Breaking News

Nizamabad

రోటరీ క్లబ్‌ సేవలు అభినందనీయం

నిజామాబాద్‌, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తెలిపారు. రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కత్రిమ కాలు ఏర్పాటు కార్యక్రమానికి కలెక్టర్‌ ఆదివారం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కాలు లేని 150 మందికి ఉచితంగా కత్రిమంగా కాళ్లు వారి కొలతలకు అనుగుణంగా ప్రత్యేకంగా తయారుచేసి అమర్చడం ఎంతైనా అభినందనీయమన్నారు. తద్వారా ఇంతవరకు కాళ్లు లేకుండా అవస్థలు పడుతున్న వారికి కత్రిమ కాలు ఏర్పాటు చేయడంతో వారు వారి పనులన్నీ ...

Read More »

కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తాం

రెంజల్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి నష్టం కలిగించే చట్టాలను చేసి రైతులను కష్టాల పాలు చేస్తున్న ప్రభుత్వానికి రైతులే సరైన బుద్ధి చెప్పి కూల్చి వేస్తారని, తస్మాత్‌ జాగ్రత్త అని అఖిలభారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.ప్రభాకర్‌ హెచ్చరించారు. శనివారం రెంజల్‌ మండలం సాటాపూర్‌ గ్రామంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. దేశానికే కాక ప్రపంచానికి నాగరికతను వ్యవసాయాన్ని 200 సంవత్సరాల పరాయి పాలనలో ప్రాధాన్యత ఇవ్వకుండా నల్లమందు ను పండించాలని ఒత్తిడి ...

Read More »

నవంబర్‌ 26 వరకు గడువు పొడిగింపు

నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డా.బి.ఆర్‌. అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీ.ఏ/బీ.కాం/బీ.ఎస్సీ), పీ.జీ కోర్సుల్లో చేరడానికి చివరి తేది నవంబర్‌ 26 వరకు పొడిగించినట్లు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా రీజినల్‌ కో-ఆర్డినేటర్‌ డా.యన్‌.అంబర్‌ సింగ్‌ తెలిపారు. ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్లు వెల్లడించారు. ఇంటర్మీడియెట్‌, నేషనల్‌ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ద్వారా ఇంటర్‌ పూర్తి చేసిన వారు, యూనివర్సిటీ నిర్వహించిన అర్హత పరీక్షల్లో 2016 నుంచి 2020 వరకు పాసైన ...

Read More »

కోవిడ్‌ పరీక్షలు జరిగేలా చూడాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఒక్కరు మాస్కులు ధరించడం, సోషల్‌ డిస్టెన్స్‌ పాటించడం, శానిటైజ్‌ చేసుకోవడం తదితర జాగ్రత్తలు పాటించే విదంగా చర్యలు తీసుకోవాలని అడిషనల్‌ కలెక్టర్‌ లత తెలిపారు. శనివారం కలెక్టరేట్‌ నుండి మెడికల్‌ ఆఫీసర్‌లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. కోవిడ్‌ పరీక్షలు ప్రతి పిహెచ్‌సిలో 25 జరిగే విధంగా చూడాలని ప్రతి ఒక్కరు మాస్కులు దరించేవిధంగా, సోషల్‌ డిస్టెన్స్‌, శానిటేషన్‌ వాడాలని ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా ...

Read More »

ప్రత్యేక ఓటర్‌ నమోదు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శనివారం, ఆదివారం రెండు రోజులపాటు నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి శంకర్‌ భవన్‌, చైతన్య పబ్లిక్‌ స్కూల్‌ కేంద్రాలలో శనివారం పర్యటించి పరిశీలించారు. ఈ సందర్బంగా నమోదు కేంద్రాలకు వస్తున్న వారి వివరాలు, నమోదు ప్రక్రియ, ఏ రకమైన ఫారాలకు వస్తున్నారో బిఎల్‌ఓలను అడిగి తెలుసుకున్నారు. 2021 జనవరి 1 నాటికి 18 సంవత్సరాల వయస్సు పూర్తి చేసుకునే ...

