Breaking News

Kamareddy

ప్రగతి పనులు ప్రారంభం

కామారెడ్డి, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 5వ వార్డులో సోమవారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. మునిసిపల్‌ సాధారణ నిదులు 3 లక్షలతో సిసి డ్రైన్‌ నిర్మాణ పనులు చేపట్టారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పట్టణాన్ని అభివృద్ధి పరిచేందుకు సభ్యులందరితో కలిసి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు పద్మ, బట్టుమోహన్‌, నాయకులు రాంకుమార్‌, తదితరులు ఉన్నారు.

Read More »

తెరాస విజయగర్జనకు భారీగా జనసమీకరణ – వేలాదిగా తరలివెళ్లిన నాయకులు

కామారెడ్డి, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించిన తెరాస విజయగర్జనసభకు కామారెడ్డి నియోజకవర్గం నుంచి వేలాదిగా నాయకులు, కార్యకర్తలు, తరలి వెళ్లారు. సుమారు 30 బస్సులు, వందకుపైగావాహనాల్లో నాయకులు, కార్యకర్తలను తరలించారు. ప్రతి నియోజకవర్గం నుంచి వేల సంఖ్యలో కార్యకర్తలను సమీకరించాలని ఇదివరకే అధిస్టానం ఆదేశాలున్న నేపథ్యంలో నాయకులు కార్యకర్తలను సమీకరించేందుకు చమటోడ్చారు. కార్యకర్తలతో పాటు నాయకులు వాహనాల్లో కలిసి వెళ్లారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా నాయకులు జనసేకరణ కోసం పోటీపడ్డారు. గత కొన్ని రోజలు కిందటనే ...

Read More »

షబ్బీర్‌అలీకి ఘనస్వాగతం… ఘన సన్మానం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాసనమండలి విపక్షనేతగా ఎన్నికైన తర్వాత తొలిసారి జిల్లాలో అడుగిడిన మాజీ మంత్రి షబ్బీర్‌అలీకి కామారెడ్డి నియోజకవర్గ నాయకులు ఘనస్వాగతం పలికారు. జిల్లా సరిహద్దు గ్రామమైన బస్వాపూర్‌ వద్ద షబ్బీర్‌ అలీకి పూలదండలు వేసి ఆహ్వానం పలికారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అక్కడినుంచి వందలాది ద్విచక్ర వాహనాలతో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. బస్వాపూర్‌ నుంచి కామారెడ్డి వరకు ర్యాలీ కొనసాగింది. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ జరిపారు. అనంతరం ...

Read More »

కేసీఆర్‌ ప్రజలపక్షమా… పెట్టుబడి దారీ పక్షమా…

  – సెక్యురిటీ వదిలి జనంలోకి వెళ్దాం పదా… – మండలి విపక్ష నేత షబ్బీర్‌ అలీ కామారెడ్డి, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముక్యమంత్రి కేసీఆర్‌ ప్రజలపక్షమో.. పెట్టుబడిదారుల పక్షమో తేల్చి చెప్పాలని శాసనమండలి విపక్ష నేత షబ్బీర్‌ అలీ సూటిగా ప్రశ్నించారు. కామారెడ్డి పట్టణంలోని సత్యగార్డెన్స్‌లో గురువారం జరిగిన కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దేశప్రధాని నరేంద్రమోడి అవలంబిస్తున్నప్రజా వ్యతిరేక విధానాలు, భూసేకరణ ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా దేశంలోని అన్ని పార్టీలు ...

Read More »

ఛలో మెట్‌పల్లి గోడప్రతుల ఆవిష్కరణ

  కామారెడ్డి, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 25న తలపెట్టిన ఛలో మెట్‌పల్లి బహిరంగ సభ గోడప్రతులను గురువారం కామారెడ్డిలో ఆవిష్కరించారు. భారతీయ విద్యార్థి మోర్చా, భారత్‌ ముక్తిమోర్చాల ఆధ్వర్యంలో ఛలో మెట్‌పల్లి కార్యక్రమం నిర్వహించనున్నట్టు ప్రతినిదులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాధికారం కోసం బహుజనులంతా ఏకమవ్వాల్సిన అవసరముందన్నారు. వెనకబడిన కులాల వారందరిని ఐక్యం చేసేందుకు వారిని చైతన్యపరిచేందుకు కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో జ్యోతి బాఫూలే విగ్రహ ఆవిష్కరణ, బహిరంగ సభ ఉంటుందన్నారు. దీనికి ...

