Breaking News

Kamareddy

ఆర్డీవో కార్యాలయం ఎదుట సిఐటియు ధర్నా

  కామారెడ్డి, మార్చి 19 నిజామాబాద్‌న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో గురువారం కామరెడ్డి ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీవో నగేశ్‌కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి రాజలింగం మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు గత ఆరునెలలుగా బిల్లులు చెల్లించడం లేదని, వేతనాలు సైతం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన నిత్యవసర సరుకుల ధరలకు అనుగుణంగా స్లాబ్‌ రేటును పెంచి ఇవ్వాలని డిమాండ్‌ ...

Read More »

అలరించిన పాఠశాల వేడుకలు

కామారెడ్డి, మార్చి 19 నిజామాబాద్‌న్యూస్‌ డాట్‌ ఇన్‌: కామారెడ్డి పట్టణంలో గురువారం మై విలేజ్‌ మాడల్‌ విలేజ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో స్థానిక ఇందిరానగర్‌ ప్రభుత్వ పాఠశాలలో వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినిలు, చిన్నారులు చేసిన నృత్యాలు ఆహుతులను వివేషంగా ఆకట్టుకున్నాయి. మండలంలోని చిన్నమల్లారెడ్డి గ్రామంలోని చైతన్య విద్యానికేతన్‌లో 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు సాంస్కృతిక ప్రదర్శనలు చేశారు. కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Read More »

సిసి డ్రైన్‌ పనులు ప్రారంభం

  కామారెడ్డి, మార్చి 19 నిజామాబాద్‌న్యూస్‌ డాట్‌ ఇన్‌: కామారెడ్డి పట్టణంలోని 3, 7వ వార్డుల్లో సిసి డ్రైన్‌ పనులను గురువారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పనులను 13వ ఆర్థిక నిదుల ద్వారా చేపడుతున్నట్టు తెలిపారు. అధికారులు పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నాణ్యతతో పనులు జరిగేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ బట్టు మోహన్‌, ఏ.ఇ గంగాధర్‌, నాయకులు గోనె శ్రీనివాస్‌, ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలి

కామారెడ్డి, మార్చి 19 నిజామాబాద్‌న్యూస్‌ డాట్‌ ఇన్‌: వేసవి కాలంలో ప్రజలు నీటి ఎద్దడకి గురికాకుండా తగు చర్యలు చేపట్టాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ రవిందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కామారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో గురువారం డివిజన్‌ స్థాయి రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ ఆహారభద్రత కార్డుల పంపిణీ, పింఛన్లు, జీవన భృతి తదితర అంశాలపై చర్చించారు. అధికారులు, సిబ్బంది కార్డుల లబ్దిదారుల ఎంపిక విషయంలో సక్రమంగా సర్వే చేసి అర్హులకు మాత్రమే అందేలా చూడాలన్నారు. గ్రామాల్లో ఉపాధి ...

Read More »

లింగాపూర్‌లో స్వచ్ఛ్‌భారత్‌

కామారెడ్డి, మార్చి 18 నిజామాబాద్‌న్యూస్‌ డాట్‌ ఇన్‌: కామారెడ్డి మండలం లింగాపూర్‌ గ్రామంలో బుధవారం స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని రోడ్లు, సచివాలయం ప్రాంతంలోని పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఎంపిపి మంగమ్మ మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడి పిలుపు మేరకు మండలంలోని వివిధ గ్రామాల్లో స్వచ్ఛభారత్‌ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా లింగాపూర్‌లో కార్యక్రమం నిర్వహించామన్నారు. అన్ని వర్గాల ప్రజలు కార్యక్రమంలో పాల్గొని గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపిడివో చిన్నారెడ్డి, సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ గ్రామస్తులు పాల్గొన్నారు.

Read More »

కొనసాగుతున్న డాక్‌ సేవకుల నిరసనలు

కామారెడ్డి, మార్చి 18 నిజామాబాద్‌న్యూస్‌ డాట్‌ ఇన్‌: తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆలిండియా గ్రామీణ డాక్‌ సేవక్‌ యూనియన్‌ ఆద్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమాలు బుధవారం నాటికి 6వ రోజుకు చేరుకున్నాయి. బుధవారం కామారెడ్డి పోస్టాఫీసు ఎదుట గ్రామీణ డాక్‌ సేవకుల నిరసన చేపట్టారు. కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తపాలా శాఖలో పనిచేస్తున్న కార్మికులకు పని భారాన్ని తగ్గించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, తపాలాశాఖను కార్పొరైజేషన్‌ చేయవద్దని తదితర డిమాండ్లను వెల్లడించారు. లేనిపక్షంలో ఆందోళన ...

