కామారెడ్డి, ఫిబ్రవరి 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జుక్కల్ నియోజకవర్గాన్ని రూర్బన్ నిధులతో పూర్తిస్థాయిలో అభివృద్ది పరిచి అధునాతనంగా రూపొందించాలని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అధికారులకు సూచించారు. మంగళవారం జనహితలో రూర్బన్ పనుల పురోగతిపై గ్రామీణాభివృద్ది, పంచాయతీ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జుక్కల్ మండలాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ది పరచడానికి 257 పనులకుగాను 25 కోట్లకు పైబడి ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. గోదాములు, ప్లాట్‌ఫాం, ఆడిటోరియం, లైబ్రరీ, శిక్షణ కేంద్రాలు, బస్ షెల్టర్లు, మౌలిక సదుపాయాలు, అంగన్వాడి, పాఠశాలలు, ఎల్ఇడి ...
Read More »తెలంగాణ జాగృతి పదవ వార్షికోత్సవ ప్రతినిధుల సభ
తెలంగాణ జాగృతి పదవ వార్షికోత్సవ ప్రతినిధుల సభ నల్లగొండలో జరుగనుంది. ఆగస్టు 5, 6 తేదీలలో జరగబోయే ఈ ప్రతినిధుల సభకు రాష్ట్రం నుండి దేశం నుండి 2 వేల మంది ప్రతినిధులు హాజరవనున్నారు. ఈ సమావేశాల్లో జాగృతి పదేళ్ల ప్రస్థానం యొక్క సింహావలోకనం తో పాటు భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. ఆగస్టు 5 వ తేదీన నల్లగొండలో తెలంగాణ జాగృతి స్కిల్ డెవెలప్ మెంట్ సెంటర్ ను అధ్యక్షులు శ్రీమతి కల్వకుంట్ల కవిత ప్రారంభిస్తారు. అనంతరం రెండు రోజులపాటు జరిగే సమావేశాల్లో గత ...
Read More »హరిత తోరణం… అందమైన కుటీరం…
గ్రామానికి ఎన్ని హంగులున్నా… పచ్చదనంతో వచ్చిన అందమే వేరు. పైగా ఆహ్లాదం.. ఆరోగ్యం. ఈ విషయం తెలిసిన కొన్ని పల్లెల్లో పచ్చదనం ఫరిడవిల్లుతోంది. అలాగని ఎపుడో ఏళ్లక్రితం మన తాతలు నాటిన చెట్లతో కాదు. దశాబ్ద కాలం క్రితం కూడు… గూడు కోసం పొట్ట చేత పట్టుకొని పయనమవాల్సిన సమయంలో అందరూ ఏకమయ్యారు. ఎవరికి వారు గూడును ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఓ గ్రామం ఏర్పడింది. పదేళ్ల కాలం పాటు ఆ గ్రామస్తులకు కనీస సౌకర్యాలు తెలియవు. కానీ తమకేదో కావాలంటూ తోచినంతగా వారికి ...
Read More »రైతులకు వరం
జుక్కల్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం రైతన్నకు వరంగా మారిందని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. శుక్రవారం మహ్మదాబాద్ గ్రామంలో రూ.26.40 లక్షలతో నిర్మిస్తున్న వాగ్మల్ కుంట చెరువు పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ… మిషన్ కాకతీయ పథకం ద్వారా పంట పొలాలకు సాగునీరంది రైతన్నల జీవితాల్లో వెలుగులు నింపుతుందని అన్నారు. ఈ పథకం ద్వారా పొలాలకు సాగునీరు అందడంతోపాటు భూగర్భ జలాలు పెరుగుతాయని తెలిపారు. చెరువులోని ...
Read More »విద్యుత్ షాక్‌తో ఆవు మృతి
జుక్కల్ : మండల కేంద్రంలోని పాత ఎస్బీహెచ్ బ్యాంకు చౌరస్తా వెనుకనున్న ట్రాన్స్ఫార్మర్ షాక్ తగిలి విద్యుత్ షాక్‌తో హన్మాండ్లుకు చెందిన ఆవు మృతి చెందింది. సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతో ఆవు మృతి చెందినట్లు బాధితుడు ఆరోపించాడు. ట్రాన్స్ఫార్మర్కు చుట్టూ కంచె లేకపోవడంతో మూగజీవి బలైంది. ప్రభుత్వం స్పందించి ఆర్థిక సాయం అందించాలని బాధితుడు కోరాడు.