Read More »

ప్రతిపక్షనేత స్వాగతానికి భారీ సన్నాహాలు

  కామారెడ్డి, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ శాసనసభ ప్రతిపక్షనేతగా ఎన్నికై తొలిసారిగా జిల్లాకు వస్తున్న మాజీ మంత్రి షబ్బీర్‌అలీని సన్మానించేందుకు కాంగ్రెస్‌ నాయకులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. షబ్బీర్‌ అలీ గురువారం కామారెడ్డికి రానున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా సరిహద్దు గ్రామమైన బస్వాపూర్‌ నుంచి షబ్బీర్‌అలీకి ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బస్వాపూర్‌లో జెండా ఆవిష్కరణ చేయించి అనంతరం అక్కడినుంచి కామారెడ్డి వరకు భారీ బైక్‌ ర్యాలీ చేపట్టనున్నారు. పట్టణంలోని సత్యగార్డెన్స్‌లో షబ్బీర్‌అలీకి పార్టీ, వివిధ సంఘాల ...

Read More »

బంగారు తెలంగాణ సాధనలో…

  ముందంజలో జాగృతి.. – తెలంగాణ జాగృతి జిల్లా కన్వీనర్‌ లక్ష్మినారాయణ కామారెడ్డి, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బంగారు తెలంగాణ సాధనలో తెలంగాణ జాగృతి ముందుండి పోరాడుతుందని తెలంగాణ జాగృతి జిల్లా కన్వీనర్‌ లక్ష్మినారాయణ అన్నారు. కామారెడ్డిలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత తెలంగాణ సాదనలో ముందుండి పోరాడారని అన్నారు. అసెంబ్లీలో అంబేడ్కర్‌ విగ్రహ ఏర్పాటు కోసం 48 గంటలు నిరాహార దీక్షచేసి దేశంలో ఎక్కడాలేనివిధంగా అసెంబ్లీలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని ...

Read More »

వైభవంగా శ్రీరేణుక ఎల్లమ్మ జోగుపండగ

కామారెడ్డి, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం ఇస్రోజివాడి గ్రామంలో శ్రీరేణుక ఎల్లమ్మ జోగు పండగ కార్యక్రమాన్ని సోమవారం గ్రామ ప్రజలు వైభవంగా నిర్వహించారు. రేణుక ఎల్లమ్మ ఉత్సవాలను మూడురోజులపాటు నిర్వహించనున్నట్టు గ్రామస్తులు తెలిపారు. ప్రతియేడు అమ్మవారి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని, ఈ యేడు సైతం ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. రేణుక ఎల్లమ్మ విగ్రహాన్ని గ్రామంలో డప్పు చప్పుళ్ళ మధ్య ఊరేగించారు. మహిళలు మంగళహారుతులతో అమ్మవారికి పూజలు జరిపారు. ఉత్సవాలకు గ్రామంతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వందలాదిగా తరలివచ్చారు.

Read More »

దత్తాశ్రమంలో ఘనంగా పూజలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని దత్తాశ్రమంలో ఆదివారం భక్తులు ఘనంగా పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని సామూహిక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. పాడి పంటలు సమృద్ధిగా ఉండి, అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని పూజలు నిర్వహించారు.

