Breaking News

Nizamabad

2న మాక్లూర్‌కు సిఎం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 2న రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మాక్లూరు రానున్నందున జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి, సిపి కార్తికేయ పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. మంగళవారం వారు సంబంధిత అధికారులతో కలిసి మాక్లూర్‌ మండల కేంద్రంలో పర్యటించి హెలిప్యాడ్‌, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించారు. నిజాంబాద్‌ అర్బన్‌ శాసనసభ్యులు బీగాల గణేష్‌ గుప్తా యొక్క తండ్రి మరణించినందున ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించడానికి ముఖ్యమంత్రి రానున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. అధికారులు ...

Read More »

వ్యాధులనుండి కాపాడుకోవాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే క్యాంపులలో మూగజీవాలకు మందులు ఇప్పించి వాటిని రోగాల బారినుండి కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి కోరారు. మంగళవారం మోపాల్‌ మండల కేంద్రంలో వెటర్నరీ, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నట్టల నివారణ వారోత్సవాల ప్రారంభ కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. డిసెంబర్‌ 1 నుండి 7 వరకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో క్యాంపులు ఏర్పాటు చేసి గొర్రెలు, మేకలలో నట్టల నివారణ ...

Read More »

2న గల్ఫ్‌ చైతన్య సదస్సు

నిర్మల్‌, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గల్ఫ్‌ భరోసా యాత్రలో భాగంగా డిసెంబర్‌ 2న ఉదయం నిర్మల్‌ జిల్లా మామడ మండల కేంద్రంలో గల్ఫ్‌ నుండి వాపస్‌ వచ్చిన వలస కార్మికులకు అవగాహన, చైతన్య కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రవాసి మిత్ర లేబర్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు స్వదేశ్‌ పరికిపండ్ల ఒక ప్రకటనలో తెలిపారు. గల్ఫ్‌ దేశాల నుండి వాపస్‌ వచ్చినవారు జీతం బకాయిలు మరియు బోనస్‌, పిఎఫ్‌, గ్రాట్యుటీ లాంటి ‘ఎండ్‌ ఆఫ్‌ సర్వీస్‌ బెనిఫిట్స్‌’ (ఉద్యోగ విరమణ ప్రయోజనాలు) ...

Read More »

ధరణి కార్యాలయానికి రూ. 9 లక్షలు

నిజామాబాద్‌, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో ఉన్న తసీల్ధార్‌లతో ధరణి పై నిజామాబాద్‌ ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. ధరణిలో ఇప్పటి వరకు 1585 స్లాట్‌ బుకింగ్‌ జరిగాయని, అందులో 1528 రిజిస్టర్‌ అయినవి, 57 మాత్రమే పెండింగ్‌ వున్నవని, అదేవిధంగా ప్రతి మండలంలో ధరణి కార్యాలయానికి 9 లక్షలు మంజూరు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి చెప్పారు. కావున ప్రతి మండలంలో ఒక మంచి కార్యాలయంతో పాటు సదుపాయాలు ఇతర అవసరాలకు మంజూరు చేశారని పేర్కొన్నారు. దీనికి ...

Read More »

రైతు వేదికలు, క్రిమిటోరియం, సిడిపి, ఎంపీ లాడ్స్‌ పనులు పూర్తి కావాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంపీ లాడ్స్‌ నిధులతో చేపట్టిన పనులు నెలాఖరులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఆదేశించారు. శనివారం వీడియో కాన్ఫరెన్సులో ఎంపి లాడ్స్‌, రైతు వేదికలు, క్రిమిటోరియం, సిడిపి పంచాయతీ రాజ్‌, శాఖ ఈఈ, డిఈ, ఏఈ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు వేదికలు, క్రిమిటోరియం, సిడిపి పనుల అభివద్ధి గురించి మండలాల వారీగా సమీక్షించారు. రైతు వేదికలు శనివారం వరకు పనులు పూర్తి ...

