Kamareddy

పదవ తరగతి పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

కామారెడ్డి, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్‌ 2 వరకు నిర్వహించే పదవ తరగతి పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఆయన చాంబరులో పది పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ జిల్లాలో 55 ప్రభుత్వ, 5 ప్రయివేటు పాఠశాలలు మొత్తం 60 పాఠశాలల్లో పది పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. మొత్తం 12 వేల 767 మంది విద్యార్థులకు పరీక్షకు హాజరుకానున్నట్టు చెప్పారు. ...

Read More »

18న జాబ్‌మేళా

కామారెడ్డి, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాలకు చెందిన బిసి నిరుద్యోగ యువత కోసం ఈనెల 18న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు బిసి స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ సి.హెచ్‌.వెంకన్న ఒక ప్రకటనలో తెలిపారు. పలు కార్పొరేట్‌ సంస్థల కంపెనీలు నిజామాబాద్‌లోని పాత బిఎస్‌ఎన్‌ఎల్‌ భవనం రెండో అంతస్తులోని బిసి స్టడీ సర్కిల్‌లో ఈనెల ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు జాబ్‌మేళా నిర్వహిస్తారన్నారు. ఇందులో ఎంపికైన అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగం కల్పిస్తారని పేర్కొన్నారు. ...

Read More »

దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ బలిదాన దివస్‌

కామారెడ్డి, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిలో సోమవారం పండిత్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ బలిదాన దివస్‌ కార్యక్రమాన్ని భారతీయ జనతాపార్టీ, ఏబివిపి నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్‌ తేలు శ్రీనివాస్‌ మాట్లాడుతూ జనసంఘ్‌ దేశమంతటా విస్తరించడానికి కారకుడైన పండిత్‌ దీన్‌దయాళ్‌ను స్మరించుకున్నారు. ఆయన ఆశయసాధనకు పార్టీ కార్యకర్తలంతా కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. బిజెపి కార్యకర్తలు ఫోన్‌లలో నరేంద్రమోడి యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసి యాప్‌ ద్వారా బిజెపి ...

Read More »

పార్లమెంటు ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేయాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రానున్న పార్లమెంటు ఎన్నికల్లోపు పార్టీని బలోపేతం చేయాలని తెలంగాణ సెక్రెటరీ ఆర్‌.సి.కుంతియా, టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిలు డిసిసి అద్యక్షులకు దిశా నిర్దేశం చేశారు. 31 జిల్లాల డిసిసి అధ్యక్షులను ఇటీవల నియమించిన నేపథ్యంలో సోమవారం గాంధీభవన్‌లో వారితో సమావేశమై కొత్త అధ్యక్షులను సన్మానించారు. కామారెడ్డి డిసిసి అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌రావును సైతం సత్కరించారు. ఈ సందర్భంగా కుంతియా మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను గెలిపించుకునేలా ప్రణాళికలు సిద్దం చేయాలన్నారు. పార్టీని ...

Read More »

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

కామారెడ్డి, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మచారెడ్డి మండలం అక్కాపూర్‌ గ్రామ రైతులకు పాసుపుస్తకాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తు సోమవారం ఎంసిపిఐయు ఆధ్వర్యంలో కామారెడ్డి కలెక్టరేట్‌ ఎదుట గ్రామ రైతులతో కలిసి ధర్నా చేపట్టారు. అక్కాపూర్‌ గ్రామంలో రైతులకు సంబంధించి సర్వేనెంబరు 22, 70 లలో పాత పట్టాపాసుపుస్తకాల స్థానంలో ఆన్‌లైన్‌ పాసుపుస్తకాలు ఇప్పించి న్యాయం చేయాలని జిల్లా కార్యదర్శి రాజలింగం డిమాండ్‌ చేశారు. అనంతరం జాయింట్‌ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ...

Read More »

ప్రజావాణిలో 61 ఫిర్యాదులు

కామారెడ్డి, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జనహిత భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 61 ఫిర్యాదులు అందినట్టు కలెక్టరేట్‌ అధికారులు తెలిపారు. అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 28 పిర్యాదులు, వ్యవసాయశాఖ- 7 ఫిర్యాదులు, డిపివో – 4, వైద్యశాఖ – 4 ఫిర్యాదులు, బిసి వెల్పేర్‌- 4, మిగతా శాఖలకు సంబందించి పిర్యాదులు అందాయన్నారు. వాటిని వెంటనే పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు ఉత్తర్వులు జారీచేశారు.

