Breaking News

Kids Corner

పురుషులలో బట్టతల వస్తుంది కానీ, స్త్రీలలో రాదు. ఎందుకని?

జవాబు: అత్యంత ప్రాధాన్యత ఉన్న మెదడు ఉండేది మన తలభాగంలోని కపాలం లోపల కాబట్టి, పరిణామ క్రమంలో భాగంగా తలపై వెంట్రుకలు పెరిగాయి. పరిసరాలలోని వాతావరణ పరిస్థితుల నుంచి ఇవి కొంత రక్షణ కల్పిస్తాయి. అయితే పరిమాణ క్రమంలో వచ్చిన మార్పుల వల్లనే వెంట్రుకల ప్రాధాన్యం కూడా బాగా తగ్గింది. ఫలితంగా వయసు పెరిగే కొద్దీ వెంట్రుకలు లేని బట్టతల ఏర్పడ్డం మొదలైంది. అయితే దీనికి ఎక్కువగా జన్యువులు (genes), వంశపారంపర్యత (hereditory charecteristics) కారణమవుతున్నాయి. అలాగే లైంగిక హార్మోన్ల ప్రభావం కూడా ఉంటుంది. పురుషులలో ...

Read More »

ఆడవాళ్లకు బట్టతల రాదేం?

  ప్రశ్న: పురుషులలో బట్టతల వస్తుంది కానీ, స్త్రీలలో రాదు. ఎందుకని? జవాబు: అత్యంత ప్రాధాన్యత ఉన్న మెదడు ఉండేది మన తలభాగంలోని కపాలం లోపల కాబట్టి, పరిణామ క్రమంలో భాగంగా తలపై వెంట్రుకలు పెరిగాయి. పరిసరాలలోని వాతావరణ పరిస్థితుల నుంచి ఇవి కొంత రక్షణ కల్పిస్తాయి. అయితే పరిమాణ క్రమంలో వచ్చిన మార్పుల వల్లనే వెంట్రుకల ప్రాధాన్యం కూడా బాగా తగ్గింది. ఫలితంగా వయసు పెరిగే కొద్దీ వెంట్రుకలు లేని బట్టతల ఏర్పడ్డం మొదలైంది. అయితే దీనికి ఎక్కువగా జన్యువులు (genes), వంశపారంపర్యత (hereditory charecteristics) ...

Read More »

ఆపిల్‌ ఎందుకు తీయగా ఉంటుంది? వేపపండు ఎందుకు చేదుగా ఉంటుంది?

ఫ్ర : ఆపిల్‌ ఎందుకు తీయగా ఉంటుంది? వేపపండు ఎందుకు చేదుగా ఉంటుంది? జ : ‘జీవం’ అంటేనే రసాయనిక ధర్మాల సమాకలనమేనని, ‘కణ నిర్మాణం’ అంటేనే రసాయనిక పదార్థాల మధ్య ఉన్న అనుబంధమేనని, రుచులు, వాసనలన్నీ రసాయనిక పదార్థాలకు, జ్ఞానేంద్రియాలైన నాలుక, ముక్కుల్లో ఉన్న రసాయనిక గ్రాహకాల (chemoreceptors) కు మధ్య ఏర్పడే చర్యాశీలతే (reactivity) నని జీవ రసాయనిక శాస్త్రం (biochemistry) ఋజువు చేసింది. ఆపిల్‌ పండులో ప్రధానంగా ఎన్నో ఇతర రుచిలేని గుజ్జు, నీటితో పాటు అందులో కరిగిన గ్లూకోజ్‌ వంటి చక్కెరలున్నాయి. ...

Read More »

మగ నెమలి కన్నీరు తాగితేనే ఆడ నెమలి గుడ్లు పెడుతుందంటారు. నిజమేనా?

