Breaking News

Madnoor

తాగునీటి కోసం తంటాలు..

మద్నూర్ : భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో ప్రజ లు తాగునీటి కోసం తీవ్ర ఇ బ్బందులు ఎదుర్కొంటున్నా రు. మండల కేంద్రంలోని వై ఎస్సార్ కాలనీవాసులు తాగు నీటి కోసం నానా తంటాలు పడుతున్నారు. బిందెడు నీళ్ల కోసం పరుగు లు తీస్తున్నారు. కాలనీలో వంద కుటుం బాలు నివసిస్తున్నాయి. కాలనీ లో ఉన్న మూడు బోర్లలో సైతం నీళ్లు అడుగంటి పోవడంతో వారు ప క్కన ఉన్న ఇందిరానగర్ కాలనీ నుంచి నీళ్లను తెచ్చుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం మండల కేంద్రంలోని ...

Read More »

నీళ్ల దాత… స్ఫూర్తి ప్రదాత…

మద్నూర్‌,: నీళ్ల కోసం ఎవరికివారు అల్లాడుతున్న ఈ రోజుల్లో తన సొంతానికి కాదని గ్రామ ప్రజలకు నీటిని సరఫరా చేస్తూ ఆపర భగీరథుడిగా నిలుస్తున్నారు మద్నూర్‌ మండలం పెద్దశక్కర్గ గ్రామానికి చెందిన రైతు శంకర్‌. గత కొన్ని నెలలుగా బోర్లలో నీరు అడుగంటిపోయి గ్రామంలో తీవ్ర కరవు ఏర్పడింది. దీంతో గ్రామస్థులు పడుతున్న నీటి కష్టాలను కళ్లారా చూసి చలించిన ఆయన తనకున్న నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిలో ఉన్న రెండు బోర్లు నుంచి నీటిని పైపులైన్‌ ద్వారా గ్రామ ప్రజలకు అందించి వారి ...

Read More »

సకాలంలో ఇంటిపన్ను బకాయిలు చెల్లించాలి

  మోర్తాడ్‌, మార్చి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో పేరుకుపోయిన ఇంటిపన్ను బకాయిలను సకాలంలో చెల్లించి గ్రామాభివృద్దికి గ్రామస్తులు సహకరించాలని మండల కార్యదర్శులు అన్నారు. గురువారం మండలంలోని తొర్తి గ్రామంలో ఇంటిపన్ను బకాయిల వసూలుపై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఇందులో 60 వేల 387 రూపాయలు వసూలు చేసినట్టు వారు తెలిపారు. కార్యక్రమంలో మండల కార్యదర్శులు నాగరాజు, సుభాష్‌ చంద్రబోస్‌, సాజన్‌, స్వప్న, కారోబార్లు తదితరులున్నారు.

Read More »

మార్కెట్ విలువకు మూడింతల పరిహారం

మద్నూర్ : లెండి ప్రాజెక్ట్ పిల్ల కాలువల కింద భూములు కోల్పోతున్న నిర్వాసితులకు మార్కెట్ విలువకు మూడింతల ప రిహారం ఇస్తామని బోధన్ ఆర్డీవో శ్యాం ప్రసాద్‌లాల్ తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో రైతులతో ఆయన మా ట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఎకరాకు సాగునీరందించేందుకు కృషి చేస్తోంద న్నారు. లెండి పిల్ల కాలువల కింద భూ ములు కోల్పోయే రైతులకు ప్రభుత్వం పరిహారం ఇస్తుందని తెలిపారు. ప్రస్తు తం తమ భూములకు చాలా డిమాండ్ ఉందని, ఎకరా రూ.12 ...

Read More »

ఆలయాల అభివృద్ధికి కృషి: మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

మద్నూర్‌: జిల్లాలో ప్రసిద్ధి చెందిన సలాబత్‌పూర్‌ ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మద్నూర్‌లోని తెలంగాణ బాలుర గురుకుల పాఠశాలలో ఆర్‌.ఎమ్‌.ఎస్‌.ఏ నిధులు రూ. 30.11 లక్షలతో కొత్తగా నిర్మించిన అదనపు గదుల భవనాన్ని ప్రారంభించారు. అనంతరం సలాబత్‌పూర్‌ హనుమాన్‌ మందిరాన్ని సందర్శించారు. మంత్రికి ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్యే హన్మంత్‌ షిండేలు హనుమాన్‌ ...