Read More »

అనాధ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శిశు గహ, బాల సదన్‌ గహాల్లో గల అనాధ పిల్లలను జాగ్రత్తగా, బాధ్యతతో చూసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి ఆదేశించారు. శనివారం ఆయన స్త్రీ – శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న శిశు గహ, బాలసదన్‌లో ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా పిల్లల ఆరోగ్యం, వారి మంచిచెడ్డలు, గహాల్లో వారికి అందిస్తున్న భోజనం తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. తల్లిదండ్రులు లేని అనాధలైన పిల్లలను మీరే తల్లిదండ్రులు అనుకొని వారికి ...

Read More »

ధాన్యం చెల్లింపులు త్వరగా జరగాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల నుండి సేకరించిన ధాన్యానికి వేగంగా చెల్లింపులు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాత్రి సంబంధిత అధికారులతో సెల్‌ కాన్ఫరెన్సు ద్వారా ధాన్యం సేకరణ, జరుగుతున్న కార్యక్రమాలపై, తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ధాన్యం సేకరణ ప్రక్రియ సాఫీగా, వేగంగా జరుగుతుందని అధికారులు మరియు కొనుగోలు కేంద్రాలలో సిబ్బంది బాగా పని చేస్తున్నారని తెలిపారు. మరోవైపు తీసుకున్న ధాన్యానికి ...

Read More »

శని, ఆదివారాల్లో ప్రత్యేక ఓటర్ల నమోదు

నిజామాబాద్‌, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శని, ఆదివారాల్లో అనగా ఈనెల 21, 22 తేదీలలో ప్రత్యేక ఓటర్ల నమోదు ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన సంబంధిత అధికారులతో ఎస్‌ఎస్‌ఆర్‌ పై సెల్‌ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఈనెల 21, 22 తేదీలలో 2021 జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తిచేసుకునే ప్రతి ఒక్కరు కొత్తగా ఓటర్‌ నమోదుకు ...

Read More »

21న ప్రొఫెసర్‌ శేషయ్య సంస్మరణ సభ

నిజామాబాద్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పౌర హక్కుల సంఘం (సీ.ఎల్‌.సీ) నిజామాబాద్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కోటగల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సి.ఎల్‌.సి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆల్గోట్‌ రవీందర్‌ మాట్లాడుతూ పౌర హక్కుల సంఘం జాతీయ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ శేషయ్య అక్టోబర్‌ 10న అనారోగ్యంతో మరణించారన్నారు. పీడిత ప్రజల హక్కుల కోసం సుదీర్ఘకాలం పనిచేసిన ప్రొఫెసర్‌ శేషయ్య మతి హక్కుల ఉద్యమానికి తీరని లోటన్నారు. ప్రొఫెసర్‌ శేషయ్య సంస్మరణ సభ పౌరహక్కుల సంఘం, తెలంగాణ, ...

Read More »

మహిళా చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమాజంలో మహిళలు ఎదుర్కుంటున్న సమస్యలపై అనేక చట్టాలు వచ్చాయని, వాటిపై మహిళలు అవగాహన పెంచుకోవాలని జిల్లా జడ్జి సాయి రమాదేవి అన్నారు. గురువారం జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యాలయంలో అంగన్‌ వాడి టీచర్‌లకు మహిళా చట్టాలపై అవగాహన సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా జడ్జి సాయి రమాదేవి మాట్లాడుతూ మహిళ న్యాయ చట్టాలపై మహిళలు తప్పక అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. గహహింస, వరకట్నం, బాల్య వివాహాల కేసులపై ...