  జవాబు: సాధారణ ప్రజానీకంలో జంతువుల గురించి ఉన్న అపోహలో ఇది కూడా ఒకటి. పాము పాలు తాగుతుందనుకోవటం, పాము నాగస్వరానికి నాట్యమాడుతుందని అనుకోవటం, పిల్లి ఎదురొస్తే అనుకోని ఆపదలు కలుగుతాయనుకోవడం వంటి అపోహలు ప్రజల్లో ఉన్నాయి. నెమలికయినా, మరే జీవికయినా కన్నీటిలో జీవకణాలు ఉండవు. నెమలి, కోతి, కప్ప, పాము, మనిషి, ఆవులు, గేదెలు వంటి ద్విలింగ జీవులలో పురుష జీవి నుంచి సగం క్రోమోజోములున్న శుక్రకణం, ఆడ జీవిలో సగం క్రోమోజోములున్న అండంతో ఫలదీకరణం (ఫెర్టిలైజేషన్‌) జరిగాక సంయుక్త బీజకణం (జైగోట్‌) ఏర్పడుతుంది. ...

Read More »

కరెంటుకు సంబంధించి వాట్టు (watt), ఓల్టు (volt)ల మధ్య తేడాలేంటి?

విద్యుత్‌ క్షేత్రంలో విద్యుత్‌ ప్రభావం ఉంటుంది. ఆ క్షేత్రంలోకి అనంత దూరం నుంచి ఒక కులుంబు విద్యుదావేశాన్ని నిర్దిష్ట బిందువు దగ్గరికి తీసుకు రావడంలో ఎంత శక్తి ఇమిడి ఉందో ఆ శక్తిని ఒక ఓల్టు అంటాము. లేదా విద్యుత్‌ క్షేత్రంలో రెండు వేర్వేరు బిందువుల మధ్య ఒక కులుంబు విద్యుదావేశాన్ని బదలాయించడంలో ఒక జౌలు శక్తి ఇమిడి ఉన్నట్లయితే ఆ రెండు బిందువుల మధ్య ఒక ఓల్టు విద్యుత్‌ పొటన్షియల్‌ తేడా ఉందంటాం. అంటే ఓల్టు విద్యుత్‌ పొటన్షియల్‌ లేదా పొటన్షియల్‌ తేడాలకు ...

Read More »

షుగర్‌ ఫ్రీ బియ్యం ఎలా వస్తాయి?

మామూలు బియ్యంలో అధిక భాగం పిండి పదార్థాలుంటాయి. మనం రోజూ తినే ప్రతి 100 గ్రాముల బియ్యంలో సుమారు 80 గ్రాముల వరకు పిండి పదార్థాలే ఉంటాయి. 12 శాతం నీరు, 7 శాతం మాంస కృత్తులు ఉంటాయి. ఇక మిగిలిన భాగంలో చిన్నాచితకా ఖనిజ లవణాలు, విటమిన్లు ఉంటాయి. ఇలాంటి బియ్యాన్ని మనం వండి నప్పుడు చాలామటుకు పిండిపదార్థాలు మన జీర్ణవ్యవస్థలో జీర్ణం కాగలిగేలా ఉడుకుతాయి. అలాంటి అన్నాన్ని తిన్నాక ఉడికిన కార్బోహైడ్రేట్‌లు జీర్ణమై గ్లూకోజ్‌నిస్తాయి. ఇది రక్తంలో కలిసినప్పుడు మన జీవ ...

Read More »

స్విచ్‌ ఆపకుండా ఛార్జర్‌ని ఉంచేయొచ్చా?

