Breaking News

Kamareddy

ఎన్నికల ఏర్పాట్లు పూర్తి

కామారెడ్డి, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాధారణ ఎన్నికలు 2018లో భాగంగా ఈనెల 7న పోలింగ్‌, 11న కౌంటింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు జిల్లా యంత్రంగం పూర్తిచేసిందని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. సోమవారం ఎంసిఎంసి కంట్రోల్‌రూంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కామారెడ్డి జుక్కల్‌, ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబందించి 5 లక్షల 77 వేల 736 మంది ఓటర్లున్నారని, వీరందరికి ఫోటో ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తిచేశామని తెలిపారు. ఓటర్లు ఓటింగ్‌కు వచ్చేటపుడు ఎపిక్‌ కార్డుతోపాటు గుర్తింపు ...

Read More »

అవినీతో, సంక్షేమమే ప్రజలే తేల్చాలి

కామారెడ్డి, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అభివృద్ది కావాలో, అవినీతి కావాలో ప్రజలే ఓటు ద్వారా తేల్చుకోవాలని కామారెడ్డి అసెంబ్లీ బిజెపి అబ్యర్తి కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. సోమవారం ఆయన మాచారెడ్డి మండలం ఆరేపల్లితోపాటు పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ముప్పై ఏళ్లకు పైగా వివిధ పార్టీల నాయకులు కామారెడ్డిని ఏలారని, వారు చేసిన అవినీతి తప్ప అభివృద్ది ఎక్కడుందని ప్రశ్నించారు. అభివృద్ది గురించి ప్రశ్నిస్తే కామారెడ్డి గాంధీ విగ్రహం సాక్షిగా ఇద్దరు మాజీ ...

Read More »

పార్టీల నేతలు పోలింగ్‌ ఏజెంట్ల వివరాలు అందించాలి

కామారెడ్డి, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలింగ్‌ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్‌ ఏజెంట్ల వివరాలను అందించాలని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిదులకు కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. నాయకులతో కలెక్టర్‌ చాంబరులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలింగ్‌ రోజు ఉదయం 6 గంటల నుంచి 6.30 వరకు మాక్‌ పోలింగ్‌ నిర్వహిస్తున్నందున ఉదయం 5.45 గంటలకే పోలింగ్‌ ఏజెంట్లు సన్నద్దమయ్యేలా చూడాలని సూచించారు. పోలింగ్‌ ఏజెంట్లకు సంబంధించి ఇద్దరు రిలీవర్స్‌ను అనుమతించడం జరుగుతుందని సాయంత్రం 4 తర్వాత ...

Read More »

సొంత గ్రామంలో అభివృద్ది చేయలేనివారు నియోజకవర్గంలో ఏంచేస్తారు

కామారెడ్డి, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తన సొంత గ్రామమైన బస్వాపూర్‌ను అబివృద్ది చేసుకోలేని గంప గోవర్దన్‌ ఇక నియోజకవర్గాన్ని ఏం అబివృద్ది చేస్తారని కామారెడ్డి అసెంబ్లీ కాంగ్రెస్‌ అభ్యర్థి షబ్బీర్‌ అలీ అన్నారు. సోమవారం భిక్కనూరు మండలం బస్వాపూర్‌, కాచాపూర్‌లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెరాస నాయకులు ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, తెరాసకు ఓటు వేయకపోతే తరువాత వారి అంతు చూస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. గ్రామాల్లో కొందరు తెరాస కార్యకర్తలను గుండాలను, రౌడీలుగా మార్చి ...

Read More »

దివ్యాంగుల ఉత్పత్తులను వసతి గృహాల్లో వినియోగిస్తాం

కామారెడ్డి, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దివ్యాంగులు చిన్నతరహా పరిశ్రమల ద్వారా తయారుచేసే ఉత్పత్తులను ప్రభుత్వ సంక్షేమ వసతి గృహలకు వినియోగిస్తామని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం స్థానిక రాజీవ్‌నగర్‌లో శాంతిసేన దివ్యాంగుల సమితి వారి చిన్నతరహా కుటీర పరిశ్రమను కలెక్టర్‌ ప్రారంభించారు. అనంతరం దివ్యాంగులు తయారుచేసిన సర్ప్‌, పినాయిల్‌ ఉత్పత్తులను చూసి అభినందించారు. దివ్యాంగులను ప్రేమపూర్వకంగా, కుటుంబ సభ్యుల్లా చూసి ఆదరించాలని, ప్రోత్సహించాలని అన్నారు. కార్యక్రమంలో ఐసిడిఎస్‌ అధికారి రాధమ్మ, డిఆర్‌డిఎ ...

