Breaking News

Nizamabad Rural

అభ్యర్థులు ప్రవర్తన నియమావళి తప్పకుండా పాటించాలి

  కామారెడ్డి, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు మాడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ప్రవర్తన నియమావళిని తప్పకుండా పాటించాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు అభిషేక్‌ కృస్ణ సూచించారు. శుక్రవారం కామారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటైన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎటువంటి సందేహాలున్నా ఉదయం 11 నుంచి 1 గంట వరకు పరిశీలకులను సంప్రదించాలని, వాట్సాప్‌, ఫోన్‌ నెంబరు ద్వారా సైతం సంప్రదించవచ్చని చెప్పారు. ఈవిఎం, వీవీప్యాట్‌ యంత్రాల రెండవ ర్యాండమైజేషన్‌లో ...

Read More »

నీలాలో పోలీసుల కవాతు

  రెంజల్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నీలా, పేపర్‌మిల్‌ గ్రామాల్లో శుక్రవారం పోలీసుల కవాతు నిర్వహించారు. గ్రామాల్లోని పలు వీధుల గుండా కవాతు నిర్వహించారు. త్వరలో జరగనున్న ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా ముందుగా ఈ ర్యాలీని బిఎస్‌ఎఫ్‌ జవాన్లతో నిర్వహించారు. ఈ కవాతులో ఏసిపి రఘు, సిఐ షకీర్‌ అలీ, ఎస్‌ఐ శంకర్‌ పాల్గొన్నారు.

Read More »

విద్యార్థులకు బహుమతుల ప్రదానం

  రెంజల్‌, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కళ్యాపూర్‌ గ్రామంలో ఫ్రెండ్స్‌ యూత్‌ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు గురువారం ఫ్రెండ్స్‌ యూత్‌ అధ్యక్షుడు నవీన్‌ బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఫ్రెండ్స్‌ యూత్‌ సభ్యులు నిఖిల్‌, ప్రవీణ్‌, సాయినాథ్‌, గంగాప్రసాద్‌ తదితరులున్నారు.

Read More »

అభివృద్దికి ఓటు వేయండి

  ఆర్మూర్‌ సభలో ఆపద్దర్మ సిఎం కెసిఆర్‌ నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్దిని చూసి ఓటు వేసి తిరిగి ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేయాలని ఆపద్దర్మ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రజల్ని కోరారు. గురువారం ఆర్మూర్‌లో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. అధికారం కోసం మాయమాటలు చెప్పే పార్టీలను నమ్మి తెలంగాణ ప్రజలు ఆగం కావద్దని, గతంలో ఉమ్మడి రాష్ట్ర పరిపాలనలో కాంగ్రెస్‌, టిడిపిలు తెలంగాణ పట్ల ...

Read More »

ఎన్నికల ప్రచారంలో భూపతిరెడ్డి దంపతులు

  నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి డాక్టర్‌ భూపతిరెడ్డి దంపతులు గురువారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గుండారం, జలాల్‌పూర్‌ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రోడ్డుషో నిర్వహించి తనను గెలిపించాలని ప్రజల్ని కోరారు. అదేవిధంగా భూపతిరెడ్డి సతీమణి వినోదిని సుద్దులం, మైలారం గ్రామాల్లో ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం కొరట్‌పల్లి, కెపి తండా గ్రామాల్లో ప్రచారంలో పాల్గొని రూరల్‌ ఎమ్మెల్యేగా భూపతిరెడ్డిని గెలిపించాలని ప్రజల్ని కోరారు.

Read More »

బిఎల్‌ఎఫ్‌ అభ్యర్థిగా నూర్జహాన్‌ నామినేషన్‌

  నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిఎల్‌ఎఫ్‌ రూరల్‌ అభ్యర్థిగా నూర్జహాన్‌ సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్బంగా బిఎల్‌ఎఫ్‌ ఆద్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిపిఎం రాష్ట్ర సీనియర్‌ నాయకుడు రాజారావు, రమ మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, సమస్యలు పరిష్కరించడంలో తెరాస పూర్తిగా విపలమైందన్నారు. తెరాస ఇచ్చిన హామీలు అమలు కాలేదని పేర్కొన్నారు. బిఎల్‌ఎఫ్‌ అభ్యర్థిగా నూర్జహాన్‌ను రూరల్‌ నుంచి గెలిపించాలని కోరారు. బిఎల్‌ఎఫ్‌ ద్వారానే ...

Read More »

సొంత గ్రామంలో పర్యటించిన ఆనంద్‌రెడ్డి

  నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ రూరల్‌ అభ్యర్థి ఆనంద్‌రెడ్డి సోమవారం తన స్వంత గ్రామమైన కేశ్‌పల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా కేశ్‌పల్లిలోని కేశవనాథ ఆలయంలో స్వామివారిని దర్శించుకొని అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. కేశ్‌పల్లి గంగారెడ్డి విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి గ్రామస్తుల కష్టసుఖాలు తెలుసుకున్నారు. రానున్న ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమన్నారు. తన సొంత గ్రామాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ది చేస్తానన్నారు. అనంతరం యువకులు నిర్వహించిన ...

Read More »

ఎన్నికల ప్రచారంలో ఆకుల లలిత బిజి బిజి

  నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఆకుల లలిత సోమవారం ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడిపారు. ఆర్మూర్‌ నియోజకవర్గంలోని పెర్కిట్‌ ఎంపిటిసి పద్మజ మోహన్‌ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అనంతరం వారితో కలిసి గ్రామంలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఎంపిటిసి నాగమణి, సాయారెడ్డి, ఎంపిటిసి సాయన్న తదితరులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. నందిపేట గ్రామంలో ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి తిరిగి రానున్న ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. ఆర్మూర్‌ ...

Read More »

నిజామాబాద్‌ రూరల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా భూపతిరెడ్డి నామినేషన్‌

  నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా డాక్టర్‌ భూపతిరెడ్డి సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం భూపతిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి రాష్ట్రంలో అధికారం చేపట్టడం ఖాయమని, రూరల్‌ నియోజకవర్గంలో తాను గెలవడం కూడా ఖాయమని ఈ సందర్భంగా అన్నారు. మహాకూటమిపై తెరాస నాయకులు అనవసర ఆరోపణలు చేస్తున్నారని, గతంలో మహాకూటమిలో తెరాస నాయకులు ఉన్న సంగతి మరిచిపోయారా అని ఆయన ప్రశ్నించారు.

Read More »

వృద్ధాశ్రమంలో దుస్తుల పంపిణీ

  కామారెడ్డి, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని తెరాస పార్టీ నాయకులు కామారెడ్డి శివారులోని వృద్దాశ్రమంలో వృద్దులకు దుస్తులు, పండ్లు పంపిణీ చేశారు. పంచముఖి హనుమాన్‌ ఆలయ కమిటీ ఛైర్మన్‌ గైని శ్రీనివాస్‌ గౌడ్‌, పార్టీ సీనియర్‌ నాయకులు జూకంటి ప్రభాకర్‌రెడ్డి ఆద్వర్యంలో వీటిని పంపిణీ చేశారు. పట్టణ తెరాస నాయకుడు సంగమేశ్వర్‌, మైనార్టీ నాయకులు షౌకత్‌ అలీ ఖాన్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు అల్పాహారం పంపిణీ చేశారు. ...

Read More »