Nizamabad

జైరెడ్డిఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అమరులకు నివాళులు

నిజామాబాద్‌, మార్చ్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాసర పుణ్యక్షేత్రంలో పవిత్ర గోదావరి నది తీరాన అమర జవానులకు నివాళులు అర్పించి వారి అత్మకు శాంతి చేకూరాలని మంగళవారం ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. కార్యక్రమంలో వ్యస్థాపక అధ్యక్షుడు మధుసూదన్‌ రెడ్డి, జాతీయ అధ్యక్షుడు ఎడ్ల ఉప్పల్‌ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు పోరెడ్డి శాంతన్‌ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సరసాని సురేందర్‌ రెడ్డి, మహిపాల్‌ రెడ్డి, హోన్నజీపేట్‌ సురేందర్‌ రెడ్డి, రాజారెడ్డి, మహేందర్‌ రెడ్డి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Read More »

ప్రాధాన్యత అంశాల ప్రాతిపదికగా గ్రామాల్లో అభివద్ధి పనులు చేపట్టాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో ఏ పనులు నిర్వహించాలో వాటి ప్రాధాన్యతను గుర్తించి అభివద్ధి చేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు తెలిపారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులకు నిర్వహిస్తున్న శిక్షణలో భాగంగా మూడవదశ కార్యక్రమాన్ని మంగళవారం డిచ్‌పల్లి టిటిడిసిలో ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన పంచాయతీ రాజ్‌ చట్టం ద్వారా గ్రామాలను అభివద్ధి చేయడానికి ప్రాధాన్యత అంశాలను గుర్తించాలన్నారు. వాటిని పక్కాగా అమలు చేయడానికి శిక్షణను సర్పంచులు సద్వినియోగం ...

Read More »

శివపంచాక్షరీ స్తోత్రం

నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ| నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై ”న” కారాయ నమః శివాయ || 1 || మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ| మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై ”మ” కారాయ నమః శివాయ || 2 || శివాయ గౌరీ వదనాబ్జ బంద సూర్యాయ దక్షాధ్వర నాశకాయ | శ్రీ నీలకంఠాయ వషభధ్వజాయ తస్మై ”శి” కారాయ నమః శివాయ || 3 || వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్య మునీంద్ర దేవార్చిత శేఖరాయ | ...

Read More »

గల్ప్‌ బాధితులకు అండగా తెలంగాణ జాగృతి

నిజామాబాద్‌ ప్రతినిధి, మార్చ్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి కోసం ఏజెంట్లను నమ్మి లక్షలు అప్పు చేసి గల్ఫ్‌ వెళ్తే అక్కడ పని, వీసా సరిగా లేదని, పని దొరకక నానా కష్టాలు పడ్డ 13 మందికి తెలంగాణ జాగతి ఖతర్‌శాఖ అండగా నిలిచింది. వారిని స్వదేశానికి చేర్చడంలో సహాయపడింది. ఆదివారం జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన ప్రెస్‌ మీట్‌లో తెలంగాణ జాగతి ప్రధాన కార్యదర్శి నవీన్‌ ఆచారి, జిల్లా అధ్యక్షులు అమర్‌దీప్‌ గౌడ్‌ బాదితుల వివరాలు వెల్లడించారు. ఏజెంట్లను ...

Read More »

అర్హులైన వారిని ఓటరుగా నమోదు చేయాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటరు నమోదు ప్రత్యేక క్యాంపెయిన్‌ పురస్కరించుకొని ఆదివారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు నగరంలోని ఫుల్‌ లాంగ్‌, సారంగాపూర్‌ పోలింగ్‌ కేంద్రాలలో జరిగే ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించారు. అనంతరం జన్‌సౌత్‌ తహసిల్‌ కార్యాలయం, నగరపాలక సంస్థ కార్యాలయాలను సందర్శించి ఓటర్‌ జాబితాలో గుర్తించిన డూప్లికేట్‌ డబల్‌ నేమ్స్‌ లాజికల్‌ ఎర్రర్‌ సవరించే ప్రక్రియను కలెక్టర్‌ పరిశీలించారు. ముందుగా జిల్లా కలెక్టర్‌ ఫులాంగ్‌, పోచమ్మగల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన 67,68,69 ...