స్విచ్‌ వేసి ఉన్నప్పుడు దాని ప్లగ్‌ సాకెట్‌ సాంకేతికంగా బాగుంటే సెల్‌ ఛార్జర్‌ను ఎంత సేపు ఉంచినా నష్టం లేదు. లాభమూ లేదు. సాంకేతికంగా బాగా ఉండటం అంటే ప్లగ్‌లోని లైన్‌ కాంటాక్ట్‌ రంధ్రంలోను, న్యూట్రల్‌ రంధ్రంలోనూ ఒకే విధమైన పొటెన్షియల్‌ ఉండటం. సాధారణంగా ఇది సున్నా ఉంటుంది. అంటే లైనుకు, న్యూట్రల్‌కు ఓల్టేజ్‌లో తేడా ఉండకూడదు. ఒక వేళ 3 పిన్నుల ప్లగ్‌ వాడుతున్నట్లయితే న్యూట్రల్‌కు, గ్రౌండ్‌(లేదా ఎర్త్‌) కు మధ్య విడి విడిగా సున్న ఓల్టేజ్‌ ఉండాలి. ఆ విలువ ఐదు ...

Read More »

గ్రహాల మధ్యలోకి సూర్యుడెలా వచ్చాడు?

మన సౌర వ్యవస్థ చరిత్ర ప్రకారం సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూ ఉండే దుమ్ము, ధూళితో కూడిన ఒక వృత్తాకార పదార్థం నుంచి గ్రహాలు ఏర్పడ్డాయి. అవి సూర్యుడు కేంద్రంగా దాని చుట్టూ తిరుగుతున్నాయి. ఈ సిద్ధాంతం సూర్యకుటుంబం ఎలా ఏర్పడింది అన్న ప్రశ్నకు సరైన నమూనా. ఈ సిద్ధాంతం ప్రకారం… నక్షత్రాల అంతర్భాగంగా ఉండే ఒక మేఘం లాంటి పదార్థం పతనమై, చదునవడంతో సూర్య కుటుంబం ఏర్పడింది. మొదట్లో ఆ మేఘం కాంతి సంవత్సరాల మేర వ్యాపించి ఉండేది. సూర్యుని కంటే పది మిలియన్‌ ...

Read More »

వయసు పెరిగే కొద్దీ మన దేహపు చర్మంపై ముడతలు పడతాయెందుకు?

శరీరంపై ఉండే చర్మపు మార్పులు వయసు పెరిగే కొద్దీ సహజంగా కలుగుతాయి. ఎక్కువగా సూర్యరశ్మి, పొగ, పరిసరాల కాలుష్యం శరీరానికి సోకితే, ఈ ప్రక్రియ వేగవంతమవుతుంది. మనకు వయసు పెరిగే కొద్దీ శరీరంపై ఉండే చర్మానికి బిగువును కలిగించే ‘కొలాజిన్‌’ అనే ప్రోటీను ఉత్పత్తి తగ్గిపోతుంది. దీంతో చర్మం మందం తగ్గి పెళుసుగా తయారవుతుంది. చర్మానికి స్థితిస్థాపకత (ఎలాస్టిసిటీ) ధర్మాన్ని సమకూర్చే ‘ఎలాస్టిక్‌’ కూడా తగ్గిపోతుంది. దాంతో తడి శాతం కూడా తగ్గి, చర్మం పొడిబారి పోతుంది. ఫలితంగా చర్మంపై నిదానంగా వయసుతో పాటు ...

Read More »

చేతి వేళ్లలో ఆ శబ్దమేల?

రెండు అర చేతుల్నీ దండం పెడుతున్నట్లు ఆనించి గట్టిగా ఒత్తితే అర చేతులు పుటాకారంలో ఉంటాయి. కాబట్టి మధ్యలో ఇరుక్కున్న గాలి చిన్న సంధుల్లో నుంచి అధిక పీడనంతో రావడం వల్ల ‘పుస్‌’ అంటూ ఈలలా శబ్దం వస్తుంది. ఇది ఒక రకం. మీరన్న వేళ్లను ఒత్తినప్పుడు వచ్చే శబ్దాన్ని మెటికలు విరవడం అని కూడా అంటారు. చేతి వేళ్లు కీళ్లతో ఉండటం వల్ల వాటిని ఎటైనా వంచగలం. రోజూ వారీ వేళ్లు కదులుతుండటం వల్ల కీళ్లు, ఎముకల మధ్య ఘర్షణ ఏర్పడుతుంది. ఈ ...

