Breaking News

Kamareddy

కామారెడ్డి వ్యాపారస్తుల‌కు ముఖ్య గమనిక

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో కరోనా వ్యాధి తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజ సంక్షేమం దృష్ట్యా వ్యాపార వాణిజ్య దుకాణములు 23వ తేదీ శుక్రవారం నుండి 30వ తేదీ వరకు మధ్యాహ్నం 3 గంటల‌కు దుకాణములు మూసివేయాల‌ని చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ వారు అత్యవసర ఆన్‌లైన్‌ సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకున్నారు. ఇట్టి విషయాన్ని ప్రజలు మరియు వ్యాపార సంస్థలు గమనించి సహకరించగల‌రని కోరారు. సమావేశంలో అధ్యక్షుడు గజవాడ రవికుమార్‌, ఎల్లంకి శ్రీనివాస్‌, ...

Read More »

సోడియం హైప్లో క్లోరైడ్‌ పిచ్చికారి

కామరెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జ్లి కేంద్రంలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదు అవుతున్నందున ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ మరియు మున్సిపల్‌ ఛైర్మన్‌ నిట్టు జాహ్నవి, వైస్‌ చైర్మన్‌ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్‌ రెడ్డి సహకారంతో గురువారం 47వ వార్డ్‌ కౌన్సిల‌ర్‌ గెరిగంటి స్వప్న ల‌క్ష్మీనారాయణ ఆధ్వర్యంలో 47వ వార్డ్‌లో కరోనా వైరస్‌ ప్రబల‌కుండ మునిసిపల్‌ సిబ్బంది సోడియం హైప్లో క్లోరైడ్‌ రసాయనం పిచికారీ చేశారు. కార్యక్రమంలో సానిటరీ ఎస్‌ఐ దేవిదాస్‌, జవాన్‌ నరేష్‌ ...

Read More »

గ్రామ కార్యదర్శిపై సస్పెన్షన్‌ వేటు

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామ శివారులో అవెన్యూ ప్లాంటేషన్‌ నాటిన మొక్కల‌ చుట్టూ ఉన్న కంచెలు కొన్ని పడి పోయినందున గ్రామ కార్యదర్శిని సస్పెండ్‌ చేయాల‌ని ఎంపీడీవో ల‌క్ష్మిని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ ఆదేశించారు. గురువారం ఆయన అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కల‌ను పరిశీలించారు. హరితహారంలో భాగంగా అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కల‌ సంరక్షణ చేయవల‌సిన బాధ్యత కార్యదర్శి, సర్పంచుల‌పై ఉందని ఆయన పేర్కొన్నారు.

Read More »

మృతదేహాల ‌ఖననం కోసం జేసిబి ఏర్పాటు

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పురపాల‌క సంఘం, శాసనసభ్యులు పట్టణ ప్రజల‌ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ కరోనా బారినపడి మృత్యు ఒడిలోకి చేరిన వారికి సంతాపం తెలుపుతూ ప్రకటన విడుదల‌ చేశారు. శాసనసభ్యులు, మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ నిట్టు జాహ్నవి సహకారంతో కరోనా మృతదేహాల‌ను ఖననం చేయటానికి ఏ సమయంలోనైనా అందుబాటులో ఉండేలా ఒక జేసిబిని ఏర్పాటు చేశారు. ఈ సౌకర్యాన్ని అవసరమైన వారు ఉపయోగించుకోవాల‌ని కోరారు. ఎం.డి. ఫర్వేజ్‌ 9849907823 దేవదాస్‌ 9640050750 అబ్దుల్‌ మోమిన్‌ 8688110983 మరిన్ని ...

Read More »

ప్రతి ఒక్క కూలీకి పని కల్పించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ పనుల‌లో ప్రతి ఒక్క కూలీకి పని కల్పించాల‌ని జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ అధికారుల‌ను ఆదేశించారు. మంగళవారం ఆయన మండల‌ అభివృద్ధి, మండల‌ పంచాయితీ, ఎపిడి, డిపిఎం, ఎపిఎం అధికారుల‌తో వీడియో కాన్ఫరెన్సు ద్వారా మండలాల‌ వారిగా జరుగుతున్న ఉపాధి హామీ పనుల‌ను సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గ్రామాలో ప్రతి ఒక కూలీకి పని కల్పించాల‌ని, కూలీలు ఉండి పని కల్పించకపోతే చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆదేశించారు. రామారెడ్డి, ...

