Breaking News

Kamareddy

పోలింగ్‌ ఏర్పాట్లు సర్వం పూర్తి

కామారెడ్డి, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలింగ్‌ రోజు ఓటు వేయడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అదికారి సత్యనారాయణ తెలిపారు. పోలింగ్‌ ఏర్పాట్లలో భాగంగా గురువారం కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌ నియోజకవర్గాలకు సంబంధించి డిస్ట్రిబ్యూటరీ కేంద్రాలను ఆయన సందర్శించి పోలింగ్‌ ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్‌కు సంబందించి 740 పోలింగ్‌ కేంద్రాల్లో 5 లక్షల 78 వేల 050 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని తెలిపారు. ప్రజలు ఎలాంటి ...

Read More »

కామరెడ్డి అభివృద్ది చెందింది కాంగ్రెస్‌ హయాంలోనే

కామారెడ్డి, డిసెంబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గం అభివృద్ది చెందింది తాను కాంగ్రెస్‌నుంచి గెలిచి రెండు సార్లు మంత్రిగా పనిచేసిన హయాంలోనేనని కాంగ్రెస్‌ అభ్యర్తి షబ్బీర్‌ అలీ అన్నారు. బుధవారం ఆయన కామారెడ్డి పట్టణంతోపాటు ఉగ్రవాయి గ్రామాల్లో భారీ రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోడ్‌షోలో జనాన్ని చూస్తుంటే విజయోత్సవ ర్యాలీని తలపిస్తుందని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తి ఎన్నికల్లో గెలుస్తానన్న నమ్మకాన్ని కల్పించిందని చెప్పారు. తాను మంత్రిగా ఉన్నపుడు నియోజకవర్గ అభివృద్ది కోసం ఎన్నో పనులు చేశానని, ...

Read More »

ఓటమి భయంతోనే రేవంత్‌రెడ్డి అరెస్టు

కామారెడ్డి, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కెసిఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని అందుకోసమే రేవంత్‌రెడ్డిని అర్దరాత్రి అరెస్టు చేయించారని కామరెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి షబ్బీర్‌ అలీ అన్నారు. మంగళవారం ఆయన మాచారెడ్డి మండలం మాచారెడ్డి, సీతాయిపేట్‌, అన్నారం, రెడ్డిపేట్‌ గ్రామాల్లో పర్యటించారు. వరంగల్‌లో నిర్వహించిన కెసిఆర్‌ సభ జరగదేమోనని భయంతో ముందస్తు అరెస్టు చేయించారని రాష్ట్రంలో మహాకూటమి గెలుపును అరెస్టులతో ఆపలేరని పేర్కొన్నారు. నాలుగున్నరేళ్ల కెసిఆర్‌ పాలనపై ప్రజలు విసుగుచెందారని, గజ్వేల్‌లో తన ఓటమిని తానే ఒప్పుకున్నారని అన్నారు. రాష్ట్రంలో ...

Read More »

మద్యం పట్టివేత

కామారెడ్డి, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం ఇస్రోజివాడి గ్రామంలో ఆబ్కార్‌ ఆధికారులు దాడులు నిర్వహించి మద్యం పట్టుకున్నారు. సుదర్శన్‌రావు అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా దాచి ఉంచిన 140 క్వాటర్‌ సీసాలతో పాటు పది ఎంసి ఫుల్‌బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. సుదర్శన్‌ను అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు.

Read More »

బుధవారం కవి సమ్మేళనం

కామారెడ్డి, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరసం కామారెడ్డి ఆద్వర్యంలో బుధవారం కవిసమ్మేళనం నిర్వహించనున్నట్టు తెరసం ప్రతినిదులు నర్సింహారెడ్డి, చలపతి విశ్వకర్మలు తెలిపారు. భీమేశ్వరాలయ ప్రాంగణంలో బుధవారం ఉదయం 10 గంటలకు కవిసమ్మేళనం ఉంటుందన్నారు. దీనికి ముఖ్య అతిథిగా తెరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ శంకర్‌ హాజరుకానున్నట్టు పేర్కొన్నారు.