Read More »

కామారెడ్డి డిసిసి అధ్యక్షునిగా కైలాస్‌ శ్రీనివాస్‌రావు

కామారెడ్డి, ఫిబ్రవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలో కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులను ప్రకటించడం జరిగింది. కామారెడ్డి జిల్లాకు మొట్టమొదటి కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షునిగా కామారెడ్డి పట్టణానికి చెందిన కైలాస్‌ శ్రీనివాస్‌ రావును అధిష్టానం ప్రకటించింది. మాజీ శాసనమండలి ప్రతిపక్షనేత ఎమ్మెల్సీ మహమ్మద్‌ అలీ షబ్బీర్‌కు సన్నిహితుడైన కైలాస్‌ శ్రీనివాసరావు పదవి వరించింది. గతంలో కామారెడ్డి పట్టణ మున్సిపల్‌ చైర్మన్‌గా, కామారెడ్డి పట్టణ అధ్యక్షునిగా, ఎన్‌ఎస్‌యుఐ కార్యకర్తగా ఉన్న శ్రీనివాసరావు అంచెలంచెలుగా ఎదిగి కాంగ్రెస్‌ ...

Read More »

ఆదివారం వసంత పంచమి వేడుకలు

కామారెడ్డి, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలోని బ్రహ్మజ్ఞాన ఆశ్రమంలో ఆదివారం వసంత పంచమి పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఆలయ ప్రతినిధులు తెలిపారు. వసంత పంచమి, ఆశ్రమ 14వ వార్షికోత్సవం పురస్కరించుకొని ధ్వజారోహణం, గోపూజ, గణపతి, నవగ్రహ పూజ, కృష్ణ భగవానునికి అభిషేకం, అన్నప్రసాద వితరణ నిర్వహిస్తామన్నారు. భక్తులు ఆలయ అభివృద్ది నిమిత్తం విరాళాలు ఇవ్వవచ్చని బోనగిరి శివకుమార్‌ కోరారు.

Read More »

వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి జిల్లా స్థాయిలో వ్యవసాయ, ఉద్యానశాఖ అదికారులు సంయుక్తంగా కృషి చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. శనివారం కలెక్టర్‌ చాంబరులో వ్యవసాయ, ఉద్యానశాఖల మార్కెటింగ్‌ అధికారులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఇరుశాఖల ఆద్వర్యంలో వివిధ రకాల నేలలు, పంటల వివరాలు, సాగుతో రూపొందించిన సమాచారాన్ని సర్వేచేసి రాష్ట్రానికి పంపించాలని ఆదేశించారు. పంటలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని సేకరించాలని నేల పరీక్షను ప్రింట్‌ చేయాలని ...

Read More »

ఓటరు నమోదు ఫిర్యాదులు వెంటనే నమోదు చేయాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 22న ఓటరు తుది జాబితా వెలువడుతున్నందున ఓటరు నమోదు క్లెయిమ్స్‌ను వెంటనే నమోదు చేయాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ఆర్డీవోలను ఆదేశించారు. శనివారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆర్డీవోలు, తహసీల్దార్లతో ఓటరు నమోదు స్పెషల్‌ సమ్మరి రివిజన్‌, రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనపై సమీక్షించారు. ఈనెల 4వ తేదీ వరకు వచ్చిన ఫిర్యాదులను క్లియర్‌ చేయాలని, డుప్లికేట్‌ ఓటరు నమోదులు లేకుండా చూసుకోవాలని సూచించారు. అన్ని దరఖాస్తులను పరిశీలించి వాటిని పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ ...

