Breaking News

Induru

చాగంటి కోటేశ్వర్‌రావును కలిసిన ఇందూరు వాసులు

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర్‌రావును నిజామాబాద్‌నగరానికి చెందిన పలువురు ఆధ్యాత్మిక వేత్తలు, ప్రతినిదులు గురువారం పెద్దపల్లి జిల్లా మంథనిలో కలిశారు. ఈ సందర్భంగా చాగంటిని ఇందూరు నగరానికి ఆహ్వానించగా ఆయన ఈ విషయంపై ఆసక్తి కనబరిచి జూలై నెలలో ఇందూరు నగరానికి వస్తానని, చారిత్రక నిలయమైన ఇందూరు అంటే తనకు ఎంతో ఇష్టమని, త్రివేణి సంగమం కందకుర్తి ఎంతో ఇష్టమని, తప్పకుండా ఇందూరును సందర్శిస్తానని ఆయన తెలిపారు. ...

Read More »

సెప్టెంబరు 25, 26, 27 తేదీల్లో ఇందూరు ఉత్సావాలు

  – జిల్లా కలెక్టర్‌ నిజామాబాద్‌, ఆగష్టు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెప్టెంబరు 27వ తేదీ ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర పర్యాటక శాఖచే జిల్లాలో మూడు రోజల పాటు ఇందూరు ఉత్సావాలు నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా తెలిపారు. బుధవారం సాయంత్రం తన చాంబరులో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఇందూరు ఉత్సవాల ఏర్పాట్లను చర్చించారు. ట్రెకింగ్‌, విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలతలో పాటు జిల్లాలోని చారిత్రక పర్యాటక ప్రాంతాలను సందర్శింపజేసేందుకు టూరిజం సర్క్యుట్‌ పర్యటన ...

Read More »

తెలంగాణ జాగృతి పదవ వార్షికోత్సవ ప్రతినిధుల సభ

తెలంగాణ జాగృతి పదవ వార్షికోత్సవ ప్రతినిధుల సభ నల్లగొండలో జరుగనుంది. ఆగస్టు 5, 6 తేదీలలో జరగబోయే ఈ ప్రతినిధుల సభకు రాష్ట్రం నుండి దేశం నుండి 2 వేల మంది ప్రతినిధులు హాజరవనున్నారు. ఈ సమావేశాల్లో జాగృతి పదేళ్ల ప్రస్థానం యొక్క సింహావలోకనం తో పాటు భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. ఆగస్టు 5 వ తేదీన నల్లగొండలో తెలంగాణ జాగృతి స్కిల్ డెవెలప్ మెంట్ సెంటర్ ను అధ్యక్షులు శ్రీమతి కల్వకుంట్ల కవిత ప్రారంభిస్తారు. అనంతరం రెండు రోజులపాటు జరిగే సమావేశాల్లో గత ...

Read More »

జిల్లా రైతులకు రాయితీపై వరి విత్తనాలు

ఇందూరు: నిజామాబాద్‌ జిల్లా రైతులకు వరి విత్తనాలను రాయితీపై ఇవ్వనున్నట్లు వ్యవసాయ, ఉద్యాన, సహకార శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. సోమవారం ఖరీఫ్‌ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ, సహకార శాఖ అధికారులతో నిర్వహించిన వీసీలో ఆయన మాట్లాడారు. పంట రుణాల పంపిణీతో పాటు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు సరఫరా చేస్తూ, రైతులు పండించిన పంటలను కొనుగోలు చేసే కేంద్రాలుగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. రైతుల బండికి జోడెద్దులుగా వ్యవసాయ, సహకారశాఖ అధికారులు వ్యవహరించాలని సూచించారు. ...

Read More »

రెండింటా… మెరిశారు..!

ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో కాస్త మెరుగు ప్రథమంలో ఏడు నుంచి మూడో స్థానం ద్వితీయంలో నాలుగో స్థానంలో జిల్లా మూడు రాష్ట్ర స్థాయి ర్యాంకులతో కాకతీయ విద్యార్థుల ప్రభంజనం నిజామాబాద్‌ విద్యావిభాగం, ఇందూరు సిటీ, న్యూస్‌టుడే : ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ఫర్వాలేదనిపించారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థుల ఫలితాలను శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ఏకకాలంలో విడుదల చేసింది. ఈ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమంలో మూడో స్థానం.. ద్వితీయంలో నాలుగో స్థానంలో జిల్లా నిలిచింది. నిరుడు ఫలితాలతో పోలిస్తే ప్రథమంలో ఏడో ...

