Breaking News

Kamareddy

గణనాథునికి విశేష పూలతో అలంకరణ

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని వీక్లి మార్కెట్‌లోగల రామసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేషునికి మంగళవారం పుష్పాలంకరణ చేశారు. 25 అడుగుల ఎత్తుగల భారీ గణనాథునికి వివిధ రకాల పూలతో అలంకరించారు. విగ్రహాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. గణనాథునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో రామసేన అధ్యక్షుడు శ్రీకాంత్‌, భక్తులు పాల్గొన్నారు.

Read More »

భక్తి శ్రద్దలతో కుంకుమ పూజ

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణ పద్మశాలి యువజన సంఘం వినాయక ఉత్సవాల సందర్భంగా మండపం వద్ద మంగలవారం మహిళలుభక్తి శ్రద్దలతో కుంకు మ పూజలో పాల్గొన్నారు. గణేష్‌ మండపం వద్ద సామూహిక కుంకుమపూజలో అధిక సంఖ్యలో బక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు. గణనాథునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. కార్యక్రమంలో మహిళా సంఘం అధ్యక్షురాలు రాజమణి, పట్టణ యువజన సంఘం నాయకులు లక్ష్మణ్‌, ప్రసాద్‌, నవీన్‌, ప్రతినిధులు రాజేశ్వర్‌, రాజయ్య, కిషన్‌, బాలనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Read More »

యువజన సమాఖ్య గణేష్‌ వద్ద అన్నదానం

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో యువజన సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణేష్‌ మండపం వద్ద మంగళవారం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రతి యేటా స్టేషన్‌లో యువజన సమాఖ్య ఆద్వర్యంలో భారీ గణనాయకుని ఏర్పాటు చేస్తారు. అన్నదానం కూడా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా అన్నదానం చేసినట్టు సమాఖ్య అధ్యక్షుడు రవిందర్‌గౌడ్‌ తెలిపారు. పట్టణంలోని షేర్‌ గల్లీలోగల యువసేన షేర్‌ ఫెడరేషన్‌ గణేష్‌ మండపం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మండపాల ...

Read More »

సిసి రోడ్డు పనులు ప్రారంభం

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 3వ వార్డులో సిసి రోడ్డు పనులను మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. మునిసిపల్‌ సాధారణ నిధుల రూ. 2 లక్షలతో రోడ్డు పనులు ప్రారంభించామన్నారు. కాంట్రాక్టర్లు పనులు నాణ్యతతో చేపట్టాలని సూచించారు.

Read More »

మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించాలి

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని లిమ్రా మిలాప్‌ పీస్‌ వెల్పేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం ఆర్డీవో నగేశ్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మైనార్టీలు అన్ని రంగాల్లో వెనకబడి ఉన్నారని, మైనార్టీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని వారు కోరారు. మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగానే వినియోగించుకోకుండా ప్రభుత్వం మైనార్టీల అభ్యున్నతికి పాటుపడాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మైనార్టీ సొసైటీ ప్రతినిధులు ...

Read More »

మానసిక వ్యాధితో యువకుని ఆత్మహత్య

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని అశోక్‌నగర్‌ కాలనీకి చెందిన దత్తాత్రి అనే యువకుడు మానసిక వ్యాధితో బాధపడుతూ సోమవారం ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దత్తాత్రి 10వ తరగతి వరకు చదివి ఫెయిల్‌అయ్యాడు. ఇంకా వివాహం కాలేదు. కొన్ని సంవత్సరాలుగా మానసిక వ్యాదితో బాధపడుతున్న దత్తాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు పట్టణ ఎస్‌ఐ సంతోష్‌ తెలిపారు.

Read More »

అంబరాన్నంటిన సాందీపని వినాయక నిమజ్జన సంబరాలు

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని సాందీపని డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన వినాయకుని సోమవారం నిమజ్జనంచేశారు. ఈసందర్బంగా విద్యార్తులు నిమజ్జన శోభాయాత్రలో విద్యార్థిని, విద్యార్తులు దాండియా నృత్యాలు, డ్యాన్సులు అందరిని ఆకట్టుకున్నాయి. గణపతి బొప్పా మోరియా అంటూ కేరింతలు కొడుతూ నిమజ్జనానికి తరలారు. కళాశాలలో లడ్డూవేలంపాట నిర్వహించగా బిఎస్సీ విద్యార్తులు రూ. 6200 లడ్డూ తీసుకున్నారు. కార్యక్రమంలో కళాశాల సిఇవోహరిస్మరణ్‌రెడ్డి, డైరెక్టర్‌ బాలాజీరావు, ప్రిన్సిపాళ్ళు ప్రవీణ్‌కుమార్‌, సాయిబాబా, అధ్యాపకులు రాజు, మనోజ్‌, బాలనర్సు, సంపత్‌కుమార్‌, శ్యాం, ...

