Breaking News

kammarpally

హెడ్‌కానిస్టేబుల్‌కు ఏఎస్‌ఐగా ప్రమోషన్‌

కమ్మర్‌పల్లి, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కమ్మర్‌ పల్లి పోలీస్‌ స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా గత ఐదు సంవత్సరాలుగా అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న జి.సుశీల్‌ కుమార్‌కి ఏ.ఎస్సైగా ప్రమోషన్‌ రావడం జరిగింది. అందుకుగాను కమ్మరపల్లి ఎస్‌ఐ, కార్యాలయ మరియు సిబ్బంది అతనికి అభినందనలు తెలిపారు.

Read More »

హాసకొత్తూర్‌లో సాంఘిక బహిష్కరణ

కమ్మర్‌పల్లి, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కమ్మర్‌పల్లి మండలంలోని హాసకొత్తూర్‌ గ్రామంలో ఎస్‌సి మాదిగ సంఘం సభ్యులపై గ్రామ కమిటీ సాంఘిక బహిష్కరణ విధించింది. ఈ విషయం పై కమ్మర్పల్లి ఎస్‌ఐ మురళి తెలిపిన ప్రకారం … హాసకొత్తూర్‌ గ్రామంలో ఎస్‌సి మాదిగ సంఘం నుండి ఇటీవలే 20 మంది సభ్యులు విడిపోయి మరో సంఘంగా ఏర్పడ్డారు. అయితే గ్రామంలో ప్రతి సంఘం నుంచి గ్రామకమిటీలోకి సభ్యున్నీ పంపడం వీలుకాదని చెప్పి ప్రాధేయపడ్డామని బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ...

Read More »

సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

కమ్మర్‌పల్లి, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కమ్మర్‌పల్లి మండలానికి చెందిన పలువురు అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకోగా పెద్దమొత్తంలో ఖర్చు అయ్యింది కాగా బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌ రెడ్డికి విన్నవించుకోగా ముఖ్యమంత్రి సహాయనిది నుండి ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయడం జరిగింది. ఈ మొత్తాన్ని శుక్రవారం లబ్దిదారులకు అందజేశారు. కొత్తపల్లి ఆశన్న రూ. 21 వేల 500, పాలేపు చిన్నగంగారాం రూ. 25 వేలు, కాప మంజుల రూ. 2 లక్షల 50 వేలు, చింత కళావతి రూ. ...

Read More »

ఆడపిల్లలు అన్ని రంగాల్లో ముందుండాలి

కామారెడ్డి, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆడపిల్లలు అన్నిరంగాల్లో ముందుండాలని పోటీ తత్వాన్ని అలవరుచుకోవాలని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖాధికారిణి రాధమ్మ అన్నారు. నేషనల్‌ గర్ల్‌ చైల్డ్‌ డే ఉత్సవాల్లో భాగంగా వారంరోజుల పాటు నిర్వహించిన వారోత్సవాలు గురువారం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆమె మాట్లాడారు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని జీవితంలో రాణించాలని సూచించారు. చదువుపై ప్రత్యేక శ్రద్ద వహించాలని, తల్లిదండ్రులు సైతం ఆడపిల్లల వెన్నుతట్టి వారిని ప్రోత్సహించాలని చెప్పారు. వివిధ పోటీల్లో ...

Read More »

శుక్రవారం మోర్తాడ్‌, కమ్మర్‌పల్లిలో ఎమ్మెల్యే పర్యటన

  మోర్తాడ్‌, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్‌, కమ్మర్‌పల్లి మండలాల్లో శుక్రవారం మిషన్‌ భగీరథ వైస్‌ఛైర్మన్‌, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పర్యటిస్తారని పిఎలు శ్రావణ్‌రెడ్డి, అరుణ్‌కుమార్‌లు గురువారం తెలిపారు. మోర్తాడ్‌ మండలంలోని ధర్మోరా గ్రామంలో, కమ్మర్‌పల్లి మండలం బషీరాబాద్‌ గ్రామంలో హరితహారం పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభిస్తారని వారు తెలిపారు.

