Breaking News

Kamareddy

కార్మికుల సమ్మెను పట్టించుకోకపోవడం శోచనీయం

  – జేఏసి కన్వీనర్‌ జగన్నాథం కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మునిసిపల్‌ కార్మికులు 33 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం కార్మికులను పట్టించుకోకపోవడం శోచనీయమని జేఏసి కన్వీనర్‌ జగన్నాథం అన్నారు. శుక్రవారం ఆయన దీక్షా శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. స్వచ్ఛ హైదరాబాద్‌ స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమంలో కార్మికులు నా దేవుళ్ళు అన్న సిఎం ఇప్పటివరకు వారి సమస్యల పట్ల స్పందించకపోవడం దారుణమని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఆయన స్పందించి కార్మికుల సమస్యల పరిష్కారానికి నిర్ణయం తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో జేఏసి ...

Read More »

తల్లిపాలు బిడ్డకు అమృతం

  కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 7వ వార్డు గాంధీనగర్‌ అంగన్‌వాడి కేంద్రంలో శుక్రవారం తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వార్డు కౌన్సిలర్‌ బట్టు మోహన్‌, సూపర్‌వైజర్‌ రాజమణి మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డకు అమృతం లాంటిదని, పుట్టిన నుంచి ఆరునెలల వరకు తప్పకుండా తల్లిపాలే పట్టించాలన్నారు. బిడ్డ పుట్టిన అరగంటలోపు పట్టే పాలను ముర్రుపాలంటారని, అవి బిడ్డకు పోషక గుణాలు, ఔషధంగా పనిచేస్తుందన్నారు. తప్పకుండా ఆరునెలల వరకు పిల్లలకు తల్లిపాలే ఇవ్వాలని ...

Read More »

అద్దె బస్సులను నిలిపివేయాలని ధర్నా

  కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అద్దె బస్సులను నిలిపివేయాలని శుక్రవారం ఆర్టీసి కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ పుష్కరాల సమయంలో ప్రయివేటు బస్సులు నడిపిస్తున్న బి.ఎస్‌.రెడ్డి అనే డ్రైవర్‌పై అల్పాహారం కోసం ఆగగా డ్యూటీ చేస్తున్నప్పుడు ఎందుకు కూర్చున్నావని డిఎం తన హోదాను మరిచి బూతులు తిడుతూ దుర్బాసలాడి కాలర్‌ పట్టుకున్నాడని ఆరోపించారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా స్పందించకపోతే ఆందోళన ఉదృతం చేస్తామని ...

Read More »

అక్షర టెక్నో స్కూల్లో బోనాల పండగ

  కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని అక్షర టెక్నో స్కూల్లో శుక్రవారం చిన్నారి విద్యార్థులు పోచమ్మకు బోనాల పండగ ఘనంగా నిర్వహించారు. అందంగా ముస్తాబైన విద్యార్థులు అలంకరించిన బోనాలను నెత్తిన బెట్టుకొని పాఠశాల నుంచి పురవీధుల గుండా ఊరేగించారు. ఆషాఢమాసంలో నిర్వహించే బోనాల పండగను విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి భక్తి శ్రద్దలతో నిర్వహించారు. విద్యార్థులు పోత రాజు వేషధారణ, నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం అమ్మవారికి బోనాలు సమర్పించి వర్షాలు కురిసి, పంటలు పండాలని మొక్కుకున్నారు. కార్యక్రమంలో ...

Read More »

సిసి కల్వర్టు నిర్మాణం పనులు ప్రారంభం

  కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టనంలోని 21వ వార్డు పెద్దబజార్‌ ప్రాంతంలో సిసి కల్వర్టు నిర్మాణం పనులను మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. మునిసిపల్‌ సాధారణ నిదులు రూ. 75 వేలతో కల్వర్టు పనులు చేపట్టినట్టు తెలిపారు. నాణ్యత లోపించకుండా నిర్మాణ పనులు చేపట్టాలని ఆమె కాంట్ట్రారును ఆదేశించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు జొన్నల నర్సింలు, బట్టు మోహన్‌, రామ్మోహన్‌, జమీల్‌, నాయకులు గోనె శ్రీనివాస్‌, ఏ.ఇ గంగాధర్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఐసిడిఎస్‌ ఉద్యోగుల నిరసన ప్రదర్శన

  కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగులను 77 మందిని తెలంగాణ రాష్ట్రానికి కేటాయించినందుకు నిరసనగా శుక్రవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఐసిడిఎస్‌ ఉద్యోగులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగులను 77 మందిని తెలంగాణ రాష్ట్రానికి కేటాయించడం సమంజసం కాదన్నారు. దానివల్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఆ ఉద్యోగులను తిప్పి పంపాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయమై మహిళాభివృద్ది, శిశు ...