Read More »

ప్రగతి పనులు ప్రారంభం

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 30వ వార్డు వివేకానంద కాలనీలో మురికికాల్వల నిర్మాణం పనులను సోమవారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 13వ ఆర్థికసంఘం నిధులు రూ. 5 లక్షలతో మురికికాల్వల నిర్మాణ పనులు చేపట్టినట్టు ఆమె తెలిపారు. చాలా ఏళ్ల క్రితం నిర్మించిన మురికికాలువలు చెడిపోవడంతో అదే స్థానంలో నూతనంగా కాలువలు నిర్మిస్తున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ విజయ, కౌన్సిలర్లు అరికెల ప్రభాకర్‌యాదవ్‌, ఆనంద్‌, రవి, ...

Read More »

భారీ వినాయకునికి భారీగా భక్తులు

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని భారత్‌రోడ్డులో బిడిఎస్‌ఎస్‌ గణేష్‌ మండలి ఆద్వర్యంలో ప్రతిస్టించిన 20 అడుగుల భారీ వినాయకుని దర్శించేందుకు భక్తులు, ప్రజలు భారీగా తరలివస్తున్నారు. వినాయకుని చేతిలో 51 కిలోల లడ్డూ ప్రసాదాన్ని ఉంచారు. కామారెడ్డి ప్రాంతంనుంచేకాకుండా వివిధ మండలాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చి గణనాథుని దర్శించుకుంటున్నారు. బిడిఎస్‌ఎస్‌ గణనాథుడు పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. గణేష్‌ మండలీల నిర్వాహకులు ఉదయం, సాయంత్రం వేళ వినాయకుని వద్దప్రత్యేక పూజా ...

Read More »

ఆశ వర్కర్ల పిల్లలతో నిరసన

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆశ వర్కర్లు 20 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రబుత్వం పట్టించుకోకపోవడాన్నినిరసిస్తూ సోమవారం తమ పిల్లలతో కలిసి సమ్మెలో బైఠాయించి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించకుండా కుటుంబాలను రోడ్డుకీడుస్తుందన్నారు. అధికారంలోకి రాక ముందు కాంటాక్టు కార్మికులను క్రమబద్దీకరిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక హామీని నిలబెట్టుకోకపోవడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం వెంటనే తమను క్రమబద్దీకరించాలని రూ. 15 వేల కనీస వేతనం చెల్లించాలని ...

Read More »

సేవా కార్యక్రమాల్లో లయన్స్‌ క్లబ్‌ ముందంజ

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సేవా కార్యక్రమాల్లో లయన్స్‌ క్లబ్‌ ముందంజలో ఉందని వివేకానంద క్లబ్‌ అధ్యక్షులు శంకర్‌రెడ్డి అన్నారు. స్థానిక బృందావన్‌ గార్డెన్‌లో శుక్రవారం జరిగిన క్లబ్‌ ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. క్లబ్‌ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత ఆరోగ్య పరీక్ష శిబిరాలు, మొక్కల పెంపకం, నేత్ర సేకరణ, రక్తదానం కార్యక్రమాలకు మంచి స్పందన వచ్చిందన్నారు. క్లబ్‌ చేస్తున్న సేవలను ప్రజలు వినియోగించుకోవాలన్నారు. ప్రజాప్రతినిధులు సైతం సేవా కార్యక్రమాలపై అవగాహన కలిగి వాటిని విజయవంతం చేసేందుకు ...

Read More »

న్యాయమూర్తులకు సన్మానం

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిలో వివేకానంద లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో పలువురు న్యాయవాదులను సన్మానించారు. న్యాయవాదుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టనానికి చెందిన న్యాయవాదులు రామచంద్రారెడ్డి, నరేశ్‌ కుమార్‌, గోపి, చంద్రశేఖర్‌లను సన్మానించారు. కార్యక్రమంలో క్లబ్‌ ప్రతినిదులు శంకర్‌రెడ్డి, ప్రవీణ్‌, భాస్కర్‌, హరిధర్‌, వెంకటేశ్వర్‌రావు, శ్యాంగోపాల్‌, రాజన్న, సతీష్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

మోకాళ్ళపై కూర్చొని ఆశల నిరసన

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆశ కార్యకర్తలు నిర్వహిస్తున్న సమ్మెలోభాగంగా శుక్రవారం మోకాళ్ళపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ 17 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం తమ సమస్యలపట్ల స్పందించకపోవడం శోచనీయమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం తమను క్రమబద్దీకరించాలని, రూ. 15 వేల నెలసరి వేతనం చెల్లించాలని, పిఎఫ్‌, ఇఎస్‌ఐ తదితర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఆశ వర్కర్లు సుజాత, లత, మమత, విజయ, ...

Read More »

ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిలోని పంచముఖి హనుమాన్‌ కాలనీ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో గురువారం విరాట్‌ విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలువేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ విశ్వాన్ని నిర్మించిన విశ్వకర్మ భగవంతునిగా జీవనోపాధికి ఉపయోగపడే రైతు నాగలి నుంచి రైలు ఇంజన్‌ వరకు తయారుచేశారని చెప్పారు. దేవుని ప్రతిరూపాలైన శిలలను చెక్కి విశ్వకర్మ చేతివృత్తులకు జీవం పోశారన్నారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిదులు శ్రీనివాస్‌,ముకుందం, చక్రపాణి, చంద్రశేకర్‌, సత్యం, బ్రహ్మయ్య, ...