Read More »

ట్రాన్స్‌పోర్టు సేప్టీ బిల్లును విరమించుకోవాలి – బిఎంఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవిశంకర్‌

కామారెడ్డి, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రయివేటు రవాణా వ్యవస్థ నడ్డివిరిచేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న రోడ్డు ట్రాన్స్‌పోర్టు సేప్టీ బిల్లును వెంటనే విరమించుకోవాలని బిఎంఎస్‌ తెలంగాణ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి రవిశంకర్‌ డిమాండ్‌ చేశారు. బిల్లును వ్యతిరేకిస్తూ ఈనెల 30న దేశవ్యాప్తంగా చేపట్టనున్న రవాణా సమ్మెకు సంబందించిన గోడప్రతులను ఆదివారం కామారెడ్డిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత యుపిఏ ప్రభుత్వ హయాంలో సుందరం కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎన్డీయే ప్రభుత్వం బిల్లు తీసుకువస్తుందని ...

Read More »

అభివృద్ధి పనులు ప్రారంభం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 32వ వార్డులో మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ శనివారం పలు అభివృద్ధి పనులుప్రారంభించారు. 13వ ఆర్థిక సంఘం నిధులు రూ.7.50 లక్షలతో చేపట్టిన మురికి కాల్వల నిర్మాణం, నాన్‌ ప్లాన్‌ నిదులు రూ. 4 లక్షలతో చేపట్టిన సిసి రోడ్దు పనులు, బిఆర్‌జిఎప్‌ నిదులు రూ. 2 లక్షలతో చేపట్టిన కల్వర్టు పనులను ఆమె ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలోని అన్ని వార్డుల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ...

Read More »

రైతుల ఆత్మహత్యలు తెరాస పుణ్యమే…

  – టిడిపి శాసనసభ పక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌ కామారెడ్డి, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస అధికారంలోకి వచ్చినప్పటినుంచి రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని, ఈ కారణంగానే 700 మంది రైతులు తెలంగాణలో ఆత్మహత్యలకు పాల్పడ్డారని టిడిపి శాసనసభ పక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఆరోపించారు. కామారెడ్డి పట్టణంలో శనివారం నిర్వహించిన కామారెడ్డి టిడిపి నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రభుత్వం మాటల్లో చెప్పిన పనులు చేతల్లో ఏమాత్రం చూపడం లేదని, ...

Read More »

నిధుల విడుదలపై హర్షం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి మండలంలోని తాగునీటి ఎద్దడిని నివారణ కోసం రూ. 36 లక్షల నిధులను ఎంపీ కవిత, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ విడుదల చేసినట్లు టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శక్కరి కొండ కృష్ణ శనివారం తెలిపారు. మండలంలోని బీబీపూర్‌కు రూ. లక్ష, చంద్రయాన్‌పల్లికి రూ. 2 లక్షలు, డిచ్‌పల్లి కి రూ. 1.లక్ష50వేలు, ధర్మారంకు రూ. 2 లక్షలు, సంగ్రానాయక్‌ తండాకు రూ. లక్ష, డిచ్‌పల్లి తండాకు రూ. 1.లక్ష50వేలు, ...

Read More »

ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ కోర్సులు

  కామారెడ్డి, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో వ్యాపార నిర్వహణ విభాగంలో రెండు సంవత్సరాల ఎంబీఏ కోర్సులతో పాటు ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ కోర్సులను నిర్వహిస్తున్నట్లు ప్రొఫెసర్‌ సత్యనారాయణ చారి శనివారం నాడు తెలిపారు. ఈ కోర్సులకు కావాల్సిన కనీస విద్యార్హత ఇంటర్మీడియేట్‌ ఉండాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలకు 50 శాతం మార్కులు ఉండాలని అన్నారు. ఈ కోర్సులు డిగ్రీ మూడు సంవత్సరాలు, రెండు సంవత్సరాలు పీజీలతో ఐదుసంవత్సరాలుగా ఇంటిగ్రేటెడ్‌గా నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ...

Read More »

నష్టపోయిన పంట రైతులను ఆదుకోవాలి

  బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆనంద్‌రెడ్డి కామారెడ్డి, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంట రైతులను ఆదుకొని పంటకు సరైన మద్దతు ధర ప్రకటించి వారిని ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆనందర్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు గద్దె భూమన్న, మండల అధ్యక్షుడు బాగారెడ్డి శనివారం అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలో అకాల వర్షాల వల్ల చేతికొచ్చిన పంట నేలపాలు కావడంతో జిల్లా రైతాంగాం తీవ్ర ఆందోళనకు గురైందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులను ...

