Breaking News

Nizamabad

సీఎంఆర్‌ బియ్యం వెంటనే వచ్చేలా చూడండి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వానకాలం సీజన్‌కు సంబంధించి రైస్‌ మిల్లుల నుండి రావలసిన సిఎంఆర్‌ రైస్‌ వెంటనే పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సెల్‌ కాన్ఫరెన్సు ద్వారా సంబంధిత అధికారులతో ధాన్యం సేకరణ, రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణం పనుల పురోభివద్ధి, పల్లె ప్రగతి వివరాలు తదితర కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ధాన్యం సేకరణకు సంబంధించి ఇప్పటివరకు ఐదున్నర లక్షల ...

Read More »

ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు రుణాలు మంజూరు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టీఎస్‌ ఐపాస్‌ అండ్‌ డిస్టిక్‌ ఇండస్ట్రీస్‌ ప్రమోషన్‌ కమిటీపై జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో టీఎస్‌ ఐ-పాస్‌, డిస్ట్రిక్‌ ఇండస్ట్రీస్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ సమీక్ష సందర్భంగా అధికారులతో మాట్లాడారు. టీఎస్‌ ఐపాస్‌ క్రింద మంజూరు చేసిన పెట్టుబడి సబ్సిడీ కింద 8 ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు సబ్సిడీ కింద రవాణా రంగంలో ట్రాక్టర్స్‌, ట్రావెల్‌ వెహికల్స్‌ 8 మంజూరీ చేయడం ...

Read More »

అంబానీ, ఆదాని వస్తువులు బహిష్కరించండి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్పోరేట్‌ సంస్థలైన రిలయన్స్‌ ముఖేష్‌ అంబానీ, ఆధాని లాంటి గుత్త పెట్టుబడిదారుల వస్తువులను బహిష్కరించాలని ఏఐకెఎమ్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి వి ప్రభాకర్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి పి రామకష్ణ పిలుపునిచ్చారు. ఆదివారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో రిలయన్స్‌ షోరూం ముందు జరిగిన ధర్నానుద్దేశించి ప్రభాకర్‌, రామకష్ణ మాట్లాడారు. దేశ సంపదనంతా దోచి కార్పొరేట్లకు, బడా పెట్టుబడిదారులకు తాకట్టు పెట్టే 3 చట్టాలను, విద్యుత్‌ సవరణ బిల్లును రద్దు చేయాలని గత 17 రోజులుగా ...

Read More »

16న ‘కట్టడి’ ఆవిష్కరణ

నిజామాబాద్‌, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రముఖ కవి, రచయిత డాక్టర్‌ కాసర్ల నరేష్‌ రావు రచించిన కరోనా కవితా సంపుటి ‘కట్టడి’ పుస్తకాన్ని 16న ఆవిష్కరించనున్నట్లు హరిదా రచయితల సంఘం అధ్యక్షుడు ఘనపురం దేవేందర్‌ తెలిపారు. నగరంలోని కేర్‌ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో పుస్తకావిష్కరణ కార్యక్రమం ఉంటుందని కవులు, రచయితలు హాజరు కావాలని కోరారు.

Read More »

లక్ష్యానికంటే అదనంగా సిద్దం చేసుకోవాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరిత హారంలో వచ్చే సంవత్సరాన్ని దష్టిలో పెట్టుకొని నర్సరీలను పెంచుటకు ప్లాన్‌ చేసుకోవాలని పంచాయతీ రాజ్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సందీప్‌ కుమార్‌ సుల్తానియా కలెక్టర్లకు సూచించారు. శనివారం హైదరాబాద్‌ నుండి చీఫ్‌ కంజర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌, సీఎంఓ ఓఎస్‌డి ప్రియాంక వర్గీస్‌తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో హరితహారంపై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 50 శాతం మొక్కలను అదనంగా సిద్ధం చేసుకోవాలని, తద్వారా మొక్కలను కొనే ...

Read More »

టు బిహెచ్‌కె స్టేటస్‌ తెలపండి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం ఏ స్థితిలో ఉన్నాయో వివరాలు అందించాలని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సంబంధిత అధికారులతో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి వాటి ప్రోగ్రెస్‌ పై సెల్‌ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ద్వారా జిల్లాకు కేటాయించిన ఇండ్ల సంఖ్య, వాటికి గాను ఎన్నింటికి మంజూరు చేయడం జరిగిందో, ...

Read More »

12న జాతీయ లోక్‌ అదాలత్‌

నిజామాబాద్‌, డిసెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 12న రెండవ శనివారం జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నామని, అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మరియు ప్రిన్సిపల్‌ జడ్జి సాయి రమాదేవి కోరారు. గురువారం జిల్లా న్యాయ సేవ సర్వీసెస్‌ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. సుప్రీం కోర్ట్‌, హైకోర్టు ఆదేశాలను అనుసరించి జాతీయ లోక్‌ అదాలత్‌ ఈ నెల 12న రెండవ శనివారం నిర్వహిస్తున్నామని, 11800 కేసులకు గాను లోక్‌ అదాలత్‌ ద్వారా ...

