Breaking News

Nizamabad

త‌ప్పుడు విడియోలు ప్ర‌చారం చేస్తే చ‌ట్ట‌రీత్యా చ‌ర్య‌లు

నిజామాబాద్, మే 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః సోషల్ మీడియాలో ఇటీవల నిజామాబాద్ హాస్పటల్ లో ఒక వ్యక్తిని అమానుషంగా పోలీసు వారు కొడుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంద‌ని, కానీ ఇది వాస్తవం కాద‌ని, ఎక్కడో వేరే ప్రాంతంలో తీసిన వీడియోను నిజామాబాద్‌లో జరిగినట్లుగా వ్రాస్తూ ప్రచారం చేస్తున్నార‌ని నిజామాబాద్ పోలీసు క‌మీష‌న‌ర్ కార్తికేయ ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు వీడియోలను వైరల్ చేసినట్లయితే చట్ట రీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంద‌ని, “వాట్సప్ గ్రూప్ అడ్మిన్ కి మరి ఫెస్ బుక్ ...

Read More »

ఆర్టీసీ ఉద్యోగులకు నేడే వ్యాక్సిన్

నిజామాబాద్, మే 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఆర్టీసీ ఉద్యోగులకు ఈ నెల 30న ఆదివారం కోవిడ్ వ్యాక్సిన్ వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం ఆర్టీసీ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఆర్డీవో లతో సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం జిల్లాలోని సుమారు 537 మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు వ్యాక్సినేషన్ చేయుటకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. ...

Read More »

సోమవారం నుండి కూలీలు పెరగాలి

నిజామాబాద్, మే 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్యను సోమవారం నుండి పెంచాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం సంబంధిత అధికారులతో నర్సరీలు , హరిత హారం, లేబర్ టర్నౌట్ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేశారు. ఎంపిడివో, ఎపిఓ లతో మాట్లాడుతూ లేబర్ టర్నౌట్ పెంచాలని గతములో ఆదేశించామని కాని ఆశించిన మేర కాలేదని కావున ఏపిఓలు బాధ్యతతో పని చేయాలని హెచ్చరించారు. కొన్ని మండలాల‌లో పెరిగినప్పటికి ...

Read More »

ఐదవ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష వాయిదా

హైద‌రాబాద్‌, మే 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బిసి, సాధారణ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో (2021 – 22) ప్రవేశానికి గాను 30.05.2021 జరిగే రాత పరీక్ష వాయిదా వేయడం జరిగిందని గురుకుల సెట్ కన్వీనర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తెలిపారు. తదుపరి తేదీ ఎప్పుడు నిర్వహిస్తామనేది ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తెలియజేస్తామని చెప్పారు.

Read More »

వానాకాలం సాగుకు అన్ని ఏర్పాట్లు చేసుకోండి

నిజామాబాద్‌, మే 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జూన్ మొదటి వారంలో వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున రైతులు వానకాలం పంటల సాగుకు ఏర్పాట్లు చేసుకుంటారని అందుకు అనుగుణంగా విత్తనాలు, ఎరువులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం వ్యవసాయ, మార్కుఫెడ్ , సహకార, ఇతర అధికారులతో వానాకాలం సాగుపై సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంచనాలు, లక్ష్యాలకు అనుగుణంగా జిల్లాలో ఎంత ...

Read More »

వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

నిజామాబాద్‌, మే 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః స్థానిక గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో కొనసాగుతున్న సూపర్ స్ప్రెడర్ల కొరకు ఏర్పాటుచేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పర్యటించి పరిశీలించారు. ఆయన శనివారం చంద్రశేఖర్ నగర్ కాలనీ, దుబ్బ యుపిహెచ్సి పరిధిలోని వారి కొరకు ప్రభుత్వ గిరిరాజ్ కళాశాలలో ఏర్పాటుచేసిన కేంద్రంలో వ్యాక్సినేషన్ తీరును ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చూడాలని అన్ని ప్రణాళిక ప్రకారం నిర్వహించాలని డాక్టర్లను సిబ్బందిని నిర్వాహకులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ...

Read More »

నిజామాబాద్ లో బ్లాక్ ఫంగస్‌కు చికిత్స,

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాలో కరోనా వైరస్ తగ్గుతూ వస్తున్నదని, బ్లాక్ ఫంగస్ కు నిజామాబాద్ లోనే చికిత్స చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని, 6 వేల మంది సూపర్ స్పైడర్ లకు 28, 29 తేదీలలో వ్యాక్సిన్ వేస్తున్నామని, కోవిడ్ విషయములో ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. గురువారం కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, కమిషనర్ ఆఫ్ ...