Read More »

రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉద్యోగి మృతి

  కామారెడ్డి, మార్చి 18 నిజామాబాద్‌న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం టేక్రియాల్‌ గ్రామ శివారులో ఎన్‌హెచ్‌ 44 పై మంగళవారం అర్దరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉద్యోగి మృతి చెందారు. బాన్సువాడలో పశుసంవర్ధకశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న కిరన్‌ కుమార్‌ (51) తన సొంత కారులో నిజామాబాద్‌ నుంచి హైదరాబాద్‌ వెళుతుండగా జాతీయ రహదారిపై వెననుంచి లారీని ఢీకొన్నారు. దీంతో తీవ్ర గాయాలపాలైన కిరణ్‌ను కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు ...

Read More »

24వ వార్డులో సిసిరోడ్డు పనులు ప్రారంభం

  కామారెడ్డి, మార్చి 17 నిజామాబాద్‌న్యూస్‌ డాట్‌ ఇన్‌: కామారెడ్డి పట్టణంలోని 24వ వార్డులో మంగలవారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ సిసి రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మునిసిపల్‌ నిధులు రూ. 2 లక్షలతో రోడ్డు పనులను ప్రారంభించినట్టు తెలిపారు. అన్ని వార్డుల్లో ప్రగతి పనులు చేపడతామని, వార్డులకు అనుగుణంగా అవసరాన్ని బట్టి నిదులు కేటాయిస్తామని తెలిపారు. అన్ని వార్డుల అభివృద్దికి సహకరిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ కమీషనర్‌, ఎ.ఇ., వైస్‌ఛైర్మన్‌ మసూద్‌ అలీ, కౌన్సిలర్‌ రేణుక, నాయకులు ...

Read More »

ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థిగా ఉండాలి

  – డిప్యూటి డిఇవో బలరాం కామారెడ్డి, మార్చి 17 నిజామాబాద్‌న్యూస్‌ డాట్‌ ఇన్‌: ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థిగా ఉండాల్సిన అవసరముందని కాలం పరుగులో మొదటి వరసలో ఉండాలని కామారెడ్డి డిప్యూటి డిఇవో బలరాం సూచించారు. కామారెడ్డి పట్టణంలో మంగళవారం 10వ తరగతి వార్షిక పరీక్షల మూల్యాంకనంపై 12 మండలాల ఉపాధ్యాయులకు నిర్వహించిన శిక్షన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయులు 10వ తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువ ఉత్తీర్ణత శాతం వచ్చేలా కృషి చేయాలని కోరారు. అనంతరం భిక్కనూరు ...

Read More »

ఘనంగా పొట్టిశ్రీరాములు జయంతి

నిజామాబాద్‌, మార్చి 16   కామారెడ్డి న్యూస్‌ : కామారెడ్డి పట్టణంలో సోమవారం వాసవి క్లబ్‌ కామారెడ్డి ఆద్వర్యంలో అమరజీవి పొట్టిశ్రీరాములు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన గొప్పతనాన్ని కొనియాడారు. కార్యక్రమంలో క్లబ్‌ అధ్యక్షులు శ్రీనివాస్‌, ప్రతినిదులు పోగురు శ్రీనివాస్‌, చంద్రశేఖర్‌, వేణుగోపాల్‌, వెంకటేశం, యాదగిరి, రవిందర్‌, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఛలో హైదరాబాద్‌ పోస్టర్ల ఆవిష్కరణ

నిజామాబాద్‌, మార్చి 16 -హమాలీలకు సమగ్ర సంక్షేమ చట్టం కోసం డిమాండ్‌ కామారెడ్డి న్యూస్‌ : హమాలీలకు సమగ్ర సంక్షేమ చట్టాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 25న ఛలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు తెలంగాణ వ్యవసాయ మార్కెట్‌ యార్డు హమాలీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు, ఏఐటియుసి ప్రతినిధి వి.ఎల్‌.నర్సింహారెడ్డి తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ హమాలీ కార్మికులందరికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా హమాలీలందరికి ఒకే రేట్లను నిర్ణయించాలని డిమాండ్‌ చేశారు. పిఎఫ్‌, ఇఎస్‌ఐ, గ్రాడ్యువిటి ప్రమాదనష్టపరిహారం, ...

