Breaking News

Hyderabad

ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగు నీరు అందించడమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యమని, నిజామాబాద్‌ జిల్లా ఇరిగేషన్‌ పనులపై అధికారులతో సమీక్షలో మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఉద్ఘాటించారు. నిజామాబాద్‌ జిల్లా పెండింగ్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై, ఆన్‌ గోయింగ్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆదేశాల మేరకు ఎర్రమంజిల్‌ ఆర్‌అండ్‌బి ఆఫీస్‌ లో సంబంధిత ఇరిగేషన్‌ అధికారులతో అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి, ఈఎన్సీ ...

Read More »

26న జాబ్‌మేళా

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేట్‌ రంగంలో ఉద్యోగాలను కల్పించుటకు ఈ నెల 26 (గురువారం) విజయ్‌నగర్‌ కాలనీలోని మల్లేపల్లి ఐటీఐ క్యాంపస్‌ వద్దనున్న జిల్లా ఉపాధి కార్యాలయంలో మినీ జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి మైత్రిప్రియ తెలిపారు. పేటీఎం, రిలయన్స్‌ డిజిటల్‌, చోళ ఎంఎస్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌, కాలిబర్‌, ఫిన్స్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ సర్వీసెస్‌, ఆర్‌బీఎల్‌ ఫిన్‌ సర్వ్‌ లిమిటెడ్‌ తదితర ప్రైవేట్‌ కంపెనీలలో హైదరాబాద్‌లో పని చేయుటకు ...

Read More »

అడవుల పెంపకం వాతావరణంలో మార్పు తెస్తుంది

నిజామాబాద్‌ న్యూస్‌ ప్రతినిధి, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అటవీ భూముల్లో అడవుల పునరుద్ధరణకు ప్రణాళిక రూపొందించి, కార్యాచరణ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు కలెక్టర్లను కోరారు. సామాజిక అడవుల పెంపకం, ఆవాస ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గించడానికి ఉపయోగపడితే.. అడవుల పెంపకం మొత్తం వాతావరణంలోనే మార్పు తెస్తుందని, వర్షాలు బాగా కురవడానికి జీవ వైవిధ్యానికి దోహద పడుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గం పరిధిలోని సింగాయపల్లి, నెంటూరు, కోమటి బండ తదితర ...

Read More »

శాసనసభ ఆవరణలో పతాకావిష్కరణ

నిజామాబాద్‌ న్యూస్‌ ప్రతినిధి, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఆవరణలో రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి గురువారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సిద్దిపేట శాసనసభ్యులు టి.హరీష్‌ రావు, అసెంబ్లీ కార్యదర్శి డా.నరసింహా చార్యులు తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఎంతో ఆలోచించి కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి తొలగించాం

నిజామాబాద్‌ న్యూస్‌ ప్రతినిధి, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 అమలును ఆయుధంగా మలచుకొని పాకిస్థాన్‌ నిరంతరం ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి తొలగించి చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఒకటే భారత్‌.. ఒకటే రాజ్యాంగం కల సాకారమైందన్నారు. గురువారం రాత్రి ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి జమ్మూకశ్మీర్‌ అంశంపై కీలక ప్రసంగం చేశారు. దేశ ప్రజల అభ్యున్నతి కోసం చేసిన ...

Read More »

భారతరత్న పురస్కారాలు…

నిజామాబాద్‌ న్యూస్‌ ప్రతినిధి, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రపతి భవన్‌లో భారతరత్న పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. 2019 ఏడాదికి గాను దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ముగ్గురికి ప్రకటించగా.. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ గురువారం అవార్డులను ప్రదానం చేశారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, దివంగత సంఘ సంస్కర్త నానాజీ దేశ్‌ముఖ్‌, దివంగత దర్శక నిర్మాత, ప్రముఖ సంగీత విద్వాంసుడు భూపేన్‌ హజారికాకు భారతరత్న పురస్కారాలు వరించాయి.