Read More »

అంతరిక్షంలో కాలం చెల్లిన ఉపగ్రహాలు వదిలిన చెత్తా చెదారాన్ని ఎలా తొలగిస్తారు?

అంతరిక్షంలో కాలం చెల్లిన ఉపగ్రహాల చెత్తా చెదారం విషయంలో ‘చికిత్స కన్నా నివారించడమే మేలు’ అనే సూత్రాన్ని పాటించడం మంచిదని శాస్త్రజ్ఞులు నమ్ముతున్నారు. అందువల్ల వారు ఉపగ్రహ ప్రయోగంలోనే దాని వల్ల ఏర్పడే అనవసర పదార్థాల్ని (జంక్‌) తొలగించే ఏర్పాటు చేస్తారు. ఒక ఉపగ్రహం జీవిత కాలం ముగియగానే అది తన కక్ష్య నుంచి తప్పుకుని భూమివైపు పయనించే ఏర్పాటు చేస్తారు. అలా కాలం చెల్లిన ఉపగ్రహం భూవాతావరణంలోకి ప్రవేశించి అక్కడి వాయువులతో ఘర్షణ ఏర్పడి మాడి మసైపోతుంది. అంతరిక్షంలో ఉపగ్రహాల వల్ల ఏర్పడిన ...

Read More »

ఆడవాళ్ల నోట్లో సీక్రెట్స్ ఎందుకు దాగవో తెలుసా ?

మహిళలు ఏ విషయాన్నైనా అందరితో పంచుకుంటారు, సీక్రెట్స్ ని బయటపెట్టేయాలనే ఆత్రుత ఉంటుంది. కానీ మగవాళ్లు మాత్రం సీక్రెట్స్ తమలోనే దాచుకోవాలని భావిస్తారు. ఎందుకు ? ఆడవాళ్లు శుక్ర గ్రహం నుంచి మగవాళ్లు అంగారక గ్రహం నుంచి వచ్చారని చెబుతుంటారు. మహిళలు ఏ విషయాన్నైనా అందరితో పంచుకుంటారు, సీక్రెట్స్ ని బయటపెట్టేయాలనే ఆత్రుత ఉంటుంది. కానీ మగవాళ్లు మాత్రం సీక్రెట్స్ తమలోనే దాచుకోవాలని భావిస్తారు. ఎందుకు ? సీక్రెట్స్ ని దాచుకోవడం ఆడవాళ్లకు చాలా కష్టమైన పని. ముఖ్యంగా ఇతరులతో చెప్పకు అన్న విషయాన్నే ...

Read More »

,క్యాలెండర్‌ కాగితాలు మాత్రం పైకే ఎగురుతాయెందుకు?

ప్రశ్న: ఫ్యాన్‌ గాలి పైనుంచి కిందకు వీస్తున్నా క్యాలెండర్‌ కాగితాలు మాత్రం పైకే ఎగురుతాయి. ఎందుకు? జవాబు: ఇలా జరగడానికి కారణం గాలి వస్తువులపై ప్రయోగించే పీడన ప్రభావమే. ఉదాహరణకు రెండు ఆపిల్‌ పళ్లను సన్నని దారాలతో ఒకదాని పక్కన మరొక దానిని వేలాడదీసి వాటి మధ్యన ఉండే ఖాళీ స్థలంలో గాలిని వూదితే, ఆ పండ్లు రెండు ఒకదాని నుంచి మరొకటి దూరంగా జరుగుతాయని అనుకొంటాం. కానీ, నిజానికి అవి రెండూ దగ్గరగా వస్తాయి. గాలి వూదడం వల్ల అంతక్రితం ఆపిల్స్‌ మధ్య ...