Read More »

గిన్నిస్‌ రికార్డు గ్రహీతకు కలెక్టర్‌ ప్రశంసలు

నిజామాబాద్‌, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అతి చిన్న వయసులోనే గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సాధించిన జిల్లా కేంద్రానికి చెందిన తేలి విభా శ్రీ ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ప్రశంసించారు. సుభాష్‌ నగర్‌ వాసులైన విజయ్‌ కుమార్‌, ప్రసన్నల కూతురు విభా శ్రీ ప్రస్తుతం నగరంలోని ఓ ప్రైవేట్‌ స్కూల్లో ఫస్ట్‌ క్లాస్‌ చదువుతు తన ఎల్‌కెజి, యూకేజీ చదువుతున్న రోజుల్లోనే ఆయా కళారంగాలలో అద్భుతమైన ప్రదర్శనలు చేసి ఆహుతులను అలరించింది. దీంతో ...

Read More »

శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై నిఘా

నిజామాబాద్‌, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాంతి భద్రతల పరిరక్షణ కొరకై పోలీస్‌ శాఖ ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటుందని నిజామాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌ కార్తికేయ ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్‌ పోలీస్‌ కమీషనరేటు పరిధిలోని ప్రజలు సద్భావన, జీవన విధానం ఆదర్శవంతమైనవని ఇటువంటి వాతావరణానికి భంగం కలిగించే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. అల్లరిమూకల దుష్ప్రచారాలు, వదంతుల (రూమర్స్‌) పట్ల ప్రతి ఒక్కరూ జాగరూకులై ఉండాలని, అదే విధంగా పోలీసు శాఖ సంఘ విద్రోహమూకపై గట్టి నిఘా ఉంచుతున్నామని, ...

Read More »

పరీక్షలు వాయిదా – ఆన్‌లైన్‌ తరగతులు యధాతథం

నిజామాబాద్‌, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ గిరిరాజ్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిసెంబర్‌ 1వ తేదీ నుండి నిర్వహించబడే బి.ఏ. బి.కాం, బి.వి. ఏ.బి.యస్సీ. 2వ, 4వ సెమిస్టరు (రెగ్యూలర్‌) (2019-20) మరియు 1వ, 2వ, 3వ సెమిస్టరు (బ్యాక్‌లాగ్‌) పరీక్షలను విద్యార్థుల అభ్యర్ధన మేరకు వాయిదా వేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ లక్ష్మినారాయణ, కళాశాల పరీక్షల నియంత్రణ అధికారి వై.వేణుప్రసాద్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పైన తెలిపిన పరీక్షల తేదీలను తర్వాత ప్రకటిస్తామన్నారు. 3వ సెమిస్టరు (రెగ్యులర్‌) ...

Read More »

మన రాజ్యాంగం మనకెంతో గర్వకారణం

నిజామాబాద్‌, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం ప్రగతి భవన్‌లో భారత రాజ్యాంగం ఆమోదించిన రోజును పురస్కరించుకొని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి ముఖ్యఅతిథిగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్య్రానంతరం భారత దేశానికి రాజ్యాంగాన్ని ప్రత్యేకంగా తయారుచేయడానికి ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించి చర్చించి, శోధించి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించారని తెలిపారు. దేశంలో ఎన్నో కులాలు, మతాలు, వర్గాలను, వారి జీవన పరిస్థితులను దష్టిలో పెట్టుకొని రూపొందించిన రాజ్యాంగం ప్రపంచంలోనే ఎన్నో దేశాలకు దిక్సూచిగా ...

Read More »

యాంత్రీకరణపై రైతులకు అవగాహన

నిజామాబాద్‌, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాగులో యంత్రాల ఉపయోగం, ఖర్చు తగ్గించుకోవడం, దిగుబడి పెంచుకోవడంపై రైతులకు జిల్లా స్థాయిలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి తెలిపారు. గురువారం తన చాంబర్‌లో వ్యవసాయ అధికారులు, కంపెనీల ప్రతినిధులు, శాస్త్రవేత్తలతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు, చేపట్టవలసిన చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ముఖ్యమైన వ్యవసాయ పనులు నిర్వహించుకునే సమయంలో రైతులకు నాటు వేయడం, కలుపు తీయడం, పంటలు కోయడం తదితర ...