Read More »

అక్రమాల నేపథ్యం…సస్పెన్షన్‌లతో తిరుగు ప్రయాణం ..!

  – కామారెడ్డి బల్దియాలో కమీషనర్‌ల నిర్వాకం కామారెడ్డి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మునిసిపల్‌ కమీషనర్‌గా విదులు నిర్వహించిన చాలా మంది కమీషనర్లు అక్రమాల నేపథ్యంలో సస్ఫెన్షన్‌ వేటు పడి తిరుగు ప్రయాణమవుతున్నారు. గతంలో ముగ్గురు కమీషనర్లపై సస్పెన్షన్‌ వేటు పడగా తాజాగా ప్రస్తుత కమీషనర్‌ విక్రమసింహారెడ్డిపై సస్పెన్షన్‌ వేటు పడింది. మునిసిపాలిటీలో పనిచేస్తున్న కమీషనర్ల తీరుతో బల్దియా ప్రగతి పథంలోకి వెళ్లకుండా వెనకబడుతుంది. బల్దియా పరిస్థితి అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా ...

Read More »

26న మహాధర్నా విజయవంతం చేయండి

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఈనెల 26న తలపెట్టిన మహాధర్నాను విజయవంతం చేయాలని సమాఖ్య జిల్లా బాధ్యులు రమేశ్‌ కుమార్‌, పూర్ణచందర్‌రావు, శివరాం, దేవేందర్‌లు కోరారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా సమాఖ్య ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేశామని, దాని పలితంగానే ఆగష్టు 5, 2015న తెలంగాణ ప్రభుత్వం గురకులాలన్నింటిని ఒకే గొడుగు కిందికి తీసుకువస్తామని ప్రకటించిందన్నారు. కానీ ప్యారిటీ పేస్కేళ్లు, ఇతర ...

Read More »

కమ్యూనిస్టు యోధుల జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి

  – సిపిఎం మండల కార్యదర్శి రాజలింగం కామారెడ్డి, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాం ప్రభువును రజాకార్లను ఎదురించి సాగించిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అమరులైన కమ్యూనిస్టు యోధుల జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని సిపిఎం మండల కార్యదర్శి రాజలింగం డిమాండ్‌ చేశారు. గురువారం కామారెడ్డి పట్టణంలో నిర్వహించిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరుల సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. రైతాంగ పోరాటంలో అమరులైన దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, కొమురం భీమ్‌ సహా ...

Read More »

రామేశ్వర్‌పల్లిలో ఐకమత్యంగా వినాయక ఉత్సవాలు

–  ఐకమత్యంగా వినాయక ఉత్సవాలు – అన్ని రంగాల్లో ఐక్యతను చాటుతామంటున్న గ్రామ సర్పంచ్ పెద్ది శ్యామల కామారెడ్డి , సెప్టెంబర్‌ 17 (నిజామాబాదు న్యూస్ ప్రత్యేకం) నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భిక్కనూరు మండలం  రామేశ్వర్‌పల్లి గ్రామం మరొక్క సారి ఆదర్శ గ్రామమని నిరూపించుకుంది. వినాయక చవితి సందర్భంగా గ్రామస్తుందరు కలిసి ఐక్యంగా ఒకే గణపతి విగ్రహాన్ని  ప్రతిష్టించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి మాట్లాడుతూ రామేశ్వర్‌పల్లిని ఆదర్శ గ్రామంగా మార్చే ప్రయత్నంలో గ్రామస్తుందరు ఐక్యంగా నిర్ణయాు తీసుకుంటున్నామని తెలిపారు. గతంలో ప్రయివేటు ...

Read More »

వంట వార్పుతో ఆశల నిరసన

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఆర్డీవో కార్యాలయం ముందు రోడ్డుపై బుధవారం ఆశ కార్యకర్తలు వంట వార్పుతో తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సిఐటియు డివిజన్‌ కార్యదర్శి రాజలింగం, ఆశ యూనియన్‌ మండల అధ్యక్షురాలు మమత మాట్లాడారు. కార్మికులు గత 15 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం సమస్యలు పరిష్కరించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో భవిష్యత్‌ కార్యాచరణకు ...

Read More »

సీనియర్‌ న్యాయవాదికి సన్మానం

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ న్యాయవాద దినోత్సవాన్ని పురస్కరించుకొని సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆద్వర్యంలో బుధవారం కామారెడ్డి సీనియర్‌ న్యాయవాది నారాయణరావును ఘనంగా సన్మానించారు. కామారెడ్డి ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి ఎం.ఎ.సలీం, సహ చట్ట పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు కారంపురి నారాయణలు నారాయణరావును శాలువా, పూలమాలలతో సన్మానించారు. కార్యక్రమంలో సహ చట్ట సమితి ప్రతినిదులు శ్యాంరావు, రాజ్‌వీర్‌, ఆనంద్‌రావు, అనురాధ, సోహెల్‌, చంద్రశేఖర్‌, శ్రీధర్‌, చారి తదితరులు పాల్గొన్నారు.

Read More »