Read More »

రామలక్ష్మణులను గెలిపించుకొని సంక్షేమానికి బాటలు వేయండి

కామారెడ్డి, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గ బిజెపి అభ్యర్థి రమణరెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గ అభ్యర్థి లక్ష్మారెడ్డి ఇద్దరు రామలక్ష్మణులని వారిని గెలిపించుకొని రామరాజ్య స్థాపనకు సంక్షేమానికి ప్రజలు పట్టం కట్టాలని స్వామి పరిపూర్ణానంద పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ తెరాస అధినేత కెసిఆర్‌ నోటికొచ్చిన వాగ్దానాలిచ్చి ముందే దిగిపోయి ప్రజల ఆశలను నట్టేట ముంచారని విమర్శించారు. ఇళ్లేమయ్యాయి, నీళ్లేమయ్యాయి, ఉద్యోగాలేమయ్యాయని నిలదీశారు. తెరాస లాగా బిజెపికి ...

Read More »

ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలి

కామారెడ్డి, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల్లో పాల్గొనే సిబ్బంది విధులను పకడ్బందీగా నిర్వహించాలని నిర్లిప్తతకు తావివ్వద్దని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం కామరెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు, సలహాలు చేశారు. ఈవిఎం, వీవీప్యాట్‌ యంత్రాలపై పూర్తిస్తాయి అవగాహన కలిగి ఉండాలని, ముందే సందేహాలు నివృత్తిచేసుకోవాలని సూచించారు. పోలింగ్‌రోజున ప్రతి రెండు గంటలకు పోలింగ్‌ శాతాన్ని తెలియజేయాలని చెప్పారు. మాక్‌పోల్‌, క్లియరెన్సుపై శ్రద్ద ...

Read More »

ఎన్నికల ఉల్లంఘన జరిగితే వెంటనే చర్యలు తీసుకోవాలి

కామారెడ్డి, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలింగ్‌ తేదికి ముందు రోజుల్లో ఎటువంటి సంఘటనలు, ఎన్నికల ఉల్లంఘనలు జరిగినా వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అదికారి సత్యనారాయణ అధికారులకు సూచించారు. కామారెడ్డి ఆర్డీవో కార్యాలయం నుంచి మంగళవారం ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, రిటర్నింగ్‌ అధికారులు, పోలీసుశాఖ అప్రమత్తంగా ఉండాలన్నారు. మాడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్టులో భాగంగా పోలింగ్‌కు 72 గంటల ముందు ఎటువంటి డబ్బులను ఆన్‌లైన్‌లో ...

Read More »

తెరాసకు ఓటు వేసి సంక్షేమానికి మద్దతు పలకాలి

కామారెడ్డి, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాసకు ఓటు వేసి సంక్షేమానికి మద్దతు పలకాలని కామారెడ్డి అసెంబ్లీ తెరాస అభ్యర్థి గంప గోవర్ధన్‌ అన్నారు. సోమవారం ఆయన లచ్చాపేట్‌, కాకులగుట్ట, రాజీవ్‌నగర్‌ కాలనీతో పాటు పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్‌ తెరాస ప్రభుత్వ హయాంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, బడుగు, బలహీన వర్గాలు రైతు శ్రేయస్సు కోసం ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. తెచ్చుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చుకునేందుకు ప్రగతి పనుల్లో ముందుకెళ్లేందుకు తెరాసను ...

Read More »

వెబ్‌కాస్ట్‌ కెమెరామెన్‌ ఓటరు ప్రవేశాన్ని రికార్డు చేయాలి

కామారెడ్డి, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వెబ్‌కాస్ట్‌ కెమెరామెన్‌ ఓటరు ప్రవేశాన్ని తప్పకుండా రికార్డు చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. సాధారణ ఎన్నికల్లో భాగంగా పోలింగ్‌ రోజున వెబ్‌కాస్టింగ్‌ కోసం 74 మంది విద్యార్థులకు సోమవారం స్థానిక ఆర్‌కె డిగ్రీ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఓటు వేసే కంపార్టుమెంటును రికార్డు చేయకూడదని తెలిపారు. పోలింగ్‌ ముందురోజు 6వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు 74 వెబ్‌కాస్టింగ్‌ స్క్రీనింగ్‌ ఉంటుందని, ఈ ...

Read More »