Read More »

చెన్నై షాపింగ్‌మాల్‌లో కార్మికులకు వేతనాలు ఇప్పించాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చెన్నై షాపింగ్‌ మాల్‌లో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు ఇప్పించాలని, వారి సమస్యలు పరిష్కరించాలని ప్రగతిశీల బట్టల దుకాణ వర్కర్స్‌ యూనియన్‌ (ఐ.ఎఫ్‌.టి.యు) ఆధ్వర్యంలో కార్మిక శాఖ సహాయ కమిషనర్‌ కార్యాలయం ముందు నిరసన తెలిపి, కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐ.ఎఫ్‌.టీ.యూ జిల్లా నాయకులు ఎం.సుధాకర్‌ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఇటీవల ప్రారంభమైన చెన్నై షాపింగ్‌ మాల్‌లో సుమారు 400 మందికి పైగా కార్మికులు ఆగస్టు 15 నుండి పని ...

Read More »

గల్ఫ్‌ కార్మికులకు న్యాయ సహాయం అందిస్తాం…

నిజామాబాద్‌, నవంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల వలన గల్ఫ్‌ దేశాల నుండి స్వదేశానికి వాపస్‌ వచ్చిన వలస కార్మికుల కొరకు మంగళవారం నిజామాబాద్‌లో అవగాహన, చైతన్య కార్యక్రమం రెడ్‌ క్రాస్‌ హల్‌లో నిర్వహించారు. కంపెనీ యాజమాన్యాల నుండి కార్మికులకు రావలసిన జీతం బకాయిలు, బోనస్‌, పిఎఫ్‌, గ్రాట్యుటీ లాంటి ఉద్యోగ విరమణ ప్రయోజనాలు (ఎండ్‌ ఆఫ్‌ సర్వీస్‌ బెనిఫిట్స్‌) పొందడం ఎలా అనే విషయాల గురించి చర్చించి పరిష్కార మార్గాలు సూచించారు. కార్యక్రమానికి ముఖ్య ...

Read More »

డ్రైవ్‌ మోడ్‌లో పనులన్నీ పూర్తి చేయాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిర్దేశించుకున్న పనులు పూర్తి చేయడానికి లక్ష్యాలను చేరుకోవడానికి ప్రత్యేక డ్రైవ్‌లో కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్సు ద్వారా వ్యవసాయ కల్లాలు, నీటిపారుదల కెనాల్స్‌ డీ సిల్టింగ్‌, వ్యవసాయ రుణాల రెన్యువల్‌ ఫామ్‌ మెకానైజేషన్‌, సాక్‌ పిట్స్‌ రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ స్ట్రక్చర్‌ల ఏర్పాటు, ఉపాధి హామీ లేబర్‌ టర్న్‌ అవుట్‌ తదితర అంశాలపై మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, డిఆర్డిఓ ...

Read More »

మానవసేవయే మాధవసేవ

నిజామాబాద్‌, నవంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం బర్కత్‌పుర రోటరీ క్లబ్‌ ఆఫ్‌ నిజామాబాద్‌ నిజామాబాద్‌ రూరల్‌ సర్వీస్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రోటరీ కత్రిమ కేంద్రానికి జిల్లా న్యాయాధికారి రమాదేవి హాజరై మాట్లాడారు. కేంద్రం ద్వారా అందజేస్తున్న కత్రిమ కాలు జైపూర్‌ ఫుట్‌ శిబిరంలోని బాధితులకు కత్రిమంగా తయారుచేసిన కాళ్లను అందజేస్తూ మరొక జన్మనిస్తున్నటువంటి రోటరీ క్లబ్‌ నిజామాబాద్‌ సంస్థకి అభినందనలు తెలిపారు. మానవసేవే మాధవసేవ అని, సభ్యులంతా దేవుని రూపంలో ఉన్న మనుషులని ఇంతటి మహత్కార్యం నిర్వహిస్తున్నందుకు ...

Read More »

రైతు సోదరులకు కలెక్టర్‌ విజ్ఞప్తి

నిజామాబాద్‌, నవంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని రైతులకు మంజూరు చేసిన 3 వేల 600 వ్యవసాయ కల్లాలను వారం రోజుల్లో పూర్తి చేసుకోవాలని, అదేవిధంగా యాసంగి పంట రుణాల కోసం బ్యాంకర్లను కలవాలని, శాస్త్రవేత్తల సూచనల మేరకే రసాయన ఎరువులను వాడి పెట్టుబడిని తగ్గించుకోవాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి జిల్లా రైతులను ఒక ప్రకటన ద్వారా కోరారు. వానాకాలం సీజన్‌ పూర్తయ్యే దశలో ఉన్నందున పంట వ్యర్థాలైన గడ్డి కానీ ఇతరత్రా చెత్త కానీ ఒకచోట వేసి ...