Read More »

స్వీయ నియంత్రణ, మాస్కు దరించడమే శ్రీరామ రక్ష

కామారెడ్డి, ఏప్రిల్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై జిల్లా కలెక్టర్‌ కార్యాల‌యంలోని జనహిత సమావేశపు హాల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల‌తో రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల‌ శాఖ మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలోని పలు నిర్ణయాల‌ను మంత్రి మీడియాకు వెల్ల‌డించారు. కోవిడ్‌ రెండవ దశలో వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల‌ మేరకు ప్రధానంగా నాలుగు అంశాల‌పై చర్చించారు. జిల్లాలో అధిక సంఖ్యలో ...

Read More »

అభివృద్ధి పనుల‌కు ప్రభుత్వ విప్‌ శంకుస్థాపనలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో సుమారు 1 కోటి 81 ల‌క్షల‌ 35 వేల‌ రూపాయల‌తో చేపట్టిన ప‌లు అభివ ృద్ధి కార్యక్రమాల‌కు ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో 20 ల‌క్షల‌ రూపాయల‌తో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణాల‌కు‌, 50 ల‌క్షల‌ రూపాయల‌తో రోటరీ పార్కు అభివృద్ధి, 1 కోటి 11 ల‌క్షల‌ 35 వేల‌ రూపాయల‌తో చేపట్టిన మిషన్‌ భగీరథ ఓహెచ్‌ఎస్‌ఆర్‌ ట్యాంకు నిర్మాణ పనుల‌కు ...

Read More »

నిజామాబాద్‌ జిల్లాకు 1000 డోసుల‌ రెమెడెసివిర్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొవిడ్‌ బాధితుల‌కు మెరుగైన సేవ‌లు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఎల్ల‌ప్పుడూ సంసిద్దంగా ఉందని ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్‌, కామారెడ్డి, జగిత్యాల‌ జిల్లాల్లో కోవిడ్‌ 19 పరిస్థితిపై సమీక్షించారు. నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి, కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌, జగిత్యాల‌ జిల్లా కలెక్టర్‌ రవితో ఫోన్‌లో మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత, కరోనా పరీక్షలు, చికిత్స, ఆసుపత్రులు వంటి అన్ని అంశాల‌పై చర్చించారు. శనివారం నిజామాబాద్‌ జిల్లాకు 1000 ...

Read More »

20 న పి.జి.స్పాట్‌ అడ్మిషన్లు

కామారెడ్డి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిలోని ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల‌లో ఈ నెల‌ 20 న పి.జి. సీట్ల భర్తీ కోసం స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్‌ ఎం.చంద్రకాంత్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఎం.కాం., ఎం.ఎ. తెలుగు, ఎం.ఎ. ఎకనమిక్స్‌, ఎం.ఎస్‌.డబ్ల్యు కోర్సులో మిగిలిపోయిన సీట్లకు ప్రవేశాలు ఉంటాయని, ఉస్మానియా విశ్వవిద్యాల‌యం నిర్వహించిన పి.జి.సెట్‌ రాసినవారితో పాటు రాయనివారు కూడా అర్హులేనన్నారు. అర్హత గల‌ విద్యార్థులు ఈ నెల‌ 20 న ఉదయం తమ ఒరిజినల్‌, ...

Read More »

అసత్య ప్రచారం చేస్తే చట్టరీత్యా చర్యలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం పోసానిపెట్‌ గ్రామంలో కోవిడ్‌ టీకాతో ఓ వ్యక్తి మరణించారని అసత్య ప్రచారం చేస్తుండడంతో దీనికి వైద్యాధికారి, ఎస్‌ఐ, గ్రామ సర్పంచ్‌ స్పందించి వెంటనే అక్కడికి వెళ్లి విచారించారు. మరణ కారణం కోవిడ్‌ టీకా కాదని, ఇంటి సమస్యల‌తో ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు. కానీ కొందరు ఇలా అసత్య ప్రచారం చేశారు. ఇలా అసత్య ప్రచారాలు చేస్తే వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోబడుతాయని, ప్రజలు ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మవద్దన్నారు. కోవిడ్‌ ...