Read More »

ఇందూరు గంజ్ ఇక నామ్ యార్డు..!

  -ఆన్‌లైన్ ట్రేడింగ్‌కు నేడు శ్రీకారం -ప్రారంభించనున్న ప్రధాని మోదీ -హాజరవనున్న మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు -ఈ మార్కెటింగ్ ద్వారా క్రయ విక్రయాలు -ఇందూరు రైతులతో ప్రధాని మాటామంతి… నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ జాతీయ మార్కెట్‌గా మారనుంది. ఈనెల 14న అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని దేశంలోని వ్యవసాయ మార్కెటింగ్ యార్డులను అనుసంధానం చేసే ఏకీకృత మార్కెటింగ్ విధానాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. జాతీయ వ్యవసాయ మార్కెట్‌ంగ్ కింద మొదటి దశలో దేశవ్యాప్తంగా ఏకీకృతం చేసే 250 మార్కెట్‌లలో తెలంగాణ నుంచి ...

Read More »

ఇందూరు గొప్ప చారిత్రాత్మక జిల్లా

  – జితేంద్ర బాబు డిచ్‌పల్లి, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా క్రీస్తు పూర్వం నుంచి ఘనమైన చరిత్ర కలిగిన ప్రాంతమని ప్రఖ్యాత చరిత్రకారుడు కుర్రా జితేందర్‌ అన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామం, ప్రతి ప్రాంతం చరిత్ర పరిశోదకులకు ఒక విజ్ఞానగని వంటిదని ఆయన అన్నారు. సోమవారం తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ చాంబర్‌లో రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి, ఓరియెంటల్‌ కళాశాల మాజీ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ జైకిషన్‌లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. మానవ జాతి చరిత్రలో బరిసెలు, ఈటెలు, ...

Read More »

నిజామాబాదు జిల్లా చరిత్ర

జిల్లా పేరు వెనుక చరిత్ర నిజామాబాదును 8వ శతాబ్దములో రాష్ట్రకూట వంశానికి చెందిన ఇంద్రవల్లభ పాంత్యవర్ష ఇంద్ర సోముడనే రాజు పరిపాలించాడు. అతని పేరుపైననే ఈ ప్రాంతానికి ఇందూరు అని పేరు వచ్చినది. ఇందూరుకు పూర్వం పేరు ఇంద్రపురి. ఇంద్రపురి అని ఒక రాజు పేరు మీదుగా పేరు వచ్చిందని భావించబడుతున్నది. కానీ ఆ రాజు క్రీ.శ.388 ప్రాంతంలో నర్మదా, తపతిల దక్షిణ ప్రాంతాన్ని పాలించిన త్రికూటక వంశానికి చెందిన ఇంద్రదత్తుడా, విష్ణుకుండిన చక్రవర్తి మొదటి ఇంద్రవర్మనా ఇదమిద్ధంగా తెలియడం లేదు. 20వ శతాబ్దం ...

Read More »

బిసి కులాలకు ఉప ప్రణాళిక బడ్జెట్‌ను కేటాయించాలి

  ఇందూరు, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర వెనకబడిన కులాల ఐక్యకార్యాచరణ సమాఖ్య ఆధ్వర్యంలో బిసి కులాల సమరభేరిని మంగళవారం స్థానిక మున్నూరు కాపు కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షులు ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ బిసి కులాలకు ఉప ప్రణాళిక బడ్జెట్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలన్నారు. బిసి కులాల ఫెడరేషన్‌కు ఎక్కువ నిదులను టార్గెట్‌ను పెంచేవిధంగా చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బ్యాంకు రుణాల కొరకు బ్యాంకుల అనుమతి ఇప్పించడానికి ప్రత్యేక ప్రభుత్వాధికారిని నియమించాలని ...

Read More »

సుందర నగరంగా ఇందూరు

  – ఎంపి కవిత ఇందూరు, సెప్టెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అతిత్వరలో నిజామాబాద్‌ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు మరుగున పడ్డాయని, ఇకముందు అన్ని విధాలుగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం నగరంలోని పలు కాలనీల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నగర పాలకసంస్త కార్పొరేటర్లతో అభివృద్ది పనులపై చర్చించిన తర్వాత విలేకరులతో మాట్లాడారు. ...

