Breaking News

Nizamabad

నిజామాబాద్‌ జిల్లాలో 2 వేల‌కే సిటిస్కాన్‌

నిజామాబాద్‌, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి వ్యాధి తీవ్రతను అంచనా వేయడానికి సిటీ స్కాన్‌ టెస్ట్‌ తప్పనిసరి అయినందున పేద ప్రజల‌పై అధిక ఆర్థిక భారం పడుతున్న నేపథ్యంలో సిటీ స్కాన్‌ టెస్ట్‌ ధరను డయాగ్నోస్టిక్‌ సెంటర్‌లు 2 వే రూపాయలు మాత్రమే తీసుకోవాల‌ని మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి నిజామాబాద్‌ జిల్లా సిటిస్కాన్‌ యజమాన్యాల‌ను కోరారు. ఇందూరు సిటీ స్కాన్‌ యజమాని డా.రవీందర్‌ రెడ్డి, ఆర్మూర్‌ అమృత ల‌క్ష్మీ సిటీ స్కాన్‌ డా.జయ ...

Read More »

చికిత్స అందించక డబ్బులు తీసుకొని పంపిస్తే ఆస్పత్రుల‌పై చర్యలు

నిజామాబాద్‌, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేవలం ఫీజుల‌ కోసం కరోనా పేషెంట్లను అడ్మిట్‌ చేసుకుని చికిత్స అందించకుండా పంపిస్తే ఆయా ఆసుపత్రుల‌పై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి హెచ్చరించారు. శనివారం ఆయన తిరుమల‌, మనోరమ, ప్రతిభ ప్రైవేటు ఆసుపత్రుల‌లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సెంటర్ల వివరాలు రెమిడెసివిర్‌ ఇంజక్షన్లు, ఆక్సిజన్‌ వివరాల‌ను రిజిస్టర్‌లో పరిశీలించారు.  ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రి యాజమాన్యాల‌తో మాట్లాడుతూ, పేషెంట్లకు సరైన చికిత్సను అందించగల‌ స్తోమత, పరిజ్ఞానము ఉంటేనే ...

Read More »

మహాత్మా బసవేశ్వరునికి ఘనంగా నివాళి

నిజామాబాద్‌, మే 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాత్మ బసవేశ్వర జయంతి సందర్భంగా జిల్లా యంత్రాంగం ఆయన జయంతి కార్యక్రమాన్ని నిర్వహించి ఘనంగా నివాళులు అర్పించారు. శుక్రవారం కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్‌ చాంబర్లో అధికారులు సిబ్బంది మహాత్మ బసవేశ్వర జయంతి కార్యక్రమాన్ని కోవిడ్‌ నిబంధనల‌తో ఏర్పాటు చేశారు. అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ ముఖ్యఅతిథిగా మహాత్మ బసవేశ్వర చిత్రపటానికి పూల‌మాల‌వేసి జ్యోతి వెలిగించి నివాళి అర్పించారు. సాంస్కృతిక శాఖ, కలెక్టరేట్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల‌ శాఖ అధికారులు, ...

Read More »

కోవిడ్‌ సేవల‌పై నిరంతర పర్యవేక్షణ

నిజామాబాద్‌, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఊహించకుండానే విరుచుకుపడి ప్రజల‌ను భయాందోళనకు గురిచేస్తూ ప్రాణాలు తీస్తున్న కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల‌ మేరకు మంత్రిగా తాను, జిల్లా కలెక్టర్‌ నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామని సేవల‌ను మెరుగు పరచడంతో పాటు సదుపాయాల క‌ల్ప‌నకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల‌ శాఖామాత్యులు వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డితో కలిసి ఆర్మూర్‌, నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రుల‌లోనూ ...

Read More »

మంత్రి, కలెక్టర్‌ రంజాన్‌ శుభాకాంక్షలు

నిజామాబాద్‌, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రంజాన్‌ పండుగ సందర్భంగా మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ముస్లింల‌కు, కుటుంబ సభ్యుల‌కు పండుగ శుభాకాంక్షలు ఒక ప్రకటనలో తెలిపారు. ముస్లింలు పండుగను కుటుంబ సభ్యుల‌తో కలిసి సంతోషకర వాతావరణంలో జరుపుకోవాల‌ని కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు పాటిస్తూ పండుగ నిర్వహించుకోవాల‌ని వారు ప్రకటనలో కోరారు.

