Breaking News

Kamareddy

రూ. 2 వేలు ఆర్థిక సాయం

కామరెడ్డి, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బిబిపేట్‌ మండలంలోని మహమ్మద పూర్‌ వాసురాలైన పిట్ల పద్మ గత వారం రోజుల‌ క్రితం గుండెనొప్పితో మరణించడం జరిగింది. కాగా మంగళవారం అఖిల‌ భారతీయ ప్రజా సేవ సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ జిల్లా ఇంచార్జ్‌ మరియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకం శ్యామ్‌ రావు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. రూ. 2 వేల‌ నగదు ఆర్థిక సాయం చేశారు. కుటుంబానికి భవిష్యత్తులో అండగా ఉంటామని మనోధైర్యాన్ని కోల్పోవద్దని ధైర్యంగా ...

Read More »

రక్తనిల్వ‌లు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు

కామారెడ్డి, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి రక్తదాతల‌ సమూహం పిలుపు మేరకు మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాల‌ బ్లడ్‌ బ్యాంకులో రక్తదాన శిబిరం నిర్వహించినట్టు కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకుడు బాలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రక్తదాన కేంద్రంలో రక్త నిలువ‌లు లేకపోవడంతో గర్భిణీ స్త్రీలు ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నారని తమకు తెల‌పడంతో శిబిరం ఏర్పాటు చేశామన్నారు. కరోనా వైరస్‌ కారణంగా రక్తదానం చేయడానికి ముందుకు రాకపోవడంతో రక్త నిలువ‌లు తగ్గిపోయాయని, ఇలాంటి పరిస్థితుల్లో కూడా ...

Read More »

బిల్లు రద్దుచేసి ప్రజల‌ను ఆదుకోవాలి

కామారెడ్డి, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారని, ఈ పరిస్థితుల్లో అడ్డగోలుగా విద్యుత్‌ అధిక బిల్లులు వసూలు చేయడం సమంజసం కాదని, వెంటనే బిల్లులు రద్దు చేయాల‌ని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ ఆదేశాల‌ మేరకు సోమవారం కామారెడ్డి పట్టణంలో డిసిసి అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాసరావు అధ్యక్షతన గాంధీ చౌక్‌ వద్ద నిరసన చేపట్టి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ...

Read More »

పరిమిత వనరుల‌తో మహా శక్తిని ఢీ కొన్నాడు

కామారెడ్డి, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన్యం దొర అల్లూరి సీతా రామరాజు 124 వ జయంతిని పురస్కరించుకుని టీజీవిపి కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో పూల మాల‌ వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీజీవిపి రాష్ట్ర కార్యదర్శి ఏనుగందుల‌ నవీన్‌ మాట్లాడుతూ అఅల్లూ‌రి సీతారామరాజు బ్రిటిషు పాల‌కుల‌ను ఎదిరించి సాయుధ పోరాటం చేసిన మన్యం ప్రాంత విప్లవ వీరుడు అన్నారు. భారత స్వాతంత్య్ర చరిత్రలో అల్లూరి సీతారామరాజు (1897 జూలై 4 – 1924 మే 07) ఒక ...

Read More »

ప్రజా పోరాటమే తెలంగాణ సాయుధ పోరాటం

కామారెడ్డి, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిపిఐ, ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య 74 వ వర్థంతి సందర్భంగా ఘనంగా నివాళుల‌ర్పించారు. అలాగే విప్లవ బాణం మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి ఎల్‌.దశరథ్‌, ఏఐఎస్‌ఎప్‌ జిల్లా అధ్యక్షుడు నరేష్‌ కుమార్‌ మాట్లాడుతూ దొడ్డి కొమురయ్య నిజాం నిరంకుశ పాల‌నకు వ్యతిరేకంగా సాగిన ప్రజా పోరాటమే తెలంగాణ సాయుధ పోరాటం అని అన్నారు. భూమి, భుక్తి, విముక్తి అనే మౌలిక ...