Read More »

ఆర్థిక ఇబ్బందులతో యువకుని ఆత్మహత్య

  కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం లింగాయిపల్లి గ్రామానికి చెందిన భాస్కర్‌ (27) అనే యువకుడు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డట్టు రూరల్‌ ఎస్‌ఐ నవీన్‌ తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం నవీన్‌ గత కొంత కాలంగా పని దొరక్క ఆర్తిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడన్నారు. దీంతోపాటు కొన్ని నెలల క్రితం భాస్కర్‌ తల్లి చనిపోవడంతో మానసిక వేదనకు గురైనట్టు చెప్పారు. దీంతో పురుగుల మందు తాగగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్టు వివరించారు. కేసు ...

Read More »

డిపో కార్యాలయం ఎదుట కార్మికుల ధర్నా

  కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఆర్టీసి ఆర్‌ఎం, సిటిఎం, ఏవోల వైఖరికి నిరసనగ శుక్రవారం తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ ఆద్వర్యంలో కార్మికులు ఆర్టీసి డిపో ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా డిపో కార్యదర్శి హరినాథ్‌ మాట్లాడుతూ కార్మికులపై ఆర్‌ఎం, సిటిఎం, ఏవోలు కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని డిమాండ్‌ చేశారు. డిపో వర్కింగ్‌ అధ్యక్షుడు కె.ఆర్‌.చందర్‌ మాట్లాడుతూ కార్మిక నాయకులను చర్చలకు పిలిచి మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో టిఎంయు నాయకులు కిషన్‌, ...

Read More »

ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

  కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం క్యాసంపల్లి గ్రామానికి చెందిన చందర్‌ (46) అనే వ్యక్తి ఆర్థిక ఇబ్బందులతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డట్టు రూరల్‌ ఎస్‌ఐ నవీన్‌ తెలిపారు. పంటలు పండక, చేసిన అప్పులు తీర్చలేక చందర్‌ మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్టు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నామన్నారు.

Read More »

వెనకబడిన వర్గాల అభివృద్దికి ఐక్యంగా ఉద్యమించాలి

  కామారెడ్డి, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్సీ,ఎస్టీ, బిసిలు అభివృద్ది చెందాలంటే ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరముందని గిరిజన విద్యార్తి సంఘం జిల్లా అధ్యక్షుడు బాదావత్‌ ప్రేమ్‌దాస్‌ నాయక్‌ అన్నారు. గురువారం కామారెడ్డిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 68 ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటికి ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ వర్గాలకు చెందిన ప్రజలు అభివృద్దికి ఆమడ దూరంలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సమైక్య ఆంద్రప్రదేశ్‌లో అణగారిన వర్గాలు, పాలకుల నిరాదరణకు గురై ఆర్తికంగా ...

Read More »

బీడీ కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలి

  – సిపిఎం జిల్లా కార్యదర్శి దండి వెంకటి కామారెడ్డి, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీడీ కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి దండి వెంకట్‌ అన్నారు. కామారెడ్డి మునిసిపల్‌ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీడీ కార్మికులు పోరాడి సాధించుకున్న విడిఎ, స్కాలర్‌షిప్‌లు, జివోలను బీడీ కంపెనీల యాజమాన్యం అమలుచేయకుండా కార్మికులను మోసం చేస్తుందన్నారు. కంపెనీ యాజమాన్యాలపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. 2014-15, ...

Read More »

ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ

  కామారెడ్డి, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతిని పురస్కరించుకొని గురువారం కామారెడ్డి పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో స్తానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అంతకుముందు జయశంకర్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాలులు అర్పించారు. అనంతరం విశ్వబ్రాహ్మణుల సమస్యల గురించి తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. జయశంకర్‌ తెలంగాణ కోసం చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిదులు వెంకటస్వామి, రాజమౌళి, శ్రీనివాస్‌, బ్రహ్మం, చక్రి, కిష్టయ్య, రఘుకుమార్‌, లక్ష్మణ్‌ తదితరులు ...

Read More »

ఆర్‌ఎం, సిటిఎం వైఖరికి నిరసనగా కార్మికుల ధర్నా

  కామారెడ్డి, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఆర్టీసి ఆర్‌ఎం, సిటిఎం, ఏవోల వైఖరికి నిరసనగ గురువారం తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ ఆద్వర్యంలో కార్మికులు ఆర్టీసి డిపో ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా డిపో కార్యదర్శి హరినాథ్‌ మాట్లాడుతూ కార్మికులపై ఆర్‌ఎం, సిటిఎం, ఏవోలు కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని డిమాండ్‌ చేశారు. డిపో వర్కింగ్‌ అధ్యక్షుడు కె.ఆర్‌.చందర్‌ మాట్లాడుతూ కార్మిక నాయకులను చర్చలకు పిలిచి మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో టిఎంయు నాయకులు కిషన్‌, ...