Read More »

మాక్‌ పోలింగ్‌కు ఏజెంట్లను సన్నద్దం చేసుకోవాలి

కామారెడ్డి, డిసెంబరు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలింగ్‌ రోజు ఉదయం 6 గంటలకే ఈవిఎం, వీవీప్యాట్‌ మాక్‌ పోలింగ్‌ జరిపేందుకు ఉదయం 5.45 గంటలకే పోలింగ్‌ ఏజెంట్లను సన్నద్దం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి సత్యనారాయణ రిటర్నింగ్‌ అధికారులను ఆదేశించారు. ఆదివారం తన చాంబరునుంచి కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఎలక్టోరల్‌ జాబితా, ఈవిఎం, వీవీప్యాట్‌, మాక్‌పోలింగ్‌, వెబ్‌ కాస్టింగ్‌, పోస్టల్‌ బ్యాలెట్‌పై సమీక్షించారు. సలహాలు, సూచనలు ఇచ్చారు. ...

Read More »

మహాత్రిపుర సుందరి అమ్మవారికి అభిషేకం

కామారెడ్డి, డిసెంబరు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి పట్టణంలోని శ్రీసీతారామచంద్ర ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో కార్తీకమాస పర్వకాలాన్ని పురస్కరించుకొని ఆదివారం మహా త్రిపుర సుందరి అమ్మవారికి పసుపుకొమ్ములతో అభిషేకం నిర్వహించారు. సహస్రనామ పారాయణ యుక్తంగా గోపూజ చేశారు. ఆంజనేయ శర్మ, శ్రవణ్‌ శర్మ, వినోద్‌శర్మ, రామశర్మ ఆధ్వర్యంలో విశేష పూజలు జరిపారు. మహిళలు సామూహిక కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు గబ్బుల బాలయ్య, శ్రీనివాస్‌, విజయ్‌కుమార్‌, దామోదర్‌, ప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

గడీల దొరల పాలనను తరిమికొట్టండి

కామారెడ్డి, డిసెంబరు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గడీల దొరల పాలనను తరిమికొట్టే సమయం ఆసన్నమైందని కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి పిలుపునిచ్చారు. ఆమె ఆదివారం బాన్సువాడ, దోమకొండ, బీబీపేట్‌ తదితర ప్రాంతాల్లో రోడ్డుషో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు సంక్షేమం కోసం తెరాసకు అధికారం కట్టబెడితే ముఖ్యమంత్రి కెసిఆర్‌ నాలుగున్నరేళ్లకే చేతులెత్తేసి ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. ఆనాడు కెసిఆర్‌తో కలిసి ఉద్యమాలు చేసిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు కనీస విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ...

Read More »

తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న మార్పు బిజెపితోనే సాద్యం

కామారెడ్డి, డిసెంబరు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, ఆ మార్పు బిజెపి ద్వారానే సాధ్యపడుతుందని జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కామారెడ్డిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. నరేంద్రమోడి నాయకత్వంలో తెలంగాణను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. కెసిఆర్‌ పాలనను విసిగి వేసారిన ప్రజలు బిజెపికి అభివృద్ది చేసే అవకాశం ఇవ్వాలని కోరారు. కేంద్ర పథకాలను ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రజల చెంతకు చేరకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. ప్రధానమంత్రి ...

Read More »

తెరాస ద్వారానే బంగారు తెలంగాణ

కామారెడ్డి, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోరాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడం తెరాస పార్టీ వల్లే సాధ్యమని కామారెడ్డి అసెంబ్లీ అభ్యర్థి గంప గోవర్దన్‌ అన్నారు. గురువారం ఆయన కామారెడ్డి పట్టణంతోపాటు పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెరాస కెసిఆర్‌ పాలనలో రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని, సంక్షేమ పథకాలను చూసి తమను తిరిగి ఆదరించాలని కోరారు. కెసిఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలోనే ఆదర్శ పథకాలుగా నిలిచాయని ఆ పథకాలు కొనసాగాలంటే రాష్ట్రంలో ...

Read More »