వ్యాక్సినేషన్‌ అభియాన్‌

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోన వ్యాక్సినేషన్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా శనివారం దేగాం గ్రామంలోని ప్రభుత్వ ఆసుపత్రి కేంద్రంలో కరోన వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి ఆర్మూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి పొద్దుటూరి వినయ్‌ రెడ్డి ఆధ్వర్యంలో వాటర్‌ బాటిల్స్‌, బిస్కేట్స్‌ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల‌ అధ్యక్షు రోహిత్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కరోన రెండవ దశ చాలా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కట్టడికి ఉన్న మార్గాలు ఒకటి వ్యాక్సిన్‌ వేయించుకోవడం, రెండవది మాస్క్‌ ...

Read More »

కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న సిబ్బంది

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల‌ కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో శనివారం ఆయా గ్రామాల‌కు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది మొత్తం కలిపి 46 మందికి కరోనా వ్యాక్సిన్‌ చేయడం జరిగిందని మోర్తాడ్‌ గ్రామ పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. కార్యక్రమంలో డిఎల్‌పిఓ శ్రీనివాస్‌, ఎంపీడీవో శ్రీనివాస్‌ రెడ్డి, ఎంపిఓ తదితరులు పాల్గొన్నారు.

Read More »

కోవిడ్‌ కేర్‌ కేంద్రాలు రేపటి వరకు సిద్ధం చేసుకోవాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం నిజామాబాద్‌, బోధన్‌, ఆర్మూర్‌లో కోవిడ్‌ కేర్‌ కేంద్రాలు సిద్ధం చేసుకోవాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. శుక్రవారం సెల్‌ కాన్ఫరెన్సు ద్వారా వైద్య ఆరోగ్య, రెవెన్యూ అధికారుల‌తో మాట్లాడారు. కరోనా విస్తరిస్తున్న నేపధ్యంలో గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని తెలిపారు. మాక్లూర్‌లో వంద పడకల‌ స్థాయికి, ఆర్మూర్‌, బోధన్‌లో యాభై చొప్పున సిద్ధం చేసుకోవాల‌ని తెలిపారు. అదే విధంగా 24 గంటలు సిబ్బందికి విధులు కేటాయించాల‌నీ, అంబులెన్స్‌ ...

Read More »

కోవిడ్‌ చికిత్సల‌కు సిద్ధం కండి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశవ్యాప్తంగా, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కోవిడ్‌ కేసులు విస్తృతంగా పెరుగుతున్నందున ప్రభుత్వ ఆసుపత్రుల‌తో పాటు అనుమతించిన ప్రైవేట్‌ ఆసుపత్రుల‌లో కూడా తిరిగి పెద్ద సంఖ్యలో సేవ‌లు అందించడానికి సిద్ధంగా ఉండాల‌ని, ఏర్పాటు చేసుకోవాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ప్రైవేట్‌ ఆస్పత్రుల‌ యాజమాన్యాల‌ను‌ కోరారు. మంగళవారం తన ఛాంబర్లో ప్రైవేట్‌ ఆస్పత్రుల‌ యాజమాన్యాల‌తో కోవీడు వ్యాప్తిపై, తీసుకోవాల్సిన చర్యల‌పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోజురోజుకు వైరస్‌ ఉదృతి ఆందోళనకరంగా కనిపిస్తున్నదని ...

Read More »

కామారెడ్డిలో సెంచరీ దాటిన కరోనా కేసులు

కామారెడ్డి, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో సోమవారం కరోనా కేసులు సెంచరీ దాటాయి. జిల్లా వ్యాప్తంగా 103 కేసులు నమోదు కాగా, 14,434 కు చేరుకుంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో జిల్లా ప్రజలు, అధికారులు ఆందోళన చెందుతున్నారు. కరోనా బాధితుని ప్రైమరీ, సెకండరీ కాంటాక్టు వివరాలు సేకరించడంలో అధికారులు విఫల‌మవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కరోనా ల‌క్షణాల‌తో మాస్కులు లేకుండానే ప్రజలు బయట తిరుగుతున్నారు. గత మార్చి నెల‌లో 464 కరోనా కేసులు నమోదు కాగా, గడిచిన ...

Read More »

ఆసుపత్రి మూసివేత

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో నిష్కల్‌ న్యూరో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్వహిస్తున్న యజమాని డాక్టర్‌ నిష్కల్‌ ప్రభుకు కోవిడ్‌ పాజిటివ్‌ ఉన్నప్పటికీ అతను పేషెంట్లకు చికిత్సలు అందిస్తున్నట్లు ఫిర్యాదు రావడంతో ఆస్పత్రిపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ సుదర్శనం ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీ చేసి సిబ్బందికి కోవిడ్‌ చికిత్సలు నిర్వహించగా ఆస్పత్రిలోని 30 మందికి, సిబ్బంది 10 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు డిఎంఅండ్‌హెచ్‌వో తెలిపారు. ఆసుపత్రి యజమాని ప్రభుకు కూడా ...

Read More »

ఆపరేషన్‌ నిమిత్తమై వృద్ధునికి రక్తదానం

కామారెడ్డి, మార్చ్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ సాయి వైద్యశాల‌లో ఎల్లారెడ్డికి చెందిన ల‌తీఫ్‌ (80) సంవత్సరాల‌ వృద్ధునికి ఆపరేషన్‌ నిమిత్తమై ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన కమ్మరి నరేష్‌ చారి మానవతా దృక్పథంతో స్పందించి ఓ పాజిటివ్‌ రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు. రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన రక్తదాతను అభినందించారు. కార్యక్రమంలో సురేష్‌, టెక్నీషియన్‌ ...

Read More »