Read More »

కరోన సమయంలో రక్తదానం చేయడం అభినందనీయం

కామారెడ్డి, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన సువర్ణ అనే మహిళకు ఏ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకులు బాలుని సంప్రదించారు. వారికి కావల‌సిన రక్తాన్ని పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది బండారి సురేందర్‌ రెడ్డి మరియు దోమకొండకు చెందిన గణేష్‌ సహకారంతో రెండు యూనిట్ల రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడినట్టు తెలిపారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ ప్రస్తుతం కరోణ వ్యాధి విజృంభిస్తోన్న నేపథ్యంలో రక్తదానానికి ...

Read More »

15 మందికి పాజిటివ్‌

కామారెడ్డి, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం రామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్‌లో ర్యాపిడ్‌ ఆంటీజెన్‌ కిట్‌ ద్వారా 109 మందికి కరోన టెస్ట్‌లు చేయగ 15 మందికి పాజిటివ్‌ వచ్చినట్టు వైద్యాధికారి డాక్టర్‌ షాహీద్‌ ఆలి తెలిపారు. వీరిలో ఒక్కరు పోసానిపెట్‌ గ్రామస్థులు, ముగ్గురు రామారెడ్డి గ్రామస్థులు, ఒక్కరు అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామస్థులు, ఒక్కరు ఉప్పల్‌ వాయి గ్రామస్థులు, ఒక్కరు గిద్ద గ్రామస్థులు, ఒక్కరు మద్దుకుంట గ్రామస్థులు, ఐదుగురు కామారెడ్డి గ్రామస్థులు, ఒక్కరు గరుగుల్‌ గ్రామస్థులు, ఒక్కరు జుక్కల్‌ గ్రామస్థులు ...

Read More »

నిరుద్యోగుల‌ను ఆదుకోవాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలో ఉద్యోగాలు భర్తీ చేయని కారణంగా ఇటీవల‌ ప్రైవేట్‌ టీచర్లు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వేముల‌వాడ, నాగార్జునసాగర్‌లో భార్య భర్తలు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వానికి మాత్రం చీమకుట్టినట్టు కుడా లేదని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌ రావు ఆందోళన వ్యక్తం చేశారు. చనిపోయిన కుటుంబాల‌ను ప్రభుత్వం ఆదుకొని 10 ల‌క్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాల‌ని, చనిపోయిన రవి ఇద్దరు పిల్ల‌ల‌ భవిష్యత్‌ బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాల‌ని, పిల్ల‌ల‌ పేర్ల మీద 10 ...

Read More »

ప్రభుత్వ విప్‌ సమక్షంలో తెరాసలో చేరిక

కామారెడ్డి, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భిక్కనూర్‌ మండలం తిప్పాపూర్‌ గ్రామ సర్పంచ్‌ శ్యామయ్యతో పాటు సుమారు 50 మంది కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ సమక్షంలో తెరాస కండువాలు వేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు నచ్చి పార్టీలో చేరేందుకు ఇష్టపడినట్టు వారు చెప్పారు. వారికి గులాబి కండువాలు కప్పి గంప గోవర్ధన్‌ పార్టీలోకి ఆహ్వానించారు.

Read More »

సిఎం సహాయనిధి చెక్కుల‌ పంపిణీ

కామారెడ్డి, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలోని 27 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 13 ల‌క్షల‌ 86 వేల‌ 500 రూపాయల‌ చెక్కుల‌ను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఇప్పటివరకు 608 మందికి 3 కోట్ల 96 ల‌క్షల‌ 64 వేల‌ 300 రూపాయల‌ చెక్కుల‌ను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ప్రమాదవశాత్తు అనారోగ్యం బారిన పడి, ...

Read More »

ధాన్యం కొనుగోళ్లను నిరంతరం పర్యవేక్షించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం కొనుగోళ్లను నిరంతరం పర్యవేక్షించాల‌ని జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ సినిల్‌ సప్లయ్‌ అధికారుల‌ను ఆదేశించారు. శుక్రవారం జిల్లా సివిల్‌ సప్లయ్‌ కార్యాల‌యంలో ధాన్యం కొనుగోలు కంట్రోల్‌ రూమ్‌ను జిల్లా కలెక్టరు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కంట్రోల్‌ రూమ్‌ అధికారులు సిబ్బందికి పలు ఆదేశాలు జారీ చేశారు. 08468-220051 నెంబరుతో ఏడు క్లస్టర్‌ పాయింట్లతో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కంట్రోల్‌ రూమ్‌లో ఏ రోజు ఎంత మంది రైతుల‌ నుండి ...