Read More »

శాసనమండలి ప్రతిపక్ష నేతకు సన్మానం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీని కామారెడ్డి నాయకులు గురువారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే స్థాయి నుంచి పలు శాఖ ల మంత్రిగా, శాసనమండలి సభ్యునిగా, ప్రతిపక్షనేతగా ఎదగడం కామారెడ్డి ప్రాంతానికే గర్వకారణమని అన్నారు. కామారెడ్డి నియోజకవర్గ అభివృద్దికి మరింత కృషి చేయాలని కోరారు. షబ్బీర్‌ను కలిసిన వారిలో కన్నయ్య, చింతల శ్రీనివాస్‌, కృఫాల్‌, శ్రీధర్‌, శేఖర్‌ తదితరులున్నారు. Opposition ...

Read More »

బైండ్ల సంఘం యువజన అధ్యక్షునిగా అర్జున్‌

  కామారెడ్డి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బైండ్ల సంఘం జేఏసి జిల్లా యువజన విభాగం అధ్యక్షునిగా బైండ్ల అర్జున్‌ను నియమించారు. అర్జున్‌కు నియామక పత్రాన్ని సంఘం రాష్ట్ర కో ఆర్డినేటర్‌ స్వామి గురువారం కామారెడ్డిలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బైండ్ల సంఘం అభివృద్ధికి పాటుపడాలని సంఘ సభ్యుల్లో చైతన్యం తీసుకొచ్చి అన్ని రంగాల్లో వారు ఎదిగేందుకు కృషి చేయాలని కోరారు. అర్జున్‌ మాట్లాడుతూ తనపై నమ్మకంతో తనకు ఈ బాధ్యత అప్పగించినందుకు సంఘం అభివృద్దికి కృషి ...

Read More »

సిసి రోడ్డు పనులు ప్రారంభం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 6వ వార్డులో గురువారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ సిసి రోడ్డు పనులను ప్రారంభించారు. మునిసిపల్‌ సాధారణ నిధులు రూ. 2 లక్షలతో రోడ్డు పనులను చేపట్టినట్టు తెలిపారు. పనులను నాణ్యతతో చేపట్టాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ప్రగతి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ వైస్‌ఛైర్మన్‌ మసూద్‌ అలీ, వార్డు కౌన్సిలర్‌ సరోజ, కాలనీ వాసులు పాల్గొన్నారు. CC Road and drainage works started ...

Read More »

జీవనభృతి కోసం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా

  కామారెడ్డి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హులైన వారందరికి జీవనభృతి కల్పించాలని డిమాండ్‌ చేస్తూ గురువారం కామరెడ్డి ఆర్డీవో కార్యాలయం ఎదుట బీడీ కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన చాలామందికి జీవనభృతి జాబితాలో పేర్లు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వేలో పేరులేదని, ఆధార్‌ కార్డు లేదని తదితర కారణాలతో అర్హులైన తమకు లేదని జీవనభృతి కల్పించడం లేదని వాపోయారు. అదికారులు పిఎప్‌ ఉన్న అందరికి జీవన భృతి ...

Read More »

ప్రమాదవశాత్తు సంపులో పడి కూలి మృతి

  కామారెడ్డి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం గర్గుల్‌ శివారులో మంగళవారం రాత్రి ఓ కూలీ ప్రమాదవశాత్తు సంపులో పడి మృతి చెందిన సంఘటన గురువారం వెలుగుచూసింది. మాచారెడ్డి మండలం మద్దికుంట గ్రామానికి చెందిన గంగరాజు (26) దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. గర్గుల్‌ శివారులోని ఓ వెంచర్‌లో పనిచేస్తుండగా మంగళవారం రాత్రి సమయంలో ఫిట్స్‌ వచ్చి ప్రమాదవశాత్తు సంపులో పడి మృతి చెందాడు. బుధవారం వర్షం కారనంగా కూలీలు పనికి రాలేదు. గురువారం పనికివెళ్లగా గంగరాజు మృతదేహం ...

Read More »