Breaking News

Nizamabad

ఈనెల‌ 12 నుండి 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ పాలియేటివ్‌ కేర్‌ ప్రోగ్రాం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నిజామబాద్‌లో అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పని చేయటానికి ఫిజిషియన్‌ / మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టు ఖాళీలు (1) ఉన్నట్టు జిల్లా వైద్యా ఆరోగ్య శాఖాధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు విద్యార్హత : ఎం.డి. జనరల్‌ మెడిసిన్‌ లేదా ఎం.బి.బి.ఎస్‌. మరియు పాలియేటివ్‌ సర్టిఫికెట్‌ కోర్సు కలిగి తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ నందు రిజిష్టర్‌ చేయబడి ఉండాల‌న్నారు. హానరోరియం ...

Read More »

స్పీకర్‌కు మంత్రి జన్మదిన శుభాకాంక్షలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి 73వ జన్మధినం సందర్భంగా రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాల‌ శాఖ మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. స్పీకర్‌ అధికార నివాసంలో మంత్రి వేముల‌ స్పీకర్‌కి పుష్ప గుచ్చం అందించారు. ఈ సందర్భంగా స్పీకర్‌ కుటుంబ సభ్యుల‌తో కలిసి కేక్‌ కటింగ్‌ కార్యక్రమంలో మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి పాల్గొన్నారు. ఎంఎల్‌సి వీజీ గౌడ్‌, శాసనసభ కార్యదర్శి డా. వి. నరసింహా ...

Read More »

కార్మికుల‌ వేతనాలు పెంచాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మున్సిపల్‌ కార్మికులందరికీ వెంటనే వేతనాలు పెంచాల‌ని, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌, ఎన్‌.ఎం.ఆర్‌ కార్మికులందరినీ పర్మినెంట్‌ చేయాల‌ని తదితర డిమాండ్లతో తెలంగాణ ప్రగతిశీల‌ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఐఎఫ్‌టియు) ఆధ్వర్యంలో నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాల‌యం ముందు ధర్నా నిర్వహించి ఎం.హెచ్‌.వోకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్‌టియు రాష్ట్ర అధ్యక్షుడు వనమాల‌ కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో సుమారు 40 వేల‌ మంది కార్మికులు పనిచేస్తున్నారని, వీరందరికీ వేతనాలు పెంచాల్సి వున్నా, ...

Read More »

గిరిరాజ్‌ కళాశాల‌లో అతిథి అధ్యాపక పోస్టులు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కళాశాల‌ విద్యాశాఖ ఆదేశాల‌ మేరకు గిరిరాజ్‌ ప్రభుత్వ కళాశాల‌ నిజామాబాద్‌లో అతిథి అధ్యాపకుల‌ పోస్టుల‌కు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాల‌ని కళాశాల‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్ ఇ.ల‌క్ష్మినారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. యుజిలో బయోటెక్నాల‌జి‌, కంప్యూటర్‌ సైన్స్‌ / అప్లికేషన్స్‌, ఇంగ్లీష్‌, తెలుగు, పొలిటికల్‌ సైన్స్‌, స్టాటిస్టిక్స్‌ సబ్జెక్టుల్లో అతిథి అధ్యాపకుల‌ కోసం ఈనెల‌ 12వ తేదీ సాయంత్రం 5 గంటల‌ లోపు దరఖాస్తు చేసుకోవాల‌న్నారు. అదేవిధంగా 13వ తేదీ కళాశాల‌లో ఉదయం 10 ...

Read More »

గ్రామపంచాయతీలో వెయ్యి మొక్కలు నాటాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల‌ 17న ప్రతి గ్రామపంచాయతీలో వెయ్యి మొక్కల చొప్పున నాటడానికి అన్ని చర్యలు తీసుకోవాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ నుండి సంబంధిత అధికారుల‌తో సెల్‌ కాన్ఫరెన్సు ద్వారా మొక్కలు నాటే కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేసిన ప్రకారం అన్ని గ్రామ పంచాయతీల‌లో వెయ్యి చొప్పున నాటించడానికి అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశించారు. మొక్కలు నాటడమే ...

Read More »

గార్డెన్‌ సమస్యల‌పై వాకబు చేసిన మేయర్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని తిల‌క్‌ గార్డెన్‌ను నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ సందర్శించి ప్రతి రోజు వాకింగ్‌కు వచ్చే వారితో కలియ తిరుగుతూ అక్కడ ఉన్న వారి సమస్యల‌పై వాకబు చేశారు. చాలా మట్టుకు సమస్యల‌ను మున్సిపల్‌ వారు పరిష్కరించ్చారని వాకర్స్‌ తెలిపారు. అక్కడే ఉన్న ఓపెన్‌ జిమ్‌లో వ్యాయామం చేస్తున్న ప్రజల‌తో మేయర్‌ మాట్లాడుతూ ఓపెన్‌ జిమ్‌ ఎలా ఉందని అడిగారు. ప్రజలు స్పందిస్తూ చాలా బాగుందని అందరికి సౌకర్యంగా ఉన్నదని తెలుపుతూ ...