Read More »

భూములు గుంజుకుంటే ఉద్యమిస్తాం

కామారెడ్డి, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం సిపిఎం పార్టీ అద్వర్యంలో కామారెడ్డి మండలం గూడేం గ్రామంలో రైతులు సాగు చేసుకుంటున్న భూముల‌ను, ప్రభుత్వం జెండాలు పాతిన భూముల‌ను సందర్శించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకట్‌ గౌడ్‌తో పాటు జిల్లా కమిటీ సభ్యులు చంద్రశేఖర్‌, రైతుల‌తో కలిసి సందర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ గూడేం గ్రామంలో 49 సర్వేనెంబర్‌లో 1000 పైగా ఎకరాల‌లో 500 కుటుంబాల‌ రైతులు గత 80 సంవత్సరాలుగా 3 గ్రామాల‌కు చెందిన రైతులు సాగు ...

Read More »

వృద్ధునికి రక్తదానం

కామారెడ్డి, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌కు చెందిన గంగిపోగు సుబ్బయ్య 57 సంవత్సరాల‌ వయసు కలిగిన వృద్ధుడికి రక్తహీనతతో ప్రాణాపాయ స్థితిలో శ్రీ విష్ణు వైద్యశాల‌ నిజామాబాద్‌లో ఉండగా వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల‌ సమూహాన్ని గురించి తెలుసుకొని సంప్రదించారు. నిజామాబాద్‌ కేంద్రంలో ఏబి పాజిటివ్‌ రక్తం ల‌భ్యం కాకపోవడంతో వారు కామారెడ్డి రక్తదాతల‌ నిర్వాహకుడు బాలును సంప్రదించడంతో ఆరేపల్లి గ్రామానికి చెందిన కెఆర్‌వి నరసింహము మరియు శ్రీనివాస్‌ సహకారంతో రెండు యూనిట్ల ఏబి పాజిటివ్‌ ...

Read More »

బహుజన సమాజంపై అగ్రవర్ణాల‌ పెత్తనం

కామారెడ్డి, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బహుజన సమాజంపై అగ్రవర్ణాల‌ పెత్తనంపై ఎంసిపిఐయు, బిఎల్‌ఎప్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు జయప్రదం చేయాల‌ని బిఎల్‌ఎఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌ సిద్దిరాంలు అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్ర కార్యాల‌యంలో శనివారం జరిగిన పత్రిక, మీడియా సమావేశానికి హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నిజామాబాదు జిల్లాలో గ్రామాభివృద్ది కమిటీ పేరుతో బహుజన సమాజంపై సాగిస్తున్న అనాగరిక, అనధికార పెత్తనాల వ‌ల్ల‌ ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ ప్రజలు పడుతున్న అవస్థల‌ను ...

Read More »

పెంచిన ధరలు వెనక్కి తీసుకోవాలి

కామారెడ్డి, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెట్రోల్‌, డీజిల్ ధరల పెంపునువ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్త ఆందోళనను చేపట్టింది. అందులో భాగంగా కామారెడ్డి జిల్లాలో మాజీ మంత్రి, మాజీ మండలి అధ్యక్షుడు షబ్బీర్‌ అలీ ఆదేశాల‌ మేరకు పట్టణాధ్యక్షుడు పండ్ల రాజు అధ్యక్షతన పెంచిన పెట్రోల్‌ డీజిల్ ధరల‌ను వెంటనే వెనక్కి తీసుకోవాల‌ని కోరుతూ కామారెడ్డి ఆర్డీఓ కార్యాల‌యం ఎదుట ధర్నా నిర్వహించి వినతి పత్రం సమర్పించారు. కరోనా సంక్షోభం వెంటాడుతున్న తరుణంలో పెట్రోల్‌, డీజిల్ ధరల‌ను అనాలోచితంగా పెంచడం ...

Read More »

57 మందికి చెక్కుల‌ పంపిణీ

కామారెడ్డి, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలోని 57 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 16 ల‌క్షల‌ 44 వేల‌ 500 రూపాయల‌ చెక్కులు ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పంపిణీ చేశారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు 371 మందికి 2 కోట్ల 60 ల‌క్షల‌ 26 వేల‌ 800 రూపాయల‌ చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు అనారోగ్య కారణాల వల‌న ఆసుపత్రుల్లో వైద్యం కోసం ఖర్చులు ముఖ్యమంత్రి ...