Read More »అక్రమాలపై బాణం… అంతర్జాలమే ఆయుధం…
జుక్కల్, న్యూస్‌టుడే: నేటి ఆధునిక కాలంలో అంతర్జాలం ప్రపంచాన్నే శాసిస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి ఒక్కరూ కంప్యూటర్ సేవలపై అవగాహన పెంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పట్టణ ప్రాంతాల నుంచి పల్లెల వరకు ప్రతి ఒక్కరూ అంతర్జాలాన్ని వినియోగిస్తున్నారు. అలాగే ప్రభుత్వ సంస్థలు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రి ఇలా ప్రతి ఒక్కరూ ప్రజలకు అందించే సేవల్లో నాణ్యతను పెంపొందించుకునేందుకు పారదర్శకతను పాటిస్తున్నారు. అయితే వినియోగదారులు, ప్రజలు తమకు అందుతున్న సేవలపై కొందరు అసంతృప్తిని వ్యక్తం చేస్తుండగా మరికొన్న కార్యాలయాల్లో అధికారులు పౌరసేవ పత్రం ...
Read More »ఎస్‌బిహెచ్ ఏటిఏం ధ్వంసం
నిజామాబాద్:జిల్లాలోని జుక్కల్ ఎస్‌బిహెచ్ ఏటిఏంను దుండగులు ధ్వంసం చేశారు. అందులోని నగదును అపహరించుకుపోయారు.
Read More »2015 నూతన సంవత్సర శుభకాంక్షలు…
…పాఠకులకు, మా శ్రేయోభిలాషులకు, ప్రకటనలకర్తలకు, మా సిబ్బందికి మరియు జిల్లా ప్రజలందరికి ”నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్” 2015 నూతన సంవత్సర శుభకాంక్షలు… గతాన్ని అవలోకించుకొని, వర్తమానాన్ని ఉపయోగించుకొని, భవిష్యత్తుకు పునాదులు వేయాలని… భావి భారతావనికి మార్గదర్శనం కావాలని ఆశిస్తూ…. 2014 సంవత్సరానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నూతన సంవత్సరం 2015కు ఘనంగా స్వాగతం పలుకుతూ….,,,, —–మీ ”నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్” ఎడిటోరియల్ బోర్డ్
Read More »నూతన సంవత్సర శుభకాంక్షలు
,,,,గతాన్ని అవలోకించుకొని, వర్తమానాన్ని ఉపయోగించుకొని, భవిష్యత్తుకు పునాదులు వేయాలని… భావి భారతావనికి మార్గదర్శనం కావాలని ఆశిస్తూ…. 2014 సంవత్సరానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నూతన సంవత్సరం 2015కు ఘనంగా స్వాగతం పలుకుతూ….,,,, —–మీ ”నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్” ఎడిటోరియల్ బోర్డ్
Read More »…పాఠకులకు, మా శ్రేయోభిలాషులకు, ప్రకటనలకర్తలకు, మా సిబ్బందికి మరియు జిల్లా ప్రజలందరికి ”నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్” 2015 నూతన సంవత్సర శుభకాంక్షలు…
…పాఠకులకు, మా శ్రేయోభిలాషులకు, ప్రకటనలకర్తలకు, మా సిబ్బందికి మరియు జిల్లా ప్రజలందరికి ”నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్” 2015 నూతన సంవత్సర శుభకాంక్షలు… – ఎడిటోరియల్ బోర్డ్
Read More »……నిజామాబాద్ జిల్లా ప్రజలకు మరియు మా వెబ్‌న్యూస్ చూస్తున్న మా రిడర్స్ అందరికి ”నిజామాబాద్ న్యూస్ డాన్ ఇన్” నూతన సంవత్సర శుభాకాంక్షలు…..