Read More »

లారీ ఢీకొని బాలిక దుర్మరణం

మేనూర్‌, (మద్నూర్‌): మేనూర్‌ గ్రామంలో జాతీయ రహదారిపై మంగళవారం లారీ ఢీ కొని మీనా (10) అనే బాలిక మృతి చెందినట్లు ఏఎస్సై బన్సీ తెలిపారు. ఏఎస్సై, గ్రామస్తుల వివరాల ప్రకారం గ్రామంలోని మొఘ చౌరస్తా వద్ద కిరాణా దుకాణంలో సరుకులు తీసుకుని ఆమె రోడ్డు దాటుతుండగా లారీ వచ్చి ఢీకొనడంతో తీవ్రగాయాలు అయ్యాయని, దీంతో మద్నూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే పరిస్థితి విషమించటంతో మృతి చెందినట్లు తెలిపారు. ఆమె స్వస్థలం జుక్కల్‌ మండలం మాధాపూర్‌ నుంచి ఇటీవలే అమ్మమ్మ ఇంటికి వచ్చినట్లు ...

Read More »

చురుకుగా సాగుతున్న డబుల్‌ బెడ్‌రూం సర్వే

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస ప్రభుత్వం అమలు చేస్తున్న డబుల్‌ బెడ్‌ రూం పథకంలో భాగంగా మోర్తాడ్‌లో తహసీల్దార్‌ వెంకట్‌రావు, ఆర్‌ఐ మంజులవాణి ఆద్వర్యంలో సర్వే చురుకుగా కొనసాగుతుంది. మంగళవారం రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో రెండు బృందాలుగా ఏర్పడి 8,9 వార్డుల్లో సర్వే కొనసాగించారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి లబ్దిదారుని ఇంటికెళ్ళి అధికారులు పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నారు. మోర్తాడ్‌లో డబుల్‌ బెడ్‌ రూం పథకం సర్వేను రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారు.

Read More »

నెమ్లీ సాయిబాబా ఆలయానికి పాదయాత్ర

  మద్నూర్‌, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మద్నూర్‌ మండల కేంద్రానికి చెందిన యువకులు శనివారం మద్నూర్‌ సాయిబాబా ఆలయం నుంచి బీర్కూర్‌ మండలం నెమ్లీ సాయిబాబా మందిరం వరకు పాదయాత్రగా బయలు దేరనున్నట్లు భక్తులు తెలిపారు. శనివారం ఉదయం 6 గంటలకు మద్నూర్‌నుంచి బయలుదేరనున్నట్లు వారు పేర్కొన్నారు. దాదాపు 70 మంది యువకులు పాదయాత్రలో పాల్గొననున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.

Read More »

ఐదుగురి బైండోవర్‌

  మద్నూర్‌, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలో పేకాట ఆడుతున్న సమాచారం మేరకు ఐదుగురిని శుక్రవారం మండల తహసీల్దార్‌ ముందు బైండోవర్‌ చేసినట్టు ఎస్‌ఐ కాశీనాథ్‌ తెలిపారు. బాలాజీ, ముసా, శ్రీకాంత్‌, మాధవ్‌, వీరేశంలను బైండోవర్‌ చేసినట్టు ఆయన వివరించారు. పేకాట ఆడుతున్నారని ఫిర్యాదు మేరకు జిల్లా పోలీసు అధికారి ఆదేశానుసారం వీరిని పట్టుకొని బైండోవర్‌ చేసి కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ వివరించారు.

Read More »

నూతన సంవత్సర శుభకాంక్షలు

,,,,గతాన్ని అవలోకించుకొని, వర్తమానాన్ని ఉపయోగించుకొని, భవిష్యత్తుకు పునాదులు వేయాలని… భావి భారతావనికి మార్గదర్శనం కావాలని ఆశిస్తూ…. 2014 సంవత్సరానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నూతన సంవత్సరం 2015కు ఘనంగా స్వాగతం పలుకుతూ….,,,, —–మీ ”నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌” ఎడిటోరియల్ బోర్డ్

Read More »

……నిజామాబాద్‌ జిల్లా ప్రజలకు మరియు మా వెబ్‌న్యూస్‌ చూస్తున్న మా రిడర్స్‌ అందరికి ”నిజామాబాద్‌ న్యూస్‌ డాన్‌ ఇన్‌” నూతన సంవత్సర శుభాకాంక్షలు…..