Read More »

కామ్రేడ్ జనార్దన్ కు విప్లవ జోహార్లు

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః సీపీఐ (ఎం.ఎల్)న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ జనార్దన్ సంతాప సభ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎన్.ఆర్ భవన్, కోటగల్లీలో జరిగింది. పార్టీ శ్రేణులు కామ్రేడ్ జనార్దన్ చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు వి.ప్రభాకర్ మాట్లాడుతూ 35 సంవత్సరాలుగా పీడిత ప్రజల కోసం విప్లవోద్యమంలో పనిచేసిన కామ్రేడ్ జనార్దన్ కమ్యూనిస్టు శ్రేణులకు ఆదర్శప్రాయుడన్నారు. కామ్రేడ్ జనార్దన్ సూర్యాపేట ఉమ్మడి నల్గొండ జిల్లా నివాసి అన్నారు. ప్రజలందరూ త‌న‌ను ...

Read More »

విద్యాశాఖా మంత్రిని మ‌ర్యాద పూర్వ‌కంగా కలిసిన టీయూ వీసీ

డిచ్‌ప‌ల్లి, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖా మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి ని తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ మర్యాద పూర్వకంగా హైదరాబాద్ లోని ఆమె చాంబర్ లో కలిసి పుష్పగుచ్చం అంద‌జేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయానికి నాల్గవ రెగ్యూలర్ నూతన ఉపకులపతిగా ఆచార్య డి. రవీందర్ గత శనివారం నియమింపబడిన విషయం విదితమే. ఈ సందర్భంగా వీసీ గురువారం ఉదయం విద్యాశాఖామంత్రి ని మర్యాద పూర్వకంగా కలిశారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి నూతనంగా నియమితులైన ...

Read More »

సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సిన్ కొరకు 18 కేంద్రాలు

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఈనెల 28, 29 తేదీలలో సూపర్ స్ప్రెడర్లకు అందించే వ్యాక్సింగ్ కొరకు అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సివిల్ సప్లై వ్యవసాయ సమాచార పౌర సంబంధాలు వైద్య ఆరోగ్య శాఖ, నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్, ఆర్డివోలు తదితర అధికారులతో ప్రత్యేక వ్యాక్సినేషన్ పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొరకు 28, 29 తేదీలలో 50 ...

Read More »

నిర్జీవంగా ఉన్న దేశాన్ని అభివృద్దివైపు తీసుకెళ్ళారు…

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః గురువారం పండిత్ జవహర్ లాల్ నెహ్రు వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నెహ్రూ చిత్రపటానికి పూలమాలవేసి అదేవిధంగా నెహ్రూ పార్క్ లోని నెహ్రూ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఇన్చార్జి తాహెర్బిన్ హందాన్, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు పాల్గొని నెహ్రూకి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ ...

Read More »

అంబులెన్స్ ప్రారంభం

నిజామాబాద్‌, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఎన్ఆర్ఐ దాతలు డొనేట్ చేసిన అంబులెన్్స‌ను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రారంభించారు. నిర్మాణం ఇండియా తరఫున నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పటాలోళ్ల మోహన్ రెడ్డి, పడిగెల రాజు ఇతర ఎన్ఆర్ఐల‌ డొనేషన్ తో ప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్్స‌ను డొనేట్ చేశారు. బుధవారం నాడు కలెక్టర్ ఛాంబర్ వద్ద అంబులెన్్స‌ను కలెక్టర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అంబులెన్్స‌ అందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సంబంధిత ప్రతినిధులు ...

Read More »

28, 29 తేదీల్లో సూపర్ స్పైడర్స్ కు వ్యాక్సినేషన్

నిజామాబాద్‌, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః రేషన్ షాప్ డీలర్లు, ఎల్‌పిజి డిస్ట్రిబ్యూటర్లు, పెట్రోల్ బంకులు, ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్, సీడ్స్ డీలర్స్, వాటిలో పని చేసేవారు, జర్నలిస్టులకు ఈ నెల 28, 29 తేదీలలో వ్యాక్సినేషన్ కొరకు జాబితాలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన సంబంధిత అధికారులతో సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం రేషన్ షాపు డీలర్లు వాటిల్లో పనిచేసే సహాయకులు ...

Read More »

రాజ్యసభ సభ్యులు సురేశ్‌రెడ్డి మొక్కలు నాటారు…

హైదరాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటడం జరిగిందని రాజ్య సభ సభ్యులు కే. ఆర్‌. సురేశ్‌ రెడ్డి పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌ కుమార్ పిలుపుమేరకు మంగళవారం తన పుట్టినరోజును పురస్కరించుకుని రాజ్య సభ సభ్యులు సురేష్‌ రెడ్డి బంజారా హిల్స్‌లోని తన నివాసంలో గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా వారి మనవరాళ్లతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎం.పీ మాట్లాడుతూ పచ్చదనం పెంచడం ...