Read More »

కార్మికుల వాటా తేల్చాలి

కామారెడ్డి, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్మికుల‌ హక్కుల‌ సాధనకు శుక్రవారం జాతీయ కమిటీ పిలుపుమేరకు సోదర సంఘాల‌తో నిరసన చేపట్టినట్టు ఏఐసిటియు, బిఎల్‌టియు కార్మిక సంఘాల‌ నాయకులు రాజలింగం, సదానందం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2 వ సారి అధికారం చేపట్టగానే పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు 44 రద్దు చేసి నాలుగుకోడ్లుగా రూపొందించే కుట్ర చేయడం తక్షణం మానుకోవాల‌ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రస్తుత లాక్‌ డౌన్‌ సందర్భంగా అసంఘటిత ...

Read More »

నివేదికలు నిర్ణీత సమయంలోగా పంపాలి

కామారెడ్డి, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె ప్రగతి, జాతీయ ఉపాధి హామీ పనులు, రైతు వేదికల‌ నిర్మాణం, రైతు కల్లాల‌ నిర్మాణం, హరితహారం తదితర కార్యక్రమాల‌ను జిల్లాలో వేగవంతం చేయడానికి జిల్లా లోని 22 మండలాల‌కు జిల్లా అధికారుల‌ను స్పెషల్‌ ఆఫీసర్స్‌గా నియమిస్తూ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ ఆదేశాలు జారీ చేశారు. పల్లె ప్రగతి కార్యక్రమాల‌కు సంబంధించి రోడ్లకు ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్‌, ప్రతి రోజూ పారిశుద్ధ్యం, డంపింగ్‌ యార్డ్‌, వైకుంఠధామాలు, ...

Read More »

ఆన్‌లైన్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి

కామారెడ్డి, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్టిఓ ఆఫీస్‌ సమీపంలో తెలంగాణ స్టేట్‌ మినరల్‌ డెవల‌ప్మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇసుక డిపోను జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ. శరత్‌ పరిశీలించారు. ఇసుక అవసరమున్న జిల్లా ప్రజలు అవకాశాన్ని వినియోగించుకోవాల‌ని కోరారు. మీ సేవ కేంద్రాల‌, ఆన్‌లైన్‌ ద్వారా ట్రాక్టర్‌ నెంబర్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకుని అనంతరం ట్రాక్టర్‌ ఇసుక కోసం 4 వేల‌ 400 రూపాయలు చెల్లించాల‌ని సూచించారు. పూర్తి వివరాల‌కు సెల్‌ నెంబర్లు ...

Read More »

మొక్కల‌ సంరక్షణ బాధ్యత గ్రామ పంచాయతీల‌దే

కామారెడ్డి, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ రహదారిపై కిలోమీటర్‌కు 1 వేయి 266 మొక్కలు ఉండే విధంగా సర్పంచులు, కార్యదర్శులు పరిశీల‌న చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. శరత్‌ అన్నారు. కలెక్టర్‌ కార్యాల‌యంలోని జనహిత హాలులో హరితహారం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో నాటిన మొక్కల‌ సంరక్షణ బాధ్యతను గ్రామ పంచాయతీల‌కు అప్పగించనున్నట్లు చెప్పారు. హైవే అధికారులు నాటిన మొక్కల‌ సంరక్షణను గ్రామ పంచాయతీల‌కు అప్పగిస్తే బాగుంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల‌ ...