Read More »

స్కూలు, కాలేజీ ఫీజుల్లో 50 శాతం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్కూలు, కాలేజీ ఫీజుల్లో 50 శాతం, హాస్టల్‌ వసతి ఉన్నన్ని రోజుల‌కే హాస్టల్‌ ఫీజు ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యా సంస్థలు వసూలు చేయాల‌ని డిమాండ్‌ చేస్తూ పిడిఎస్‌యు ఆధ్వర్యంలో సోమవారం నిజామాబాద్‌ కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించి, అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షురాలు సిహెచ్ క‌ల్ప‌న మాట్లాడుతూ విద్యా సంస్థలు ప్రారంభం కావడంతో లాభార్జనే ధ్యేయంగా ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యా సంస్థలు ఫీజు వసూళ్లకు ...

Read More »

మెడికల్‌ కళాశాల‌లో కాంట్రాక్టు పోస్టులు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ప్రభుత్వ మెడికల్‌ కళాశాల‌ / ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్‌, నిజామాబాద్‌లో సీనియర్‌ రెసిడెంట్‌, జూనియర్‌ రెసిడెంట్‌ వైద్యుల‌ పోస్టుల‌ను భర్తీ చేయటానికి కాంట్రక్ట్‌ పద్ధతిలో ఒక సంవత్సర కాల‌ము నియమించుటకు వైద్య విద్య సంచాల‌కులు తెలంగాణ, హైదరాబాద్‌ అనుమతి ఇచ్చినట్టు మెడికల్‌ కళాశాల‌ ప్రధానాచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల‌వారు ఈనెల‌ 9వ తేదీ నుంచి 16 వరకు దరఖాస్తుల‌ను ప్రధాన ఆచార్యులు, ప్రభుత్వ మెడికల్‌ కళాశాల‌ కార్యాల‌యములో అందజేయాల‌ని ...

Read More »

9న జాబ్‌మేళా

నిజామాబాద్‌, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని నిరుద్యోగుల‌కు ఈనెల‌ 9వ తేదీ జిల్లా ఉపాధి కార్యాల‌యములో జాబ్‌ మేళా జరుగుతుందని, ఇట్టి జాబ్‌ మేళాకు హైదరాబాద్‌ నుండి శ్రీ విజయ బయో ఫెర్టిలైజర్స్‌ వారు నిజామాబాద్‌ జిల్లాలో 80 సెల్స్‌ రిప్రజంటివ్‌ కోసం ఎంపిక నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి అధికారి యస్‌. శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్హతలు ఇంటర్‌ ఆ పైన, వయోపరిమితి 18 నుండి 35 సంవత్సరాల‌ వరకు, వేతనము 9 వేల‌ 100 రూపాయలు ...

Read More »

ఫుట్‌ బాల్‌ కు కేరాఫ్‌ అడ్రస్‌ కేర్‌ ఫుట్‌బాల్‌ అకాడమీ

నిజామాబాద్‌, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేర్‌ ఫుట్‌బాల్‌ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్‌ 13 కేర్‌ ఫుట్‌బాల్‌ అకాడమీ ప్రీమియర్‌ లీగ్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ముఖ్యఅతిథిగా అడిషనల్‌ డిసిపి అరవింద్‌ బాబు పాల్గొని ఫుట్‌బాల్‌ ఆట ప్రోత్సహిస్తున్న కేర్‌ ఫుట్‌బాల్‌ అకాడమి నిర్వాహకుల‌ను అభినందించారు. ముఖ్యంగా కోచ్‌ నాగరాజు తన జీవితాన్ని మొత్తం ఫుట్‌బాల్‌కు అంకితం చేసి ఫుట్‌బాల్‌ ప్లేయర్ ల‌ను తయారు చేయడం గొప్ప విషయమని కొనియాడారు. ఆటలు ఆడిన ప్రతి ఒక్కరు జీవితంలో విజయం సాధించారని ...