Read More »

సమ్మెకు పిడిఎస్‌యు మద్దతు

నిజామాబాద్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ, నవంబర్‌ 26న జరిగే సార్వత్రిక సమ్మెలో విద్యార్థులు పాల్గొని సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షురాలు సి.హెచ్‌ కల్పన అన్నారు. బుధవారం పిడిఎస్‌యు ఆద్వర్యంలో నగరంలోని ఎన్‌ఆర్‌ భవన్‌లో సమ్మె గోడప్రతులు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతు, కార్మిక, ప్రజా విద్య వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని, నూతన జాతీయ విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి విద్యా కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణను ...

Read More »

పూర్తి చేసిన పనులు ఆన్‌లైన్‌ చేయాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయడమే కాకుండా వాటిని ఆన్‌లైన్‌లో కూడా కనిపించే విధంగా నమోదు చేయించాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం క్యాంపు కార్యాలయం నుండి సెల్‌ కాన్ఫరెన్సు ద్వారా సంబంధిత అధికారులతో పల్లె ప్రగతి డ్రైయింగ్గ్‌ ప్లాట్‌ ఫారాల నిర్మాణం గురించి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 416 డ్రైయింగ్‌ ప్లాట్‌ ఫారాలు పూర్తి చేసినట్లు అధికారులు నివేదికలు ఇచ్చినప్పటికీ అవి ...

Read More »

రాష్ట్రంలోనే తలమానికంగా ప్రభుత్వ ఆసుపత్రి

నిజామాబాద్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాదు ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్రంలోనే ఉన్నతమైన సేవలు అందించే విధంగా తీర్చిదిద్దడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి ఆస్పత్రి వైద్య అధికారులను ఆదేశించారు. బుధవారం తన చాంబర్‌లో ప్రభుత్వ ఆసుపత్రి వైద్య అధికారులతో ఆసుపత్రి అభివద్ధి, సదుపాయాలు, నాణ్యమైన సేవలు, తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆస్పత్రికి అవసరమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో పాటు మిషనరీ తదితర సదుపాయాలతో పాటు ఆసుపత్రి అభివద్ధికి ఇంకా ఏమేం చేయాలో ...

Read More »

పోలీసు కుటుంబాలకు చెక్కుల పంపిణీ

నిజామాబాద్‌, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూలై 6వ తేదీన ఎల్‌.మురళి, కానిస్టేబుల్‌ (1664) ఆత్మహత్య చేసుకుని మరణించారని, పోలీస్‌ అసోసియేషన్‌ ఆద్వర్యంలో అతని కుటుంబానికి పోలీస్‌ శాఖలో గల కాని స్టేబుల్‌ నుండి పోలీస్‌ కమీషనర్‌ వరకు తమ జీతం నుండి డెత్‌ ఫండ్‌ (ఆర్థిక సహాయం) రూ.1 లక్ష 24 వేల 100 చెక్కు రూపంలో మంగళవారం పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ చేతుల మీదుగా పోలీస్‌ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్సు హాల్‌లో మురళి సతీమణి అయిన హేమలతకి ...

Read More »

డిఆర్‌డిఎ పనులన్నీ వెంటనే పూర్తి కావాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిఆర్‌డిఎ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నర్సరీలు, హరిత హారం, క్రిమిటోరియం, డ్రైయింగ్‌ ప్లాటుఫామ్‌ తదితర పనులన్నీ వెంటనే పూర్తి చేయటానికి అధికారులందరూ ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ నుండి ఎపిఓ, ఏఈపిఆర్‌లతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి మండలంలో మరియు ప్రతి గ్రామపంచాయతీ వారీగా ఇచ్చిన టార్గెట్‌ను సమీక్షించారు. రెండు రోజుల్లో ప్రతి జిపిలో మట్టిని సిద్ధం చేసుకుని బ్యాగ్‌లలో ...

