Breaking News

Kamareddy

బిఎల్‌ఎఫ్‌లో యువత చేరిక

కామారెడ్డి, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బహుజన లెప్ట్‌ ఫ్రంట్‌ పార్టీలో కామారెడ్డి పట్టణానికి చెందిన న్యాయవాది ముదాం నవీన్‌తోపాటు సుమారు 70 మంది యువకులు ఆదివారం పార్టీ అభ్యర్థి పుట్టమల్లికార్జున్‌ సమక్షంలో బిఎల్‌ఎఫ్‌లో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఎల్‌ఎఫ్‌ అధికారంలోకి వస్తే యువకులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి ఉద్యోగాలు కల్పిస్తారని, సామజిక న్యాయం ఎజెండాగా సాగుతున్న బిఎల్‌ఎఫ్‌కు అండగా ఉంటామన్నారు. తెరాస నిరుద్యోగులను మోసం చేసిందని, అందుకే బిఎల్‌ఎఫ్‌కు మద్దతిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో వెంకటరాములు, చంద్రశేఖర్‌, ...

Read More »

అభ్యర్థి ప్రతి రూపాయి ఖర్చు లెక్కచూపాలి

కామారెడ్డి, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు సంబంధించి వారి ప్రతి రూపాయి వ్యయాన్ని లెక్కచూపాలని కామారెడ్డి జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకుడు రాంజలాల్‌ మీనా తెలిపారు. ఆదివారం జిల్లా కలెక్టర్‌ చాంబరులో జరిగిన రాజకీయ పార్టీల ప్రతినిదుల విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థి 28 లక్షల రూపాయల వరకు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుందని స్పస్టం చేశారు. నామినేషన్‌కు ఒక రోజు ముందు అభ్యర్తి లేదా అతని ఎన్నికల ఏజెంట్‌పేరుపై ...

Read More »

అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈవిఎం, వీవీప్యాట్‌ యంత్రాల కేటాయింపు

కామారెడ్డి, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల నిర్వహణలో భాగంగా ఈవిఎం, వీవీప్యాట్‌ యంత్రాల మొదటి దశ ర్యాండమైజేషన్‌ కార్యక్రమం ద్వారా వివిధ నియోజకవర్గాలకు ఈవిఎం, వీవీప్యాట్‌ యంత్రాలను కేటాయించినట్టు కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. ఆదివారం స్థానిక ఏఎంసి గోదాములోని ఎన్నికల స్ట్రాంగ్‌రూంలో వివిద పార్టీల సమక్షంలో మొదటిదశ ర్యాండమైజేషన్‌ కార్యక్రమం ద్వారా కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబందించి ఈవిఎం, వీవీప్యాట్‌ యంత్రాల కేటాయింపు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జుక్కల్‌ ...

Read More »

పోలీసుల కవాతు

కామారెడ్డి, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల్లో భాగంగా పోలీసు అధికారుల ఆదేశాల మేరకు శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో పోలీసు కవాతు నిర్వహించారు. బార్డర్‌ సెక్యురిటి ఫోర్సు, ప్రత్యేక పోలీసులు ఇంద్రనగర్‌, రాజీవ్‌నగర్‌, డ్రైవర్స్‌ కాలనీల్లో కవాతు నిర్వహించారు. శాంతియుతంగా ఎన్నికల్లో పాల్గొనాలని, ఎలాంటి పుకార్లు నమ్మవద్దని ఎస్‌హెచ్‌వో రామకృష్ణ ప్రజలకు తెలిపారు. ర్యాలీలో ఎస్‌ఐలు రవికుమార్‌, గోవింద్‌, రవీందర్‌రెడ్డి, మాజర్‌ తదితరులున్నారు.

Read More »

అభివృద్దికి పట్టం కట్టాలి

కామారెడ్డి, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం చేసిన అభివృద్దిని చూసి ప్రజలు తిరిగి తెరాసకు పట్టం కట్టాలని తెరాస కామారెడ్డి అసెంబ్లీ అభ్యర్థి గంప గోవర్ధన్‌ కోరారు. ప్రచారంలో భాగంగా శనివారం పలు గ్రామాల్లో పర్యటించారు. శివాయిపల్లి గ్రామంలో కానిస్టేబుల్‌ కిస్టయ్యకు నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా కానిస్టేబుల్‌ కిష్టయ్యతోపాటు ఎంతోమంది విద్యార్థులు అమరులయ్యారని, అందరిని తమప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. కెసిఆర్‌ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, అవి ...

