Breaking News

Kamareddy

బోరుమోటారు ప్రారంభం

  కామారెడ్డి, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 24వ వార్డు హౌజింగ్‌ బోర్డులోని ద్వారకానగర్‌లో శుక్రవారం వార్డు కౌన్సిలర్‌ రేణుక చంద్రశేఖర్‌ బోరు మోటారును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమెమాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ మంచినీటి ఎద్దడి నివారణకు నిదులు కేటాయించారని తెలిపారు. నిదుల కోసం ఎమ్మెల్యేను కోరగా వెంటనే నిధులు విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా వార్డుల అభివృద్ధికి ఎమ్మెల్యే, ఛైర్మన్‌ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు చంద్రశేఖర్‌, ...

Read More »

పర్యావరణాన్ని కాపాడాలని అటవీశాఖ ర్యాలీ

  కామారెడ్డి, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం కామారెడ్డి డివిజన్లోని అటవీశాఖ సిబ్బంది పర్యావరణాన్ని కాపాడాలని అడవులను రక్షించాలని కామారెడ్డి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అడవులను కాపాడుకుంటేనే భవిష్యత్తు తరాలకు స్వచ్చమైన గాలి, నీరు అందే అవకాశముంటుందని పేర్కొన్నారు. అడవులను నరికివేసి భావితరాలకు హాని కలిగించవద్దని సూచించారు. కార్యక్రమంలో కామారెడ్డి డివిజన్‌ అటవీశాఖ సిబ్బంది, ఆర్డీవో నగేశ్‌, డిఎఫ్‌వో నాగేశ్వర్‌రావు, జిల్లా సెకండ్‌ క్లాస్‌మేజిస్ట్రేట్‌ సలీం, ...

Read More »

ప్రమాదవశాత్తు చెరువులో పడి యువకుని మృతి

  కామారెడ్డి, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తాడ్వాయి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామ చెరువులో శుక్రవారం మధ్యాహ్నం ఈతకువెళ్లి ప్రమాదవశాత్తు పాషా (21) మృతి చెందినట్టు దేవునిపల్లి ఎస్‌ఐ నవీన్‌కుమార్‌ తెలిపారు. కామారెడ్డి పట్టణంలోని బతుకమ్మ కుంటకు చెందిన పాషా శుక్రవారం సరంపల్లి గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లి అక్కడినుంచి ఈతకొట్టేందుకు చిన్నమల్లారెడ్డి చెరువులోకి వెళ్లగా ప్రమాద వశాత్తు మృతి చెందినట్టు తెలిపారు. మృతునికి భార్య, కూతురు ఉన్నట్టు తెలిపారు.

Read More »

పిఆర్‌టియు మహాధర్నా పోస్టర్ల ఆవిష్కరణ

  కామారెడ్డి, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద ఈనెల 9న పిఆర్‌టియు ఆధ్వర్యంలో తలపెట్టిన మహాధర్నాకు సంబంధించిన గోడప్రతులను గురువారం కామారెడ్డిలో ఆవిష్కరించారు. ఈసందర్భంగా పిఆర్‌టియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కమలాకర్‌, శంకర్‌లు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని, తెలంగాణ కోసం ఉపాధ్యాయులు ఎంతో పోరాడి సాధించుకున్నారన్నారు. పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, సర్వీసు రూల్సు అమలు చేయాలని, ఆరోగ్య కార్డులు ప్రయివేటు ఆసుపత్రుల్లో చెల్లుబాటు ...

Read More »

ఉత్తమ అంగన్‌వాడి కార్యకర్తకు సన్మానం

  కామారెడ్డి, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉత్తమ అంగన్‌వాడి కార్యకర్తగా ఎంపికైన పి.సుజాతను రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ సుష్మ, ఆర్డీవో నగేశ్‌లు ప్రశంసాపత్రం, అవార్డును అందించారు. సుజాత స్థానిక రాజీవ్‌నగర్‌ కాలనీలో అంగన్‌వాడి కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ తనకు సహకరించిన ఐసిడిఎస్‌ సిడిపివో సంధ్యారాణి, అర్బన్‌ సూపర్‌వైజర్‌ రాజమణిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తమ అంగన్‌వాడి కార్యకర్తకు సన్మానం కామారెడ్డి, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉత్తమ ...