……నిజామాబాద్‌ జిల్లా ప్రజలకు మరియు మా వెబ్‌న్యూస్‌ చూస్తున్న మా రిడర్స్‌ అందరికి ”నిజామాబాద్‌ న్యూస్‌ డాన్‌ ఇన్‌” నూతన సంవత్సర శుభాకాంక్షలు…..

Read More »

కరువు మండలంగా ప్రకటించాలి -మద్నూర్‌లో రాస్తారోకో

మద్నూర్‌, నవంబర్‌ 11 : మద్నూర్‌ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ బిజెపి ఆధ్వర్యంలో మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు రాములు మాట్లాడుతూ ఈ సీజన్‌లో కనీస వర్ష పాతం కూడా నమోదు కాలేదన్నారు. ఖరీఫ్‌లో పంటలన్నీ ఎండిపోయాయని, దీంతో రైతులు పెట్టిన పెట్టుబడి రాలేదన్నారు. రబీలో పంటలు కూడా పండించలేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. పంటలు నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాగా ఎస్‌ఎన్‌ఏ రహదారిపై బిజెపి నాయకులు, ...

Read More »

మద్నూర్‌లో వాహనాల తనిఖీ

మద్నూర్‌, నవంబర్‌ 11 : మద్నూర్‌లో మంగళవారం పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. స్థానిక ఎస్‌ఎన్‌ఏ రహదారిపై ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టగా నెంబరులేని వాహనాలు, రిజిస్ట్రేషన్‌ లేని వాహనాలకు జరిమానాలు విధించారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌లు లేని వారితో పాటు పరిమితికి మించి వాహనాలు నడిపిన వారికి సైతం జరిమానాలు విధించారు. వాహనాలకు సంబంధించిన పత్రాలు లేకుండా నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ అన్నారు. డ్రైవర్లు రోడ్డు రూల్స్‌ను పాటించాలన్నారు.

Read More »

నిస్సహాయ స్థితిలో వున్న వారికి ఆసరా -పించన్ల పంపిణీలో ఎమ్మెల్యే షిండే

మద్నూర్‌, నవంబర్‌ 9 : సమాజంలో నిస్సహాయ స్థితిలో వున్న వారికి ఆపన్న హస్తం అందించేదే ఆసరా పథకం అని జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే అన్నారు. ఆదివారం ఆయన మద్నూర్‌, బిచ్కుంద మండలాల్లో ఆసరా పథకం కింద పించన్లను పంపిణీ చేశారు. కార్మికులు, కల్లుగీత, చేనేత కార్మికులతో పాటు వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ప్రభుత్వం ఆసరా పథకాన్ని ప్రారంభించిందన్నారు. దీని కింద వృద్ధులు, వితంతువులకు వెయ్యి రూపాయలు, వికలాంగులకు 1500 రూపాయల చొప్పున పించన్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి ...

Read More »

మద్నూర్‌లో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం

మద్నూర్‌, నవంబర్‌ 9 : మద్నూర్‌ మార్కెట్‌యార్డులో ఆదివారం జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్తి మద్దతు ధర క్వింటాలుకు 4050 రూపాయలు వుందన్నారు. తేమ తక్కువగా వుండటం వల్ల పత్తి రంగుమారి పత్తిలోని పోగులు, గింజల నాణ్యత లేకుండా పోతుందన్నారు. మార్కెట్‌లో కనీస మద్దతు ధర 4050 రూపాయలకు తగ్గించి కొనుగోలు చేస్తే వెంటనే మార్కెట్‌యార్డులో ఏర్పాటు చేసిన సిసిఐ కొనుగోలు కేంద్రంలో పత్తిని విక్రయించాలని రైతులను సూచించారు. కొనుగోలు కేంద్రంలో విక్రయించిన ...

