Breaking News

jagtyal

కేంద్రంలో హంగ్‌ : మనమే కీలకం : ఎంపి కవిత

జగిత్యాల, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు, అట్లాగే బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్య తెచ్చుకోదు..సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనుంది.. మనం 16 గెల్చుకుంటే ఏ ప్రభుత్వం ఏర్పడాలో మనమే నిర్ణయించవచ్చని నిజామాబాద్‌ ఎంపి కవిత అన్నారు. ఆదివారం సాయంత్రం కోరుట్ల నియోజకవర్గంలోని మల్లాపూర్‌ మండలం మొగిలిపేట, సిర్పూర్‌, మల్లాపూర్‌లలో రోడ్‌షోలో ప్రసంగించారు. బతుకమ్మతో కవిత, హాజరైన ప్రజలు పేదల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్న మన నాయకుడు, ముఖ్యమంత్రి కెసిఆర్‌ దేశంలోనే ...

Read More »

ఎంపి కవితకు మద్దతుగా ఎన్నికల ప్రచారం

జగిత్యాల, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాయికల్‌ మండలం బోర్నపెల్లి గ్రామంలో నిజామాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థి కల్వకుంట్ల కవితకు మద్దతుగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ సతీమణి రాధిక సంజయ్‌ ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి జగిత్యాల నియోజకవర్గ అభివద్ధికి కషి చేసిన కవిత కోసం కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతొ గెలిపించాలని కోరారు. తెరాస ప్రభుత్వ హయంలో ఎన్నో అభివద్ధి సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నదని తెలిపారు. బోర్నపెల్లి ...

Read More »

16 ఎంపీలను ఇస్తే కెసిఆర్‌ 116 చేస్తారు

నిజామాబాద్‌, మార్చ్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 16 మంది టిఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఎంపీలుగా గెలిపిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్‌ 116 మంది ఎంపీలను కూడగడతారని నిజామాబాద్‌ ఎంపి కవిత చెప్పారు. దేశాభివద్ధికి దార్శనికత, జవాబుదారీతనం కలిగిన ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరముందన్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేశారని తెలిపారు. శనివారం జగిత్యాల, బాల్కొండ నియోజక వర్గాల్లో రోడ్‌షోలలో కవిత పాల్గొని ప్రసంగించారు. ఇన్నేళ్లు పాలించిన కాంగ్రెస్‌ బి.జె.పిలు దేశానికి చేయాల్సిన అభివద్ధిని చేయలేదని విమర్శించారు. మనరాష్ట్రం హక్కులు ...

Read More »

సిఎం కెసిఆర్‌ విజన్‌ దేశానికి దిక్సూచి : ఎంపి కవిత

జగిత్యాల, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత బుధవారం సాయంత్రం మెట్‌పల్లిలో కోరుట్ల నియోజక వర్గం టిఆర్‌ఎస్‌ నాయకులతో సమావేశమయ్యారు. కోరుట్ల ఎమ్మెల్యే కె.విద్యాసాగర్‌రావు నివాసంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేతో కలిసి మండలాల వారీగా పార్టీ పరిస్థితిని సమీక్షించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆధారంగా గ్రామ నాయకుల పనితీరును విశ్లేషించారు. కోరుట్ల, మెట్‌పల్లి, మల్లాపూర్‌, ఇబ్రహీంపట్నం మండలాల్లోని గ్రామాల అవసరాలను అడిగి తెలుసుకుంటూ, పరిష్కారం కోసం సూచనలు చేశారు. కోరుట్ల, మెట్‌ పల్లి టౌన్‌ లపై ...

