Breaking News

Kamareddy

తెరాస పట్టణ అనుబంధ నాయకుల ఎన్నిక

  కామారెడ్డి, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర సమితి అనుబంధ సంఘాలకు సంబంధించి ఆయా విభాగాల నాయకులను సోమవారం కామారెడ్డి ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఎన్నుకున్నారు. రైతు విభాగం అధ్యక్షునిగా లింగం, బిసి విభాగం అధ్యక్షునిగా ఈశ్వర్‌, ప్రదాన కార్యదర్శిగా సంగమేశ్వర్‌, మైనార్టీ విభాగం అధ్యక్షునిగా షౌకత్‌ అలీఖాన్‌, ప్రధాన కార్యదర్శిగా సయ్యద్‌ అక్రమ్‌, యువత విభాగం అధ్యక్షునిగా రవి, ప్రధాన కార్యదర్శిగా రవిందర్‌, ఎస్సీ సెల్‌ విభాగం అధ్యక్షునిగా రాంచంద్రం, ఎస్టీ సెల్‌ అధ్యక్షునిగా శేషు, ...

Read More »

తెరాస యువజన విభాగం అధ్యక్షునిగా రవి

  కామారెడ్డి, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రసమితి కామారెడ్డి పట్టణ యువజన విభాగం అధ్యక్షునిగా 12వ వార్డు కౌన్సిలర్‌ రవియాదవ్‌ ఎన్నుకోబడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకముంచి పార్టీ యువత అధ్యక్షునిగా నియమించినందుకు కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌, సీనియర్‌ నాయకులు నిట్టువేణుగోపాల్‌, ముజీబోద్దీన్‌, రాజేశ్వర్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ పటిష్టతకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Read More »

మురికి కాల్వల నిర్మాణ పనులు ప్రారంభం

  కామారెడ్డి, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 6వ వార్డు గాంధీనగర్‌ కాలనీలో సోమవారం మురికి కాల్వల నిర్మాణం పనులను మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. మునిసిపల్‌ సాధారణ నిదులు రూ. 2 లక్షల వ్యయంతో కాల్వల నిర్మాణం పనులు చేపడుతున్నట్టు తెలిపారు. పనులను నాణ్యత లోపం లేకుండా త్వరితగతిన పూర్తిచేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో వైస్‌ఛైర్మన్‌ మసూద్‌ అలీ, కౌన్సిలర్‌ సరోజ, ఏఇ గంగాధర్‌, వర్క్‌ ఇన్స్‌పెక్టర్లు సంజీవ్‌, రవిందర్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

అంగన్‌వాడి కేంద్రం తనిఖీ

  కామారెడ్డి, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని హౌజింగ్‌బోర్డులోగల అంగన్‌వాడి కేంద్రాన్ని శనివారం ఐసిడిఎస్‌ సిడిపివో, వార్డు కౌన్సిలర్‌ రేణుకలు ఆకస్మికంగా తనికీ చేశారు. అంగన్‌వాడి కేంద్రంలో విద్యార్థులకు పాఠాలు ఎలా బోదిస్తున్నారు, కేంద్రాన్ని ఎలా పరిశుభ్రంగా ఉంచుతున్నారు, రిజిష్టర్‌ల నమోదును తనికీ చేశారు. అనంతరం విద్యార్థులకోసం వండిన అన్నం పాత్రలను పరిశీలించారు. కేంద్రాన్ని పరిశుభ్రంగా ఉంచుకొని, విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని సిడిపివో తెలిపారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Read More »

ఘనంగా అమ్మ భగవాన్‌ల కళ్యాణ వేడుక

  కామారెడ్డి, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని శ్రీకల్కి ఆలయంలో శనివారం శ్రీఅమ్మ భగవాన్‌ల 13వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని కళ్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పుణ్యాహవాచనం, గోపూజ, ధ్వజారోహణ, మూలమంత్ర కుంకుమ పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేశారు. ప్రపంచంలోని దు:ఖాలు తొలగిపోవాలంటే మనిషి ప్రవర్తనే మూలమని భక్తులకు పిలుపునిచ్చారు. ప్రపంచం సుఖ సంతోషాలతో ఉండాలంటే ప్రతి ఒక్కరు ప్రేమాభిమానాలు కలిగి ఉండాలని సూచించారు. సాయంత్రం వేళ అమ్మభగవాన్‌లను ఊరేగింపు చేశారు. కార్యక్రమంలో భక్తులు ...

