Breaking News

nandipeta

ఎస్‌ఐ జన్మదినం సందర్బంగా వంట సామగ్రి పంపిణీ

నందిపేట్‌, మే 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ ఎస్‌ఐ శోభన్‌ బాబు జన్మదిన వేడుకల‌ను ఎంవైసి ముస్లిమ్‌ యూత్‌ కమిటీ ఆధ్వర్యంలో మండల‌ కేంద్రంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంవైసి సభ్యులు లాక్‌ డౌన్‌ సడలింపు సమయం అయిన ఉదయం 8 గంటల‌ సమయంలో కేక్‌ కట్‌ చేసి ఎస్‌ఐకి శుభాకాంక్షలు తెలిపి ఆయన చేతుల‌ మీదుగా పేద ప్రజల‌కు వంట సామగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎంవైసి నాయకులు మాట్లాడుతూ కరోన కష్టకాలంలో రాత్రనక ...

Read More »

ఆరోగ్య సర్వే పరిశీలించిన అదనపు కలెక్టర్ ల‌త

నందిపేట్‌, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల‌ మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల‌ పరిధిలో జరుగుతున్న ప్రజారోగ్యం సర్వేను జిల్లా అధికారులు పరిశీలిస్తున్నారు. ఆయా కేంద్రాల‌ పరిధిలోని వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రతి రోజు ఇంటింటికీ తిరుగుతూ ప్రజ ఆరోగ్యానికి సంబంధించిన సమస్యల‌ను తెలుసుకుంటూ, కరోన వైరస్‌పై తగిన అవగాహన కల్పిస్తున్నారు. వన్నెల్‌, సిద్దాపూర్‌ గ్రామాల్లో జరిగిన సర్వేను జిల్లా అదనపు కలెక్టర్ ల‌త మంగళవారం క్షేత్ర స్థాయిలో ఇంటింటికి వెళ్లి పరిశీలించారు. ...

Read More »

ఎమ్మెల్యేను కలిసిన పూర్వ విద్యార్థులు

నందిపేట్‌, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూత్‌పల్లి పాఠశాల పూర్వ విద్యార్థులు (1992 బ్యాచ్‌) ఆదివారం హైదరాబాద్‌ వెళ్లి ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి మండలంలోని విద్యా సమస్యలపై చర్చించారు. పూర్వ విద్యార్థులు ఇలా కలిసి మండల అభివద్ధి కొరకు ఆలోచించడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. ఎమ్మెల్యేను కలిసినవారిలో రైతు సమన్వయ సమితి మండల డైరెక్టర్‌ దొంకేశ్వర్‌ మల్లారెడ్డి, నికాల్‌పూర్‌ ఆశన్న, ఉషన్న, గంగసరం గంగిరెడ్డి, మారంపల్లి సాయిరెడ్డి, లింగ రెడ్డి తదితరులు ఉన్నారు.

Read More »

కాంగ్రెస్‌ నాయకుల ఇంటింటి ప్రచారం

నందిపేట్‌, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు ఎర్రం సుబ్బమ్‌ ముత్యం ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ మహాకూటమి అభ్యర్థి కాంగ్రెస్‌ నాయకురాలు ఆకుల లలితను చేతి గుర్తుకు ఓటువేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ, డ్వాక్రా, మహిళా సంఘాలకు 10 లక్షల ఫండ్‌, సంవత్సరానికి 6 ఉచిత గ్యాస్‌ సిలిండర్లు ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు. మండలంలో ఒక్క రెండు ...

Read More »

గణేష్‌ నిమజ్జనానికి ప్రజలు సహకరించాలి

నందిపేట్‌, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణేశ్‌ నిమజ్జనానికి ప్రజలందరు సహకరించాలని ఆర్మూర్‌ ఏసిపి అందె రాములు కోరారు. మంగళవారం నందిపేట పోలీసు స్టేషన్‌ను సందర్శించిన ఆయన స్థానిక ఎస్‌ఐ రాఘవేందర్‌తో కలిసి గణేశ్‌ మండలీల సభ్యులతో, ముస్లిం పెద్దలతో వేరువేరుగా సమావేశం నిర్వహించారు. నిమజ్జనం రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విధి విధానాలు సూచించారు. ప్రత్యేక పోలీసు బలగాలతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ప్రజలు శాంతియుతంగా నిమజ్జనం నిర్వహించి సహకరించాలని కోరారు.