……నిజామాబాద్ జిల్లా ప్రజలకు మరియు మా వెబ్‌న్యూస్ చూస్తున్న మా రిడర్స్ అందరికి ”నిజామాబాద్ న్యూస్ డాన్ ఇన్” నూతన సంవత్సర శుభాకాంక్షలు…..
Read More »చారిత్రక ఘనత వహించిన నాటి ఇంద్రపురి వైభవం
నిజామాబాద్ న్యూస్ ప్రత్యేకం ఎస్. శర్మ కామారెడ్డి: బోధన్ ఒకప్పటి భారత గాథలో బకాసుర వధ వృత్తాంతాన్ని తెలియజేసే ఏకచక్రపురంగా ద్వాపార యుగం నుంచి వీటి ఆనవాళ్లు కలిగి వుంది. చోళులు, బాదామి చాళుక్యులు పాలనల ద్వారా శ్రావణ బెళగోలలో నెలకొల్పిన బాహుబలిని పోలిన విగ్రహం బోధన్‌లో వెలుగులోకి వచ్చి ఈ చారిత్రక నేపథ్యాన్ని జైన తీర్థాంకరుల స్థావరంగా పేర్కొనదగినది. నవనాథ గురువుల ఆనవాళ్లతో ఆర్మూర్ ప్రాంతం సైతం జైన మత వ్యాప్తిలో పేరుగాంచినది. పైఠానపురం బోధన్గా మార్పు చెంది వేల ఏళ్ల ...
Read More »కరువు మండలంగా ప్రకటించాలి -మద్నూర్‌లో రాస్తారోకో
మద్నూర్, నవంబర్ 11 : మద్నూర్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బిజెపి ఆధ్వర్యంలో మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు రాములు మాట్లాడుతూ ఈ సీజన్లో కనీస వర్ష పాతం కూడా నమోదు కాలేదన్నారు. ఖరీఫ్‌లో పంటలన్నీ ఎండిపోయాయని, దీంతో రైతులు పెట్టిన పెట్టుబడి రాలేదన్నారు. రబీలో పంటలు కూడా పండించలేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. పంటలు నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా ఎస్ఎన్ఏ రహదారిపై బిజెపి నాయకులు, ...
Read More »మద్నూర్‌లో వాహనాల తనిఖీ
మద్నూర్, నవంబర్ 11 : మద్నూర్‌లో మంగళవారం పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. స్థానిక ఎస్ఎన్ఏ రహదారిపై ఎస్ఐ శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టగా నెంబరులేని వాహనాలు, రిజిస్ట్రేషన్ లేని వాహనాలకు జరిమానాలు విధించారు. డ్రైవింగ్ లైసెన్స్‌లు లేని వారితో పాటు పరిమితికి మించి వాహనాలు నడిపిన వారికి సైతం జరిమానాలు విధించారు. వాహనాలకు సంబంధించిన పత్రాలు లేకుండా నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ అన్నారు. డ్రైవర్లు రోడ్డు రూల్స్‌ను పాటించాలన్నారు.
Read More »నిస్సహాయ స్థితిలో వున్న వారికి ఆసరా -పించన్ల పంపిణీలో ఎమ్మెల్యే షిండే
మద్నూర్, నవంబర్ 9 : సమాజంలో నిస్సహాయ స్థితిలో వున్న వారికి ఆపన్న హస్తం అందించేదే ఆసరా పథకం అని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే అన్నారు. ఆదివారం ఆయన మద్నూర్, బిచ్కుంద మండలాల్లో ఆసరా పథకం కింద పించన్లను పంపిణీ చేశారు. కార్మికులు, కల్లుగీత, చేనేత కార్మికులతో పాటు వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ప్రభుత్వం ఆసరా పథకాన్ని ప్రారంభించిందన్నారు. దీని కింద వృద్ధులు, వితంతువులకు వెయ్యి రూపాయలు, వికలాంగులకు 1500 రూపాయల చొప్పున పించన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి ...
