Kamareddy

కేంద్రప్రభుత్వం మద్దతు ధర పెంచడం హర్షణీయం

కామారెడ్డి, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు పండించిన పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతుధర పెంచడం హర్సణీయమని భారతీయకిసాన్‌ సంఘ్‌ జిల్లా అధ్యక్షుడు అంజన్న అన్నారు. భారతీయ కిసాన్‌ సంఘ్‌ కామారెడ్డి జిల్లా సమావేశం గురువారం కామారెడ్డి గంజ్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్దతు ధర పెంచినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఎక్కువ మొత్తంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరారు. విద్యుత్‌ వినియోగదారుల ఛైర్మన్‌ రైతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించి ...

Read More »

కెసిఆర్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

కామారెడ్డి, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిస్తాయిలో నెరవేర్చాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గసభ్యురాలు పశ్యపద్మ అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో సిపిఐ కామారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాలుగున్నరేళ్ళు గడుస్తున్నా దళితులకు మూడెకరాల భూపంపిణీ, రెండు పడక గదుల ఇళ్ళు ఎంతమందికి ఇచ్చారని ప్రశ్నించారు. చాలా చోట్ల నాసిరకం సిమెంటుతో రెండు పడక గదుల ఇళ్లు నిర్మిస్తున్నారని ఆరోపించారు. ప్రజాపథకాలన్ని అధికార పార్టీ వారే ...

Read More »

పంచాయతీ ప్రత్యేకాధికారులు పరిశుభ్రత, పచ్చదనంపై శ్రద్ద కనబర్చాలి

కామారెడ్డి, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతనంగా నిర్మించబడిన గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారులు పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో పరిశుభ్రత, పచ్చదనంపై ప్రత్యేక శ్రద్ద కనబర్చాలని కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ అన్నారు. గురువారం స్థానిక ఆర్‌కె డిగ్రీ కళాశాలలో గ్రామ ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులకు పంచాయతీ రాజ్‌ చట్టంపై రెండ్రోజుల పాటు నిర్వహించనున్న అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. నూతన పంచాయతీ రాజ్‌ చట్టాన్ని అనుసరించి గ్రామాల్లో జరిగే సంక్షేమ కార్యక్రమాలకు జవాబుదారీ ...

Read More »

కంటి వెలుగు విజయవంతం చేయాలి

కామారెడ్డి, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆగష్టు 15 నుంచి నిర్వహించనున్న కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొనే అందరు కలిసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. కామారెడ్డి జనహితలో గురువారం కంటి వెలుగులో పాల్గొనే మెడికల్‌ అధికారులు, పిహెచ్‌సి క్యాంపు అధికారులు, కంటి వైద్యులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో ఆయన సమీక్షించారు. కంటివెలుగు కార్యక్రమంలో జిల్లాకు నోడల్‌ అధికారిగా జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ పిడి డివిజన్‌ స్థాయిలో డివిజనల్‌ నోడల్‌ అధికారులుగా ఆర్డీవోలను ...

Read More »

11న గ్రామ పంచాయతీ కార్మికుల ఛలో హైదరాబాద్‌

నిజామాబాద్‌ టౌన్‌, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 11న గ్రామ పంచాయతీ కార్మికులు ఛలో హైదరాబాద్‌ కార్యక్రమం చేపడుతున్నట్టు తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసి నాయకులు శ్యాం తెలిపారు. గురువారం తమ సమస్యలపై ర్యాలీ నిర్వహించిన అనంతరం మాట్లాడారు. గత 18 రోజులుగా తాము దీక్ష చేస్తున్నా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం తమను తీవ్రంగా వేధిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వస్తే గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలన్ని పరిష్కరిస్తామన్న ప్రభుత్వం ...

Read More »

అందరి భాగస్వామ్యంతో హరితహారం విజయవంతం చేయాలి

కామారెడ్డి, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో హరితహారం దిగ్విజయం చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. బుధవారం హరితహరంలో భాగంగా కామారెడ్డి జిల్లా ఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఇంటిగ్రేటెడ్‌ ఎస్‌సి బాలికల వసతి గృహంలో కలెక్టర్‌తోపాటు రాష్ట్ర టీఎన్జీవోస్‌ సంఘం అధ్యక్షుడు రవీందర్‌రెడ్డిలు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో 67 లక్షల మొక్కలు నాటినట్టు తెలిపారు. రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రబుత్వం చేపడుతున్న అన్ని ...

Read More »

ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేయాలి

కామారెడ్డి, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీచేయాలని ఏఐఎఫ్‌డిఎఫ్‌ నాయకులు బుధవారం ఆర్డీవో సంబంధిత అధికారికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు జబ్బర్‌ నాయక్‌ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ బదిలీలు జరిగిన తర్వాత కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్తితి ఏర్పడిందన్నారు. మరికొన్ని పాఠశాలల్లో 40 మంది విద్యార్థులున్న దగ్గర నలుగురు ఉపాధ్యాయులున్నారని, మరికొన్ని పాఠశాలల్లో వందమంది ...

