Breaking News

Kamareddy

రెవెన్యూ భూ రికార్డుల ప్రక్షాళన పరిశీలన

కామారెడ్డి, జూలై 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ రెవెన్యూ డివిజన్‌ కార్యాలయంలో జరుగుతున్న రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని బుధవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ పరిశీలించారు. కంప్యూటర్లో ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియ చూశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 2 లక్షల 10 వేల పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశామన్నారు. 21 వేల పాసుపుస్తకాలు వివిద కారణాలతో పంపిణీ జరగలేదన్నారు. ఇతరత్రా కలుపుకొని 50వేలు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. మంగళవారం నాటికి 34 వేల 361 క్లియర్‌ చేశామని ...

Read More »

పంచాయతీ కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలి

కామారెడ్డి, జూలై 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ గ్రామ పంచాయతీ కార్మిక సంఘాల జేఏసి ఆద్వర్యంలో జూలై 23 నుంచి నిర్వహించనున్న సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సిద్దిరాములు పిలుపునిచ్చారు. బుధవారం కామారెడ్డిలో గ్రామ పంచాయతీ కార్మి సంఘాల ఐక్య కార్యాచరణ జేఏసి ఆద్వర్యంలో సమ్మె సన్నాహక సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో పంచాయతీ రంగంలోని కారోబార్లు, సిబ్బంది, ఇతర కార్మికులకు వేతనాలు పెంచలేదని, గతంలో రాతపూర్వక హామీ ఇచ్చినా అమలుకు నోచుకోలేదన్నారు. ఈ ...

Read More »

దృఢ సంకల్పంతో పరీక్షలకు సన్నద్దం కావాలి

కామారెడ్డి, జూలై 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్‌ఐ, పోలీసు కానిస్టేబుల్‌ పోటీ పరీక్షలకు సంబందించి శిక్షణ పొందినవారందరు దృఢ సంకల్పంతో పరీక్షలకు సన్నద్దం కావాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో 437 మంది అభ్యర్తులకు పోలీసులు శిక్షణ ఇచ్చారు. ముగింపు కార్యక్రమం బుధవారం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరై కలెక్టర్‌ మాట్లాడారు. రాష్ట్రంలో 18 వేలకు పైగా పోలీసు ఉద్యోగాల నియామకం జరుగుతోందని ప్రభుత్వం కల్పించిన శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ...

Read More »

గెస్ట్‌ లెక్చరర్ల కోసం ఆందోళన

కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గెస్ట్‌ లెక్చరర్లను నియమించాలని డిమాండ్‌ చేస్తు మంగళవారం టిఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో నోడల్‌ అధికారి కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్బంగా టిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బాలు మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ప్రారంభమై 45 రోజులు గడుస్తున్నా గెస్ట్‌ జూనియర్‌ అధ్యాపకులను రినివల్‌ చేయకపోవడంతో విద్యార్తులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ముఖ్యమంత్రి అసమర్థత వల్లే విద్యావ్యవస్థ ఇబ్బందులకు గురవుతుందని విమర్శించారు. ప్రభుత్వం వచ్చాక కాంట్రాక్టు అధ్యాపకులు ఉండరని, వారిని క్రమబద్దీకరిస్తామని చెప్పి ఉన్నవారిని ...

Read More »

లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో వైద్య శిబిరం

కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో మంగళవారం లయన్స్‌ క్లబ్‌ కామారెడ్డి ఆద్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా రోగులకు బిపి, షుగర్‌, రోగ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా జరిపారు. 800 మందికి రోగ నిర్ధారణ పరీక్షలు చేసినట్టు క్లబ్‌ అధ్యక్షుడు శ్రీహరి తెలిపారు. కార్యక్రమంలో క్లబ్‌ డిస్ట్రిక్‌ గవర్నర్‌ ప్రకాశ్‌, మహేశ్‌గుప్త, కస్తూరి నరహరి, రమేశ్‌కుమార్‌, నర్సింహరాజు, నాగరాజు, ప్రవీణ్‌, శ్యాంగోపాల్‌రావు, వైద్యులు లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.