Read More »

పెండింగ్‌ లేకుండా పనులు పూర్తిచేయాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు వేదికల పనులు నూరు శాతం వెంటనే పూర్తి కావాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం సంబంధిత అధికారులతో పలు అంశాలపై సెల్‌ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొత్తం 106 రైతు వేదికలు రెండు మూడు రోజుల్లో పూర్తి కావాలని ఎక్కడ కూడా ఏ ఒక్క పని కూడా పెండింగ్‌ లేకుండా పంచాయతీ రాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారులు చర్యలు తీసుకోవాలని కలరింగ్‌తో సహా ...

Read More »

అనుమతులు సక్రమంగా జరగాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టియస్‌ఐపాస్‌ అండ్‌ డిస్ట్రీస్ట్‌ ఇండస్ట్రీస్‌ ప్రమోషన్‌ కమిటీపై నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. సోమవారం కలెక్టర్‌ ఛాంబర్‌లో టీఎస్‌ ఐ-పాస్‌ డిస్ట్రిక్ట్‌ ఇండస్ట్రీస్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ సమీక్ష సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ అన్ని అనుమతులు సక్రమంగా జరగాలని టియస్‌ఐపాస్‌ క్రింద మంజూరైన లోన్‌ వివరాలు టి ప్రైడ్‌ పాలసీ యస్‌పి క్రింద 3 మంది ఎస్సీలకు ట్రాక్టర్లు, గూడ్స్‌ లైట్‌ మోటార్‌ వెహికల్స్‌ 2, యల్‌ఎంవి గూడ్స్‌ ...

Read More »

దరఖాస్తులు పెండింగ్‌ లేకుండా చూడాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ సందర్భంగా ప్రజావాణి పిటిషన్లు నేరుగా కాకుండా గత సోమవారం వరకు బాక్స్‌లలో వేశారు. తిరిగి సోమవారం జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ కలెక్టర్‌ చాంబర్‌లో ప్రజల నుండి నేరుగా ప్రజావాణి విజ్ఞప్తులు స్వీకరించారు. ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్‌ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తీసుకున్న చర్యలను దరఖాస్తుదారుల దష్టికి తెలిసేలా చూడాలని ఆదేశించారు.

Read More »

మరోసారి ఔదార్యం చాటుకున్న ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్‌, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత నెల 24న మలేషియాలో గుండెపోటుతో చనిపోయిన బాల రవీందర్‌ మతదేహాన్ని వారి స్వగహం గూపన్‌ పల్లికి తెప్పించారు ఎమ్మెల్సీ కవిత. బ్రతుకుపై ఆశతో ఈయేడు జనవరిలో పొట్ట చేత పట్టుకొని మలేషియా వెళ్లిన బాల రవీందర్‌ కరోనా దెబ్బతో ఉపాధి కోల్పోయి ఎన్నో కష్టాలు పడి జీవితంపై ఆశ కోల్పోయి గుండెపోటుతో గత నెల 24న మరణించగా, అతనికి అప్పులు ఉండడంతోతో పార్థివ దేహాన్ని స్వగహానికి తెప్పించడానికి వారి కుటుంబ సభ్యులకు ...

Read More »

ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెండు రోజులుగా జిల్లాలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్‌ నమోదు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌తో కలిసి పరిశీలించారు. రెండవ రోజైన ఆదివారం ఆయన ప్రభుత్వ గిరిరాజ్‌ కళాశాల, ఎస్‌ఎఫ్‌ఎస్‌ విద్యాసంస్థలో పర్యటించి నమోదు ప్రక్రియను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయా పోలింగ్‌ కేంద్రాలలో విధులు నిర్వహిస్తున్న బూత్‌ లెవల్‌ ఆఫీసర్లు, సిబ్బందితో నమోదు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను ...

Read More »