Read More »

ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలి

  కామారెడ్డి, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్సీ, ఎస్టీ, బిసిలకు ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని శనివారం కామారెడ్డి తహసీల్దార్‌కు సిపిఎం నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ డివిజన్‌ కార్యదర్శి కె.చంద్రశేఖర్‌ మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో సరళీకరణ ఆర్తిక విధానాలు సంస్కరణల వల్ల ప్రభుత్వ రంగం 15శాతానికి కుదించబడి, 85 శాతానికి ప్రయివేటు రంగం విస్తరించబడిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసిలకు ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయకపోవడం వల్ల దేశంలో, రాష్ట్రంలోగల ...

Read More »

విద్యార్థులు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి

  – డిఎస్పీ భాస్కర్‌ కామారెడ్డి, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని కామారెడ్డి డిఎస్పీ భాస్కర్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని మంజీర డిగ్రీ కళాశాలలో తెలంగాణ యూనివర్సిటీ స్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు శనివారం బహుమతి ప్రదానం చేశారు. ముఖ్య అతిథిగా డిఎస్పీ హాజరై ప్రసంగించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళి రాష్ట్ర స్థాయి పోటీపరీక్షలకే పరిమితం కాకుండా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే ఉద్యోగాలకు సైతం పోటీపడాలని ...

Read More »

అభివృద్ధి పనులు ప్రారంభం

  కామారెడ్డి, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 2వ వార్డులో గురువారం మునిసిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. లక్ష రూపాయలతో చేపట్టిన సిసి రోడ్డు పనులను వైస్‌ ఛైర్మన్‌ మసూద్‌ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని వివిధ వార్డుల్లో ప్రగతి పనులు చేపడుతున్నట్టు తెలిపారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మునిసిపల్‌ కమీషనర్‌ విక్రమసింహారెడ్డి, కౌన్సిలర్‌ గణేశ్‌, సిపివో రాహుల్‌, నాయకులు కిషన్‌, శ్రీనివాస్‌, ...

Read More »

విఆర్‌ఏలను కొనసాగించాలి

  కామారెడ్డి, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలంలో వంతుల వారిగా కొనసాగుతున్న విఆర్‌ఏలను యధావిధిగా కొనసాగించాలని సిఐటియు అనుబంధ విఆర్‌ఏల సంఘం ఆద్వర్యంలో కామారెడ్డి ఆర్డీవో కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు డివిజన్‌ కార్యదర్శి రాజలింగం మాట్లాడుతూ కామారెడ్డి డివిజన్‌లో వంతులవారి విధానం స్వతంత్ర కాలం నుంచి నడుస్తుందన్నారు. డివిజన్‌లోని సేవలు దళిత కటుంబాలు వంతుల వారిగా ఒక్కో మండలంలో 800ల మందికిపైగా ఉన్నారన్నారు. కామారెడ్డి డివిజన్‌లో ఎక్కువ కుటుంబాలు ఆధారపడ్డ ...

Read More »

ఘనంగా అఖండ హనుమాన్‌ చాలీసా పారాయణం

  కామారెడ్డి, జూన్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో మైసూరు వేదపండితులు కళ్యాణ్‌, శ్రీచక్రవర్తి ఆధ్వర్యంలో సుమారు 153 మందిచే 21 సార్లు హనుమాన్‌ చాలీసా పారాయణం వైభవంగా జరిపించారు. అనంతరం మహామంగళహారతి అందించారు. పూజకు వచ్చిన సుమారు 300 మంది భక్తులకు అన్నదానం జరిపించారు. కార్యక్రమంలో పూజారులు కృష్ణ ప్రసాద్‌, ఓంకార్‌, ట్రస్టు సభ్యులు వెంకటకృష్ణ, ఆంజనేయులు, లక్ష్మణ్‌రావు, నవీన్‌కుమార్‌, బైరయ్య, చంద్రకాంత్‌రావు, బాల్‌రాజ్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి

  కామారెడ్డి, జూన్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి డివిజన్‌లోని ప్రయివేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఏఐపిఎస్‌యు జిల్లా ప్రధాన కార్యదర్శి జబ్బర్‌ నాయక్‌ డిమాండ్‌ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయివేటు విద్యాసంస్థళ యాజమాన్యాలు ప్రభుత్వ నిబందనలు పాటించకుండా విచ్చలవిడిగా విద్యార్థుల నుంచి పీజులు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. పేద విద్యార్థులకు ప్రయివేటు విద్యాసంస్థల్లో 25 శాతం మందికి ఉచిత విద్యనందించాల్సి ఉండగా ఏ ఒక్క విద్యార్థికి సైతం విద్యనందించడంలేదని పేర్కొన్నారు. ప్రయివేటు ...