Read More »

6న ఇందూరుకు అమిత్‌ షా

నిజామాబాద్‌, మార్చ్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 6న నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా విచ్చేస్తున్నట్టు బిజెపి కేంద్ర కార్య వర్గ సభ్యులు యెండల లక్ష్మినారాయణ తెలిపారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా యెండల మాట్లాడుతూ 6న స్థానిక భూమారెడ్డి కన్వెన్షన్‌లో నిజామాబాద్‌, అదిలాబాద్‌, జహీరాబాద్‌, మెదక్‌, కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల క్లస్టర్‌ సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మీడియా సమావేశంలో నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షులు పల్లె ...

Read More »

బిజెవైఎం ఆద్వర్యంలో బైక్‌ ర్యాలీ

నిజామాబాద్‌, మార్చ్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం బిజెవైఎం ఆధ్వర్యంలో విజయలక్ష్యం 2019 మహా బైక్‌ ర్యాలీని నగర అధ్యక్షుడు రోషన్‌లాల్‌ బోరా ఆద్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారతీయ జనతాపార్టీ కేంద్ర కార్యవర్గ సభ్యులు యెండల లక్ష్మినారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్త, బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు న్యాలం రాజు, బిజెపి నగర అధ్యక్షుడు యెండల సుధాకర్‌ తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యెండల మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడి తిరిగి దేశ ప్రధాని కావాలనే ...

Read More »

పొలింగ్‌ కేంద్రాలు పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మార్చ్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాలపల్లి దారుగల్లీ ఉర్దూ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన 174,176,177,180 194,195 పోలింగ్‌ కేంద్రాలను శనివారం జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా డూప్లికేట్‌ ఓటర్లు, ఓటరు లిస్టులో శాశ్వతంగా తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని బిఎల్‌ఓ లను ఆదేశించారు. పాఠశాల ఆవరణలో పరిశుభ్రంగా లేకపోవడంతో ప్రధానోపాధ్యాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్పు చేసిన పోలింగ్‌ కేంద్రాల నంబర్లు గోడపై వ్రాయించాలని తహసీల్దార్‌కు ఆదేశాలు జారీచేశారు. మధ్యాహ్న భోజన వంటగది పరిశీలించి, ...

Read More »

ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్దం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ సబ్‌ డివిజన్‌ రైతాంగం గత 20 రోజులకుపైగా తాము పండించిన ఎర్ర జొన్న క్వింటాలుకు రూ. 3500 ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, పసుపు క్వింటాలుకు రూ.15 వేలు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ దశలవారీ ఆందోళనలు నిర్వహించినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో గత్యంతరం లేక రైతులు తమ గోడును ముఖ్యమంత్రికి తెలియజేయటానికి ఆర్మూర్‌ నుండి హైదరాబాద్‌కు పాదయాత్రగా వెళ్లాలని నిర్ణయించి బయలుదేరగా ప్రభుత్వం రైతులను అడుగడుగునా అడ్డగిస్తూ ...

Read More »

దివ్యంగులకు ప్రత్యేక ఓటరు నమోదు కేంద్రాలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రకారం జిల్లాలో ఫిబ్రవరి 27 నుండి మార్చి 5 వరకు వారం రోజులపాటు అన్ని రకాల దివ్యాంగుల కొరకు ఓటరు నమోదు ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన వారు ఆపై వయసు గలవారు, ఇప్పటివరకు ఓటరుగా నమోదు చేసుకొని వారు, ఓటర్‌ జాబితాలో పేరు లేని వారు, సదరన్‌ సర్టిఫికెట్‌ లేనివారు కూడా పోలింగ్‌ బూతు వద్ద ...