Read More »

సిబ్బంది వివరాలు సేకరించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రయివేటు స్కూల్స్‌ ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది వివరాల‌ను మండల‌ విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు కలిసి క్షేత్రస్థాయిలో సేకరించి వెంటనే పంపాల‌ని జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ విద్యా శాఖ అధికారుల‌ను ఆదేశించారు. శుక్రవారం ఆయన విద్యాశాఖ ఎంఇఓల‌తో, మున్సిపల్‌ కమీషనర్లు, సివిల్‌ సప్లయ్‌ అధికారుల‌తో సమావేశమై ప్రభుత్వం ప్రయివేటు స్కూల్స్‌ ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి 2 వేల‌ రూపాయల‌ ఆర్థిక సహాయం, 25 కిలోల‌ బియ్యం సరఫరా చేయనున్న నేపథ్యంలో సంబంధిత ప్రయివేటు ...

Read More »

డ్రైవర్‌ కావలెను

కామారెడ్డి, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఆదేశానుసారం బాన్సువాడ రెవెన్యూ డివిజనల్‌ అధికారి అధ్యక్షులుగా గల‌ నియామకాల‌ కమిటీ ద్వారా బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో పంపిణీ చేయబడిన సంచార రక్త సేకరణ వాహనంలో పనిచేయటానికి అనుభవం గల‌ వైద్యుడు, డ్రైవర్‌ పోస్టుల‌కు ఔట్‌సోర్సింగ్‌ పద్దతిలో పనిచేయుటకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు రెవెన్యూ డివిజనల్‌ ఆఫీసర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంబిబిఎస్‌ పూర్తిచేసి రక్తసేకరణ, వర్గీకరణ మొదలైన అంశాల‌లో అనుభవంగల‌ వైద్యులు అర్హుల‌ని, వైద్యుని నెల‌సరి భత్యం రూ. ...

Read More »

వాక్సినేషన్‌ కేంద్రాలు పెంచాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కేంద్రాల‌లో వాక్సినేషన్‌ పాయింట్స్‌ పెంచాల‌ని, 45 సంవత్సరముల‌ వయస్సు పైబడిన ప్రతి ఒక్కరికి వాక్సిన్‌ అందేలా చర్యలు తీసుకోవాల‌ని జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ వైద్య అధికారుల‌ను ఆదేశించారు. గురువారం ఆయన సెల్‌ కాన్ఫరెన్సు ద్వారా పిహెచ్‌సి, సిహెచ్‌సి వైద్య అధికారులు, స్టాటిస్టికల్‌ ఆఫీసర్లతో కరోనా పరీక్షలు, ట్రేసింగ్‌, వాక్సినేషన్‌పై ఆరోగ్య కేంద్రాల‌ వారిగా సమీక్షించారు. ఎర్రపహాడ్‌ ఆరోగ్య కేంద్రం వాక్సినేషన్ ల‌క్ష్యాన్ని సాధించినందుకు వైద్య సిబ్బందిని అభినందించారు. వాక్సినేషన్‌ నిజాంసాగర్‌ ...

Read More »

తాగునీటికి అంతరాయం కల‌గకుండా చూడాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల‌ తాగునీటికి అంతరాయం కల‌గకుండా అప్రమత్తంగా ఉండాల‌ని జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ మిషన్‌ భగీరథ, గ్రామీణ మంచి నీటి సరఫరా ఇంజనీర్లను ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్‌లో మున్సిపాలిటీలు, గ్రామాల‌లో మంచినీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు. మిషన్‌ భగీరథ, ఆర్‌ డబ్ల్యూ ఎస్‌ ఇంజనీర్లు, మున్సిపల్‌ ఇంజనీర్లు పూర్తి సమన్వయంతో పనిచేయాల‌ని, సరఫరాలో కానీ, పైప్‌ లైన్ల లీకేజీలో కానీ అంతరాయం ఏర్పడితే తక్షణమే స్పందించి పునరుద్దరణ చర్యలు చేపట్టాల‌ని‌, గ్రామాల‌లో ...

Read More »