Read More »

బాల్కొండ నియోజకవర్గంలో 65వేల ఎకరాలకు సాగు నీరందించాలి

కమ్మర్‌పల్లి: బాల్కొండ నియోజకవర్గంలో 65వేల ఎకరాలు సాగులోకి వచ్చేలా అంచనాలు సిద్ధం చేయాలని మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బాల్కొండ నియోజకవర్గంలోని ప్రాణహిత-చేవెళ్ల ప్యాకేజీ 21 పనుల పురోగతి, చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల పథకం, గుత్ప ఎత్తిపోతల పథకం, నిజాంసాగర్ పాత కెనాల్ మరమ్మతుల గురించి బుధవారం ఆయన సచివాలయంలోని తన చాంబర్‌లో గోదావరి బేసిన్ కమిషనర్ మధుసూదన్ రావు, సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్యాకేజీ 21 ద్వారా నియోజకవర్గంలోని వేల్పూర్, భీమ్‌గల్, కమ్మర్‌పల్లి, మోర్తాడ్ ...

Read More »

కేసీఆర్ స్వప్నన్ని సాకారం చేయడమే లక్ష్యం..

కమ్మర్‌పల్లి: ఇంటింటికీ తాగునీటిని అందించి సీఎం కేసీఆర్ స్వప్నన్ని సా కారం చేయడమే తన లక్ష్యమని మిషన్ భగీరథ వైస్‌చైర్మన్ అన్నారు. గురువారం ఎస్సారెస్పీ వస తి గృహంలో విలేకరులతో ఆయన మాట్లాడా రు. 2018 డిసెంబర్‌లోగా 28,400 గ్రామాలు, ఆవాస ప్రాంతాలకు నీరు అం దించనున్నట్లు చెప్పారు. ఆడపడుచులు అడిగన చోట నళ్లాలు బిగించి నీరు అందించి మిషన్ భగీరథను విజయవంతం చేస్తామన్నారు. భూగర్భ జలాల్లో అనారోగ్య కారకాలు ఉండటం, వేసవిలో నీటి తిప్పలు ఎదురు అవుతుండటం దృష్ట్యా జలాశయాల నుంచి ఉపరితల ...

Read More »

రైతుల మేలు కోసమే బెల్లం కొనుగోళ్లు

కామారెడ్డి: రైతులకు మేలు చేసే ఉద్దేశంతో వారి వద్ద నిల్వ ఉన్న బెల్లంను పూర్తిగా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంపగోవర్ధన్‌ పేర్కొన్నారు. మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో కామారెడ్డి వ్యవసాయ మార్కెట్‌యార్డులో ఏర్పాటు చేసిన బెల్లం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతుల వద్ద బెల్లం నిల్వల్ని కొనుగోలు చేయాలని ఇటీవల జిల్లాకు వచ్చిన సీఎం కేసీఆర్‌కు తాను, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి విన్నవించినట్లు తెలిపారు. తక్షణమే నిల్వల వివరాలు సేకరించి కొనుగోలు చేయాలని కలెక్టర్‌కు సీఎం ...

Read More »

వరద కాలువలో కంకర దందా

కమ్మర్‌పల్లి : కమ్మర్‌పల్లి, నాగాపూర్ గ్రామాల సరిహద్దుల్లో ఎస్సారెస్పీ వరద కాలువలో కొద్ది రోజులుగా కంకర కొట్టి తరలిస్తున్నారు. కాలువ కట్ట వెంట ఉన్న బండ రాళ్లను తొలగిస్తూ, పగుల గొడుతూ కంకర చేస్తున్నారు. వరద కాలువలో ఇరువైపులా కట్ట వెంట రాళ్లు పుష్కలంగా ఉన్నాయి. కాలువ కట్ట తవ్వకాల నుంచి సహజంగా ఉన్న ఈ రాళ్లు కట్ట బలోపేతానికి తోడ్పడుతాయి. ఈ రాళ్లను తొలగించడం మూలంగా కట్టకు గోతులు ఏర్పడి రాళ్లను తొలగించిన చోట మట్టి జారి పోయింది. కాలువలో వరద వచ్చినప్పుడు ...

Read More »

బటన్ వేస్తేనే నీళ్ల కోసం రూ.కోటి ఖర్చు

కమ్మర్‌పల్లి: వేల్పూర్ మండలంలోని నవాబ్ ఎత్తిపోతల పథకానికి బటన్ వేస్తే చాలు నీళ్లు ఇవ్వడం కోసం కోటి రూపాయలు ఖర్చు చేయడం వృథా అని మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆ యన కమ్మర్‌పల్లి గ్రామ పంచా యతీ కార్యాలయంలో నిర్వ హిం చిన విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. తిప్పితే రాని నీళ్లు బట న్ వేస్తే వస్తాయా అన్నారు. మిష న్ కాకతీయ కింద చెరువుల్లో పూడిక తీస్తున్నా రు కదా.. దానితో అదనంగా ఒక్క ఎకరానికై నా నీళ్లు ...