Read More »

ఇంటింటి సర్వేకు కుటుంబ సభ్యులందరూ పాల్గొనాలి

నిజామాబాద్‌, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఆదేశాల‌ మేరకు కోవిడ్‌ నివారణకు తీసుకున్న చర్యల‌వ‌ల్ల‌ వ్యాప్తి 25 నుండి 15 శాతానికి తగ్గిందని, మరణాల‌ రేటు కూడా తగ్గిందని ఇందుకు కృషి చేసిన వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్లకు, సిబ్బందికి అభినందనలు తెలియ చేస్తున్నానని, అదేవిధంగా ఇందుకు సహకరించిన రెవిన్యూ, పోలీస్‌ అధికారుల‌కు కూడా కృతజ్ఞతలు తెలియ చేస్తున్నానని రాష్ట్ర శాసనసభ వ్యవహారాలు రోడ్లు భవనాల‌ శాఖామాత్యులు వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. బుధవారం ...

Read More »

వ్యాక్సినేషన్‌, కరోనా పరీక్షలు డోర్‌ టు డోర్‌ సర్వే నిర్వహించాలి

నిజామాబాద్‌, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం నాగారం, అర్సపల్లి పి.హెచ్‌.సిల‌ ను జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లాక్‌ డౌన్‌లో కూడా వోపి సేవ‌లు వ్యాక్సినేషన్‌ కరోనా పరీక్షలు హౌస్‌ హోల్డ్‌ సర్వే నిర్వహించాల‌ని తెలిపారు. పిహెచ్‌సిలో ఓపి రిజిస్టర్‌ పరిశీలించారు. కోవిడ్‌ వోపి. జనరల్‌ వోపి, పిహెచ్‌సి పరిశీలించారు. రెండవ డోస్‌ తీసుకోవడానికి వస్తున్నారా కరోనా ర్యాపిడ్‌ పరీక్షలు ఈరోజు ఎన్ని జరిగాయని, కోవిద్‌ వ్యాక్సినేషన్‌ కు ఎంత మంది వచ్చార‌ని ...

Read More »

నిర్ణయించిన చార్జీలు మాత్రమే వసూలు చేయాలి

నిజామాబాద్‌, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలోని ప్రైవేటు ల్యాబ్‌ యాజమానులు కరోనా టెస్టుల‌ పేరుతో ఇష్టానుసారంగా డబ్బు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నందున జిల్లా కలెక్టర్‌ జిల్లా వ్యాప్తంగా ఆరు టాస్క్‌ ఫోర్స్‌ టీంల‌ను ఏర్పాటు చేసి మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. 23 కేంద్రాల‌లో తనిఖీలు చేసి కొన్ని కేంద్రాల‌లో సరియైన సౌకర్యాలు కల్పించట్లేదని విచారణలో తేలింది. వీటి విషయమై విచారణ అనంతరం చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని జిల్లా ...

Read More »

ఆన్‌లైన్‌ రిజిష్టర్‌ చేసుకున్నవారికే టీకాలు

నిజామాబాద్‌, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకున్న వారికే కోవిడ్‌ వ్యాక్సిన్‌ టీకాలు వేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 45 సంవత్సరాలు పై బడిన వారు ప్రతి ఒక్కరు కోవిన్‌ యాప్‌లో పేరు నమోదు చేసుకోవాల‌న్నారు. వివరాలు నమోదు చేసుకున్నవారికి కేటాయించిన తేదీల్లో సంబంధిత కేంద్రాల్లో టీకాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లాలో మొత్తం 42 సెంటర్లు ఉన్నాయని, నచ్చిన సెంటర్‌ను ఎంపిక చేసుకొని అక్కడికి వెళ్లి టీకా తీసుకోవచ్చని ...

Read More »

అధిక వసూలు చేస్తే కాల్‌ చేయండి

నిజామాబాద్‌, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ప్రయివేటు అంబులెన్స్‌ యజమానులు ఇష్టానుసారంగా డబ్బు వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి హెచ్చరించారు. కరోనాను అవకాశంగా చేసుకొని ప్రజల‌ నుంచి అధికంగా డబ్బు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. కావున అంబులెన్స్‌ ఓనర్‌లు, డ్రైవర్లు తెలంగాణ మోటర్‌ వెహికల్‌ చట్టం నిబంధనలు, డిఎం ఆక్ట్‌ 2005 అనుగుణంగా డబ్బు వసూలు చేయాల‌న్నారు. నిబంధనల‌ ప్రకారం వసూల్‌ చెయ్యని యజమానుల‌పై సీరియస్‌గా చర్యలు తీసుకుంటామని ...