Read More »

దోమకొండ గడీకోట ప్రజల ఆస్తి

కామారెడ్డి, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దోమకొండ గడీకోట ప్రజల ఆస్తి అని రెవిల్యుషనరీ సోషలిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి కొత్త నర్సింలు అన్నారు. బుధవారం కామరెడ్డి జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దోమకొండ గడీకోట క్రీ.శ. 15వ శతాబ్దిలో 400 ఏళ్ల క్రితం నిర్మించబడిందన్నారు. అప్పటి నుంచి కామినేని వంశస్తులు సామంతరాజులుగా పరిపాలన కొనసాగించారని పేర్కొన్నారు. ప్రజలచేత కప్పం కట్టించుకున్నారని, ప్రజల కష్టార్జితంగా నిర్మించుకున్న కోటను కామినేని ఉమాపతి, కామినేని అనిల్‌కుమార్‌లు తమదంటే తమదని రచ్చకెక్కడం సమంజసం ...

Read More »

మురికి కాలువ నిర్మాణ పనులు ప్రారంభం

కామారెడ్డి, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 28వ వార్డులో బుధవారం మురికి కాలువ నిర్మాణ పనులను మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 14వ ఆర్థిక సంఘం నిధులు రూ. 4 లక్షలతో కాలువ నిర్మాణ పనులు ప్రారంభించినట్టు తెలిపారు. పనులు నాణ్యతతో చేపట్టాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ అరికెల ప్రభాకర్‌ యాదవ్‌, నాయకులు భూమయ్య, నరేందర్‌రెడ్డి, సునీల్‌ తదితరులు ఉన్నారు.

Read More »

తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం

కామారెడ్డి, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు దేశంలో మరెక్కడా లేవని తద్వారా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం నిజామాబాద్‌ ప్రగతిభవన్‌లో నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల కంటి వెలుగు అవగాహన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నిరుపేదలకు దృష్టిలోపాన్ని నివారించడం, సవరించడం కోసం ఆగష్టు 15 నుంచి జనవరి 26 వరకు కంటి వెలుగు కార్యక్రమం ఇంటింటా వెలుగునిస్తుందని పేర్కొన్నారు. ...

Read More »

తీజ్‌ ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి పోచారం

కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బంజారాలు భక్తి శ్రద్దలతో పవిత్రంగా జరుపుకునే తీజ్‌ ఉత్సవాల్లో మంగళవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. బాన్సువాడలోని నసురుల్లాబాద్‌ మండలం సంగెం తాండాలోజరిగిన బంజారా తీజ్‌ ఉత్సవాల్లో పాల్గొని బంజారాలతో కలిసి సంప్రదాయబద్దంగా నృత్యాలు చేశారు. తీజ్‌ ఉత్సవాలు బంజారాల సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడతాయని పవిత్రమైన తీజ్‌ ఉత్సవాలను సంప్రదాయ బద్దంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.

Read More »

నాసిరకం రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను నిరసిస్తూ ధర్నా

కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి వాంబే కాలనీలో నిర్మిస్తున్న నాసిరకం రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను నిరసిస్తూ మంగళవారం ఎంసిపిఐ ఆద్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎంసిపిఐ బృందం ఇళ్ళ నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్బంగా పార్టీ జిల్లా కార్యదర్శి రాజలింగం మాట్లాడుతూ పట్టణ ప్రజల కోసం 300 ఇళ్లు నిర్మించేందుకు టెండర్లు తీసుకున్న కాంట్రాక్టర్‌ నాణ్యతలేని సిమెంటు ఇటుకలతో నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు. వాటిని పర్యవేక్షించాల్సిన అధికారులు పత్తాలేరని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్‌ తక్షణమే తగు ...

Read More »

ఆగష్టు 11న చలో హైదరాబాద్‌

కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆగష్టు 11న నిర్వహించనున్న ఛలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిద్దిరాములు అన్నారు. లింగంపేట మండల కేంద్రంలో జరుగుతున్న గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె శిబిరాన్ని మంగళవారం ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె పోరాటం చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం వారి డిమాండ్లను పరిష్కరించాలని లేనిపక్షంలో ఆందోలన మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ...

Read More »

రైతులను అన్ని రకాలుగా ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యం

కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులను అన్ని రకాలుగా ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామ రైతులకు రైతు జీవితబీమా దృవీకరణ పత్రాలు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ రైతుబంధు పథకం ప్రవేశపెట్టి రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం చేయూతనిస్తుందని చెప్పారు. రైతు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడొద్దని సదుద్దేశంతో ప్రభుత్వమే రైతుపక్షాన బీమా చెల్లించి మరణించిన రైతు కుటుంబానికి ...