Read More »

మంచినీటి మోటరు ప్రారంభం

  కామారెడ్డి, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 23వ వార్డులో గురువారం మంచినీటి బోరు మోటారును మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. వార్డులో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొన్న దృష్ట్యా మునిసిపల్‌ జనరల్‌ ఫండ్స్‌ నుంచి బోరు మోటారు బిగించారు. ప్రజల దాహార్తి తీర్చడానికి చర్యలు చేపట్టారు. దీంతోపాటు 14వ వార్డు గడి రోడ్డులో, 11వ వార్డులో మునిసిపల్‌ జనరల్‌ ఫండ్స్‌ నుంచి లక్ష రూపాయలతో బోరు మోటార్లు ప్రారంభించినట్టు ఆమె తెలిపారు. కార్యక్రమంలో వైస్‌ ...

Read More »

ఆక్రమణలపై ఉక్కుపాదం

  – స్వయంగా రంగంలోకి దిగిన ఎమ్మెల్యే కామారెడ్డి, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఆక్రమణలపై ఉక్కుపాదం మోపారు. స్వయంగా స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ రంగంలోకి దిగి ఆక్రమణ తొలగింపునకు శ్రీకారం చుట్టారు. బుధవారం రాత్రి ఆక్రమణల తొలగింపు వ్యవహారం వివాదానికి దారితీసింది. ఆక్రమణదారులకు, ప్రజాప్రతినిధులకు వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కొంతమంది ఆక్రమణ దారులను పోలీసు స్టేషన్‌కు తరలించారు. స్థానిక నిజాంసాగర్‌ చౌరస్తాలోని పెట్రోల్‌ బంక్‌ వద్ద పరిసర ప్రాంతాల్లో కబ్జాకు గురైన ...

Read More »

ప్రథమ మహాసభల వాల్‌పోస్టర్ల ఆవిష్కరణ

  కామారెడ్డి, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ అసంఘటిత రంగ కార్మిక సంఘాల సమాఖ్య టిఎకెఎస్‌ నిజామాబాద్‌ జిల్లా మహాసభలకు సంబందించిన గోడప్రతులను బుధవారం కామారెడ్డిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రదాన కార్యదర్శి నర్సాగౌడ్‌ మాట్లాడుతూ ఈనెల 7వ తేదీన జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్‌ భవనంలో టిఎకెఎస్‌ జిల్లా మొదటి మహాసభలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సభలకు వివిధ ప్రజాసంఘాల మేధావులు, న్యాయవాదులు హాజరుకానున్నారని పేర్కొన్నారు. జిల్లాలోని సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికులు అధిక సంఖ్యలో హాజరై సభ ...

Read More »

ట్రాఫిక్‌ ఇబ్బందులు తొలగించాలి

  కామారెడ్డి, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని ప్రధాన వ్యాపార మార్గాల్లో ఏర్పడ్డ తీవ్రమైన ట్రాఫిక్‌ సమస్యను బుధవారం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిదులు స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ను కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్బంగా వారుమాట్లాడుతూ పట్టణంలోని ప్రధాన వ్యాపార మార్గాలైన సుభాష్‌రోడ్డు, తిలక్‌రోడ్డు, జెపిఎన్‌ రోడ్డు, మాయాబజార్‌లలో అనునిత్యం విపరీతమైన ట్రాఫిక్‌ ఏర్పడుతుందని పేర్కొన్నారు. నిబంధనలు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా పార్కింగ్‌ చేస్తున్నారని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ట్రాఫిక్‌ ...