Read More »మద్నూర్‌లో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
మద్నూర్, నవంబర్ 9 : మద్నూర్ మార్కెట్‌యార్డులో ఆదివారం జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్తి మద్దతు ధర క్వింటాలుకు 4050 రూపాయలు వుందన్నారు. తేమ తక్కువగా వుండటం వల్ల పత్తి రంగుమారి పత్తిలోని పోగులు, గింజల నాణ్యత లేకుండా పోతుందన్నారు. మార్కెట్లో కనీస మద్దతు ధర 4050 రూపాయలకు తగ్గించి కొనుగోలు చేస్తే వెంటనే మార్కెట్‌యార్డులో ఏర్పాటు చేసిన సిసిఐ కొనుగోలు కేంద్రంలో పత్తిని విక్రయించాలని రైతులను సూచించారు. కొనుగోలు కేంద్రంలో విక్రయించిన ...
Read More »పెద్ద ఎక్లారాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ -ఒకరి పరిస్థితి విషమం
మద్నూర్, నవంబర్ 9 : మద్నూర్ మండలం పెద్ద ఎక్లారా గ్రామంలో ఆదివారం ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ సంఘటనలో 22 మందికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా వుంది. గ్రామంలో ఓ ఇంటి నిర్మాణం విషయంలో జరిగిన గొడవ చిలికి చిలికి ఘర్షణకు దారి తీయగా పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాల వారిని చెదరగొట్టారు. గాయపడిన వారిని మద్నూర్ ఆసుపత్రికి తరలించి చికిత్సలు నిర్వహించారు. కాగా ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ...
Read More »ఇళ్ల ముంగిళ్లలో తులసీ కళ్యాణాలు..
మద్నూర్, నవంబర్ 6 : కార్తీక పౌర్ణమి సందర్భంగా మహిళలు తులసీ కళ్యాణాలను ఘనంగా నిర్వహించారు. జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్, బిచ్కుంద, మద్నూర్, మండలాల్లోని మహిళలు తమ ఇళ్ల ముంగిళ్లలో తులసీ మండపాలను అందంగా అలంకరించారు. శ్రీకృష్ణా-రాధ చిత్రపటాలను పూలు, విద్యుద్దీపాలతో చేసి గౌరమ్మ, ఉసిరి, మామిడి, చెరుకు, అరటి కొమ్మలతో సుందరంగా పందిళ్లు వేసి వివాహాలు చేశారు. కార్తీకమాసంలో ఈ వివాహాలు చేయడం వల్ల కుటుంబీకులు సుఖసంపదలతో ఉంటారని భక్తుల నమ్మకం. పిల్లలు టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు.
Read More »సలాబత్పూర్ ఆలయంలో కంకణాల ధారణ
మద్నూర్, నవంబర్ 6 : మద్నూర్ మండలం సలాబత్పూర్ గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో గురువారం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కంకణాల ధారణ కార్యక్రమం జరిగింది. ఆలయ అర్చకులు శరద్మహారాజ్ వేదమంత్రోచ్ఛారణలతో కంకణాల ధారణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మనగుడి కార్యక్రమంలో భాగంగా కంకణాల ధారణ నిర్వహించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతినిధులు తెలిపారు. కాగా మనగుడి కార్యక్రమంపై అవగాహన, పూజా విధానాలు తదితర అంశాలపై తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మేనేజర్ హన్మాండ్లు, సిబ్బంది వేణు, భక్తులు పాల్గొన్నారు. ఆలయంలో సామూహిక ...
Read More »దైవస్వరూపాలే కార్తీక దీపాలు
మద్నూర్, నవంబర్ 6 : జుక్కల్ నియోజకవర్గంలో గురువారం కార్తీక పౌర్ణమి పండగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని మద్నూర్, బిచ్కుంద, జుక్కల్ మండలాల్లోని వివిధ గ్రామాల ప్రజలు కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాల్లో ఘనంగా పూజలు నిర్వహించారు. ఇంటి ముంగిళ్లలో మహిళలు కార్తీక దీపాలను అందంగా అలంకరించారు. బిచ్కుంద మండల కేంద్రంలోని నాగుల గుడి ఆలయంలో మహిళలు దీపాలతో ఆకర్షణీయంగా దీపాలను వరుసగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తోరణంగా దీపాలు వెలిగించడం వల్ల దుష్టశక్తుల నాశనమై పుణ్యం చేకూరుతుందని ...
Read More »