Read More »

మహిళలు ఆర్థికంగా ఎదిగేలా చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ఇంకా ఎస్‌హెచ్‌జి గ్రూపులలో చేరకుండా ఉన్న మహిళలను గుర్తించి వారిని సభ్యులుగా చేర్చి రుణాలు అందించి ఆర్థికంగా ఎదిగిన విధంగా చర్యలు తీసుకోవాలని డిఆర్‌డిఎ అధికారులను జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి ఆదేశించారు. గురువారం సంబంధిత అధికారులతో సెల్‌ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలో మరో లక్షకి పైగా మహిళలు సెల్ఫ్‌హెల్ప్‌ గ్రూప్‌లలో చేరడానికి అవకాశం ఉందని, వారందరినీ గుర్తించి గ్రూపులలో సభ్యులుగా చేర్పించి ...

Read More »

ఉపాధి హామీలో కొనసాగుతున్న పనులన్నీ పక్కాగా జరగాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో నిర్వహిస్తున్న పనులన్నీ పక్కాగా జరిగేలా చూడాలని, గ్రామ కార్యదర్శులు అన్ని రకాల పనులను పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సెల్‌ కాన్ఫరెన్సు ద్వారా మండల ప్రత్యేక అధికారులు ఎంపీడీవోలు, ఏపీఓలు, డిఆర్‌డిఓ ఇతర అధికారులతో పలు అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ కార్యదర్శులు అర్ధ భాగం విధులు పంచాయతీలకు సంబంధించి ...

Read More »

ఎరువుల సరఫరాకు చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వచ్చే యాసంగి సీజన్‌ అవసరమైన ఎరువుల సరఫరాకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రశేఖర్‌ అన్నారు. గురువారం ప్రగతి భవన్‌ సమావేశం మందిరంలో వ్యవసాయ శాఖ, మార్క్‌ఫెడ్‌ తదితర అధికారులతో యాసంగి సీజన్‌ 2020/21 సన్నాహకము పై జిల్లాస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ సొసైటీస్‌ చైర్మన్లు, ఫర్టిలైజర్స్‌ డీలర్స్‌, ట్రేడర్స్‌, కంపెనీ రిప్రజెంట్‌ లతో మాట్లాడుతూ వర్షాలు బాగా పడినందున యాసంగి ...

Read More »

16న వేలం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ శాఖలకు చెందిన పలు పాత వాహనాలకు ఈనెల 16 న ఇ-వేలం నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పాత వాహనాల కెవైసి డాక్యుమెంట్లు, ఇఎండి డిపాజిట్‌ రుజువులతో ఆన్‌లైన్‌కు రిజిస్ట్రేషన్‌కు ఆఖరి డిసెంబర్‌ 10 అని ఆయన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇ వేలం ఈనెల 16న నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Read More »

మధుయాష్కి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో చీరల పంపిణీ

నిజామాబాద్‌, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రదాత, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా బుధవారం మధుయాష్కీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షులు, మధుయాష్కీ ఫౌండేషన్‌ డైరెక్టర్‌ దయాకర్‌ గౌడ్‌ నేతత్వంలో జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్‌ రెడ్డి, కేశ వేణు, తాహెర్‌బిన్‌ హందాన్‌ ముఖ్య అతిథులుగా హాజరై పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు మాట్లాడుతూ స్వాతంత్ర తెలంగాణ ...

Read More »

ఉద్యోగుల వివరాలు అందజేయాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ 19 వ్యాక్సినేషన్‌కు సంబంధించి ప్రయివేటు ఆసుపత్రులు, ల్యాబుల ఉద్యోగుల వివరాల గురించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో మంగళవారం చర్చించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో మంగళవారం డిఎం అండ్‌ హెచ్‌వో డాక్టర్‌ సుదర్శనం ఆధ్వర్యంలో జిల్లా ఐఎంఎ, తానా అసోసియేషన్‌ కార్యవర్గంతో సమావేశమయ్యారు. ఎవరైనా ప్రయివేటు ఆసుపత్రుల వారు ఉద్యోగుల వివరాలు అందజేయకపోతే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. సమావేశంలో ఐఎంఎ అధ్యక్షుడు డాక్టర్‌ జీవన్‌రావు, ...

Read More »

రైతు నేస్తం పురస్కారానికి జిల్లా రైతు ఎంపిక

నిజామాబాద్‌, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు నేస్తం మాస పత్రిక ద్వారా ప్రతి సంవత్సరం తెలుగు రాష్ట్రాల ఉండి ఉత్తమ రైతులను, వ్యవసాయ శాస్త్రజ్ఞులను ఎంపిక చేసి అందజేసే రైతు నేస్తం పురస్కారానికి జిల్లా రైతు నాగుల చిన్న గంగారాం (చిన్ని కష్ణుడు) ఎంపికయినట్లు జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జక్రాన్‌పల్లి మండలం చింతలూరు గ్రామానికి చెందిన చిన్ని కష్ణుడు వ్యవసాయాధికారులు సలహాలతో ఎటువంటి రసాయన ఎరువులు వాడకుండా కేవలం ఆర్గానిక్‌ ఎరువులతో ...