Read More »

చట్టాన్ని ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదు

నందిపేట్‌, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల ప్రజలు పండుగలు శాంతియుతంగా జరుపుకోవాలని చట్టాన్ని ఉల్లంఘించరాదని నందిపేట్‌ ఎస్‌ఐ సంతోష్‌కుమార్‌ సూచించారు. పోలీసు స్టేషన్‌ ఆవరణలో వచ్చే బక్రీద్‌ పండగ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన శాంతికమిటీ సమావేశంలో మతపెద్దలను ఉద్దేశించి మాట్లాడారు. మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కుల, మతాలకు పండగలు జరుపుకొని మత సామరస్యాన్ని చాటాలని కోరారు. పండగలు స్నేహపూర్వకంగా జరిగినపుడే అందరు సంతోషంగా ఉంటారన్నారు. ఎవరూ చట్టాన్ని ఉల్లంఘించరాదని, బక్రీద్‌ సందర్భంగా గోవధ చేయొద్దని, ...

Read More »

వర్షం… రైతన్న హర్షం…

నందిపేట రూరల్‌, ఆగష్టు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా వర్షం జాడలేకపోవడంతో దిగాలుతో ఉన్న రైతన్నకు సుమారు మూడురోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో నందిపేట మండలంలోని ఆయా గ్రామాల్లో కురిసిన వర్షం కొంత ఆనందాన్ని ఇచ్చింది. వర్షాకాలం ప్రారంభంలో కొద్దిపాటి కురిసిన వర్షాలకు చాలామంది రైతులు వరినాట్లు వేసుకున్నారు. అలాగే మరికొందరు ఆరుతడి పంటలకు సిద్దమయ్యారు. జూలై మొదటి నుంచి వర్షాలు లేకపోవడంతో వరిపొలాలు బీటలు వారాయి. మొక్కజొన్న, సోయా పంటలు కూడా వాడు ...

Read More »

మణీశ్వరి తల్లిదండ్రుల ఆందోళన

నందిపేట్‌ రూరల్‌, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలో గీతా హైస్కూల్‌ ముందు మణీశ్వరి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేపట్టారు. మణీశ్వరి కిడ్నాప్‌కు గురికావడానికి పాఠశాల యాజమాన్య నిర్లక్ష్యమే కారణమని బందువులు ఆరోపిస్తు పాఠశాల ముందు బైఠాయించారు. పాపను తమకు అప్పగించే వరకు పాఠశాల ముందు నుంచి కదిలేది లేదని పట్టుబట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు కుటుంబీకులను సముదాయించారు. తమ పాపను రజిత కిడ్నాప్‌చేసి రెండ్రోజులు గడుస్తున్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం ...

Read More »

విద్యార్థి కిడ్నాప్‌

నందిపేట్‌, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రయివేటు కాన్వెంట్‌ స్కూల్లో చదివే యుకెజి విద్యార్థిని స్కూలు ఆవరణ నుండి కిడ్నాపైన సంఘటన గురువారం నందిపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… వన్నెల్‌ .కె. గ్రామానికి చెందిన మద్దె రమేశ్‌, హరిత దంపతుల కూతురు మనీశ్వరి (6) మండల కేంద్రంలోని ప్రయివేటు పాఠశాలలో యుకెజి చదువుతుంది. అయితే రమేశ్‌కు మచ్చర్ల గ్రామంలో రజిత రెండోభార్య ఉంది. రజితకు రమేశ్‌కు మద్య గత రెండుమూడురోజుల నుంచి గొడవలు జరుగుతుండడంతో భర్త మీద ...