Read More »

దరఖాస్తుల‌ ఆహ్వానం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాంఘిక సంక్షేమ గురుకుల‌ పాఠశాల‌లు / కళాశాల‌ల్లో పార్ట్‌ టైం ప్రాదిపదికన బోధనకు అర్హులైన అభ్యర్థుల‌ నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రాంతీయ సమన్వయాధికారిణి అలివేలు ఒక ప్రకటనలో తెలిపారు. అధ్యాపక ఖాళీల్లో తెలుగు-2, ఆంగ్లం-1, ఫిజిక్స్‌-1, సివిక్స్‌-1, ఉపాధ్యాయుల‌ ఖాళీల్లో పీజీటీ తెలుగు-1, ఆంగ్లం-4, గణితం-4, ఫిజికల్‌ సైన్స్‌-1 ఖాళీలు ఉన్నాయన్నారు. అధ్యాపకుల‌కు నెల‌కు వేతనం రూ.18 వేలు, ఉపాధ్యాయుల‌కు రూ.14 వేలు చెల్లిస్తారన్నారు. అభ్యర్థుల‌ పూర్తి బయోడెటా, విద్యార్హత జిరాక్సు ప్రతుల‌ను ...

Read More »

అభివృద్ధి పనుల‌కు మేయర్‌ భూమిపూజ

నిజామాబాద్‌, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం నగరంలోని 14,13,30,31,54 డివిజన్లలో సుమారు 58 ల‌క్షల‌ రూపాయల‌ నిధుల‌తో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల‌కు నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ శేఖర్‌ భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ ఇద్రిస్‌ ఖాన్‌, ఎంఐఎం ఫ్లోర్‌ లీడర్‌ షకీల్‌, డివిజన్ల కార్పొరేటర్లు హరూన్‌, సలీం, మున్సిపల్‌ ఇంజినీర్లు ముస్తాక్‌ అహ్మద్‌, శంకర్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

8 నుండి గొర్రెలు, మేకల‌కు టీకాలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఫిబ్రవరి 8వ తేదీ నుండి 20 వ తేదీ వరకు పశువైద్య మరియు పశు సంవర్దకశాఖ ఆద్వర్యంలో జిల్లాలో 66 శాతం గొర్రెలు, మేకల‌కు ఉచితంగా పిపిఆర్‌ టీకాలు ఇవ్వనున్నట్టు జిల్లా పశు వైద్య మరియు పశు సంవర్ధకశాఖ అధికారి డాక్టర్‌ యం.భరత్‌ తెలిపారు. టీకాలు జిల్లాలోని గొర్రెలు, మేకల‌ పెంపకం దారులు సద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు.

Read More »

8న ఎన్‌ఎస్‌యుఐ మహాసభ

నిజామాబాద్‌, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల‌ 8వ తేదీ సోమవారం నిజామాబాద్‌ నగరంలోని నూతన అంబేడ్కర్‌ భవన్‌లో ఎన్‌.ఎస్‌.యు.ఐ మహాసభ నిర్వహించనున్నామని, కార్యక్రమానికి ఎన్‌.ఎస్‌.యు.ఐ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్‌ నవీద్‌ ఖాన్‌, రాష్ట్ర అధ్యక్షుడు బ‌ల్మూర్‌ వెంకట్‌ హాజరవుతున్నారని ఎన్‌.ఎస్‌.యు.ఐ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు వరద బట్టు వేణురాజ్‌ అన్నారు. ఈ మేరకు శనివారం నిజామాబాద్‌ కాంగ్రెస్‌ భవన్‌లో విలేకరుల‌తో మాట్లాడారు. మహాసభకు ఎన్‌.ఎస్‌.యు.ఐ నాయకులు, కార్యకర్తలు మరియు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల‌ని ...

Read More »

రైతాంగ ఉద్యమంపై ప్రభుత్వ నిర్బంధ చర్యలు నశించాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోడీ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక వ్యవసాయ చట్టాల‌ను రద్దు చేయాల‌ని డిమాండ్‌ చేస్తూ శనివారం ఏఐకెఎస్‌సిసి దేశవ్యాప్త పిలుపు మేరకు రహదారుల‌ దిగ్బంధనం కార్యక్రమంలో భాగంగా రైతు సంఘాల‌ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో బోర్గాం (పి) చౌరస్తా, నిజామాబాద్‌ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐకెఎంఎస్‌ రాష్ట్ర కార్యదర్శి వి.ప్రభాకర్‌, కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులు తాహెర్‌ బిన్‌ హందాన్‌, ఏఐకెఎస్‌ జిల్లా భాద్యులు పెద్ది వెంకట్రాములు, సీపీఐ జిల్లా కార్యదర్శి ...