Read More »

కేంద్రం దృష్టికి పసుపు రైతుల ఆందోళన

నిజామాబాద్‌ ప్రతినిధి, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌, నీతిఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌లకు వినతి సానుకూలంగా స్పందించిన నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ పసపు రైతులకు బీజేపీ పాలిత రాష్ట్రాలలాగానే బోనస్‌ ఇవ్వాలని ధర్మపురి అర్వింద్‌ డిమాండ్‌ నిజామాబాద్‌లో జరుగుతున్న పసుపురైతుల ఆందోళనలను కేంద్రం దష్టికి తీసుకెళ్లారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధర్మపురి అర్వింద్‌. బీజేపీ నాయకులు వెంకట్‌, వినయ్‌రెడ్డి, బస్వలక్ష్మీనర్సయ్య, పార్లమెంట్‌ సెగ్మెంట్‌ ...

Read More »

వీడియో జర్నలిస్టులకు ఆహ్వానం

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ నిజామాబాద్‌న్యూస్‌.ఇన్‌ సంస్థలో పనిచేయటానికి ఉత్సాహవంతులైన వీడియో జర్నలిస్టులు కావలెను. ఇంటర్వ్యూలు, ప్రెస్‌మీట్‌లు, ఇతరత్రా కార్యక్రమాలు వీడియోలో చిత్రీకరించేందుకు చక్కటి వాక్చాతుర్యం, వాగ్దాటి కలిగిన జర్నలిస్టులు కావలెను. నిజామాబాద్‌ పట్టణం కేంద్రంగా ఉంటూ జిల్లాలో ఇతర ప్రాంతాలకు వెళ్లి వార్త సేకరణ చేయగలగాలి. ఆకర్షణీయ వేతనం ఇవ్వబడును. సొంతంగా వీడియో కెమెరా లేదా హెచ్‌డి ఫోన్‌ కలిగి ఉండవలెను. మరిన్ని వివరాలకు 91 8333088383 నెంబర్‌లో మీ ఇమెయిల్‌, ఫోన్‌ నెంబర్‌ మొదలైన వివరాలు వాట్సాఅప్‌ చేసి సంప్రదించగలరు.

Read More »

ఎర్రజొన్న రైతులు ఆందోళన చెందవద్దు…

నిజామాబాద్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్లు, భవనాలు, రవాణా, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డికి ఆత్మీయ సన్మానం ఘనంగా జరిగింది. బుధవారం నిజామాబాద్‌లోని శ్రావ్యగార్డెన్‌లో జరిగిన కార్యక్రమానికి నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దుఃఖం దాచుకోవాలంటారు అలాగే సంతోషాన్ని పంచుకోవాలంటారు…కేసీఆర్‌కు జిల్లా ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. స్పీకర్‌, శాసన సభ వ్యవహారాలు మన జిల్లాకే వచ్చాయని, శాసన వ్యవస్థలను మనవాళ్ళే చూస్తుండటం మనకు గర్వ కారణం అన్నారు కవిత. ...

Read More »

మలేషియాలో పడరాని కష్టాలుపడి ఎట్టకేలకు స్వగ్రామం చేరిన బాదితుడు

నిజామాబాద్‌ ప్రతినిధి, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జరిమానాతో పాటు, విమాన చార్జీలు చెల్లించి స్వదేశం చేర్చిన ఎంపీ కల్వకుంట్ల కవిత బాదితుడు నరేష్‌ను బుధవారం పరామర్శించిన జాగతి నాయకులు ఎంపీ కవితకు జీవితాంతం రుణపడి ఉంటామన్న బాదితుడి కుటుంబ సభ్యులు పొట్టకూటి కోసం మలేషియా వెళ్లి పడరాని కష్టాలు అనుభవించిన ఆ యువకుడు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నాడు. ఎంపీ కల్వకుంట్ల కవిత సహాయంతో ఆ యువకుడికి విముక్తి లభించింది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్‌ కు చెందిన ...