Read More »

కరోనా మరణాల‌కు ప్రభుత్వమే బాధ్యత వహించాలి

నిజామాబాద్‌, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా చికిత్స విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ సీపీఐ (ఎం.ఎల్‌) న్యూడెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్‌లోని ఎన్‌ఆర్‌ భవన్‌లో విలేకరుల‌ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా న్యూడెమోక్రసీ జిల్లా (ఇన్చార్జి) కార్యదర్శి వనమాల‌ కృష్ణ మాట్లాడుతూ కరోనా వచ్చి సంవత్సరం పైగా అవుతున్నా ఇప్పటికీ నిర్ధారణ, చికిత్స సౌకర్యాల‌ విషయంలో ప్రభుత్వాల‌ దగ్గర పరిష్కారం లేకపోవడం సిగ్గుచేటన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకదానిపై ఒకటి ఆరోపణలు చేసుకుంటున్నాయి కానీ ప్రజల‌కు ...

Read More »

రెండు రోజులు రైతులు అప్రమత్తంగా ఉండాలి

నిజామాబాద్‌, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న అకాల‌ వర్షాల వల‌న ఏర్పడిన నష్ట నివారణ చర్యలు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి తెలిపారు. సోమవారం తహసీల్దార్లు, వ్యవసాయ శాఖ అధికారులు, సివిల్‌ సప్లయి అధికారులు, కొనుగోలు కేంద్రాల‌ నిర్వాహకుల‌తో కలెక్టర్‌ సెల్‌ కాన్ఫరెన్సులో మాట్లాడారు. అకాల‌ వర్షాల‌కు తక్కువగా తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టి తూకం వేయాల‌న్నారు. ఎక్కువ మొత్తం తడిసిన ధాన్యాన్ని బాయిల్్డ మిల్లుల‌కు పంపించాల‌ని సంబంధిత ...

Read More »

అక్రమాల‌కు పాల్ప‌డే ఆసుపత్రుల‌ నుండి సంజాయిషీ తీసుకోవాలి

నిజామాబాద్‌, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అక్రమాల‌కు పాల్ప‌డే ఆసుపత్రుల‌ నుండి సంజాయిషీ తీసుకోవాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. రెమిడెసివర్‌ ఇంజక్షన్లు, ఆక్సిజన్‌ వాడకంపై ప్రైవేటు ఆసుపత్రుల‌లో తనిఖీ చేసి నివేదిక సమర్పించాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ టాస్క్‌ ఫోర్స్‌ కమిటీని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కమిటీ అధికారులు నిజామాబాద్‌ నగరంలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల‌లో శుక్రవారం, శనివారం తనిఖీలు నిర్వహించి నివేదికలు సిద్ధం చేశారు. వారి నివేదిక ...

Read More »

ప్రైవేట్‌ ఆస్పత్రుల‌ తనిఖీ

నిజామాబాద్‌, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని ప్రైవేట్‌ ఆస్పత్రుల‌లో రెమిడెసివర్‌ ఇంజక్షన్లు, ఆక్సిజన్‌ ఉపయోగంపై జిల్లా కలెక్టర్‌ నియమించిన టాస్క్‌ఫోర్సు అధికారులు శ్రీల‌క్ష్మి, శ్రీవిష్ణు, తిరుమల‌, శ్రీ సాయి, సాయి అశ్విన్‌, జయ, మనోరమ, వేదాన్ష్‌, శ్రీ వెంకటేశ్వర, సూర్య, ప్రతిభ కిడ్స్‌ కేర్‌ తదితర ఆస్పత్రుల‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఇంజక్షన్‌తో ఆక్సిజన్‌ పేషెంట్లకు ఇచ్చిన వివరాల‌ను సరఫరా, వాడకం, నిలువ తదితర విషయాల‌ను రికార్డుల‌ ద్వారా పరిశీలించారు. రోగుల‌ కుటుంబ సభ్యుల‌కు కాల్‌ చేసి ...

Read More »

నా కష్టార్జితం ఇప్పించండి

నిజామాబాద్‌, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యుఏఇ రాజధాని అబుదాబి లోని తన యాజమాన్య కంపెనీ ఘంతూత్‌ ట్రాన్సుపోర్టు అండ్‌ జనరల్‌ కాంట్రాక్టింగ్‌ నుండి తనకు రావల‌సిన 16 సంవత్సరాల‌ కష్టార్జితం ‘ఎండ్‌ ఆఫ్‌ సర్వీస్‌ బెనిఫిట్స్‌’ (ఉద్యోగ ముగింపు ప్రయోజనాలు) ఇప్పించాల‌ని పెట్టెం కిషన్‌ అనే గల్ఫ్‌ కార్మికుడు శుక్రవారం మంచిర్యాల‌ జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. మంచిర్యాల‌ జిల్లా ల‌క్షెటిపేట మండలం కొత్తూరు గ్రామానికి చెందిన పెట్టెం కిషన్‌ అనే కార్మికుడు 2004 లో అబుదాబికి ...