Read More »

వికలాంగులకు కృత్రిమకాలు

నిజామాబాద్‌, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోటరీ క్లబ్‌ నిజామాబాద్‌ ఆధ్వర్యంలో రోటరీ కత్రిమ అవయవ కేంద్రం ద్వారా నవంబర్‌ 18 బుధవారం నుండి జైపూర్‌ ఫుట్‌ (కత్రిమ కాలు) అందజేసే శిబిరం ప్రారంభం అవుతుందని నిర్వాహకులు తెలిపారు. 18 న రిజిస్ట్రేషన్స్‌ మరియు కొలతలు తిరిగి నవంబర్‌ 22న కత్రిమ కాలు అమర్చడం జరుగుతుందన్నారు. బాధితులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకై 9246990055 నెంబర్‌లో సంప్రదించాలన్నారు.

Read More »

గోడప్రతుల ఆవిష్కరణ

నిజామాబాద్‌, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నవంబర్‌ 26న జరిగే దేశవ్యాప్త సమ్మె ప్రచార పోస్టర్లను ప్రగతిశీల కేజీబీవీ నాన్‌ టీచింగ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఐ.ఎఫ్‌.టి.యు) ఆధ్వర్యంలో మాక్లూర్‌ మండల కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్‌ జిల్లా ఇంచార్జి ఎం.సుధాకర్‌ మాట్లాడుతూ నరేంద్ర మోడీ నేతత్వంలోని కేంద్ర ప్రభుత్వం కార్మికుల, రైతుల, సామాన్య ప్రజల హక్కుల మీద దాడి చేస్తుందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను కొనసాగిస్తున్న ఫలితంగా దేశంలోని ...

Read More »

ధాన్యం డబ్బులు వేగవంతంగా చెల్లించాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరుగాలం కష్టించి ధాన్యాన్ని అందించిన రైతుకు ధాన్యం డబ్బులు చెల్లించే ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సెల్‌ కాన్ఫరెన్సు ద్వారా ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో మాట్లాడారు. రైతులు తెచ్చిన ధాన్యం నాణ్యతను పరిశీలించి వెంట వెంట తూకం వేయడం, రైస్‌ మిల్లులకు పంపించడం, అక్కడ వెంటనే ధాన్యాన్ని దించుకునే విధంగా రైస్‌ మిల్లుల వద్ద ఏర్పాటు చేయాలని, రవాణా ...

Read More »

నర్సరీలలో విత్తనాల పనులు వెంటనే పూర్తి చేయాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అన్ని మున్సిపాలిటీలలో లక్ష్యానికి అనుగుణంగా నర్సరీలలో విత్తనాలు వేయడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి మున్సిపల్‌ కమిషనర్లను ఆదేశించారు. సోమవారం సెల్‌ కాన్ఫరెన్సు ద్వారా మున్సిపాలిటీలలో హరితహారం కొరకు విత్తనాలు వేయడంపై మున్సిపల్‌ కమిషనర్లతో మాట్లాడారు. హరితహారంపై రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక దష్టితో పర్యవేక్షణ చేస్తున్నారని జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా నర్సరీలను సిద్ధం చేసుకొని వాటిల్లో వచ్చే సంవత్సరంలో హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటడానికి అవసరమైన ...

Read More »

నిరుపేదలకు రగ్గుల పంపిణీ

నిజామాబాద్‌, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ సహారా ఆద్వర్యంలో నిజామాబాదు నగరంలోని నిరాశ్రయులైన నిరుపేదలకు ఆదివారం రాత్రి రగ్గులు పంపిణీ చేశారు. నగరంలోని రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌, గాంధీచౌక్‌, కంఠేశ్వర్‌, పూలాంగ్‌ తదితర ప్రాంతాల్లో చలికి వణుకుతూ ఇబ్బందులు పడుతున్న వారికి రగ్గులు అందజేశారు. ఈ సందర్బంగా లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ సహారా అధ్యక్షుడు ఉండవల్లి శివాజి మాట్లాడుతూ చలి తీవ్రత పెరిగిన దష్ట్యా తమ క్లబ్‌ ఆద్వర్యంలో పేదలకు రగ్గులు పంపిణీ చేశామని చెప్పారు. ప్రతీ ...

Read More »