Read More »

వికలాంగుడికి భరోసా ఇచ్చిన కేటీఆర్‌..

నిజామాబాద్‌ న్యూస్‌ ప్రతినిధి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌. దేవరకొండ నియోజకవర్గానికి చెందిన పార్టీ సినియర్‌ నేత పల్లె కష్ణయ్యకు అండగా నిలిచారు కేటీఆర్‌. కష్ణయ్యను అన్ని విధాల ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. గతంలో ఒక రోడ్డు ప్రమాదంలో తన కాలును పోగొట్టుకున్న కష్ణయ్యకు కేటీఆర్‌ సూచన మేరకు కత్రిమ కాలును అందించడం జరిగింది. రెండు వారాల క్రితం కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్‌ ఏ స్మైల్‌ ...

Read More »

రైతుబీమా పథకం మరో ఏడాది కొనసాగింపు

నిజామాబాద్‌ న్యూస్‌ ప్రతినిధి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2019 ఆగస్టు 14 నుంచి 2020 ఆగస్టు 13 వ తేదీ వరకు రైతుబీమా పథకం కొనసాగనుంది. 31.10 లక్షల మంది రైతులకు రైతుబీమా పథకం అమలవుతుంది. ఒక్కో రైతుకు 3013.50 ప్రీమియంతో 5 లక్షల బీమా లబ్ది చేకూరనుంది.

Read More »

కేసీఆర్‌ మోడల్‌ హౌస్‌ !

నిజామాబాద్‌ న్యూస్‌ ప్రతినిధి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రూ. 3.24 లక్షల్లోనే డబుల్‌ బెడ్‌రూం ఇల్లు 15 రోజుల్లో పదిమంది కూలీలతో నిర్మాణంకరీంనగర్‌లో యువబిల్డర్‌ ప్రయోగం సక్సెస్‌ ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. ఈ రెండు పనులూ కష్టసాధ్యమనే ఉద్దేశంతోనే అలా చెప్పారు. ఇప్పుడు రోజులు మారాయి. అంతా రెడీమేడ్‌ యుగం. కేవలం పదిహేను రోజుల్లోనే డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు నిర్మించవచ్చు! మీరు విన్నది నిజమే. కరీంనగర్‌ శివారు బొమ్మకల్‌ బైపాస్‌ ...

Read More »

కాశ్మీరు ఎవరిది?

నిజామాబాద్‌ న్యూస్‌ ప్రతినిధి, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వాట్సాప్‌లో వచ్చిన కన్నడ వ్యాసానికి తెలుగు సేత వింగ్‌ కమాండర్‌ సుదర్శన్‌ రచన ఇది, కశ్యప మహర్షి పేరుతో ఏర్పడిన ప్రదేశము ‘మైరా’ అనే సంస్కత పదానికి అర్థము ‘సరోవరము’ అని. ఈ మన్వంతరములోని సప్త ఋషులలో ఒకరు కశ్యపుడు. ఇతడు బ్రహ్మ దేవుని మనవడు. ఇతడి తండ్రి మరీచి మహర్షి. ఈ మరీచి బ్రహ్మ దేవుని మానస పుత్రుడు. దక్ష ప్రజాపతి తన పదముగ్గురు కుమార్తెలనూ కశ్యప మునికి ...

Read More »

జైపాల్‌రెడ్డి భౌతిక కాయానికి సురేశ్‌రెడ్డి నివాళి

హైదరాబాద్‌, జూలై 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూబ్లీహిల్స్‌లో జైపాల్‌ రెడ్డి భౌతిక కాయానికి మాజీ స్పీకర్‌ సురేష్‌ రెడ్డి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. విద్యార్థి నాయకుడిగా జైపాల్‌ రెడ్డి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారని, జైపాల్‌ రెడ్డి వాయిస్‌ ఎప్పుడు ప్రజా సమస్యల పక్షాన్నే ఉండేదని సురేశ్‌రెడ్డి గుర్తుచేశారు. నేటి యువతరానికి ఆయన ఎంతో ఆదర్శప్రాయమని, గొప్ప అభ్యున్నత భావాలు కలిగిన వ్యక్తి జైపాల్‌రెడ్డి అని అన్నారు. నిక్కచ్చిగా మాట్లాడే వ్యక్తి జైపాల్‌ ...