Read More »

లయన్స్‌ క్లబ్‌ ఆద్వర్యంలో ఉచిత ఆక్యుప్రజర్‌ శిబిరం

నిజామాబాద్‌, మార్చి 15 కామారెడ్డి న్యూస్‌ : కామారెడ్డి పట్టణంలో ఆదివారం లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ కామారెడ్డి ఆద్వర్యంలో ఉచిత ఆక్యుప్రజర్‌ వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో మోకాళ్ళ నొప్పులు, మెడ, నడుమునొప్పి, కాళ్ళ తిమ్మిర్లు, బిపి, తదితర వ్యాధులున్న రోగులకు ఆక్యుప్రజర్‌ విధానంతో చికిత్స అందించారు. ప్రజలు ఆక్యుప్రజర్‌ విధానాన్ని వినియోగించుకొని రోగాలనుంచి ఉపశమనం పొందాలని డాక్టర్‌ పి.కె.చౌదరి సూచించారు. కార్యక్రమంలో లయన్స్‌క్లబ్‌ అధ్యక్షులు నరేశ్‌ కుమార్‌, ప్రతినిధులు గంగాధర్‌, లింబాద్రి, గోపి, రమేశ్‌, శ్యాంగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

అభివృద్ది పనులు ప్రారంభం

నిజామాబాద్‌, మార్చి 15   కామారెడ్డి న్యూస్‌ : కామారెడ్డి పట్టణంలోని 15, 16 వవార్డుల్లో పలు అభివృద్ధి పనులు ఆదివారం మునిసిపల్‌ ఛైర్మన్‌ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. 15వ వార్డులో లక్ష రూపాయలతో చేపట్టిన సిసి రోడ్డు పనులను, 16వ వార్డులో సిసి రోడ్డు, డ్రైన్‌ పనులను ఆమె ప్రారంభించారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తనవంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జేఏసి ఛైర్మన్‌ జగన్నాథం, కౌన్సిలర్లు భూంరెడ్డి, మోహన్‌, అంజద్‌, ...

Read More »

గ్రామీణ డాక్‌ సేవక్స్‌ సమ్మె

నిజామాబాద్‌, మార్చి 15   కామారెడ్డి న్యూస్‌ : తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నిరవధిక సమ్మె చేపట్టినట్టు ఆలిండియా డాక్‌ సేవక్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు యూసుఫ్‌ అలీ తెలిపారు. కామారెడ్డిలో సమ్మెలో పాల్గొన్న యూనియన్‌ ప్రతినిధులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 10 గంటల పాటు పనిచేయించుకుంటూ డాక్‌ సేవకులను తీవ్ర మానసిక, శారీరక ఒత్తిడికి గురిచేస్తున్నారని పేర్కొన్నారు. అధికారులు శ్రమ దోపిడికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస ...

Read More »

కవిత్వంలో ప్రతి అక్షరం ఆయుధం అవ్వాలి

నిజామాబాద్‌, మార్చి 15 – ప్రజాకవి సి.హెచ్‌.మధు కామారెడ్డి న్యూస్‌ : రచయిత కవిత్వంలోని ప్రతి అక్షరం ఆయుధమై తిరగబడాలని ప్రజాకవి సి.హెచ్‌. మధు అన్నారు. కామారెడ్డి పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో యువకవి ధర్పల్లి సాయికుమార్‌ రచించిన ‘అశ్రుగీతం’ కవితా సంపుటిని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ ధిక్కారం కవి సహజ నైజమని, కవికి ఆలోచనతోపాటు అక్రోశం, ఆవేశం కూడా అవసరమని అన్నారు. సామాజిక రుగ్మతల పట్ల కవికి ...