Read More »

ఎంపి కవిత గెలుపుకోసం కుల సంఘాల విరాళాలు

జగిత్యాల, మార్చ్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సార్వత్రిక ఎన్నికల్లో ఎంపి కవితను భారీ మెజార్టీతో గెలిపించేందుకు సర్వత్రా సుముఖత వ్యక్తమవుతుంది. అంతేగాకుండా కల్వకుంట్ల కవిత గెలుపు కోసం ఏకగ్రీవ తీర్మానాలు, కులసంఘాలు విరాళాలు సైతం అందజేస్తున్నారు. ఆ వివరాలు… జగిత్యాలలో పద్మశాలి సంఘం రూ.1,00,116, సీనియర్‌ సిటిఎం ఫోరమ్‌ రూ.1,01,116, ఒడ్డెర సంఘం రూ. 50,000, మున్నూరుకాపు సంఘం రూ.25,000, నాయీ బ్రాహ్మణ సేవ సంఘం రూ.25,000, రజక సంఘం రూ. 25,000, స్వర్ణ కార సంఘం రూ.25,000, రైతు ...

Read More »

దేశ రాజకీయాలకు కెసిఆర్‌ నాయకత్వం ఎంతో అవసరం

జగిత్యాల, మార్చ్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుత పరిస్థితుల్లో కెసిఆర్‌ లాంటి నాయకుడు జాతీయ స్థాయిలో ఎంతో అవసరమని, ఈ నెల 19న నిజామాబాద్‌లో జరగనున్న పార్లమెంట్‌ ఎన్నికల బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఎంపి కవిత కోరారు. సోమవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్‌ కుమార్‌తో కలిసి ఆమె మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ నాయకులు దేశభక్తి, రామమందిరం పేరిట ప్రజల్ని మరోసారి మభ్యపెట్టే ప్రయత్నం ...

Read More »

గల్ప్‌ బాధితులకు అండగా తెలంగాణ జాగృతి

నిజామాబాద్‌ ప్రతినిధి, మార్చ్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి కోసం ఏజెంట్లను నమ్మి లక్షలు అప్పు చేసి గల్ఫ్‌ వెళ్తే అక్కడ పని, వీసా సరిగా లేదని, పని దొరకక నానా కష్టాలు పడ్డ 13 మందికి తెలంగాణ జాగతి ఖతర్‌శాఖ అండగా నిలిచింది. వారిని స్వదేశానికి చేర్చడంలో సహాయపడింది. ఆదివారం జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన ప్రెస్‌ మీట్‌లో తెలంగాణ జాగతి ప్రధాన కార్యదర్శి నవీన్‌ ఆచారి, జిల్లా అధ్యక్షులు అమర్‌దీప్‌ గౌడ్‌ బాదితుల వివరాలు వెల్లడించారు. ఏజెంట్లను ...

Read More »

రాష్ట్రంలో బిజెపిని బలోపేతం చేయాల్సిన అవసరముంది

జగిత్యాల, ఫిబ్రవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో బిజెపిని బలోపేతం చేయాల్సిన అవసరముంది భారతీయ జనతాపార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధర్మపురి అరవింద్‌ అన్నారు. వసంత పంచమి సందర్బంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని చాణక్య మోడల్‌ స్కూల్‌ లో నిర్వహించిన గాయత్రీ యజ్ఞంలో పాల్గొని మాట్లాడారు. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో నిజామాబాద్‌ బీజేపి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలువనున్నానని ఆశాభావం వ్యక్తం చేసారు. రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో మీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రాని పరిస్థితిలో ...

Read More »

కొమిరెడ్డి రాములును పరామర్శించిన అర్వింద్‌

జగిత్యాల, ఫిబ్రవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధర్మపురి అర్వింద్‌ ఆదివారం మెట్‌పల్లి మాజీ ఎమ్మెల్యే, సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాది కొమిరెడ్డి రాములును పరమర్శించారు. గత నెలలో కొమిరెడ్డి రాములు మాతమూర్తి స్వర్గస్తులైనారు. ఆదివారం కొమిరెడ్డి రాములు కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో కొమిరెడ్డి విజయ్‌, కొమిరెడ్డి అజాద్‌, కొమిరెడ్డి అభిమానులు, స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Read More »