Read More »

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ క్లబ్‌ విధులు ప్రశంసనీయంగా ఉన్నాయని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి అభినందించారు. రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి అన్ని సదుపాయాల‌తో 15 స్ట్రెచర్‌ బెడ్స్‌ విరాళంగా అందజేశారు. కలెక్టర్‌ చాంబర్‌ ముందు మంగళవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రోటరీ క్లబ్‌ ప్రతినిధులు కలెక్టర్‌కు అందించి ప్రారంభింపజేశారు. అందుకు కలెక్టర్‌ సంతోషం వ్యక్తం చేస్తూ కరోనా ఆపద సమయంలో స్వచ్చంద సంస్థలు ఎన్నో ...

Read More »

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు మందులు ఇస్తున్నారా మీ ఆరోగ్య విషయాలు పర్యవేక్షణ చేస్తున్నారా అని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి కరోనా వచ్చిన పేషంట్‌ల‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. డోర్‌ టు డోర్‌ సర్వే ద్వారా కరోనా ల‌క్షణాలు ఉన్న 12 మందికి ఆయన మంగళవారం కలెక్టరేట్‌లోని కోవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుండి మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. డోర్‌ టు డోర్‌ సర్వే రెండు విడతల్లో ఆశా ...

Read More »

మొబైల్‌ కూరగాయల‌ వాహనాలు ప్రారంభం

నిజామాబాద్‌, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొనసాగుతున్న లాక్‌ డౌన్‌ ను ద ృష్టిలో పెట్టుకొని నగర ప్రజల‌కు ఇంటి వద్దకే కూరగాయలు అందించడానికి 13 మొబైల్‌ కూరగాయల‌ వాహనాల‌ను ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం నుండి వాహనాలు నగరంలోని గంగాస్థాన్‌, వినాయక నగర్‌, మాధవ నగర్‌, కాలూరు, గుండారం, ముబారక్‌ నగర్‌, అశోక్‌ నగర్‌, సుభాష్‌ నగర్‌, బోర్గాం తదితర ప్రాంతాల్లో ప్రజల‌కు కావల‌సిన వివిధ రకాల‌ కూరగాయల‌తో తిరుగుతాయని తెలిపారు. ...

Read More »

హెల్త్‌ సెంటర్‌ సిబ్బందికి పండ్లు పంపిణీ చేసిన మేయర్‌

నిజామాబాద్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ చంద్రశేఖర్ కాల‌నీ, అర్సపల్లి, మాల‌పల్లి, ఇంద్రపూర్‌లో విధులు నిర్వహిస్తున్న ఆశా కార్యకర్తలు, నర్సులు, స్టాఫ్‌ నర్సు, ఫార్మాసిస్ట్లు, ఇతర సిబ్బందికి నగర మేయర్‌ నీతూ కిరణ్‌ పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ గత సంవత్సర కాలం నుంచి కరోనా వ్యాధి విజ ృంభిస్తున్న, లాక్‌ డౌన్‌ పరిస్థితుల్లో ప్రజలందరు ఇళ్లకే పరిమితమైన, వైరస్‌ బారినపడే ప్రమాదం ఉన్న ఎక్కడ భయపడకుండా ఇంటికి తిరుగుతూ ...

Read More »

ఆసుపత్రుల‌లో పారిశుద్ధ్యం, హరితహారం కార్యక్రమాలు ప్రత్యేకంగా నిర్వహించాలి

నిజామాబాద్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లాక్‌ డౌన్‌ కఠినంగా అమలు చేయాల‌ని రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా క్లారిటీ ఇచ్చారని దానితోపాటు ఆసుపత్రుల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు ఖచ్చితంగా నిర్వహించాల‌ని, లేబర్‌ టర్న్‌ అవుట్‌ పెంచుకోవడంతో పాటు నర్సరీలో మొక్కల‌ను కాపాడాల‌ని హరిత హారంలో నాటిన మొక్కల‌ను బతికించడానికి ప్రతిరోజు నీటిని అందించాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి మండల‌ స్థాయి గ్రామస్థాయి అదేవిధంగా మండల‌ ప్రత్యేక అధికారుల‌ను ఆదేశించారు. శనివారం వీడియో కాన్ఫరెన్సులో లాక్‌ డౌన్‌ను కఠినంగా అమలు చేయటకు ...

Read More »

రద్దీని తగ్గించడానికి మరిన్ని చర్యలు

నిజామాబాద్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లాక్‌ డౌన్‌ సడలింపు సమయంలో ప్రజల‌ రద్దీని తగ్గించడానికి మరిన్ని చర్యలు చేపట్టాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. శనివారం తన చాంబర్లో పోలీస్‌ కమీషనర్‌ కార్తికేయ, మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ అదనపు కలెక్టర్‌ చంద్ర శేఖర్‌తో కల‌సి లాక్‌ డౌన్‌ను కఠినంగా అమలు చేయటకు తీసుకోవాల్సిన చర్యల‌పై చర్చించారు. జిల్లాలో ఇప్పుడిప్పుడే వైరస్‌ తగ్గు ముఖం పడుతున్నదని కావున ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాల‌ని రద్దీ అధికంగా ...

Read More »