Read More »

అలరించిన మనోవైకల్య ,  అందుల , బదిరుల విన్యాసాలు 

ఘణంగా గా కవితక్క  జన్మదిన వేడుకలు తెలంగాణ జాగృతి అధ్యక్షులు , నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి కల్వకుంట్ల  కవితక్క  జన్మదిన వేడుకలు తెలంగాణ జాగృతి విద్యార్ధి సమాఖ్య జిల్లా కన్వీనర్ పసుల చరణ్ ఆద్వర్యం లో స్థానిక కళా భారతి లో ఘనంగా జరిగాయి . ప్రభుత్వ అందుల పాటశాల , ప్రభుత్వ బదిరుల పాటశాల , మనో వికాస కేంద్రం , బాలసదన్ , ఆనంద నిలయం , సహాయ అనాదాశ్రమం లోని విద్యార్థుల ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది . మర్రిపెల్లి ...

Read More »

ఐఎఫ్‌టియు రాష్ట్ర మహాసభల గోడప్రతుల ఆవిష్కరణ

నిజామాబాద్‌, మార్చి 13 కామారెడ్డి న్యూస్‌ : ఐఎఫ్‌టియు రాష్ట్ర 8వ మహాసభల గోడప్రతులను ఆటో యూనియన్‌ ఆద్వర్యంలో శుక్రవారం కామారెడ్డిలో నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐఎఫ్‌టియు రాష్ట్ర 8వ మహాసభలు ఈనెల 13,14,15 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్టు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర పాలకవర్గాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలన్నారు. శుక్రవారం సుందరయ్య పార్కు నుంచి ఇందిరా పార్కు వరకు వేలాది మంది కార్మికులతో భారీ ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించామన్నారు. మరో రెండ్రోజులపాటు ముఖ్య నాయకులు ప్రసంగిస్తారని ...

Read More »

కామారెడ్డిని అగ్రగామిగా నిలపాలి

నిజామాబాద్‌, మార్చి 13 – ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ కామారెడ్డి న్యూస్‌ : కామారెడ్డిని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపాలని ప్రభుత్వ విప్‌ కామారెడ్డి ఎమ్మెల్యే గంపగోవర్దన్‌ అన్నారు. శుక్రవారం కామారెడ్డి కిరాణ వర్తక సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యే ప్రసంగించారు. కామారెడ్డి వ్యాపారులకు రాష్ట్ర స్థాయిలో పేరుందని, వ్యాపారాన్ని మరింత అభివృద్ది పరచాలని ఆకాంక్షించారు. కామారెడ్డిని జిల్లా కేంద్రంగా మారుస్తానని ముఖ్యమంత్రి ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వ్యాపారుల సంక్షేమానికి తనవంతు ...

Read More »

కామారెడ్డి జిల్లా కేంద్రంగా కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌

-నెరవేరనున్న కామారెడ్డి వాసుల కల -ఫలించిన జిల్లా సాధన సమితి పోరాటం కామారెడ్డి ఫిబ్రవరి 13 (నిజామాబాద్ద్ న్యూస్.ఇన్ ): కామారెడ్డిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని కామారెడ్డి జిల్లా సాధన సమితి ఆధ్యర్యంలో చేస్తున్న ఉద్యమానికి ఫలితం లభిచనుంది. కామారెడ్డి జిల్లా అవుతుందో లేదో అని డోలాయమానంగా ఉన్న సమయంలో స్వయంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు ప్రకటనతో దానికి తెరపడ్డట్టు అయ్యింది. కామారెడ్డి వాసుల చిరకాల వాంఛ నెరవేరనుంది. గురువారం జిల్లాలోని సదాశివనగర్‌లో జరిగిన బహిరంగ సభలో ”ముఖ్యమంత్రి కేసీఆర్‌ కామారెడ్డిని ...

Read More »

మిషన్‌ కాకతీయతో తెలంగాణ భూములు సస్యశ్యామలం

– రూ.40 వేల కోట్లతో రాష్ట్రంలో వాటర్‌ గ్రిడ్‌ – 46 వేల చెరువుల పునరుద్దరణ – నాలుగేళ్లలో ప్రతి ఇంటికి నల్లా – సిఎం కేసీఆర్‌ వెల్లడి కామారెడ్డి న్యూస్‌ : మిషన్‌ కాకతీయ ద్వారా తెలంగాణ భూములను సస్యశ్యామలం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తుందని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు తెలిపారు. గురువారం నిజామాబాద్‌ జిల్లా సధాశివనగర్‌ మండల కేంద్రంలోని పాత చెరువు వద్ద మిషన్‌ కాకతీయ- మన ఊరు – మనచెరువు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ...

Read More »