Read More »

క్రీడాకారుల‌ను ప్రోత్సహించాల‌నే వాలీబాల్‌ టోర్నమెంట్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఉద్యమ నాయకుడు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు క‌ల్వ‌కుంట్ల కవిత ఆధ్వర్యంలో ఈనెల‌ 9, 10 తేదీల‌లో పురుషుల‌ ఓపెన్‌ జిల్లా స్థాయి వాలీబాల్‌ టోర్నమెంట్‌ నిర్వహిస్తున్నామని జాగృతి రాష్ట్ర కార్యదర్శి నరాల‌ సుధాకర్‌ తెలిపారు. శనివారం కలెక్టర్‌ గ్రౌండ్‌లో పోస్టర్‌ ఆవిష్కరించి మాట్లాడారు. జాగృతి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు, సేవ కార్యక్రమాలే కాక, క్రీడకారుల‌ను ప్రోత్సహించాల‌నే ఉద్దేశ్యంతో రాష్ట్రంలోని 33 జిల్లాలో ...

Read More »

15వ తేదీకి చివరి గడువు పొడిగింపు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలోని దివ్యాంగుల‌కు సహాయ ఉపకరణములు అందించటానికి వెబ్‌ సైట్‌ నందు జనవరి 25 నుంచి ఫిబ్రవరి 6వ తేదీ లోపు సంబందిత అన్ని ద్రువపత్రముల‌తో దరఖాస్తు చేసుకోవాల‌ని ఇదివరకు పత్రికా ప్రకటన జారీచేసినట్టు మహిళ, శిశు, దివ్యాంగుల‌ మరియు వయో వృద్ధుల‌ శాఖ జిల్లా సంక్షేమ అధికారి ఝాన్సీ ల‌క్ష్మీ ఒక ప్రకటనలో తెలిపారు. కానీ ప్రభుత్వ ఆదేశానుసారము ఇట్టి దరఖాస్తుల‌ స్వీకరణ చివరి తేదిని ఫిబ్రవరి 6 నుంచి 15వ ...

Read More »

ఎంపి అర్వింద్‌ చిత్రపటానికి పాలాభిషేకం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం నగరంలోని ఏడో డివిజన్‌ బీజేపీ కార్పొరేటర్‌ మధు ఆధ్వర్యంలో పసుపు రైతుల‌కు మద్దతు ధర ప్రకటించినందుకు పార్లమెంట్‌ సభ్యులు ధర్మపురి అరవింద్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్‌ మాట్లాడుతూ కేంద్రం ఇచ్చిన పసుపు ధర మద్దతు ఎక్కడలేని విధంగా ఏడు వేల‌ ఒక వంద రూపాయలు ధర ప్రకటించినందుకు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, నరేంద్ర మోడీ ప్రభుత్వంలో యువత మరియు రైతులు చాలా సంతోష పడుతున్నారని అన్నారు. ...

Read More »

నెహ్రూ యువ కేంద్ర వాలంటీర్ల నియామకం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నెహ్రూ యువ కేంద్ర సంఘటన్‌ నూతన ఆర్థిక సంవత్సరం 1 ఏప్రిల్‌ 2021 నుండి రాబోయే ఏడాది కోసం నూతన వాలంటీర్ల నియామకం చేపడుతుందని, జిల్లా స్థాయిలో ఇంటర్వ్యూ ద్వారా వాలంటీర్లను ఎంపిక చేయడం జరుగుతుందని జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాలంటీర్లకు నెల‌కి 5 వేల‌ రూపాయల‌ గౌరవ వేతనం ఇవ్వడం జరుగుతుందన్నారు. అర్హతలు : 1. కనీస విద్యార్హత 10వతరగతి పాసై ఉండాలి. 2. ...

Read More »

7న ఆధ్యాత్మిక చింతన మౌన శిబిరం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇందూరు ఆర్యసమాజము ఆధ్వర్యంలో 7వ తేదీ ఆదివారం ఆధ్యాత్మిక చింతన మౌన శిబిరం నిర్వహించనున్నట్టు నిర్వాహకులు ఒకప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 6 నుండి రాత్రి 8 గంటల‌ వరకు యోగ, ధ్యానం, సంధ్య, యజ్ఞం, ఆధ్యాత్మిక చింతన ప్రవచనములు, ఆధ్యాత్మిక చింతన మననం తదితర కార్యక్రమాలు ఉంటాయన్నారు. sa శిబిరంలో పాల్గొనదచిన వారు పూర్తిగా మౌనం పాటించాల‌ని, అప్పుడే దివ్యమైన అనుభూతిని పొందగలుగుతారన్నారు. అలాగే సెల్‌ఫోన్‌ రోజంతా స్విచ్‌ ఆఫ్‌ చేయాల్సి ఉంటుందన్నారు. ...

Read More »