Breaking News

Kamareddy

‘దేశం’ సభ్యత్వ నమోదుకు శ్రీకారం

‘దేశం’ సభ్యత్వ నమోదుకు శ్రీకారం -నవంబర్‌ 3న ప్రారంభం -క్రియాశీల కార్యకర్తలకు రూ.2 లక్షల ప్రమాద బీమా కామారెడ్డి, నవంబర్‌ 1 : తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈనెల 3వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని ఆ పార్టీ నాయకులు ఎండి ఉస్మాన్‌, చీల ప్రభాకర్‌లు తెలిపారు. శనివారం వారు కామారెడ్డిలో విలేకరులతో మాట్లాడారు. తెలుగు దేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం తర్వాత పార్టీ సంస్థాగత మార్పులు వుంటాయన్నారు. తెలంగాణలో పార్టీ నిర్మాణంపై అధిష్టానం కార్యాచరణ ప్రకటించిందన్నారు. టిడిపి క్రియాశీల కార్యకర్తగా ...

Read More »

ఎఐటియుసి జెండా ఆవిష్కరణ

కామారెడ్డి, అక్టోబర్‌ 30 : ఎఐటియుసి 95వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా కామారెడ్డి పట్టణ సివిల్‌ సపై ్లస్‌ హమాలీ సంఘం ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో జెండాను ఆవిష్కరించారు. ఎఐటియుసి నాయకుడు విఎల్‌ నర్సింహారెడ్డి జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. 1920వ సంవతర్సంలో బ్రిటిష్‌ పాలన నుంచి దేశ విముక్తి కోసం కార్మికుల సంక్షేమం కోసం ఎఐటియుసి ఏర్పడిరదన్నారు. నాటి నుంచి కార్మికులను ఐక్యం చేసి అనేక పోరాటాలు చేసినట్లు తెలిపారు. పిఎఫ్‌, గ్రాట్యూటీ, బోనస్‌, కనీస వేతనాల చట్టం, పారిశ్రామిక వివాదాల చట్టం వంటివి ...

Read More »

సంక్షేమ పథకాలకు అర్హులనే ఎంపిక చేస్తాం కామారెడ్డి, అక్టోబర్‌ 30 : ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ పథకాలకు గాను అర్హులైన వారినే ఎంపిక చేస్తామని కామారెడ్డి మున్సిపల్‌ కమిషనర్‌ బాలోజినాయక్‌ అన్నారు. పట్టణంలో కొనసాగుతున్న ఆహార భద్రత, పించన్ల కోసం దరఖాస్తులపై సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పట్టణంలోని విద్యానగర్‌, అలశోక్‌నగర్‌, శ్రీరామ్‌నగర్‌, వివేకానంద కాలనీ, ఆర్‌బినగర్‌ కాలనీ తదితర కాలనీలో సర్వేను ఆయన గురువారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. అర్హులైన వారినే ఆయా పథకాల కింద ఎంపిక చేస్తామన్నారు. ...

Read More »

నేడు ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ

మాచారెడ్డి, అక్టోబర్‌ 30 : మాచారెడ్డి మండల కేంద్రంలోని లక్ష్మీనర్సింహాస్వామి గార్డెన్స్‌లో శుక్రవారం పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంపై ఒక్కరోజు శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు గాయత్రీ షుగర్‌ఫ్యాక్టరీ ఎఓ డి.బాల్‌రాజ్‌ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతులకు లాభదాయకంగా వుండే విధంగా ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇస్తున్నామని, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం వుంటుందన్నారు. ఈ శిక్షణ శిబిరానికి రైతులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు.

Read More »

190 మందికి వైద్య పరీక్షలు – 8 మంది హైదరాబాద్‌కు తరలింపు

తాడ్వాయి, అక్టోబర్‌ 30 : తాడ్వాయి మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలకు చెందిన 190 విద్యార్థినిలకు గురువారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో 8 మందిని మరిన్ని పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌ తరలించినట్లు పాఠశాల ప్రిన్సిపల్‌ రాణి తెలిపారు. పాఠశాల ఆవరణలో డాక్టర్‌ రాజుగౌడ్‌, పాప, సుమలత, శ్రీను, జనార్దన్‌లు విద్యార్థినులను పరీక్షలు నిర్వహించారు.

Read More »

నాలుగు నెలలుగా సౌదీ జైలులో మగ్గుతున్న వలస కార్మికులు

బతుకుదెరువు కోసం ఎడారి దేశాలకు వెళ్లిన యువకులు అక్కడి ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలతో నాలుగు నెలలుగా జైళ్లలో మగ్గుతున్నారు. తమను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ బాధితులు ఫోన్‌లో తమ గోడును వెళ్లబోసుకున్నారు. నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం లచ్చాపేటకు చెందిన మిరిదొడ్డి అనిల్ గురువారం ‘న్యూస్‌లైన్’తో ఫోన్‌లో మాట్లాడారు. ‘నతాఖత్’ చట్టం అమలులోకి రావడంతో పలు కంపెనీలు చాలా మంది కార్మికులను బయటకు పంపించాయి.  ఈ నేపథ్యంలో అనుమతి లేకుండా సౌదీలో ఉంటున్నారంటూ తనతోపాటు దాదాపు రెండు వందల మంది జైలులో వేశారని తెలిపారు. మాచారెడ్డి ...

Read More »

నిజామాబాద్‌ జిల్లా పాలనా ప్రాదేశిక వ్యవస్థీకరణ – అభివృద్ధి పరంపర

నిజామాబాద్ న్యూస్ ప్రత్యేకం ఎస్. శర్మ కామారెడ్డి: నిజామాబాద్‌ జిల్లా 1952 రాష్ట్ర పునర్వవ్యస్థీకరణలో పలు మార్పులకు లోనైంది. అప్పటి వరకు నాందేడ్‌, నిర్మల్‌, దెగ్లూర్‌, బైంసా ప్రాంతాలను నిజామాబాద్‌ నుంచి తొలగించి మహారాష్ట్ర, ఆదిలాబాద్‌ జిల్లాల్లో విలీనం చేశారు. అప్పట్లో 7 తాలూకాలుగా నిజామాబాద్‌, బాన్సువాడ, బోధన్‌, ఆర్మూర్‌, మద్నూర్‌, కామారెడ్డి, ఎల్లారెడ్డి కేంద్రాలతో ఏర్పాటు అయింది. 1979లో తాలూకాల పునర్వవ్యస్థీకరణలో భాగంగా నిజామాబాద్‌ జిల్లాకు మరో రెండు తాలూకాలుగా దోమకొండ, భీంగల్‌ ఏర్పాటయ్యాయి. 1956లో పంచాయితీరాజ్‌ వ్యవస్థ ఏర్పాటై జిల్లాలో నిజామాబాద్‌, ...

Read More »