Read More »

కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

  కామారెడ్డి, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం లింగాపూర్‌ గ్రామ ఎంపిటిసి కాశీంబి కుమారుడు ఎస్‌.కె.అహ్మద్‌ విద్యుత్‌ ఘాతంతో మరణించాడు. బుధవారం మృతుని కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ పరామర్శించారు. మృతుని కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. మృతునికుటుంబాన్ని ఓదార్చారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు, నాయకులు వెంకటేశ్వర్‌రెడ్డి, గోపిగౌడ్‌, రాంరెడ్డి, సర్పంచ్‌ బాల్‌రాజు, బాగయ్య, లింగం తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఆసుపత్రిపై దాడిని ఖండిస్తూ వైద్యుల నిరసన

  – డిఎస్పీకి వినతి కామారెడ్డి, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిపై జరిగిన దాడిని ఖండిస్తూ బుధవారం కామారెడ్డి పట్టణంలో వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది నిరసన ప్రదర్శన చేపట్టారు. వైద్యులు, ఆసుపత్రులపై దాడులు ఆపాలంటూ పట్టణంలో నల్ల బ్యాడ్జిలు ధరించి ర్యాలీ చేపట్టారు. ఐఎంఎ ఆధ్వర్యంలో వైద్యులు కార్యక్రమం నిర్వహించారు. స్థానిక డిఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకొని డిఎస్పీ భాస్కర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ అజయ్‌కుమార్‌, ...

Read More »

నవ తెలంగాణ కోసం సిపిఎం పోరాటం

  కామారెడ్డి, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడిపోయి 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను నవ తెలంగాణగా సాధించుకునే దిశగా సిపిఎం పోరాటం చేస్తుందని ఆ పార్టీ డివిజన్‌ కార్యదర్శి కె.చంద్రశేఖర్‌ అన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణలోని ప్రజల ఆకాంక్ష నెరవేర్చడంలో తెరాస కేవలం ఆర్భాటాలకే పరిమితమైందని విమర్శించారు. ప్రజలు, శ్రామిక వర్గాల ఆందోళనలు పెరిగిపోయాయన్నారు. తెరాస ప్రభుత్వం ఎన్నిలక మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చాలని, ...

Read More »

వివిధ రంగాల్లో సేవలందించిన వారికి సన్మానం

  కామారెడ్డి, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వివిధ రంగాల్లోసేవలందించిన వారికి మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా కామారెడ్డి మునిసిపల్‌ కార్యాలయంలో సన్మానించారు. ఉత్తమ సంఘ సేవకుడిగా కె.నరేందర్‌రెడ్డి, ఉత్తమ వైద్యునిగా రమేశ్‌బాబు, సుధీర్‌కుమార్‌, ఉత్తమ ఉపాధ్యాయురాలుగా పద్మజ, శివ, ఉత్తమ అర్చకులుగా జార్జ్‌ మాథ్యు కల్లు, ఉత్తమ అంగన్‌వాడి వర్కర్లుగా సుజాత, మల్లికార్జున్‌, ఉత్తమ ప్రభుత్వ ఉద్యోగులుగా నరేందర్‌, అమృత, ఉత్తమ ఎన్జీవోగా మాసల లక్ష్మినారాయణ, ఉత్తమ క్రీడాకారునిగా సహస్ర, ఉత్తమ పరిశోధకునిగా గడిసెకుర్తి రాజేందర్‌లను ...

Read More »

ప్రగతి పనులు ప్రారంభం

  కామారెడ్డి, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 8వ వార్డులో మంగళవారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. 13వ ఆర్థిక సంఘం నిధులు రూ. 5 లక్షలతో చేపట్టిన సిసి డ్రైన్‌ పనులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు. పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు యాదమ్మ, బట్టు మోహన్‌, నాయకులు రాజేందర్‌, శ్రీనివాస్‌, ప్రసాద్‌, ...

Read More »

ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

  కామారెడ్డి, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని వివిద ప్రభుత్వ కార్యాలయాలు, పార్టీ కార్యాలయాలు, పాఠశాలలు, ప్రజా సంఘాలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో నగేశ్‌, డిఎస్పీ కార్యాలయంలో డిఎస్పీ భాస్కర్‌, స్థానిక మునిసిపల్‌ కార్యాలయంలో ఛైర్మన్‌ పిప్పిరి సుష్మ, తహసీల్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ జాతీయజెండా ఆవిష్కరించారు. బిజెపి, తెరాస, కాంగ్రెస్‌, తెదేపా, సిపిఐ, సిపిఎం, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం,శ్రీసాయిసుధ ...

