Breaking News

Makluru

అందరు తప్పక వ్యాక్సిన్‌ తీసుకోవాలి

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం భారతీయ జనతా పార్టీ మాక్లూర్‌ మండల‌ శాఖ ఆధ్వర్యంలో దేశ ప్రధాని మోదీ ప్రజలందరికీ తప్పనిసరిగా కోవిడ్‌ వ్యాక్సిన్‌ ను అందించాల‌నే ఉద్దేశంతో జరుగుతున్న వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ గురించి అవగాహన కల్పించే పోస్టర్‌ను జిల్లా ప్రధాన కార్యదర్శి జి.వి. నరసింహ రెడ్డి, ఆర్మూర్‌ కొవిడ్‌ కన్వీనర్‌ ద్యాగ ఉదయ్‌ చేతుల‌ మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆర్మూర్‌ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్‌ వినయ్‌, మాక్లూర్‌ మండల‌ నాయకులు సంతోష్‌, బిజెవైఎం ...

Read More »

ఎమ్మెల్యేను పరామర్శించిన సిఎం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గ శాసనసభ్యులు బిగాలా గణేష్‌ గుప్తా, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. శాసనసభ్యులు గణేష్‌ గుప్తా తండ్రి కష్ణమూర్తి గుప్తా గత కొద్ది రోజుల క్రితం ఆకస్మికంగా చనిపోయిన విషయం విదితమే. ఆయన ద్వాదశ దిన కర్మను పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి బుధవారం మాక్లూర్‌లోని ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి గుప్త సోదరులను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కీర్తిశేషులు ...

Read More »

2న మాక్లూర్‌కు సిఎం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 2న రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మాక్లూరు రానున్నందున జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి, సిపి కార్తికేయ పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. మంగళవారం వారు సంబంధిత అధికారులతో కలిసి మాక్లూర్‌ మండల కేంద్రంలో పర్యటించి హెలిప్యాడ్‌, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించారు. నిజాంబాద్‌ అర్బన్‌ శాసనసభ్యులు బీగాల గణేష్‌ గుప్తా యొక్క తండ్రి మరణించినందున ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించడానికి ముఖ్యమంత్రి రానున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. అధికారులు ...

Read More »

నవంబర్‌ వరకు గరీబ్‌ కళ్యాణ్‌ యోజన

నిజామాబాద్‌, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశ ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన గరీబ్‌ కళ్యాణ్‌ యోజన పథకాన్ని నవంబర్ నెల‌ వరకు పొడిగిస్తూ ప్రతి ఒక్కరికి ఉచితంగా ఐదు కేజీల‌ బియ్యం, ఒక కేజీ కందిపప్పు అందిస్తామని ప్రకటించారని ఆత్మ నిర్బర్‌ భారత్‌ జిల్లా కో ఆర్డినేటర్‌ పుప్పాల‌ శివరాజ్‌ కుమార్‌ తెలిపారు. ఈ మేరకు గురువారం మాక్లూర్‌ మండలంలో మీడియాతో మాట్లాడారు. ఉజ్వల‌ పథకం ల‌బ్ధిదారుల‌కు మరో మూడు నెల‌లు ఎల్‌పిజి గ్యాస్‌ ఉచితంగా అందజేస్తామని తెలిపారన్నారు. కరోనా ...

Read More »

అసత్య పత్రికా ప్రకటనలు చేస్తున్నారు

మాక్లూర్‌, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ మండల‌ బిజెపి సర్వసభ్య సమావేశం సోమవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాలా శివరాజ్‌ కుమార్‌ హాజరై మాట్లాడారు. బిజెపి ఎదుగుదల‌ను చూసి ఓర్వలేక టిఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు అసత్య పత్రికా ప్రకటనలు చేస్తున్నారని, వారి మాటల‌ను ఇప్పుడు ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ నిధుల‌ను దుర్వినియోగ పరుస్తూ కేంద్రం ఎటువంటి సహాయం చేయడం లేదని అసత్య ఆరోపణలు చేస్తున్న నాయకుల‌కు దమ్ము ధైర్యం ...