Read More »

గోదావరి పైప్‌లైన్‌ పరిశీలించి సమస్య తలెత్తకుండా చూడాలి

  – కలెక్టర్‌కు విన్నవించిన మునిసిపల్‌ పాలకవర్గం కామారెడ్డి, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణానికి తాగునీటి కోసం వచ్చే గోదావరి జలాల పైప్‌లైన్‌లు ప్రతి నిత్యం పగిలిపోవడంవల్ల ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారని, వాటిని పరిశీలించి సమస్య తలెత్తకుండా చూడాలని గురువారం కామారెడ్డి మునిసిపల్‌ పాలకవర్గం జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌కు వినతి పత్రం అందజేశారు. గురువారం కామారెడ్డికి వచ్చిన కలెక్టర్‌ను కలిసి సమస్యలు విన్నవించారు. గోదావరి జలాల పైప్‌లైన్లు జలాల్‌పూర్‌ నుంచి కామారెడ్డి పట్టణం ...

Read More »

ఆర్డీవో కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ కార్మికుల ధర్నా

  కామారెడ్డి, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ పంచాయతీ కార్మికులు గత 37 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించపోవడాన్ని నిరసిస్తూ గురువారం కామారెడ్డి ఆర్డీవో కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో అటెండరు, వాచ్‌మెన్‌, స్వీపర్లు, ఎలక్ట్రిషియన్లు, వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం రెగ్యులరైజ్‌ చేసి వారికి ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, పిఎఫ్‌, ఇఎస్‌ఐ తదితర సౌకర్యాలు ...

Read More »

జాతిపితకు కొవ్వొత్తులతో నివాళి

  కామారెడ్డి, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌81వ జయంతి ని పురస్కరించుకొని పట్టణంలోని శ్రీసాయి సుధ విద్యాలయంలో చిన్నారి విద్యార్తులు కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్‌ రాజేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి ప్రొఫెసర్‌ జయశంకర్‌ దశ, దిశ నిర్దేశించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఆయన చూపిన బాటలో ప్రతి విద్యార్తి నడవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకబృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

Read More »

తల్లిపాలు బిడ్డకు శ్రేష్టం

  కామారెడ్డి, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తల్లిపాలే బిడ్డకు శ్రేష్టమని, బిడ్డకు ఆరునెలలు వచ్చేంత వరకు తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ అజయ్‌కుమార్‌ అన్నారు. రోటరీ క్లబ్‌ ఆఫ్‌ కామారెడ్డి ఆద్వర్యంలో స్తానిక ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పుట్టిన గంటలోపు బిడ్డకు ముర్రి పాలు ఇవ్వాలని, తద్వారా బిడ్డకు వ్యాధి నిరోదక శక్తి పెరిగి సంజీవనిలా పనిచేస్తుందని ...

Read More »

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

  కామారెడ్డి, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇళ్ళల్లో పాచి పనులు చేసే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని బుధవారం కామారెడ్డి ఆర్డీవో నగేశ్‌కు ఇండ్ల పాచిపని చేసేవారి యూనియన్‌ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు 300 మంది ఇళ్లల్లో పాచి పనులు చేస్తున్నామన్నారు. పేదరికంలో మగ్గుతూ పిల్లలకు తిండి పెట్టి చదివించలేక అవస్తలు పడుతున్నామని విన్నవించారు. తమకు జీవనభృతి కల్పించాలని, ప్రభుత్వం నుంచి ఇళ్ళస్తలాలు అందేలా చూడాలని తదితర సమస్యలు విన్నవించారు. కార్యక్రమంలో ...

Read More »

ముర్రుపాలు బిడ్డకు సంజీవని

  కామారెడ్డి, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముర్రుపాలు బిడ్డకు సంజీవనిలా పనిచేస్తుందని, ముర్రుపాలే బిడ్డకు మొదటి టీకా అని 24వ వార్డు కౌన్సిలర్‌ రేణుక అన్నారు. ఆగష్టు 1వ తేదీ నుంచి 7 వరకు నిర్వహిస్తున్న తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా బుధవారం 24వ వార్డులో వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లి బిడ్డకు ఆరునెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే అందించాలని, ఇతర ఆహారపదార్థాలు ఇవ్వకూడదన్నారు. 7వ నెల నుంచి తల్లిపాలతో పాటు అంగన్‌వాడి కేంద్రంలో ...

Read More »

ఆర్టీసి డిపో కార్యాలయం ఎదుట ధర్నా

  కామారెడ్డి, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో బుధవారం కామారెడ్డి ఆర్టీసి డిపో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టిఎంయు డిపో కార్యదర్శి హరినాథ్‌ మాట్లాడుతూ ఆర్‌ఎం, సిటిఎం, ఏవోలు తమ మొండి వైఖరి మానుకోవాలని, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్మికులకు మేలు చేయాలని, లేనిపక్షంలో తదుపరినిరసన కార్యక్రమాలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. వారి వైఖరిని మార్చుకోవాలని కోరారు. కార్యక్రమంలో టిఎంయు నాయకులు ఏ.ఆర్‌.రెడ్డి, సత్యం, ...

Read More »