Read More »

గురువారం మండలంలో ఎమ్మెల్యే పర్యటన

నందిపేట్‌, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి గురువారం పర్యటించనున్నారని తెరాస మండల అధ్యక్షుడు నక్కల భూమేశ్‌ తెలిపారు. మధ్యాహ్నం 2.45 గంటలకు మాయాపూర్‌లో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ చేస్తారని, 3.30 గంటలకు మండల కేంద్రంలోని ఎంపిడివో కార్యాలయంలో జరిగే షాదీముబారక్‌, కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. తర్వాత చిన్నయానం, జోర్‌పూర్‌, కౌల్‌పూర్‌ గ్రామాల్లో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణాల భూమిపూజ ...

Read More »

చురుకుగా సాగుతున్న రోడ్డు వెడల్పు పనులు

నందిపేట, జూలై 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలోని పాత పెట్రోల్‌ పంప్‌ చౌరస్తా నుంచి స్థానిక పెద్ద మసీదు వరకు గల ప్రధాన రహదారి వెడల్పు పనులు ప్రారంభమై చురుకుగా సాగుతున్నాయి. రోడ్డు మద్య నుంచి ఇరువైపులా 50 ఫీట్ల వెడల్పుతో వందఫీట్ల డబుల్‌ రోడ్డు వేయనున్నారు. రోడ్డు మద్యనుంచి 50 ఫీట్ల లోపు ఉన్న దుకాణ యజమానులకు తొలగించాలని కోరుతూ ఆర్‌అండ్‌బి అధికారులు గురువారం నోటీసులు జారీచేశారు. మెయిన్‌ రోడ్డు వెడల్పు పనులు చేపడుతుండడంతో బస్టాండ్‌ ...

Read More »

అడవిపందుల బెడద నివారించండి

నందిపేట, జూలై 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలో అడవిపందుల బెడద ఎక్కువగా ఉన్నందున రాత్రి సమయాల్లో ప్రమాదాలు సంభవిస్తున్నాయని కావున వాటి నివారణ కొరకు చర్యలు తీసుకోవాలని గురువారం మండల అభివృద్ది అదికారి నాగవర్ధన్‌కు మాయాపూర్‌ గ్రామస్తుడు సుభాష్‌గౌడ్‌ వినతి పత్రం సమర్పించారు. నందిపేట నుంచి బాద్గుణ వెళ్లే దారిలో అటవీ ప్రాంతం ఉండడం వల్ల అడవిపందుల బెడద ఉందన్నారు. రాత్రి సమయాల్లో ప్రమాదాలు సంభవించి ఇప్పటి వరకు ముగ్గురు చనిపోయారని, సుమారు 50 మందికి కాళ్లు విరిగి ఆసుపత్రి ...

Read More »

నందిపేట్‌లో 10.2 మి.మీ. వర్షపాతం

నందిపేట్‌, జూలై 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలో గడిచిన 24 గంటల్లో 10.2 మి.మీ.ల వర్షపాతం నమోదైనట్టు తహసీల్దార్‌ ఉమాకాంత్‌రావు సోమవారం తెలిపారు. గత వారంరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రైతులు హర్షం వ్యక్తం చేస్తు పొలంబాట పడుతున్నారు. మండలంలోని చెరువులు, గోదావరిలో నీరు వచ్చి చేరుతుండడంతో జలకళ సంతరించుకుంటుంది.

Read More »

వర్షాలతో వెల్లివిరుస్తున్న ఆనందం

– ముమ్మరంగా వరినాట్లు ప్రారంభం నందిపేట రూరల్‌, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత నాలుగురోజుల నుంచి నందిపేట మండలంలో కురుస్తున్న వర్షాలకు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాదిలో జూన్‌ మొదటి, రెండవ వారాల్లో కురిసిన వానలకు మండలంలోని చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నిండడంతో పాటు వాగులు, వంలు పొంగి పొర్లాయి. కానీ ఈ ఏడాది జూన్‌లో రెండు, మూడు సార్లు తేలికపాటి వర్షాలు కురిసినప్పటికి వ్యవసాయానికి అవసరమైన నీరు పంట పొలాల్లో చేరలేదు. దీంతో జూన్‌లో ...