Read More »

యువకుల రక్తదానం

  కామారెడ్డి, జూన్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణానికి చెందిన లక్ష్మి అనే గర్భిణీకి అత్యవసరంగా రక్తం అవసరం కాగా తెరాస ఉపాధ్యక్షుడు లక్ష్మినారాయణ బుధవారం రక్తదానం చేశారు. స్థానిక విపి ఠాకూర్‌ బ్లడ్‌బ్యాంక్‌లో రక్తదానం చేసి సమయానికి గర్భిణీని ప్రాణాపాయ స్థితినుంచి కాపాడాడు. కార్యక్రమంలో తెరాస పట్టణ అద్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, కౌన్సిలర్‌ లక్ష్మినారాయణ, ప్రతినిదులు షకీల్‌, భూమేశ్‌ యాదవ్‌, తదితరులున్నారు.

Read More »

ఆత్మవిశ్వాసానికి అంగవైకల్యం అడ్డుకాదు

  కామారెడ్డి, జూన్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆత్మవిశ్వాసముంటే అంగవైకల్యం అడ్డుకాదని దుర్గసేవా సమితి ప్రతినిధులు అన్నారు. అంగవైకల్యంతో బాధపడుతున్నవారికి చేయూత నందించేందుకు దుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో తోడ్పాటును అందిస్తున్నట్టు తెలిపారు. బుధవారం కామారెడ్డి పట్టణంలో దుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అంగవైకల్యం గలవారికి చేయూత నందించారు. లక్ష్మణ్‌కు 5 వేల రూపాయలు, చంద్రశేఖర్‌కు 2 వేలు, రవిందర్‌రెడ్డికి వెయ్యి, లక్ష్మణ్‌కు 500, మొత్తం రూ. 8500లను ఎంపిపి మంగమ్మ అందజేశారు. సమాజ సేవకు ...

Read More »

సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె

  కామారెడ్డి, జూన్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మునిసిపల్‌ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించని పక్షంలో సమ్మె అనివార్యమవుతుందని మునిసిపల్‌ కాంట్రాక్టు కార్మికుల సంఘం ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు తెలిపారు. బుధవారం కామారెడ్డి మునిసిపల్‌ కమీషనర్‌కు సమ్మె నోటీసును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్‌లోని సుందరయ్య కళాభవన్‌లో 8 కార్మిక యూనియన్లు సమావేశమై కార్మికుల ప్రధాన సమస్యలపై చర్చిస్తామన్నారు. కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్‌ చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ళు నిర్మించి ...

Read More »

ఏఐవైఎఫ్‌ రాష్ట్ర మహాసభల పోస్టర్ల ఆవిష్కరణ

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరీంనగర్‌లో ఈనెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మూడురోజుల పాటు జరిగే ఏఐవైఎఫ్‌ మహాసభల పోస్టర్లను శనివారం కామారెడ్డిలో డిప్యూటి డిఇవో బలరాంనాయక్‌, నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి దశరథ్‌ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోది ప్రభుత్వం రాష్ట్రంలోని కేసీఆర్‌ ప్రభుత్వం విద్యార్థులకు, యువకులకు ఇచ్చిన హామీలు మరిచి వారిని రోడ్డున పడేవిధంగా చేస్తుందని ఆరోపించారు. ఇప్పటివరక ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ల జాడేలేదని పేర్కొన్నారు. ...

Read More »

అలరించిన సాహిత్య సభ

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో ఆర్యనగర్‌ కాలనీలోగల సరస్వతి నిలయంలో శనివారం నిర్వహించిన సాహితీ సభ అలరించింది. సభలో కవులు మాట్లాడుతూ కవి గర్షకుర్తికి మునిసిపల్‌ స్థాయిలోనే కాకుండా జిల్లా, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు రావాలని ఆకాంక్షించారు. సభాధ్యక్షత వహించిన కృష్ణమూర్తి మాట్లాడుతూ తెలంగాణ కవులకు పలు సూచనలు చేసి తమ కవితలతో అలరించారు. ముఖ్య అతిథి చాట్ల నర్సయ్య మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను కేవలం ప్రభుత్వమే నిర్వహిస్తుందని భావించక సాహిత్య తరంగిణి, గర్షకుర్తి ...