Read More »

వైకుంఠ ధామాల నిర్మాణాలకు భూమిపూజ

మాక్లూర్‌, జనవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ మండలంలోని వెంకటాపూర్‌, గొట్టుముక్కుల, ముల్లంగి, మాదాపూర్‌, చిన్నాపూర్‌ గ్రామాలలో గురువారం జరిగిన రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమాలలో నిజామాబాదు జెడ్పి చైర్మెన్‌ దాదన్నగారి విఠల్‌ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో నిర్మించనున్న వైకుంఠ ధామాల నిర్మాణ పనులకు ఆయన భూమి పూజలు చేశారు. బొంకన్‌పల్లిలో చెత్త బుట్టలను పంపిణి చేశారు. ఎంపీడీఓ, సర్పంచులు, తెరాస నాయకులు గోపాల్‌ నగేష్‌, రమణారావు తదితరులు పాల్గొన్నారు.

Read More »

వైకుంఠధామాల నిర్మాణానికి భూమిపూజ

మాక్లూర్‌, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతి కార్యక్రమంలో సోమవారం జడ్పి చైర్మన్‌ దాదన్న విట్టల్‌ రావు, ఎమ్మెల్సీ ఆకుల లలిత పాల్గొన్నారు. మాక్లూర్‌ మండలంలోని మెట్‌పల్లి, గుంజిలి, చికిలి, వల్లభాపూర్‌ గ్రామాల్లో వైకుంఠ ధామాల నిర్మాణ పనులకు వారు భూమి పూజ చేశారు. మాక్లూర్‌ ఎంపీడీఓ, ఎంపీపీ, స్థానిక సర్పంచులు తెరాస నాయకులు పాల్గొన్నారు.

Read More »

మాక్లూర్‌ మండలం అటవీ ప్రాంతంలో జోరుగా పేకాట

నిజామాబాద్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌ మండలంలోని అటవీ ప్రాంతంలో జోరుగా పేకాట కొనసాగుతుంది. మండలంలోని అటవీ ప్రాంతాలైన సింగంపల్లి తాండా, లొద్దిచెరువు, పంజాగుట్ట, కెనాల్‌కట్ట, చిన్నాపూర్‌ గండి తదితర ప్రాంతాల్లో రోజు మాక్లూర్‌ మండలానికి చెందినవారితోపాటు సింగంపల్లి తాండా, దుర్గానగర్‌ తాండాలకు చెందిన యువకులు గుంపులు గుంపులుగా పేకాట ఆడుతూ ఆర్థికంగా నష్టపోతున్నారు. జనసంచారం ఉండకపోవడంతో ఇక్కడ పేకాట విషయంలో పలుమార్లు వివాదాలు ఏర్పడి గొడవలు పడ్డ సందర్భాలున్నాయని తాండావాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ...

Read More »

సరిహద్దు పోలీసులు స్నేహభావంతో మెలగాలి

మద్నూర్ : రాష్ట్ర సరిహద్దు పోలీసులు స్నేహభావంతో మెలగాలని దెగ్లూర్ డీఎస్పీ ప్రశాంత్ స్వామి అన్నారు. శనివారం దెగ్లూర్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ గ్రౌండ్‌లో ఇంటర్‌స్టేట్ బోర్డర్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. బిచ్కుంద సర్కిల్ పరిధిలోని పోలీసులు,దెగ్లూర్ సర్కిల్ పరిధిలోని పోలీసులకు వాలీబాల్ టోర్నీ నిర్వహించారు.అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన డీఎస్పీ సరిహద్దు పోలీసులు ఒకరినొకరు సహకరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో దెగ్లూర్ సీఐ సంపత్ షిండే,మద్నూర్ ఎస్సై కాశీనాథ్ ఉన్నారు.