Read More »

దిగుడు బావుల నగరము అంటారెందుకు ?,

బావులు లేదా నూతులు (Wells) కొన్ని ప్రాంతాలలో మంచినీటి అవసరాల కోసం తయారుచేసుకున్న కట్టడాలు. బావులలో రకాలు : * ఊట బావి: ఈ బావులలో ప్రకృతి సిద్దంగా నీరు ఊరుతుంది. అందువల్ల ఇవి వేసవి కాలంలో కూడా ఎండిపోవు. * దిగుడు బావి: ఈ బావులు భూమి ఉపరితలంలో కలిసిపోయి ఉంటాయి. అంటే వీనికి గట్లు ఉండవు. అందువల్ల వీనిలో పశువులు, చిన్న పిల్లలు పడిపోయి చనిపోయే ప్రమాదం ఉంది. కొన్నింటిలోనికి దిగడానికి మెట్లు ఉంటాయి. * గొట్టపు బావి: ఈ బావులు ...

Read More »

కర్పూరం గొప్పేంటి?

కర్పూరపు బిళ్ళలను నీళ్ళలో ఉంచి వెలిగించినా వెలుగుతాయి. ఎందువల్ల? అందులో ఏముంటాయి. మనం తెలుసుకుందామా! కర్పూరాన్ని నీటిలో ముంచి వెలిగిస్తే వెలగదు. లేదా వెలుగుతున్న కర్పూరాన్ని నీటిలో ముంచినా ఆరిపోతుంది. కర్పూరాన్ని జాగ్రత్తగా నీటి మీద ఉంచి వెలిగిస్తే వెలుగుతుంది. కర్పూరం నీటిలో కరగదు. ఇది ఒకటర్పీను జాతికి చెందిన సేంద్రియ పదార్థం. ఇందులో కర్బనం, ఆక్సిజన్, హైడ్రోజన్ మాత్రమే ప్రత్యేక పద్దతిలో సంధానించుకుని ఉంటాయి. కర్పూరం మంచి ఇంధనం అంటే అది త్వరగా మండుతుంది. కర్పూరం సాంద్రత నీటి సాంద్రత కన్నా తక్కువ ...

Read More »

కొడితే వాతలేల?

ప్రశ్న: ఎవరినైనా చెంపపై ‘ఛెళ్లు’మని కొడితే, వాతలు తేలుతాయి. ఎందుకు? జవాబు: మన శరీరంలో చెంపపై ఉండే చర్మం మిగతాభాగాలపై ఉండే చర్మంకన్నా మెత్తగా, సున్నితంగా ఉంటుంది. ఎవరినైనా చెంపపై కొడితే చర్మం కింద ఉండే జీవకణాలు తమ నిరోధక శక్తిని కోల్పోయి చిట్లి చెల్లాచెదురవుతాయి. ఆ ప్రభావాన్ని తగ్గించడానికి అక్కడ మామూలుకన్నా అధికంగా తెల్లరక్తకణాలు అవసరమవుతాయి. వాటిని సరఫరా చేసే క్రమంలో ఆ ప్రాంతానికి రక్తప్రసరణ అధికంగా జరుగుతుంది. దీనికి తోడు అక్కడ పగిలిపోయిన కణాలలోని ద్రవం కూడా ఆ రక్తంలో కలవకుండా ...

Read More »

కృష్ణద్రవ్యం అంటే ఏంటి?,

కృష్ణద్రవ్యం అంటే ఏంటి? ప్రశ్న: కృష్ణ ద్రవ్యము (Dark Matter) అంటే ఏమిటి? జవాబు: ఈ విశాల విశ్వంలో, బ్రహ్మాండాలను (గెలాక్సీలను) ఒకటిగా ఉంచడానికి, అవి గుంపులుగా కదలడానికి ఎంత ద్రవ్యరాశి (Matter)కావాలో గణనలు చేయడం ద్వారా శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు. కానీ వారు గమనించిన ద్రవ్యం, విశ్వంలో ఉన్న ద్రవ్యంలో 4 శాతం మాత్రమే. కాబట్టి, ఆ కనిపించని, వెలుగునీయని ద్రవ్యాన్ని డార్క్‌మేటర్‌ (కృష్ణ ద్రవ్యము) అంటారు. ఈ ద్రవ్యము నల్లని మేఘాలు, ధూళి లేక కాలం తీరిన నక్షత్రాల (Dead Stars) రూపంలో ...