Read More »

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

కామారెడ్డి, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం 1983-84 లో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల సమావేశం జరిగింది. ది స్నేహ ఏ ట్రూ ప్రెండ్‌ వెల్పేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఇందులో 130 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ది స్నేహ సొసైటీ తరఫున గత రెండు సంవత్సరాలుగా చేస్తున్న అభివృద్ధిని గురించి వివరించారు. అనంతరం సొసైటీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా రమేశ్‌బాబు, ప్రధాన కార్యదర్శిగా ...

Read More »

నేడు జిల్లాకు కేంద్రమంత్రి గడ్కరీ రాక

– మాజీ ఎమ్మెల్యే యెండల కామారెడ్డి, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలో సోమవారం జరగనున్న జిల్లా పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి, అనంతరం జరిగే సభకు ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ హాజరుకానున్నట్టు నిజామాబాద్‌ అర్బన్‌ మాజీ ఎమ్మెల్యే, బిజెపి నాయకులు యెండల లక్ష్మినారాయణ తెలిపారు. ఆదివారం కామారెడ్డిలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నరేంద్రమోడి ఏడాది పాలనలో దేశంలో జరిగిన అభివృద్ధి గురించి, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాల గురించి గడ్కరీ వివరిస్తారన్నారు. ...

Read More »

మునిసిపల్‌ కార్మికుల పర్మనెంట్‌కై 1న ఛలో హైదరాబాద్‌

  కామారెడ్డి, మే 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మునిసిపల్‌ వ్యవస్థలో కాంట్రాక్టు పద్దతిలో కాలం వెళ్ళదీస్తున్న కార్మికులను పర్మనెంట్‌ చేయాలనే డిమాండ్‌తో జూన్‌ 1న ఛలో హైదరాబాద్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు సిఐటియు కాంట్రాక్టు కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కె.రాజనర్సు తెలిపారు. కామారెడ్డి పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంట్రాక్టు కార్మికులు శ్రమదోపిడికి గురవుతున్నారని, వారిని పర్మనెంట్‌ చేస్తామని ప్రభుత్వాలు హామీలు గుప్పిస్తున్నప్పటికి ఇంతవరకు పర్మనెంట్‌ చేయకపోగా వారికి కల్పించాల్సిన కనీస వేతనాలు, పిఎఫ్‌, ఇతర ...

Read More »

నీటి సరఫరా కేంద్రాన్ని ఆకస్మికంగా తనికీ చేసిన చైర్‌పర్సన్‌

  కామారెడ్డి, మే 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 5వ వార్డులో గల నీటి సరఫరా వ్యవస్థను శుక్రవారం మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ఆకస్మిక తనిఖీ చేశారు. 5వ వార్డులోని సైలానిబాబా కాలనీ ప్రాంతంలో మునిసిపల్‌ వాటర్‌ ట్యాంకర్ల ద్వారా పట్టణానికి నీటి సరఫరా చేస్తుంటారు. ఛైర్‌పర్సన్‌ ఆకస్మిక తనికీ చేసి నీటి సరపరా జరుగుతున్న తీరును వాటర్‌ ట్యాంకర్ల రిజిష్టర్లను, ట్యాంకర్ల ట్రిప్పుల సమయాన్ని పరిశీలించారు. గైర్హాజరైన వాటర్‌ ట్యాంకర్‌ల కాంట్రాక్టర్ల బిల్లుల్లో కోత విధించాలని ...

Read More »

మూలికల పేరుతో ఘరానా మోసం…

  – చాకచక్యంతో దొంగలను పట్టుకున్న పోలీసులు కామారెడ్డి, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మూలికల పేరిట చోరీలకు పాల్పడుతున్న దొంగలను కామారెడ్డి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. కామారెడ్డి డిఎస్పీ భాస్కర్‌ గురువారం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితులను ప్రవేశపెట్టారు. డిఎస్పీ కథనం ప్రకారం… నర్సాపూర్‌కు చెందిన ఒంటెద్దు రవి, ఒంటెద్దు శ్రీనివాస్‌, ఒంటెద్దు సాయిలు ముగ్గురు కలిసి మూలికలు విక్రయిస్తూ చోరీలకు పాల్పడుతున్నారన్నారు. వీరు ఇందల్వాయికి చెందిన అబ్దుల్‌ సయీద్‌కు ఈనెల 22న మూలికలతో సర్వరోగాలు ...

Read More »