Read More »

మెస్‌ చార్జీలు విడుదల చేయాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంక్షేమ వసతి గృహాల్లో మెస్‌ చార్జీలు విడుదల చేయాలని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు నరేశ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. కామారెడ్డిలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వసతి గృహాల విద్యార్థులకు సంబంధించిన మెస్‌ చార్జీ బకాయిలను ఇంతవరకు విడుదల చేయకపోవడం గర్హణీయమన్నారు. వార్డెన్లు అప్పులు చేసి నెట్టుకొస్తున్నారని పేర్కొన్నారు. వసతిగృహాల్లో ఖాళీగా ఉన్న వార్డెన్‌ పోస్టులను భర్తీచేయాలని డిమాండ్‌ చేశారు. మిగతా పోస్టులను సైతం భర్తీచేయాలని, వసతి గృహాల్లో అన్ని వసతులు ...

Read More »

స్ట్రాంగ్‌రూంకు సీల్‌

కామారెడ్డి, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లోక్‌సభ ఎన్నికల్లో వినియోగించనున్న బ్యాలెట్‌ యూనిట్‌, కంట్రోల్‌ యూనిట్‌, వీవీప్యాట్‌ ఫస్ట్‌లెవల్‌ చెకప్‌ను పూర్తిస్థాయిలో వెరిఫికేషన్‌ చేసి సర్టిఫై చేసినట్టు జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం ఏఎంసి గోదాములో ఉంచిన బ్యాలెట్‌ యూనిట్‌, కంట్రోల్‌ యూనిట్‌, వీవీప్యాట్‌ లలో మాక్‌పోల్‌లో నమోదైన ఓట్లను లెక్కించి ఎఫ్‌ఎల్‌సిని పూర్తిచేసి సీల్‌ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ భారత్‌ ఎలక్ట్రానిక్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో యంత్రాల ఎఫ్‌ఎల్‌సిని పూర్తిచేశామన్నారు. మాక్‌పోల్‌లో భాగంగా 853 కంట్రోల్‌ ...

Read More »

నిరుపేదలకు రుణాల ద్వారా చేయూత

కామారెడ్డి, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్థికంగా వెనకబడిన బిసి కులస్తులకు ఉపాధి కల్పన నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం వందశాతం సబ్సిడీతో 50 వేల రూపాయలు అర్హులైన లబ్దిదారులకు అందిస్తుందని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. బిసి సంక్షేమ, కార్పొరేషన్‌ ద్వారా మంజూరైన చెక్కులను శుక్రవారం జిల్లా కలెక్టర్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ లబ్దిదారులకు పంపిణీ చేశారు. నిరుపేదలైన 9 వేల 788 మంది లబ్దిదారులకు రూ. 50 వేల నుంచి రూ. 12 లక్షల వరకు ప్రభుత్వ ...

Read More »

భక్తి శ్రద్దలతో కలశ యాత్ర

కామారెడ్డి, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మార్కండేయ జయంతిని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం పద్మశాలి సంఘం ఆద్వర్యంలో వైభవంగా కలశ యాత్ర నిర్వహించారు. వేలాది మంది మహిళలు కలశాలు నెత్తినబెట్టుకొని ఊరేగించారు. పట్టణ పద్మశాలి సంఘం నుంచి ప్రారంభమైన యాత్ర ప్రధానవీధుల గుండా మార్కండేయ మందిరం వరకు కొనసాగింది. మహిళలు ఆలయం వద్ద కలశాలను ఉంచి మార్కండేయునికి సమర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమం, అన్నదాన కార్యక్రమం జరిపారు.

Read More »

ఎంసిపిఐయు మహాసభల పోస్టర్ల ఆవిష్కరణ

కామారెడ్డి, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంసిపిఐయు ఆలిండియా మహాసభల పోస్టర్లను శుక్రవారం కామారెడ్డిలో ఆవిష్కరించారు. ఈనెల 15 నుంచి 18వ తేదీ వరకు కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్‌ నగరంలో ఎంసిపిఐయు మహాసభలు జరుగుతాయని, పార్టీ జిల్లా కార్యదర్శి రాజలింగం తెలిపారు. 18 రాష్ట్రాల్లో పూర్తిస్తాయి నిర్మాణం కలిగి, 22 రాష్ట్రాల్లో ప్రజాసంఘాల నిర్మాణం కలిగి ఎంసిపిఐయు దేశవ్యాప్తంగా విస్తరిస్తుందని పేర్కొన్నారు. కారల్‌మార్క్స్‌, లెనిన్‌, స్టాలిన్‌ ఆశయాలతో మార్క్సిస్టు పార్టీ మూల సిద్దాంతం, ఆచరణ ధ్యేయంగా దేశంలో కుల, వర్గ ...