Read More »

నీళ్లతో మత్తు దిగేనా?,

ప్రశ్న: తాగిన వ్యక్తిపై నీళ్లు కుమ్మరిస్తే మత్తు దిగిపోతుందని అంటారు. నిజమేనా? జవాబు: తాగుబోతులు తాగే ద్రావణంలో నీరు అధికంగానూ, ఇథైల్‌ ఆల్కహాలు కొద్దిగానూ ఉంటాయి. ఆల్కహాలు మోతాదునుబట్టి ఆయా పానీయాల మత్తు తీవ్రత ఆధారపడుతుంది. ఇథైల్‌ ఆల్కహాలుకు తనంత తానుగా మత్తును కలిగించే గుణం లేదు. తాగినప్పుడు ఏ జీర్ణ ప్రక్రియ అవసరం లేకుండానే కొద్దిసేపటికే రక్తంలో కలిసే గుణం దీనికి ఉంది. రక్తంలో కలిసిన వెంటనే అది దేహంలోని కణ జాలాల్లోకి బాగా త్వరితంగా చేరుకోగలుగుతుంది. కణాల్లోకి వెళ్లక అది సాధారణంగా ...

Read More »

పొగకు కళ్లు మండుతాయేం?

ప్రశ్న: పొగ కళ్లలోకి వెళ్లినపుడు కళ్లు మండుతాయి. ఎందుకని? జవాబు: పాక్షికంగా మండిన ఇంధనం వల్లనే పొగ వస్తుంది. ‘నిప్పు లేనిదే పొగరాదు’ అన్న సామెత సబబే అయినా నిప్పున్నంత మాత్రాన పొగ రావాల్సిన అగత్యం లేదు. నిప్పులకు సరిపడినంత ఆక్సిజన్‌ దొరికితే పొగ లేకుండానే నిప్పులు మండగలవు. పచ్చిగా ఉన్న వంట చెరకు, తడిగా ఉండే బొగ్గులు, మలినగ్రస్తమైన తారు తదితర పెట్రోలియం ఇంధనాలు, ప్లాస్టిక్కులు, రబ్బరులు, కిరోసిన్‌ దీపాలు, గాలి సరిగా సరఫరా కాని కిరోసిన్‌ పొయ్యిలు, సిగరెట్లు, బీడీలు పొగల్ని ...

Read More »

ఆ గుర్తు కథేంటి? ,

ప్రశ్న: ఆసుపత్రులు, అంబులెన్స్‌లు, వైద్యుల కార్లపై ఎర్రని ప్లస్‌ (+) గుర్తు ఉంటుంది కదా? దాని అర్థమేంటి? జవాబు: తెల్లని నేపథ్యంలో ఎర్రని ప్లస్‌ గుర్తు ఉంటే అది అంతర్జాతీయ రెడ్‌క్రాస్‌ సంస్థ చిహ్నం. కొందరు ప్లస్‌ చుట్టూ గుండ్రని వలయం గీస్తారు. అప్పుడది రెడ్‌క్రాస్‌ చిహ్నం కాదు. నాలుగుసార్లు నోబెల్‌ శాంతి బహుమతి పొందిన రెడ్‌క్రాస్‌ సంస్థ, స్విట్జర్లాండ్‌ దేశస్థుడైన హెన్రీ డునాంట్‌ యుద్ధ సైనికులకు చికిత్స చేసే విధానాలపై రాసిన పుస్తకం ప్రేరణగా కొందరు 1863లో జెనీవాలో స్థాపించినది. అప్పట్లో తరచూ ...

Read More »