Read More »

బంద్‌ కరో… బంద్‌ కరో…

నిజామాబాద్‌, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో దేశ వ్యాప్త బందులో భాగంగా నిజాంబాద్‌ నగరంలో బైకుల ద్వారా పెద్ద ఎత్తున నిజామాబాద్‌ నగరమంతా తిరుగుతూ దుకాణాలు, వ్యాపార సముదాయాలు బందు చేయించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓ మయ్య మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ వస్తుందని దాంట్లో భాగంగానే రైల్వే, బిఎస్‌ఎన్‌ఎల్‌, ఎల్‌ఐసి, బ్యాంకింగ్‌, రక్షణ రంగాలను 100 ...

Read More »

త్రివిధ దళాల సేవలు మరువలేనివి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశ రక్షణ కోసం తమ జీవితాలను త్యాగం చేస్తూ తమ భార్య పిల్లలను ఇంటి దగ్గరేవుంచి ఎక్కడో దేశ సరిహద్దులలో భారత దేశ రక్షణ కొరకు, భారత ప్రజల సుఖశాంతుల కొరకు పనిచేస్తున్న భారత త్రివిధ దళాల సేవలు మరవలేనివని, అందుకే వారి సంక్షేమానికి ప్రతి ఒక్క భారత పౌరుడు చేయూతనందిస్తూ వారికి సంఘీభావం తెలపడం అవసరమని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో సోమవారం సాయుద ...

Read More »

శిశు హత్య మహా పాపం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శిశు హత్య మహా పాపం అని అడిషనల్‌ కలెక్టర్‌ లత అన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్‌లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్కారీ వారి ఉయ్యాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అడిషనల్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ పిల్లల పెంపకం భారంగా ఉన్నవారు నాలలో గాని ముళ్లపొదల్లో గాని పారేయకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఉయ్యాలలో వేయాలని కోరారు. మానవత్వంతో ఆలోచించి పసి పాపలకు మరో ప్రపంచాన్ని చూపిద్దామన్నారు. మీకు ...

Read More »

ఇంకా విక్రయించకుంటే కొనుగోలు కేంద్రాలకు వెళ్ళండి…

నిజామాబాద్‌, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎవరైనా రైతుల వద్ద ఈ వాన కాలంలో పండించిన మక్కలు ఇంకా విక్రయించకుండా ఉంటే వాటిని కొనుగోలు కేంద్రాలలో అమ్ముకోవచ్చునని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో రైతులకు సూచించారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 3 వేల 340 మంది రైతుల నుండి తొమ్మిది వేల మెట్రిక్‌ టన్నుల మక్కలను జిల్లాలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీల ద్వారా సేకరించామని క్వింటాలుకు రూ.1850 మద్దతు ధర చెల్లిస్తున్నామని తెలిపారు. ఈ వాన కాలంలో ...

Read More »

మూడురోజుల పాటు ఇన్స్‌పెక్షన్‌ – రికార్డులు సిద్దం చేసుకోండి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో ఉపాధి హామీ పథకం బాగా జరుగుతున్నందున జాతీయ ఉపాధి హామీ పథకం కేంద్ర ప్రభుత్వ జాయింట్‌ సెక్రటరీ జిల్లాలో మూడు రోజులపాటు పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి తెలిపారు. సోమవారం ఉపాధి హామీ పథకం అధికారులు ఎంపీడీవోలతో సెల్‌ కాన్షరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 9 నుండి 11 వరకు ఆయన బందం జిల్లాలో పర్యటించనున్నందున క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను వారు ...

Read More »

దేవక్కపేట్‌లో అంబేడ్కర్‌ వర్ధంతి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీంగల్‌ మండలంలోని దేవక్కపెట్‌ గ్రామంలో రైజింగ్‌ స్టార్‌ యూత్‌ ఆధ్వర్యంలో ప్రపంచ మేధావి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డా బి. ఆర్‌.అంబేద్కర్‌ 64వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు ఆర్పించారు. కార్యక్రమంలో యూత్‌ అధ్యక్షులు అల్లంపట్ల ఆనంద్‌, సుధాకర్‌, రవి, నరేష్‌, సూర్యకిరణ్‌, ప్రవీణ్‌, శేఖర్‌, నర్సయ్య యూత్‌ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు. న్యాయవాది సుంకపాక ప్రకాష్‌ మాట్లాడుతూ ప్రపంచ మేధావి బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి డా బి.ఆర్‌.అంబెడ్కర్‌ ఆలోచన ...

Read More »