Read More »

ఉద్రిక్తంగా మారిన ఛలో ప్రగతిభవన్‌

నిజామాబాద్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిడిఎస్‌యు చేపట్టినబి ఛలో హైదరాబాద్‌ ప్రగతి భవన్‌ ఉద్రిక్తంగా మారింది. ప్రైవేటు యూనివర్సిటీలను అనుమతించొద్దని, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పీజీ కోర్సులు ఎత్తివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పిడిఎస్‌యు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఛలో ప్రగతి భవన్‌ (హైదరాబాద్‌) కార్యక్రమం శుక్రవారం చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులను అరెస్టు చేసి, వివిధ పోలీస్‌ స్టేషన్‌లకు తరలించారు. అరెస్టయిన వారిలో పిడిఎస్‌యు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జూపాక శ్రీనివాస్‌, బోయినపల్లి రాము, ...

Read More »

శాసనసభ ఆవరణలో బోనాల పండగ

బాన్సువాడ, జూలై 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ శాసనసభ ఆవరణలోని బంగారు మైసమ్మ దేవాలయంలో మంగళవారం ఘనంగా బోనాల పండగ నిర్వహించారు. శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి దంపతులు బోనాల పండగలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. బోనాలు సమర్పించారు. కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటి ఛైర్మన్‌ నేతి విద్యాసాగర్‌, అసెంబ్లీ సెక్రెటరీ నర్సింహాచారి, సిబ్బంది పాల్గొన్నారు.

Read More »

స్పీకర్‌ను కలిసిన శిక్షణ ఐఏఎస్‌లు

హైదరాబాద్‌, జూలై 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ అసెంబ్లీ లోని స్పీకర్‌ చాంబర్‌లో శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస రెడ్డిని శుక్రవారం కలిసిన శిక్షణ ఐఏఎస్‌లు మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ కేడర్‌కు చెందిన శిక్షణ ఐఏఎస్‌లు తమ ట్రైనింగ్‌లో బాగంగా శుక్రవారం అసెంబ్లీ సమావేశాలను పరిశీలించీ అనంతరం స్పీకర్‌ పోచారంను కలిసారు. ఈసందర్భంగా శిక్షణ ఐఏఎస్‌లకు శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్‌ పేద ప్రజలకు సేవ చేసే అవకాశం లభించడం అదష్టంగా భావించాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు రెండు కళ్ళు ...

Read More »

జర్నలిస్టు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

హైదరాబాద్‌, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల రోడ్డు ప్రమాదంలో మతి చెందిన హైదరాబాద్‌ కవాడిగూడ నమస్తే తెలంగాణ రిపోర్టర్‌ విజయ్‌ కుమార్‌ కుటుంబానికి సోమవారం ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. కవాడిగూడలోని ఆయన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, శాసన సభ్యులు ముఠా గోపాల్‌, నవ తెలంగాణ ఎడిటర్‌ ఎస్‌.వీరయ్య, స్థానిక కార్పోరేటర్‌ లాస్య నందితలు పాల్గొని విజయ్‌ భార్యకు ఐదు లక్షల ఎఫ్‌డీ బాండ్‌, ...