Read More »

కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షునికి సన్మానం

కామారెడ్డి, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన కైలాష్‌ శ్రీనివాస్‌రావును గురువారం కాంగ్రెస్‌ నాయకులు ఆయన స్వగృహంలో సన్మానించారు. పార్టీకి ఏళ్లతరబడిగా చేస్తున్న సేవలకు గాను అధిష్టానం గుర్తించి అధ్యక్షునిగా బాద్యతలు అప్పగించిందని నాయకులు పేర్కొన్నారు. ఆయన మరిన్ని పదవులు పొందాలని, ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకుడు దాత్రిక సత్యం, నాయకులు సందీప్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షునిగా కైలాష్‌ శ్రీనివాస్‌

కామారెడ్డి, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాహుల్‌గాంధీ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాలకు నూతన జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులను ప్రకటించారు. కామరెడ్డి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ నూతన అధ్యక్షునిగా మునిసిపల్‌ మాజీ ఛైర్మన్‌ కైలాష్‌ శ్రీనివాస్‌రావు ఎంపికయ్యారు. నిజామాబాద్‌ పట్టణ కమిటీ అధ్యక్షునిగా కేశవేణు, నిజామాబాద్‌ అధ్యక్షునిగా మానాల మోహన్‌రెడ్డిలను అధిష్టానం ఎంపిక చేసింది. ఈ సందర్భంగా కైలాష్‌ శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి పనిచేస్తున్నానని కౌన్సిలర్‌గా, మునిసిపల్‌ ఛైర్మన్‌గా పట్టణ కాంగ్రెస్‌ అద్యక్షునిగా సేవలందిస్తున్నానని ...

Read More »

పోచారంను పరామర్శించిన ముఖ్యమంత్రి

కామారెడ్డి, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తల్లి పాపవ్వ బుధవారం మృతి చెందిన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ గురువారం హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌ ద్వారా బాన్సువాడకు చేరుకున్నారు. బాన్సువాడ నుంచి రోడ్డు మార్గం గుండా పోచారం వెళ్లారు. అనంతరం సభాపతి శ్రీనివాస్‌రెడ్డిని పరామర్శించారు. పాపవ్వ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పోచారంను ఓదార్చారు. ఆయన వెంట ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ, నిజామాబాద్‌ ఎంపి కవిత, ...

Read More »

సేవాలాల్‌ జయంతిని అధికారికంగా జరపాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సేవాలాల్‌ జయంతిని ఎల్లారెడ్డిలో అధికారికంగా జరిపించాలని, అలాగే సేవాలాల్‌ జయంతి రోజు ప్రభుత్వం అధికారికంగా సెలవు దినంగా ప్రకటించాలని ఆలిండియా బంజారా సేవసంఘ్‌ సభ్యులు డిమాండ్‌ చేశారు. బుధవారం ఎల్లారెడ్డి మండల అధ్యక్షుడు రాథోడ్‌ లింబేస్‌, సెక్రెటరీ గోవింద్‌, జిల్లా ఉపాధ్యక్షుడు యశ్వంత్‌ రావు నాయక్‌,మలోత్‌ రాములు, కడవత్‌ రాములు,మలోత్‌ పాండు, కట్రాత్‌ లక్ష్మణ్‌ ,కట్రాత్‌ బిల్‌ సింగ్‌ , హరిచంద్‌ ,తవుర్య మరియు బంజారా సంఘం సభ్యులు కలిసి ఆర్డీఓ కార్యక్రమంలో ...

Read More »

సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

కామారెడ్డి, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన లబ్దిదారులకు బుధవారం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. కామారెడ్డి, మాచారెడ్డి, దోమకొండ, బిక్కనూరు మండలాలకు చెందిన 41 మంది లబ్దిదారులకు మంజూరైన రూ. 18 లక్షల 75 వేల విలువగల చెక్కులను బుధవారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ, జడ్పిటిసిలు మధు, నంద రమేశ్‌, ఏఎంసి ఛైర్మన్లు గోపిగౌడ్‌, అమృత్‌రెడ్డి, నాయకులు పిప్పిరి ఆంజనేయులు, బల్వంత్‌రావులు అందజేశారు.

Read More »