Read More »

విజృంభించిన వైరల్ ఫీవర్స్

కమ్మర్‌పల్లి : మండలంలోని గాంధీనగర్, ఇందిరమ్మ కాలనీల్లో జ్వరాలు ప్రబలాయి. వారం రోజులుగా కాలనీల వాసులు తీవ్ర జ్వరాలతో బాధపడుతున్నారు. సుమారు 60 మంది జ్వరాలతో మంచం పట్టారు. బాధితు ల్లో తీవ్ర జ్వరం, ఒంటి నొప్పులు, మోకాళ్లలో వాపు లక్షణాలున్నాయి. కొందరు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వై ద్యం పొందుతుండగా, మరికొందరు కరీంనగర్ జిలా ్లమెట్‌పల్లి దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. రెండు రోజులుగా జ్వరాలు తీవ్రం అవుతున్న సమాచారంతో శనివారం మండల వైద్యాధికారి డాక్టర్ అజయ్ కుమార్ కాలనీలను సందర్శించి రోగులను ...

Read More »

నీటి ఎద్దడిపై దద్దరిల్లిన మునిసిపల్‌ కౌన్సిల్‌

  -అధికారులు, ఛైర్‌పర్సన్‌ తీరుపై నిలదీత కామారెడ్డి, ఫిబ్రవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మునిసిపల్‌ కార్యాలయంలో సోమవారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ అధ్యక్షతన నిర్వహించిన కౌన్సిల్‌ సమావేశం నీటి ఎద్దడి సమస్యపై దద్దరిల్లింది. కౌన్సిల్‌ సభ్యులు అధికారులు, ఛైర్‌పర్సన్‌ తీరుపై మండిపడ్డారు. వాగ్వాదాలతో సమావేశం రసాభాసగా మారింది. బడ్జెట్‌ కోసం నిర్వహించిన సమావేశం కాస్తా వాయిదా పడింది. సమావేశంలో ప్రధానంగా నీటి ఎద్దడిపైనే వాగ్వాదం చోటుచేసుకుంది. కౌన్సిలర్లు రామ్మోహన్‌, జమీల్‌, వైస్‌ఛైర్మన్‌ మసూద్‌ అలీలు నీటి ఎద్దడి ...

Read More »

బోరుమోటారు ప్రారంభం

  కామారెడ్డి, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 7వ వార్డు హరిజనవాడలో శనివారం బోరుమోటారును మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. మునిసిపల్‌ సాధారణ నిధులు రూ. 2 లక్షలతో మోటారు బిగించినట్టు తెలిపారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని నీటి ఎద్దడి నివారణకు బోరుమోటారు బిగించినట్టు తెలిపారు. కార్యక్రమంలో వైస్‌ఛైర్మన్‌ మసూద్‌ అలీ, కౌన్సిలర్లు సంగి మోహన్‌, భూంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఫారెస్టు కోర్సుతో ఉజ్వల భవిష్యత్తు

  యుపి ఫారెస్టు కార్పొరేషన్‌ డిఎం రఘుపతిరెడ్డి కామారెడ్డి, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఫారెస్టు కోర్సుతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని కోర్సు పూర్తయిన తర్వాత దేశ వ్యాప్తంగా విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని యుపి ఫారెస్టు కార్పొరేషన్‌ డిఎం రఘుపతిరెడ్డి అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం బిఎస్‌సి ఫారెస్టు చదివిన, ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులతో సదస్సు నిర్వహించారు. సదస్సుకు ప్రిన్సిపాల్‌ ప్రభాకర్‌ అధ్యక్షత వహించారు. రఘుపతిరెడ్డి, ఉత్తర ప్రదేశ్‌ ఝాన్సీ జిల్లా ...