Read More »

తాగునీటి కోసం రాస్తారోకో

  మాక్లూర్‌, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని దాస్‌నగర్‌ 63వ జాతీయ రహదారిపై దాస్‌నగర్‌ స్థానికులు సోమవారం రాస్తారోకో చేపట్టారు. తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వెంటనే పరిష్కరించాలని నినాదాలుచేశారు. అరగంట పాటు రాస్తారోకో చేయడంతో 2 కి.మీ. ల మేర వాహనాలు ఇరువైపులా నిలిచిపోయాయి. వెంటనే తాగునీటి సమస్య పరిష్కరించకపోతే ప్రతిరోజు రాస్తారోకో చేస్తామని హెచ్చరించారు. సిఎం, ఎమ్మెల్యే, సర్పంచ్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసుల చొరవతో ఆందోళన కార్యక్రమం సద్దుమణిగింది.

Read More »

ఒడ్డేడ్‌పల్లిలో హనుమాన్‌ విగ్రహ ప్రతిష్టాపన

  మాక్లూర్‌, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ మండలం ఒడ్డేడ్‌పల్లి గ్రామంలో గురువారం హనుమాన్‌ భక్తులు, గ్రామస్తులు, గ్రామాభివృద్ది కమిటీ సభ్యుల ఆద్వర్యంలో హనుమాన్‌ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు హనుమాన్‌ భక్తులు విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి గ్రామ శివారులోని ఒడ్డేడ్‌ చెరువు పక్కన విగ్రహాన్ని ప్రతిష్టించి వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ గీత, తెరాస నాయకులు సత్యం, ఉపసర్పంచ్‌ అరుణ్‌, చిరంజీవి, ఒడ్డెన్న, గ్రామాభివృద్ది కమిటీ సభ్యులు ...

Read More »

దళితులకు మూడెకరాల భూమి ఇప్పించండి

  మాక్లూర్‌, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా దళితులకు 3 ఎకరాల భూమిని ఇవ్వాలని ప్రగతిశీల యువజన సంఘంఆర్మూర్‌ డివిజన్‌ కార్యదర్శి అభిలాష్‌ అన్నారు. ఈ మేరకు సోమవారం మాక్లూర్‌ మండలంలోని మాణిక్‌ బండార్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు చెప్పడానికి మాత్రమే పరిమితమయ్యాయని, వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. సమావేశంలో పివైఎల్‌ మండల అద్యక్షుడు లక్ష్మినారాయణ, దత్తు, గంగాధర్‌, గోవర్దన్‌, చిన్నయ్య, తదితరులు ...

Read More »

దేవి ఆలయానికి ఎంపి 2 లక్షల విరాళం

  మాక్లూర్‌, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ మండలంలోని మాణిక్‌బండార్‌ గ్రామం నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత దత్తత గ్రామం. కాగా మాణిక్‌ బండార్‌పరిధిలోని మాణిక్‌బండార్‌ తాండాలోని దేవి ఆలయానికి ఎంపి కవిత 2 లక్షల రూపాయలు విరాళాలు అందజేశారు. ఇందుకు సంబంధించిన చెక్కును ఆర్మూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆశన్నగారి రాజేశ్వర్‌రెడ్డి ఆలయ కమిటీ సభ్యులకు సోమవారం అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఆకుల రాంకిషన్‌, ఎంపిటిసి దేవి, జడ్పిటిసి లత, పీర్‌సింగ్‌, మండల పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్‌, నాయకులు ...