Read More »

ఊరూరా వైభవంగా బోనాల పండగ

కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంతోపాటు మండలాల్లో బోనాల పండగ ఉత్సవాలను కన్నుల పండువగా నిర్వహించారు. కామారెడ్డి మండలం దేవునిపల్లి గ్రామంలో మంగళవారం శ్రీసూర్యవంశి ఆరె కటిక సంఘం ఆద్వర్యంలో బోనాల ఊరేగింపు నిర్వహించారు. శాలివాహన కుమ్మరి సంఘం ఆద్వర్యంలో సైతం బోనాల వేడుకలు జరిపారు. అందంగా అలంకరించిన బోనాలను నెత్తినెత్తుకొని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. అనంతరం గ్రామంలోని పోచమ్మకు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆయా సంఘాల ప్రతినిధులు ...

Read More »

కామారెడ్డిలో బిపి మండల్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి

కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో బిపి మండల్‌ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మంగళవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణకు సమాజ్‌వాది పార్టీ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిందేశ్వరి ప్రసాద్‌ మండల్‌ వెనకబడిన తరగతుల కమీషన్‌ ఛైర్మన్‌గా 1978లో అప్పటి భారతరాష్ట్రపతి నియమించారన్నారు. వెనకబడిన తరగతులపై అధ్యయనం చేసి ఆయన 1980లో నివేదిక సమర్పించారని చెప్పారు. దానినే మండల్‌ కమీషన్‌ రిపోర్టుగా పరిగణిస్తారని పేర్కొన్నారు. పలు కోర్టులు, ...

Read More »

రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రభుత్వ పథకాలు

కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో రైతులు ఆర్తికంగా నిలదొక్కుకునేందుకు, వారికి చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం వారికోసం పలు రకాల పథకాలు ప్రవేశపెట్టిందని రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బాన్సువాడ మండలం నాగారం గ్రామంలో రైతులకు బీమా బాండ్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర రైతుబంధు సామూహిక జీవితబీమా పథకం ఆగష్టు 14 రాత్రి నుంచి అమలవుతుందని చెప్పారు. నాగారంతోపాటు బాన్సువాడలో రైతుబీమా బాండ్లను మంత్రి పంపిణీ ...

Read More »

విదేశీ విద్యానిధి పథకానికి దరఖాస్తుల ఆహ్వానం

కామారెడ్డి, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని బిసి విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసానికి సహాయం నిమిత్తం విదేశీ విద్యానిధి పథకానికిగాను ఆగష్టు 1 నుంచి 31 లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనకబడిన తరగతుల అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు వయసు 35 సంవత్సరాలలోపు ఉండాలని, తల్లిదండ్రుల వార్షికాదాయం రూ. 5 లక్షల లోపు ఉండాలని చెప్పారు. ఇంజనీరింగ్‌, సైన్స్‌, వైద్యం, మేనేజ్‌మెంట్‌, వ్యవసాయం, నర్సింగ్‌, సామాజిక శాస్త్రాల్లో అభ్యర్థులకు డిగ్రీ స్తాయిలో 60 శాతానికి పైగా ...

Read More »

రైతాంగ సమస్యలపై తహసీల్దార్‌కు వినతి

కామారెడ్డి, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతాంగ సమస్యలపై తాడ్వాయి మండల తహసీల్దార్‌కు గురువారం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్‌ మర్రి రాంరెడ్డి వినతి పత్రం సమర్పించారు. తాడ్వాయి మండలంలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారి దృష్టికి తీసుకొచ్చారు. రైతులకు వెంటనే కొత్త పాస్‌పుస్తకాలు అందించాలని, ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనలో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన 50 శాతం వాటాను వెంటనే చెల్లించాలని, భూసార పరీక్షలు నిర్వహించి రైతులందరికి హెల్త్‌ కార్డులు పంపిణీ చేయాలని తదితర డిమాండ్లు వెల్లడించారు. ...

Read More »

ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అల్పాహారం

కామారెడ్డి, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ క్లబ్‌ ఆప్‌ కామారెడ్డి ప్రధాన కార్యదర్శి విశ్వనాథుల మహేశ్‌గుప్త జన్మదినాన్ని పురస్కరించుకొని గురువారం కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఆవరణలో 150 మందికి అల్పాహారం వితరణ చేశారు. ఈ సందర్భంగా మహేశ్‌ గుప్త మాట్లాడుతూ లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో పలు సామాజికసేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, అందులో భాగంగా ఆసుపత్రిలో రోగులకు, వారి బంధువులకు అల్పాహారం అందజేసినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో క్లబ్‌ ప్రతినిదులు, పబ్బ శ్రీహరి, కస్తూరి నరహరి, శ్యాంగోపాల్‌రావు, నరేశ్‌, రామకోటి, ...

Read More »