Read More »

గందరగోళంగా ఎడ్‌సెట్‌ కౌన్సిలింగ్‌

  ఇందూరు, సెప్టెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో రెండవరోజు ఎడ్‌సెట్‌ కౌన్సిలింగ్‌ గందరగోళంగా మారింది. ర్యాంకులు బట్టి కాకుండా ఇస్టారాజ్యంగా సర్టిఫికెట్ల పరిశీలన జరుపుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కౌన్సిలింగ్‌ నిర్వాహకుల ఇష్టారాజ్యం వల్ల ప్రతిభగల విద్యార్థులు నష్టపోవాల్సి వస్తుందని తెలిపారు. నగరంలోని గిరిరాజ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం నుంచి ప్రారంభమైన కౌన్సిలింగ్‌లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. అయితే రెండోరోజు ఒకటి నుంచి 6 వేల ర్యాంకు వరకు కౌన్సిలింగ్‌ నిర్వహించడంతో చాలా ...

Read More »

ఎండుతున్న ఎస్‌ఆర్‌ఎస్‌పి

  ఇందూరు, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌జిల్లాలో వర్షాభావం ఆందోలన కలిగిస్తుంది. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని ఎండిపోతోంది. ఎన్నడూలేనివిధంగా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నీళ్లు లేక ప్లే గ్రౌండ్‌ను తలపిస్తుంది. ఆరు జిల్లాలకు సాగు నీరందక రైతన్నలు వ్యవసాయం మానుకుంటున్నారు. ఏం చేయాలో తోచక దీనంగా ఆకాశం వైపు చూస్తున్నారు ఆయకట్టు రైతులు. ప్రాజెక్టు నీటి మట్టం 8 టిఎంసిలకు పడిపోయింది. 18 లక్షల ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారిపోయింది. తాగునీటి పథకాలపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఉత్తర తెలంగాణవరప్రదాయిని ...

Read More »

తక్కువ ధరకే నాణ్యమైన ప్రసారాలు

  ఇందూరు, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తక్కువ ధరకే నాణ్యమైన ప్రమాణాలతో నిజామాబాద్‌ జిల్లా ప్రజలకు టివి ప్రసారాలను అందించేందుకు ముందుకొచ్చామని తెలంగాణ ఎంఎస్‌ఓ సంఘం మాజీ అధ్యక్షులు కుల్‌దీప్‌ సహాని తెలిపారు. సీమాంధ్ర వ్యాపారస్తుల దోపిడి విధానానికి అడ్డుకట్ట వేసేందుకు వచ్చిన సిటి డిజిటల్‌ను ఆశీర్వదించాలని కోరారు. నగరంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కుల్‌దీప్‌ సహాని మాట్లాడారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న కేబుల్‌ వ్యాపారస్తులు తమ సెట్‌ఆఫ్‌ బాక్సులను బలవంతంగా ప్రజలకు అంటగట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. గ్రామీణ ...

Read More »

సర్కారు స్పందించకపోతే సమరమే

  ఇందూరు, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశవ్యాప్తంగా ఉద్యోగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రబుత్వ వైఖరికి నిరసనగా మంగళవారం నిజామాబాద్‌ జిల్లా కార్మిక మరియు ఉద్యోగ సంఘాలు సార్వత్రిక సమ్మెను తలపెట్టాయి. ఇందులో ప్రధానంగా కార్మి చట్టాల సవరణకు ప్రభుత్వం సిద్దం కావడంపై వ్యతిరేకించారు. కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనాలు రూ. 15 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగులకు రిటైర్‌మెంట్‌ తర్వాత ఇవ్వాల్సిన పింఛన్‌లోను కోతలు పెట్టుకోవడం ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్‌ చేశారు. కంట్రిబ్యూటర్‌ పించన్‌ ...

Read More »

పేరుకే పెద్దాసుపత్రి… చికిత్సకు దిక్కేది…

  ఇందూరు, సెప్టెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అది ఓ ఏడంతస్తుల అద్దాల మేడ… జిల్లాలోని నిరుపేదలందరికి ఉచిత వైద్యం అందించేందుకు కోట్లు ఖర్చుచేసి నిర్మించిన ఆసుపత్రి అది. కాని పేరుకు మాత్రమే పెద్దాసుపత్రిగా మారింది. చికిత్స కోసం ఈ ఆసుపత్రికి వెళ్లే అంతే సంగతులు. ఉన్న ప్రాణం గాల్లో కలిసిపోవాల్సిందే. దీంతో ఈ దవాఖాన పేరు చెప్తేనే ప్రజలు జంకుతున్నారు. అప్పో సోప్పో చేసి ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్నారు తప్ప ఇటువైపు రావడం లేదు. అన్నీ ఉన్నా అల్లుడినోట్లో ...