Read More »

మరుగుదొడ్ల అవకాశాన్ని వినియోగించుకోవాలి

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వచ్ఛభారత్‌- స్వచ్ఛ తెలంగాణ పథకంలో భాగంగా ప్రభుత్వం లబ్దిదారులకు మరుగుదొడ్ల నిర్మాణం కొరకు ఇస్తున్న డబ్బులను వినియోగించుకోవాలని మునిసిపల్‌ అధికారులు సూచించారు. స్వచ్ఛభారత్‌- స్వచ్ఛ తెలంగాణ అమల్లో భాగంగా కామారెడ్డి మునిసిపల్‌ కార్యాలయంలో శనివారం మేస్త్రీలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా మేస్త్రీలకు మరుగుదొడ్ల నిర్మాణం, ప్రభుత్వం నుంచి వస్తున్న నిదుల గురించి వివరించారు. వార్డుల వారిగా వచ్చిన లబ్దిదారులతో మాట్లాడి ప్రస్తుతం స్తలమున్నవారికి వెంటనే మరుగుదొడ్లు నిర్మించుకోవాలని సూచించారు. సమావేశంలో మునిసిపల్‌ ...

Read More »

రైల్వేస్టేషన్‌ను ఆకస్మికంగా తనికీచేసిన డిఆర్‌ఎం

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి రైల్వేస్టేషన్‌ను శనివారం రైల్వే డిఆర్‌ఎం అరుణాసింగ్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. స్టేషన్‌తోపాటు క్యాంటీన్‌, వివిధ కార్యాలయాలు, ఫుట్‌పాత్‌, టికెట్‌ కౌంటర్లు, ఇతర విభాగాలను పరిశీలించారు. క్యాంటీన్‌లో తినుబండారాలను అధిక ధరలకు అమ్మడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన ధరలకే తినుబండారాలు విక్రయించాలని నిర్వాహకులకు ఆదేశించారు. స్టేషన్‌ను శుభ్రంగా ఉంచుకోవాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట పలువురు అధికారులు ఉన్నారు.

Read More »

ప్రజ్ఞ కళాశాల విద్యార్థులకు సన్మానం

  కామారెడ్డి, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల ప్రకటించిన తెలంగాణ యూనివర్సిటీ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రజ్ఞ కళాశాల విద్యార్థులను శుక్రవారం కళాశాల యాజమాన్యం సన్మానించారు. శ్రీహిత 99 శాతం మార్కులు సాధించింది. ఈమెతోపాటు వివిధ కోర్సుల్లో వందకు వంద సాధించిన 20 మంది విద్యార్థులను ఎస్‌బిహెచ్‌ దేవునిపల్లి మేనేజర్‌ ఈశ్వర్‌, కళాశాల కరస్పాండెంట్‌ శశిదర్‌ శర్మ జ్ఞాపికలతో సత్కరించారు. కార్యక్రమంలో డైరెక్టర్‌ లక్ష్మారెడ్డి, ప్రిన్సిపల్‌ గోవర్ధన్‌రెడ్డి, వైస్‌ ప్రిన్సిపల్‌ మోహన్‌, అధ్యాపకబృందం పాల్గొన్నారు.

Read More »

గ్రీన్‌వాక్‌ అటవీశాఖ ఆధ్వర్యంలోర్యాలీ

  కామారెడ్డి, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం కామారెడ్డి పట్టణంలో గ్రీన్‌వాక్‌ ఫౌండేషన్‌, అటవీశాఖ సంయుక్త ఆద్వర్యంలో ర్యాలీ నిర్వహించారు స్థానిక అటవీశాఖ కార్యాలయం నుంచి కొత్త బస్టాండ్‌ వరకు ర్యాలీ చేపట్టారు. ఇందులో భాగంగా విశ్రాంత ఉద్యోగుల భవనంలో పర్యావరణ సదస్సు, మొక్కల పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు. ఈ ర్యాలీని ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి సలీం జెండా ఊపి ప్రారంభించారు. తెలంగాణ హరితహారంపై నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగింది. తెలంగాణలో చేపట్టిన ...

Read More »