Read More »

అర్హత గల రైతుల‌కు పంట రుణాలు

కామారెడ్డి, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు కల్లాల‌ నిర్మాణం పనుల‌ను త్వరిత గతిన పూర్తి చేయాల‌ని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ తెలిపారు. గురువారం స్థానిక వెల‌మ ఫంక్షన్‌ హాల్‌లో జిల్లా వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారుల‌తో సమీక్ష నిర్వహించారు. ల‌బ్ధిదా‌రుల‌ జాబితాను ఈ నెల‌ 3 లోగా జిల్లా కేంద్రానికి పంపాల‌ని సూచించారు. ఈనెల‌ 10లోగా 20 శాతం రైతుల‌ కల్లాల‌ నిర్మాణాల‌ను పూర్తిచేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అర్హతగల‌ రైతుల‌కు పంట రుణాలు ఇప్పించాల‌ని ...

Read More »

రూ. 5.06 కోట్లతో రైతు వేదికలు

కామారెడ్డి, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి, దోమకొండ, భిక్కనూర్‌, కామారెడ్డి, బీబీపేట్‌, రాజంపేట, రామారెడ్డి మండలాల్లో సుమారు 5 కోట్ల 6 ల‌క్షల‌ రూపాయల‌తో నిర్మించనున్న 23 రైతు వేదికల‌ నిర్మాణ పనుల‌కు ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ శంకుస్థాపనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ శరత్‌ పాల్గొన్నారు.

Read More »

12వ వార్డులో మొక్కలు నాటారు

కామారెడ్డి, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం హరితహారంలో భాగంగా 12 వ వార్డులో కౌన్సిల‌ర్‌ కాసార్ల గోదావరి స్వామి అధ్యరంలో దేవి విహార మరియు బీడీ కాల‌నీలో మొక్కలు నాటి నీరుపోశారు. కార్యక్రమంలో 35వ వర్డ్‌ కౌన్సిల‌ర్‌ పోలీస్‌ కృష్ణాజీ రావు, మనోహర్‌ రావు, రవీందర్‌, నారాయణ రావు, కాల‌నీ ప్రజలు పాల్గొన్నారు.

Read More »

మత మార్పిడుల‌ను అడ్డుకోవాల్సిందే

కామారెడ్డి, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఒరిస్సా ప్రాంతం నుంచి భాగ్యనగర్‌ వచ్చి పని చేసుకుంటున్న ఒరిస్సా ప్రాంత ప్రజల‌కు విశ్వహిందూ పరిషత్‌ అండగా ఉంటుందని, ఎవరికి ఏ అవసరం వచ్చినా విశ్వహిందూ పరిషత్‌, బజరంగ్‌దళ్‌ కార్యకర్తల‌ను సంప్రదించాల‌ని విశ్వహిందూ పరిషత్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజేశ్వర్‌ రెడ్డి సూచించారు. మంగళవారం మియాపూర్‌లో సమావేశం నిర్వహించారు. విశ్వహిందూ పరిషత్‌ ప్రాంత సహ ప్రచార ప్రముఖ్‌ పగుడాకుల బాల‌స్వామి, బజరంగ్‌ దళ్‌ స్టేట్‌ కో కన్వీనర్‌ శివ రాము, భారతీయ జనతా ...

Read More »

కురిసింది వాన… కామారెడ్డిలోన….

కామారెడ్డి, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిలో గురువారం భారీవర్షం కురిసింది. ధీంతో రోడ్లన్నీ జల‌మయమయ్యాయి. ద్విచక్రవాహన చోదకులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షం నీరు మొత్తం రోడ్ల పై నిలిచింది. ఇక మొత్తం వర్షాకాలం వచ్చి భారీగా వర్షాలు కురిస్తే పరిస్థితి ఏంటని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read More »

రైతు వ్యతిరేక ఆర్డినెన్సు ఉపసంహరించుకోవాలి

కామారెడ్డి, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం కామారెడ్డి జిల్లాలోని కలెక్టర్‌ కార్యాల‌యం ముందు ఏఐకెఎస్‌ (తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం) ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం విడుదల‌ చేసిన వ్యవసాయ సంబంధిత రైతు వ్యతిరేక ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాల‌ని కలెక్టర్‌ కార్యాల‌యం ముందు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ కార్యాల‌యంలోని ఏవో శ్రీనివాసరావుకి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఏఐకెఎస్ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు, జూకంటి సుధాకర్‌ రెడ్డి, ...

Read More »