Read More »

గురువారం నాటి ఘటనపై కలెక్టర్‌ ఆగ్రహం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెమిడెసివిర్‌ ఇంజక్షన్‌ అని చెప్పి సెలైన్‌ వాటర్‌ ఉంచిన బాటిల్స్‌ అమ్మడం, ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది ఈ ఇంజక్షన్లు బ్లాక్‌లో అమ్మడం ఘటనను యంత్రాంగం తీవ్రంగా పరిగణిస్తున్నదని, ఇందుకు పాల్ప‌డిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధుల‌తో ఈ విషయాల‌పై సెల్‌ కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు. కరోనా వల‌న ప్రజలు రకరకాలుగా ప్రతిరోజు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రెమిడెసివిర్‌ ఇంజక్షన్ల ...

Read More »

పోలీసువారి హెచ్చరిక

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ 1వ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నకిలీ రెమిడెసివియర్‌ ఇంజక్షన్‌ కరోనా రోగుల‌కు విక్రయించిన ఇద్దరు వ్యక్తుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. వాడిన రెమిడెసివియర్‌ సీసాలో సిలేన్‌ వాటర్‌ పోసి కరోనా రోగుల‌కు విక్రయించి మోసం చేసిన వారిపై కేసు నమోదు చేసి రినూండ్‌కు తరలించడం జరిగిందని నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిజామాబాద్‌ 4వ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అధిక ధరల‌కు (1 ఇంజక్షన్‌ ...

Read More »

గల్ఫ్‌లో ఎగవేసిన జీతాలు ఇలా పొందవచ్చు !

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా సందర్బంగా గల్ఫ్‌ తదితర దేశాల‌ నుండి వాపస్‌ వచ్చిన వల‌స కార్మికుల‌కు వారి యాజమాన్యాల‌ నుండి రావల‌సిన జీతం బకాయిలు, బోనస్‌, పిఎఫ్‌, గ్రాట్యుటీ లాంటి ‘ఎండ్‌ ఆఫ్‌ సర్వీస్‌ బెనిఫిట్స్‌’ (ఉద్యోగ విరమణ ప్రయోజనాలు) ఇప్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాల‌ని ప్రవాసి మిత్ర లేబర్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు స్వదేశ్‌ పరికిపండ్ల ఒక ప్రకటనలో కోరారు. ‘జస్టిస్‌ ఫర్‌ వేజ్‌ తెఫ్ట్‌’ (జీతం దొంగతనం గురించి న్యాయం చేయాలి) ...

Read More »

27న ప్రచారం ముగించాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల‌ 30 వ తేదీన బోధన్‌ మున్సిపాలిటీ లోని 18 వ వార్డ్‌కు ఎల‌క్షన్‌ జరగనున్నందున రాష్ట్ర ఎన్నికల‌ కమిషన్‌ ఆదేశాల‌ మేరకు 72 గంటల‌ ముందుగా అనగా 27వ తేదీ సాయంత్రం 5 గంటల‌ లోగా ప్రచారం ముగించాల‌ని స్థానిక సంస్థల‌ అదనపు కలెక్టర్ ల‌త తెలిపారు. శనివారం రాష్ట్ర ఎన్నికల‌ కమిషనర్‌ పార్థసారధి మున్సిపల్‌ ఎన్నికలు జరిగే జిల్లా అధికారుల‌తో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారని, ఈ సందర్భంగా పోటీచేసే అభ్యర్థులు ...

Read More »

నిజామాబాద్‌ జిల్లాలో కరోనాతో ఇద్దరు జర్నలిస్టుల‌ మృతి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా కారణంగా ఇప్పటి వరకు నిజామాబాద్‌ జిల్లాలో ముగ్గురు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అయితే తాజాగా నిజామాబాద్‌ నియోజకవర్గంలోని ధర్పల్లి మండల‌ సాక్షి దినపత్రిక పాత్రికేయుడు అల్లాడి శేఖర్‌ (48) అదేవిధంగా నిజామాబాద్‌ రూరల్ ఎల‌క్ట్రానిక్‌ మీడియా టివి-5 పాత్రికేయుడు వేణుగోపాల్‌ (49)లు కరోనాతో శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందారు. గత వారం రోజుల‌ క్రితం వీరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా అల్లాడి శేఖర్‌ ఇంట్లో స్వీయ నిర్బంధంలో ఉంటూ చికిత్స ...

Read More »