Read More »

అవినీతి వ్యతిరేక పోరాటానికి ప్రజలు అండగా నిలవాలి

కామారెడ్డి, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస అవినీతి వ్యతిరేక పోరాటంలో భాగంగా భారతీయ జనతా పార్టీ పక్షాన ప్రజలు నిలవాలని కామారెడ్డి బిజెపి అభ్యర్తి కాటిపల్లి వెంకటరమణారెడ్డి కోరారు. పల్లెపల్లెకు, గడప గడపకు బిజెపిలో భాగంగా శనివారం ఆయన భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి, దోమకొండ మండలం దోమకొండలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టిడిపి, కాంగ్రెస్‌, తెరాసలో ఎన్నో ఏళ్ళుగా పరిపాలిస్తున్నా పేదలకు కనీసం ఇళ్ళులేవని, పూరిగుడిసెల్లో జీవనం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పల్లెల్లోకెళితే కనీస ...

Read More »

ముదిరాజ్‌లను బిసి-డి నుంచి బిసి- ఎ లోకి మారుస్తాం

కామారెడ్డి, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముదిరాజ్‌లను బిసి-డి నుంచి బిసి- ఎ లోకి మారుస్తామని కామారెడ్డి అసెంబ్లీ కాంగ్రెస్‌ అభ్యర్థి షబ్బీర్‌ అలీ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఫంక్షణ్‌ హాల్‌లో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముదిరాజ్‌లు వెనకబడి ఉన్నారని, తమ ప్రభుత్వ హయాంలో ముదిరాజ్‌లను బిసి-డి నుంచి బిసి-ఎలోకి మార్చాడానికి జివో ఇచ్చినా సుప్రీంకోర్టు కొట్టేసిన విషయాన్ని గుర్తుచేశారు. ముదిరాజ్‌ల కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు డిమాండ్‌ సైతం ఉందని, ...

Read More »

ఈవిఎం, వీవీప్యాట్‌ యంత్రాల నమూనా పరిశీలన

కామారెడ్డి, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈవిఎం, వీవీప్యాట్‌ యంత్రాల మొదటి దశ నమూనా, ర్యాండనైజేషన్‌ కార్యక్రమాన్ని శనివారం కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ పరిశీలించారు. ఏఎంసి గోదాములోని ఎన్నికల ఫస్ట్‌ లెవల్‌ చెక్‌సెంటర్‌ను కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ర్యాండనైజేసణ్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 11వ తేదీన అన్ని రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో ర్యాండనైజేషన్‌ కార్యక్రమం నిర్వహించి ఆయా నియోజకవర్గాలకు యంత్రాలను కేటాయిస్తామని పేర్కొన్నారు. అనంతరం నూతనంగా నిర్మితమవుతున్న జిల్లా కలెక్టర్‌ క్యాంపు కార్యాలయ ...

Read More »

12న కామారెడ్డి అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

కామారెడ్డి, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 12న కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలవుతుందని కామరెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి రాజేంద్రకుమార్‌ తెలిపారు. శనివారం తన చాంబరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 12 నుంచి 19 వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. 20న నామినేషన్ల పరిశీలన ఉంటుందన్నారు. 21,22 తేదీల్లో నామినేషన్ల ఉపసంహరణ, 22న అభ్యర్థుల ...

Read More »

102లో దరఖాస్తుల ఆహ్వానం

కామరెడ్డి, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జివికె ఇఎంఆర్‌ఐ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నడిపిస్తున్న 102 అమ్మఒడి అంబులెన్సులో ఉద్యోగాల కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఉమ్మడి జిల్లాల ప్రోగ్రాం మేనేజర్‌ బాలకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండి 22-35 సంవత్సరాల మధ్య వయసు ఉండాలన్నారు. ఎత్తు 5.4 అంగుళాలు ఉండాలని, డ్రైవింగ్‌లో కనీసం 3 సంవత్సరాల అనుభవం, ఎల్‌ఎంవి లైసెన్సు, బ్యాడ్జి నెంబరు కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తిగల అబ్యర్థులు ఈనెల 9, ...

Read More »