Read More »

వివాహిత ఆత్మహత్య

నందిపేట, జూన్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలం అయిలాపూర్‌ గ్రామానికి చెందిన గోపుపద్మ (37) అనే వివాహిత బుధవారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు ఎస్‌ఐ సంతోస్‌ తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం అయిలాపూర్‌ గ్రామానికి చెందిన గోపు భూమేశ్‌ భార్య అయిన పద్మ గత కొంత కాలంగా నరాల బలహీనత వ్యాధితో బాధపడి మతిస్థిమితం కోల్పోయింది. నిజామాబాద్‌ ఆసుపత్రిలో చికిత్స చేయించినప్పటికి ఫలితం లేకపోవడంతో మనస్తాపానికి గురైన పద్మ బుధవారం ఇంట్లో చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని పేర్కొన్నారు. ...

Read More »

ఘనంగా రంజాన్‌ పండగ

నందిపేట, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలోని పలుగ్గుట్ట పక్కనగల ఈద్గాలో శనివారం ముస్లింలు రంజాన్‌ పండగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అందరు కలిసి మెలిసి సోదరభావంతో మెలగాలని మత గురువు అఫ్జల్‌ పేర్కొన్నారు. పద్మశాలి అధ్యక్షుడు భూమేశ్‌, కాంగ్రెస్‌ నాయకులు బండి నర్సాగౌడ్‌ తదితరులు ఈద్గాకు వచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

Read More »

సిఎం కెసిఆర్‌ దేశానికి ఆదర్శం

నందిపేట, మే 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఉన్నత రాష్ట్రంగా అభివృద్ది పరచాలనే ఆకాంక్షతో సిఎం కెసిఆర్‌ అహర్నిశలు కృషి చేస్తు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న గొప్ప సిఎం కెసిఆర్‌ అని ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. మండలంలోని తొండాకూర్‌, గాదేపల్లి, నికాల్‌పూర్‌, ఉమ్మెడ గ్రామాల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకంలో భాగంగా సోమవారం రైతులకు పెట్టుబడి చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల కొరకు ప్రభుత్వం పెట్టుబడి ...

Read More »

విద్యుత్‌ ప్రమాదంలో దుకాణం దగ్దం

నందిపేట, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని డొంకేశ్వర్‌ గ్రామంలో అంబేడ్కర్‌ విగ్రహం వద్దగల సంజీవ్‌కు చెందిన జిరాక్సు దుకాణం విద్యుత్‌ షాక్‌ సర్క్యూట్‌తో గురువారం ఉదయం దగ్దమైంది. ప్రమాదంలో జిరాక్సు మిషన్‌, ప్రింటర్‌, స్టేషనరీ నష్టం వాటిల్లింది. సుమారు లక్ష రూపాయల వరకు ఆస్తినష్టం జరిగిందని బాధితుడు తెలిపారు.

Read More »

పింఛన్‌ అందుతున్నవారి వివరాల సర్వే

నందిపేట, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలో బుధవారం ఇవో పిఆర్‌డి రవీశ్వర్‌గౌడ్‌ ఆద్వర్యంలో ప్రత్యేక బృందం ఇంటింటికి తిరిగి పెన్షన్‌దారుల జాబితా పరిశీలించి సరిగా పింఛన్లు అందుతున్నాయా లేదా తెలుసుకోవడానికి సర్వే చేపట్టారు.

Read More »

విత్తన దుకాణాల్లో విస్తృత తనిఖీ

నందిపేట, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యవసాయ అధికారి సాయికృష్ణ, ఎస్‌ఐ సంతోష్‌ కుమార్‌ ఆద్వర్యంలో సోమవారం రాత్రి మండలంలోని పలు గ్రామాల్లో విత్తన దుకాణాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. కౌల్‌పూర్‌ గ్రామంలో శివ సీడ్స్‌ అండ్‌ పెస్టిసైడ్‌ దుకాణంలో కాలం మించిన విత్తనాలు గుర్తించి షోకాజు నోటీసు జారీచేశారు. నకిలీ విత్తనాలు కానీ, కాలం చెల్లిన విత్తనాలు విక్రయిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Read More »