Read More »

చలివేంద్రం ప్రారంభం

  మాక్లూర్‌, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ మండలం మదన్‌పల్లి గ్రామంలో తెరాస కార్యకర్త ఒడ్డెన్న ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని శనివారం తహసీల్దార్‌ లత శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎండలు తీవ్రమవుతున్నవేళ బాటసారుల దాహం తీర్చేందుకు ఇటువంటి చలివేంద్రం ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయమని అభినందించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ లత, ఎంపిటిసి సుశీల, గ్రామ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

  మాక్లూర్‌, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ మండల కేంద్రంలోని రామాలయంలో శుక్రవారం అత్యంత వైభవంగా శ్రీరావనవమి వేడుకలు నిర్వహించారు. ఉదయంనుంచే ఆలయానికి భక్తులు తరలివచ్చారు. ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక అర్చనలు, పూజలు నిర్వహించారు. అదేవిధంగా భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు లక్ష్మినారాయణ, ఉపాధ్యక్షులు రమణారావు, సభ్యులు, గ్రామ పెద్దలు, పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

Read More »

మాక్లూర్‌లో అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాలు

  మాక్లూర్‌, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ మండల కేంద్రంతో పాటు ప్రతి గ్రామంలో డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ 125వ జయంతి ఉత్సవాలను గురువారం ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలో సర్పంచ్‌ సత్తమ్మ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలువేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అంబేడ్కర్‌ రాజ్యాంగంలో పేర్కొన్నవిధంగా ప్రజలందరు కులమతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండాలని అన్నారు. అంబేడ్కర్‌ జాతీయభావాలు గల గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఈరోజు ప్రపంచంలోని చాలా దేశాల్లో అంబేడ్కర్‌ జయంతి జరుపుకోవడం ...

Read More »

చిన్నాపూర్‌లో సుభాష్‌చంద్రబోస్‌ విగ్రహ ఆవిష్కరణ

  మాక్లూర్‌, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశ స్వాతంత్య్రం కోసం, బ్రిటీష్‌వారిని ఈ దేశం నుంచి తరిమికొట్టడం సైన్యాన్నే తయారుచేసిన గొప్ప యోధుడు సుభాష్‌ చంద్రబోస్‌ అని ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆదివారం మండలంలోని చిన్నాపూర్‌ గ్రామ పంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహ ఆవిష్కరణ చేశారు. అనంతరం మాట్లాడుతూ దేశమాత దాస్యశృంఖలాలను తెంచడం కోసం అనేక మంది స్వాతంత్య్ర సమరంలో వీరమరణం పొందారన్నారు. అలాగే తెలంగాణ ఉద్యమంలో కూడా ప్రజల ...

Read More »

శుక్రవారం ఒడ్డేటమ్మ జాతర

  మాక్లూర్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఒడ్యాట్‌పల్లి గ్రామంలో శుక్రవారం ఒడ్డేటమ్మ అమ్మవారి ఆలయం వద్ద జాతర నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ ప్రతినిదులు సత్యం, మహిపాల్‌ తెలిపారు. ఈ సందర్బంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, బోనాలు, నైవేద్యం సమర్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. జాతరకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలిరావాలని కోరారు. భక్తుల సౌకర్యార్థం తాగునీరు, షామియానాలు తదితర వసతులు కల్పించినట్టు తెలిపారు.

Read More »

చలివేంద్రం ప్రారంభం

  మాక్లూర్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కల్లడి గ్రామంలో జడ్పిటిసి లత, పీర్‌సింగ్‌ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ వద్ద చలివేంద్రం ఏర్పాటు చేసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎండలు తీవ్రమవుతున్న వేళ ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేశామన్నారు. వేసవిలో తాగునీరు అందించి ప్రజల దాహార్తి తీర్చడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పోశెట్టి, వార్డుమెంబర్లు తదితరులున్నారు.

Read More »

వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి

  మాక్లూర్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని గంగరమంద గ్రామంలో దేవేందర్‌ (45) అనే ఉపాధి కూలీ వడదెబ్బతో మృతి చెందాడు. గురువారం ఉదయమే ఉపాధి కూలీ పనులకు వెళ్ళి 12.30 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చాడు. వడదెబ్బకు గురైన దేవేందర్‌ అవస్థ పడుతుండడంతో గమనించిన కుటుంబీకులు నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా మార్గమధ్యంలో మృతి చెందినట్టు తెలిపారు.

Read More »