Read More »

పెద్ద ఎక్లారాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ -ఒకరి పరిస్థితి విషమం

  మద్నూర్‌, నవంబర్‌ 9 : మద్నూర్‌ మండలం పెద్ద ఎక్లారా గ్రామంలో ఆదివారం ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ సంఘటనలో 22 మందికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా వుంది. గ్రామంలో ఓ ఇంటి నిర్మాణం విషయంలో జరిగిన గొడవ చిలికి చిలికి ఘర్షణకు దారి తీయగా పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాల వారిని చెదరగొట్టారు. గాయపడిన వారిని మద్నూర్‌ ఆసుపత్రికి తరలించి చికిత్సలు నిర్వహించారు. కాగా ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ...

Read More »

ఇళ్ల ముంగిళ్లలో తులసీ కళ్యాణాలు..

మద్నూర్‌, నవంబర్‌ 6 : కార్తీక పౌర్ణమి సందర్భంగా మహిళలు తులసీ కళ్యాణాలను ఘనంగా నిర్వహించారు. జుక్కల్‌ నియోజకవర్గంలోని మద్నూర్‌, బిచ్కుంద, మద్నూర్‌, మండలాల్లోని మహిళలు తమ ఇళ్ల ముంగిళ్లలో తులసీ మండపాలను అందంగా అలంకరించారు. శ్రీకృష్ణా-రాధ చిత్రపటాలను పూలు, విద్యుద్దీపాలతో చేసి గౌరమ్మ, ఉసిరి, మామిడి, చెరుకు, అరటి కొమ్మలతో సుందరంగా పందిళ్లు వేసి వివాహాలు చేశారు. కార్తీకమాసంలో ఈ వివాహాలు చేయడం వల్ల కుటుంబీకులు సుఖసంపదలతో ఉంటారని భక్తుల నమ్మకం. పిల్లలు టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు.

Read More »

సలాబత్‌పూర్‌ ఆలయంలో కంకణాల ధారణ

మద్నూర్‌, నవంబర్‌ 6 : మద్నూర్‌ మండలం సలాబత్‌పూర్‌ గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో గురువారం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కంకణాల ధారణ కార్యక్రమం జరిగింది. ఆలయ అర్చకులు శరద్‌మహారాజ్‌ వేదమంత్రోచ్ఛారణలతో కంకణాల ధారణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మనగుడి కార్యక్రమంలో భాగంగా కంకణాల ధారణ నిర్వహించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతినిధులు తెలిపారు. కాగా మనగుడి కార్యక్రమంపై అవగాహన, పూజా విధానాలు తదితర అంశాలపై తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మేనేజర్‌ హన్మాండ్లు, సిబ్బంది వేణు, భక్తులు పాల్గొన్నారు. ఆలయంలో సామూహిక ...

Read More »

దైవస్వరూపాలే కార్తీక దీపాలు

మద్నూర్‌, నవంబర్‌ 6 : జుక్కల్‌ నియోజకవర్గంలో గురువారం కార్తీక పౌర్ణమి పండగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని మద్నూర్‌, బిచ్కుంద, జుక్కల్‌ మండలాల్లోని వివిధ గ్రామాల ప్రజలు కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాల్లో ఘనంగా పూజలు నిర్వహించారు. ఇంటి ముంగిళ్లలో మహిళలు కార్తీక దీపాలను అందంగా అలంకరించారు. బిచ్కుంద మండల కేంద్రంలోని నాగుల గుడి ఆలయంలో మహిళలు దీపాలతో ఆకర్షణీయంగా దీపాలను వరుసగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తోరణంగా దీపాలు వెలిగించడం వల్ల దుష్టశక్తుల నాశనమై పుణ్యం చేకూరుతుందని ...

Read More »

గ్రామాల్లో కొనసాగుతున్న సర్వే

మద్నూర్‌, నవంబర్‌ 4 : మద్నూర్‌ మండలంలోని వివిధ గ్రామాల్లో సర్వే కొనసాగుతోంది. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల కింద వచ్చిన దరఖాస్తులపై అధికారులు, సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. మద్నూర్‌ మండలంలోని అన్ని గ్రామాల్లో మంగళవారం సర్వే నిర్వహించారు. ఆహార భద్రత కార్డులు, పించన్‌ల కోసం వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలించారు. అర్హులైన లబ్దిదారులకు రేషన్‌, పించన్‌ అందించేందుకు ఈ సర్వే నిర్వహిస్తున్నారు. మద్నూర్‌ విఆర్‌ఓ శంకర్‌పటేల్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Read More »