Breaking News

Makluru

రోడ్డుప్రమాదంలో ఇద్దరికి గాయాలు

  మాక్లూర్‌, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని దాస్‌నగర్‌ క్రాసింగ్‌ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. నిజామాబాద్‌ నుంచి ఆర్మూర్‌ వైపు వెళ్తున్న ఆర్టీసి బస్సు ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొనడంతో బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. స్తానికులు గమనించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.

Read More »

తెరాసలో చేరిక

04.04.6   మాక్లూర్‌, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కల్లడి గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ నాయకురాలు, ఎంపిటిసి లత సోమవారం తెరాసలో చేరారు. ఈ మేరకు ఆర్మూర్‌లోని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సమక్షంలో జడ్పిటిసి లత పీర్‌సింగ్‌ ఆధ్వర్యంలో సుమారు 50 మందితో కలిసి తెరాస తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారిని పార్టీ కండువాలతో పార్టీలోకి ఎమ్మెల్యే ఆహ్వానించారు. కార్యక్రమంలో సుధాకర్‌, మల్లేశ్‌, సుమలత, తదితరులున్నారు.

Read More »

వైన్స్‌లో చోరీ

మాక్లూర్ : మండలంలోని మానిక్‌బండార్‌లోని జై భవానీ వైన్స్‌లో సోమవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఎస్సై వెంకట్‌రాములు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మానిక్‌బండార్‌లోని జై భవానీ వైన్స్‌కు వ్యాపారులు సోమవారం రాత్రి 10 గంటలకు తాళాలు వేసి వెళ్లి పోయారు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు షెట్టర్ తాళాలు పగుల కొట్టి లోపలికి చొరబడ్డారు. మూడు రాయల్ స్టగ్ ఫుల్ బాటిళ్లు, రూ. 4 వేల ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. వైన్స్ యజమాని ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు ...

Read More »

యువతిపై బ్లేడ్‌తో దాడి చేసిన ప్రేమికుడు

మాక్లూర్ : మండలంలోని మాదాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గాలిబ్‌నగర్‌కు చెందిన యువతి తనను ప్రేమించిన యువకుడిని పెండ్లి చేసుకోమని కోరడంతో సోమవారం రాత్రి ఆ చేయిపై అతను బ్లేడుతో కోసి గాయపరిచాడని ఎస్సై వెంట్రాములు తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన యువతి, సుమన్ మూడేళ్లుగా ప్రేమించు కుంటున్నారు. ఇంట్లో పెద్దలకు తెలపడంతో ఇరు కుటుంబాల పెద్దలు ఆరు నెలల క్రితం ఒప్పుకున్నారు. నెల రోజుల క్రితం సుమర్ కనిపంచకుండా పోయాడు. మూడు రోజుల క్రితం గ్రామానికి రావడంతో ...

Read More »

ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు

మాక్లూర్ : రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు ద క్కుతాయని ప్రభుత్వ ప్రత్యేక ధర్మపురి శ్రీనివా స్ అన్నారు. మాక్లూర్ మండలం మానిక్‌బండార్ గ్రామ సర్పంచి ఆకుల రాంకిషన్ నివాసంలో ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఆహ్వానం మేరకు ఆయన అ ల్పహార విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌తో కలిసి 2004లో పనిచేయడం మరిచిపోలేని విషయమని గుర్తు చేశారు. జిల్లా ఎంపీగా కవిత ఉండడం దేవుడు ఇచ్చిన వరమన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే మంచితనం, అభివృద్ధి, ...