Read More »

జిల్లా స్థాయి సమావేశం జయప్రదం చేయండి

కామరెడ్డి, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ధర్మశాలలో ఈనెల 18న నిర్వహించనున్న ఎంసిపిఐయు జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి రాజలింగం కోరారు. మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కామారెడ్డి జిల్లా నిర్మాణ సంఘాలతో నిర్వహించే సమావేశానికి ఎంసిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాండ్రకుమార్‌, సహాయ కార్యదర్శులు ఉపేందర్‌రెడ్డి, కార్యవర్గ సభ్యుడు వనం సుధాకర్‌లు హాజరుకానున్నట్టు తెలిపారు. సమావేశానికి జిల్లాలోని అన్ని మండల పార్టీ కార్యకర్తలు, కార్మిక ...

Read More »

రెండు పడక గదుల ఇళ్ళ నిర్మాణాలు వేగిరం చేయాలి

కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెండు పడక గదుల ఇళ్ళ నిర్మాణాలు వేగవంతం చేయాల్సిన అవసరముందని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అధికారులను, కాంట్రాక్టర్లకు సూచించారు. మంగళవారం కామరెడ్డి పట్టణంలోని ఇందిరానగర్‌ కాలనీలో నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇళ్ళ నిర్మాణాలను, లింగాయపల్లిలో ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఇందిరానగర్‌లో 15 కోట్ల 90 లక్షలతో 300 రెండు పడక గదుల ఇళ్లను, లింగాయపల్లిలో 2 కోట్ల 40 లక్షలతో 40 ఇళ్లను నిర్మిస్తున్నట్టు తెలిపారు. పట్టణంలో కోటి 50 ...

Read More »

కాంగ్రెస్‌లో 30 మంది చేరిక

కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తాడ్వాయి మండలం దేవాయిపల్లి గ్రామానికి చెందిన 30 మంది తెరాస కార్యకర్తలు మంగళవారం శాసననమండలి విపక్షనేత షబ్బీర్‌ అలీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా షబ్బీర్‌అలీ మాట్లాడుతూ కల్లబొల్లి మాటలు చెప్పి అమలుకాని హామీలిచ్చి కెసిఆర్‌ ప్రజలను మోసంచేశారని విమర్శించారు. దళితులకు, పేదలకు మూడెకరాల భూ పంపిణీ ఏమైందని, ఎంతమందికి రెండు పడక గదుల ఇళ్ళు ఇచ్చారని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో ప్రజలే వారికి బుద్దిచెబుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ...

Read More »

గ్రామ పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమించాలి

కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సర్పంచ్‌ల పదవి కాలం ఈనెలతో ముగుస్తున్నందున ప్రతీ గ్రామపంచాయతీకి ప్రత్యేకాధికారులను నియమించాలని చీఫ్‌ సెక్రెటరీ ఎస్‌.కె.జోషి మంగళవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా అధికారులకు సూచించారు. జిఏడి నుంచి ఏర్పాటైన వీడియో కాన్ఫరెన్సులో చీఫ్‌ సెక్రెటరీతోపాటు, మునిసిపల్‌ సెక్రెటరీ అరవింద్‌కుమార్‌, వివిధ శాఖల సెక్రెటరీలు జిల్లా కలెక్టర్లతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల క్లస్టర్‌లకు పంచాయతీ సెక్రెటరీని నియమించాలని, కొత్తగా ఏర్పాటైన మునిసిపాలిటిలకు కమీషనర్‌లుగా ఎంఆర్వోను గాని, జిల్లా అధికారిని గాని నియమించాలని ...

Read More »

వేతనాలు అమలు చేయాలి

కామారెడ్డి, జూలై 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల వేతనాలు అమలు చేయాలని ఏఐటియుసి ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జివో 68 ప్రకారం కార్మికులకు నెలకు 9640 వేతనం చెల్లించాలని, అందులో పిఎఫ్‌ 1157 చెల్లించాలని, దాంతో పాటు పిఎఫ్‌, ఇఎస్‌ఐ చెల్లించాల్సిన అవసరముందన్నారు. ఉద్యోగులకు కనీస వేతనాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదని పేర్కొన్నారు. ...

Read More »