Read More »

పరీక్ష కేంద్రం తనిఖీ

నిజామాబాద్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ఈనెల 27వ తేదీ నుండి మార్చి 18వ తేదీ వరకు జరుగు ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో భాగంగా బుధవారం మొదటి సంవత్సరం పరీక్షలలో మొత్తం 20వేల 211 మంది విద్యార్థులు హాజరైనట్లు జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. బుధవారం ఉదయం నగరంలోని కోటగల్లి ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో జరుగు ఇంటర్మీడియట్‌ పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 44 పరీక్ష కేంద్రాలను ...

Read More »

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల పంపిణీ

నిజామాబాద్‌, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్తా గురువారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి క్రింద మంజూరైన రూ. 3 లక్షల 92 వేలు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను 12 మంది లబ్దిదారులకు అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిగాల మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ విషయంలో చాలా అలసత్వం ఉండేదని తెలంగాణ ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ సీఎం రిలీఫ్‌ ఫండ్‌ విషయంలో ఆలస్యం కాకుండా చర్యలు ...

Read More »

22న ”చింత బరిగె స్కీం”

నిజామాబాద్‌ కల్చరల్‌, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఫరెవర్‌ ఫెంటాస్టిక్‌ థియేటర్స్‌, సూర్యాపేట వారి నాటిక ‘చింత బరిగె స్కీం’ ఈనెల 22న శుక్రవారం సాయంత్రం 6 గంటలకు స్థానిక రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో ప్రదర్శించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. నాటక రచన ఖాజా పాషా, దర్శకత్వం ఫరెవర్‌ థియెటర్స్‌, పర్యవేక్షణ దీన బాందవ అని పేర్కొన్నారు. ఇందూరు కవులు, కళాకారులు, రచయితలు, నాటక ప్రియులు పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు.

Read More »

ఘనంగా శివాజీ జయంతి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఛత్రపతి శివాజీ మహరాజ్‌ జయంతి వేడుకలు పురస్కరించుకొని మంగళవారం బిజెవైఎం నగర అధ్యక్షుడు రోషన్‌లాల్‌బోరా ఆధ్వర్యంలో శివాజీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రోషన్‌ మాట్లాడుతూ హిందూ సమాజంకోసం శివాజీ చేసిన సేవలు ఎనలేనివని, యువత శివాజీని ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని పేర్కొన్నారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి చైతన్య కులకర్ణి, నరేశ్‌, సాయి, ప్రతాప్‌, మహేశ్‌, సంజీవ్‌, కార్యకర్తలు పాల్గొన్నారు. నిజామాబాద్‌ బార్‌ ...

Read More »

పేకాటరాయుళ్ల అరెస్టు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని ఖలీల్‌వాడిలో ఓ సిటీ స్కానింగ్‌ సెంటర్‌ పై అంతస్తులో మంగళవారం పేకాట ఆడుతున్న పదిమందిని అదుపులోకి తీసుకున్నట్టు టాస్క్‌ఫోర్సు సిఐ జగదీశ్‌ తెలిపారు. వారి వద్దనుంచి లక్ష 2 వేల 226 నగదు, పది సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు ఆయన తెలిపారు. సమగ్ర విచారణ కొరకు కేసును ఒకటో టౌన్‌కు బదిలీ చేసినట్టు సిఐ పేర్కొన్నారు. దాడిలో ఎస్‌ఐ సంతోష్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నట్టు తెలిపారు.

Read More »

నులిపురుగు మాత్రల పట్ల అపోహలు వద్దు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో 19 సంవత్సరాల లోపు పిల్లలకు పంపిణీ చేసే నులి పురుగు నివారణ మందుల పట్ల ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అన్నారు. మంగళవారం పోచమ్మగల్లి, పూలాంగ్‌ ప్రాథమిక పాఠశాలలో నులి పురుగుల మందుల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లలను ఆరోగ్యవంతంగా ఉజ్వల భవిష్యత్తును అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నులి పురుగు మందులను పిల్లలకు వేయడం ...

Read More »