Read More »

ఆవు దూడను చంపిన చిరుత

మాక్లూర్‌, : చిరుతపులి దాడిలో ఆవుదూడ మృతి చెందిన సంఘటన శుక్రవారం తెల్లవారుజామున మాక్లూర్‌ పంచాయతీ పరిధిలోని సింగంపల్లిలో చోటు చేసుకుంది. రియాజొద్దీన్‌ అనే రైతు తన నాలుగు ఆవులు, మూడు దూడలను గురువారం రాత్రి పశువుల పాకలో కట్టేసి ఇంటికి వెళ్లాడు. శుక్రవారం ఉదయం చూసేసరికి ఒక ఆవుదూడ కనిపించకుండా పోయింది. సమీపంలోని అటవీ ప్రాంతంలో వెతకగా ఆవుదూడ శవమై కనిపించింది. ఆవుదూడను చిరుతపులి దూరంగా లాక్కొని వెళ్లి చంపేసింది. స్థానికులు అందించిన సమాచారం మేరకు మండల పశు వైద్యాధికారి హన్మంత్‌రెడ్డి సంఘటన ...

Read More »

మెరుగైన ఫలితాల కోసం…

మాక్లూర్‌: పేద విద్యార్థుల సంక్షేమం కోసం ఆయన ఎంతగానో కృషి చేస్తారు. ఫీజు చెల్లించడంతో పాటు ప్రతిభ గల వారిని ఎప్పుడూ ప్రొత్సహిస్తుంటారు. కళాశాలలో ఎలాంటి సమస్యలున్నా వెంటనే స్పందిస్తారు. తన వంతుగా విరాళాలు అందిస్తారు. తాజాగా మెరుగైన ఫలితాలు సాధించేందుకు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టి అందరిచే భేష్‌ అనిపించుకుంటున్నారు. విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్న భోజనం పెడుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. నిత్యం 300 మందికి భోజనం… మాక్లూర్‌, నందిపేట, నిజామాబాద్‌ మండలాలకు చెందిన 311 మంది విద్యార్థులు మాక్లూర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చదువుతున్నారు. ...

Read More »

రైతులతో మమేకం … ప్రదర్శనలతో చైతన్యం

మాక్లూర్‌: అన్నదాతల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆశించిన మేర చర్యలు తీసుకోలేకపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో…ఓ వ్యవసాయ శాఖ విస్తరణ అధికారి మాత్రం నిత్యం వారి అభ్యున్నతి కోసమే శ్రమిస్తున్నారు. కర్షకులతో మమేకమవుతూ వ్యవసాయ ప్రదర్శనలిస్తూ చైతన్యం నింపుతున్నారు. అతని సేవలకు గుర్తుగా మూడుసార్లు ఉత్తమ అధికారిగా ఎంపికయి శభాష్‌ అనిపించుకున్నారు. అంకిత భావంతో విధులు నిర్వహిస్తూ సహచరుల్లో స్ఫూర్తి నింపుతూ ఎందరికో మార్గదర్శిగా మారారు. మాక్లూర్‌ మండల వ్యవసాయ శాఖ విస్తరణ అధికారిగా పనిచేస్తున్న లక్ష్మీపతి నిరుపేద కుటుంబంలో జన్మించారు. చిన్న ...

Read More »

రవి… చైతన్యఝరి

కొత్తపల్లి. మాక్లూర్‌(మాక్లూర్‌ గ్రామీణం): చిన్ననాటి నుంచి సంగీత సాధనలో మెరుగైన ప్రతిభ కనబరిచి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. సమాజంలో జరుగుతున్న సంఘటనలను ఇతివృత్తాలుగా తీసుకుని లఘుచిత్రాలు రూపొందించి పౌరుల్లో సామాజిక స్పృహకు బాటలు వేస్తున్నారు. తోలు బొమ్మల ద్వారా వినూత్నరీతిలో పాఠాలను బోధించి ప్రత్యేకతను చాటుకుంటున్నారు రవిప్రసాద్‌. మాక్లూర్‌ మండలం కొత్తపల్లి గ్రామంలో గణితశాస్త్ర ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్న రవిప్రసాద్‌ ఇరిగేషన్‌ విశ్రాంత ఉద్యోగి రాజ్‌సుందర్‌, రాజేశ్వరిల కుమారుడు. చిన్నప్పటి నుంచి సంగీతంలో ఆసక్తి పెంచుకుని సాధన చేశాడు. తండ్రి ప్రోత్సాహంతో చదువు, సంగీతం, ...

Read More »