Read More »

జర్నలిస్టుల సంక్షేమ ఘనత కేసీఆర్‌దే

హైదరాబాద్‌, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు అండగా ఉండడంతో పాటు వారి సంక్షేమానికి భరోసా కల్పించిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదేనని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ తెలిపారు. తెలంగాణ పోరాటంలో పాల్గొన్న జర్నలిస్టుల కోసం వంద కోట్లతో జర్నలిస్టుల సంక్షేమ నిధి ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనన్నారు. శనివారం మధ్యాహ్నం మాసబ్‌ ట్యాంక్‌, సమాచార భవన్‌లో మీడియా అకాడమీ కార్యాలయంలో జర్నలిస్టుల సంక్షేమ నిధి నుండి 16 మంది ...

Read More »

కువైట్‌లోని 92 కంపెనీలపై నిషేధం

కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించిన భారత విదేశాంగ శాఖ వెబ్‌సైట్‌లో జాబితా ప్రకటించిన అధికారులు కువైట్‌ వెళ్లే కార్మికులు జాగ్రత్తపడాలని సూచన హైదరాబాద్‌, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కువైట్‌లో నిబంధనల ప్రకారం వ్యవహరించకుండా కార్మికులను రోడ్డున పడేస్తున్న కంపెనీలను భారత విదేశాంగ శాఖ నిషేధించింది. ఈ కంపెనీలు కార్మికులకు పని కల్పించే పేరిట వీసాలను జారీచేసి కువైట్‌కు చేరిన తరువాత కార్మికులను పట్టించుకోవడం లేదని పేర్కొంది. ఈ విధమైన 92 కంపెనీలను గుర్తించి వాటిని బ్లాక్‌ లిస్టులో ...

Read More »

ప్రముఖ హాస్యనటుడు కన్నుమూత

హైదరాబాద్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రముఖ సినీ హాస్యనటుడు రాళ్లపల్లి (73) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని మ్యాక్స్‌క్యూర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. 850 కి పైగా చిత్రాల్లో నటించిన రాళ్ళపల్లి అసలు పేరు రాళ్లపల్లి నర్సింహారావు, 1979 లో ‘కుక్కకాటుకు చెప్పు దెబ్బ’తో సినీ రంగ ప్రవేశం చేశారు. 1945 ఆగస్టు 15న అనంతపురం జిల్లా కంబదూరులో రాళ్లపల్లి జన్మించారు. సీనియర్‌ నటుడు రాళ్లపల్లి మతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ...

Read More »

సిద్దిపేటలో బ్లాస్టింగ్‌ దాటికి నేలరాలిన విద్యార్థి

సిద్దిపేట, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా రంగాయక సాగర్‌ నుండి మల్లన్న సాగర్‌ మధ్య కాలువ పనుల్లో భాగంగా బ్లాస్టింగ్‌ జరుగుతున్న సమయంలో శుక్రవారం మధ్యాహ్నం రాతి శకలాలు వచ్చి హాస్టల్‌ విద్యార్థి తలపై పడి మతి చెందాడు. మెదక్‌ జిల్లా రామయంపేట్‌ మండలం చల్మేడ గ్రామానికి చెందిన చిట్టి సురేష్‌ అనే విద్యార్థి సిద్దిపేట డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతూ తొర్నల్‌ హాస్టల్‌లో ఉంటున్నాడు. డిగ్రీ మొదటి సంవత్సరం 2వ సెమిస్టర్‌ పరీక్షలు ...

Read More »

ద్విచక్ర వాహనం ఢీకొని బాలుడి మతి

హైదరాబాద్‌, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ద్విచక్ర వాహనం ఢీకొని బాలుడు మతి చెందిన సంఘటన మేడ్చల్‌ జిల్లా జవహార్‌ నగర్‌ పి.యస్‌ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతున్న హరికష్ణ అనే ఐదు సంవత్సరాల బాలుడి పైకి వేగంతో ద్విచక్ర వాహనం తీసుకువెళ్లడంతో తీవ్ర గాయాలు కాగా గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మతి చెందాడు. బాధిత కుటుంబీకులు తమకు న్యాయం చేయాలని జవహార్‌ నగర్‌ పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించారు. పదిహేను రోజుల ...

Read More »