Read More »

మాకూ పింఛన్లు కల్పించండి

  ఇందూరు, సెప్టెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బడుగు బలహీన వర్గాల ప్రజలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఎంఆర్‌పిఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు యాతాకుల భాస్కర్‌ అన్నారు. తరతరాలుగా మాదిగ కులవృత్తుల వారు అనేక బాధలు, అవమానాలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నిజామాబాద్‌ నగరంలో ఎంఆర్‌పిఎస్‌ ఆధ్వర్యంలో మాదిగ కులవృత్తుల వారు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి మెమోరండం సమర్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్యాకేజీలతో అన్ని వర్గాల వారిని ఆదుకుంటున్నా తమను మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ...

Read More »

శాకాంబరీ దేవిగా దర్శనమిచ్చిన సంతోషిమాత

  ఇందూరు, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రావణ మాసంలోని మొదటి శుక్రవారం సందర్భంగా నిజామాబాద్‌ జిల్లాలోని అమ్మవారి ఆలయాలన్ని భక్తులతో కిటకిటలాడాయి. శాకాంబరీ అవతారిగా మొదటి శుక్రవారాన్ని పిలుస్తారని ఈ పర్వదినం రోజున అమ్మవారి విగ్రహాన్ని కూరగాయలతో అలంకరించి మొక్కులు తీర్చుకుంటే కోరిన కోరికలు తీరుతాయని పండితులు తెలిపారు. నిజామాబాద్‌ నగరంలోని హమాల్‌వాడిలోగల సంతోషిమాత ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి వివిధ రకాల ఆకుకూరలు, కాయకూరలు, పండ్లతో అమ్మవారిని అలంకరించారు. శ్రావణమాసంలో మొత్తం నాలుగు శుక్రవారాలు నాలుగు ...

Read More »

అభివృద్ది పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

  ఇందూరు, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలు, నగరాల అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తుందని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్త అన్నారు. గ్రామజ్యోతి పేరుతో సమగ్ర గ్రామాభివృద్ది, అదేవిధంగా నగరాల్లో అన్ని డివిజన్ల సమస్యల పరిష్కారానికై అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఈమేరకు గురువారం నగరంలోని డివిజన్లలో అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. స్థానిక 3వడివిజన్‌ కంఠేశ్వర్‌ ప్రాంతంలో బ్యాంక్‌కాలనీలో 4లక్షల 15వేల వ్యయంతో సీసీడ్రైనేజీ పనులకు,4వడివిజన్‌ ఎల్లమ్మగుట్టలో ...

Read More »

ప్రభుత్వం వెంటనే రీయంబర్స్‌మెంట్‌ విడుదల చేయాలి

  ఇందూరు, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పీజురీయంబర్స్‌మెంట్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం ఏబివిపి ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కో కన్వీనర్‌ రాకేశ్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న పీజు రీయంబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ల విడుదలలో తీవ్ర జాప్యంచేస్తుందని ఆరోపించారు. దీనివల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఆర్థిక భారం పెరిగి చదువుకోలేని పరిస్తితి నెలకొందని అన్నారు. తెరాస అధికారం చేపట్టిన నాటినుంచి విద్యార్థుల ఊసెత్తకపోవడం సమంజసం కాదన్నారు. రాష్ట్రంలో 2 ...

Read More »

దేశం అభివృద్ది చెందాలంటే గ్రామాలే కీలకం

  ఇందూరు, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశుద్యం, సాంఘిక భద్రత, పేదరిక నిర్మూలన అంతేగాక ప్రజలకు మౌలిక వసతులను కల్పించడం కొరకై గ్రామాల్లోని ప్రభుత్వ శాఖలన్నింటిని సమన్వయపరిచి సమీకృత అభివృద్దిని సాధించాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందడుగు వేయడం ఎంతో సంతోషకరమని జడ్పిటిసి శోభ అన్నారు. ఈ మేరకు మంగళవారం కులాస్‌పూర్‌ గ్రామంలో స్వచ్చందంగా చేపట్టిన శ్రమదానంలో గ్రామప్రజలు, మహిళా సంఘాలు, యువకులు వీధుల్లో శుభ్రం చేశారు. మురికి కాల్వల్లో పూడిక ...

Read More »