Read More »

సిసి డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభం

కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 12వ వార్డులో గురువారం మురికి కాలువల నిర్మాణం, కల్వర్టు నిర్మాణ పనులను మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. స్టేట్‌ ఫైనాన్స్‌ నిధులు రూ. 4 లక్షలతో కాలువ నిర్మాణ పనులు చేపట్టామన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కుంబాల రవి, ముప్పారపు ఆనంద్‌, ఎ.ఇ. గంగాధర్‌, వర్క్‌ ఇన్స్‌పెక్టర్లు కిషన్‌, రవిందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

శుక్రవారం చిన్నారులకు అక్షరాభ్యాసం

  కామారెడ్డి, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వసంత పంచమి పుణ్యతిథిని పురస్కరించుకొని పట్టణంలోని సరస్వతి శిశుమందిర్‌ పాఠశాలలో శుక్రవారం అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించనున్నట్టు పాఠశాల యాజమాన్యం తెలిపారు. భగత్‌సింగ్‌నగర్‌ పాఠశాలలో వేద పండితులు మునుస్వామి ఆధ్వర్యంలో దయానందస్వామి అక్షరాభ్యాసం చేయిస్తారన్నారు. ఉదయం 10 గంటలకు తల్లిదండ్రులు తమ చిన్నారులను తీసుకొని వచ్చి అక్షరాభ్యాసం చేయించుకోవాలని కోరారు.

Read More »

కల… నెరవేరనున్న వేళ…

రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న కామారెడ్డి డిగ్రీ కళాశాలకు సంబంధించిన ఆస్తుల వ్యవహారం కొలిక్కి వస్తోంది. మూడున్నర దశాబ్ధాలుగా ఎదురు చూస్తున్న కల నెరవేరబోతోంది.. కళాశాలకు సంబంధించిన ఆస్తులను విద్యాకమిటీ నుంచి ప్రభుత్వపరం చేసుకునే దస్త్రంపై ఎట్టకేలకు మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతకం చేశారు. ప్రత్యేక అధికారిని సైతం నియమించారు. ఇందుకు సంబంధించిన జీవో ఒకటి, రెండు రోజుల్లో వెలువడనుంది. సుధీర్ఘకాలంగా కామారెడ్డి ప్రాంత వాసులు ఎదురు చూస్తున్న కళాశాల ఆస్తుల వ్యవహారంలో సీఎం సంతకంతో కదలిక వచ్చినట్లయ్యింది. భవిష్యత్తులో కళాశాలకు మంచి ...

Read More »

పసుపు రైతుకు పానీ తిప్పలు

కమ్మర్‌పల్లి, నమస్తే తెలంగాణ : పసుపు పంటకు నీటి గండం పట్టుకుంది. చేతికొచ్చిన పంటను కాపాడుకొనేందుకు రైతులు ఎన్నో కష్టాలు పడుతున్నారు. మరోవైపు బోరు బావులు ఎత్తిపోవడంతో దిగుబడి గణనీయంగా తగ్గింది. కమ్మర్‌పల్లి మండలంలో సుమారు 1600 హెకార్టల్లో పసు పు పంట వేశారు. ఎకరానికి సుమారు 25 వేల రూపాయల వ రకు ఖర్చు పెట్టి సాగు చేస్తున్న రైతన్నకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ ఏడాది నిరాశజనకంగా వర్షపాతం నమోదు కావడం తో పంట తవ్వేందుకు కూడా సరిపడా నీళ్లు లేని ...

Read More »

బ‘షేర్‌’బాద్‌

కమ్మర్‌పల్లి, న్యూస్‌టుడే: గల్ఫ్‌ మోజు ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుంది .అదే బాటలో ప్రయనిస్తున్న ఈ గ్రామస్థులు మాత్రం ప్రగతి పథంలో దూసుకెళుతున్నారు.. గల్ఫ్‌ అంటేనే పుట్టెడు కష్టాలు, కన్నీళ్లని వలస జీవులంతా రోదిస్తుంటే… ఈ గ్రామస్థులు తమ అభివృద్ధికి బాటలు వేసుకుంటున్నారు. గడిచిన నలభై ఐదేళ్ల కాలంలో తాత నుంచి మనువడి వరకు ఇంటికొకరు గల్ఫ్‌లో ఉంటూ ఆర్థికంగా పురోగమిస్తున్నారు కమ్మర్‌పల్లి మండలం బషీరాబాద్‌ గ్రామస్థులు. గల్ఫ్‌బాటలో విలసిల్లిన బ‘షేర్‌’బాద్‌పై న్యూస్‌టుడే కథనం. జిల్లాలో గల్ఫ్‌కు జీవనోపాధి కోసం వలస వెళ్లి అభివృద్ధి ...

Read More »