Breaking News

Nizamabad

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆకుల లలిత

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ కాంగ్రెస్‌ అభ్యర్తి ఆకుల లలిత మంగళవారం గడప గడపకు కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమంలో భాగంగా మాదాపూర్‌ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు లలితను ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గంగరమంద, కొండూరు, మామిడిపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా లలిత మాట్లాడుతూ తన ప్రచారానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందని, తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది మహాకూటమి అని తనను ఆర్మూర్‌ ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు.

Read More »

తెరాసలో చేరిన రాజారాం యాదవ్‌

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు తెలంగాణ పోరాటంలో చురుకైన పాత్ర వహించిన రాజారాం యాదవ్‌ మంగళవారం ఎంపి కవిత, ఆర్మూర్‌ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో తెరాసలో చేరారు. గత ఎన్నికల్లో బిజెపి, టిడిపి కూటమిలో ఆర్మూర్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన రాజారాం యాదవ్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడి తెరాసలో చేరారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నపుడు రేవంత్‌రెడ్డి అనుచరుడిగా ఉన్న రాజారాం యాదవ్‌, ఆయనతోపాటు కాంగ్రెస్‌లో చేరారు. ప్రజాకూటమి పేరుతో అన్ని ...

Read More »

యెండల విస్తృత ప్రచారం

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ నిజామాబాద్‌ అర్బన్‌ అభ్యర్థి యెండల లక్ష్మినారాయణ మంగళవారం 8,11,18వ డివిజన్‌లలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మినారాయణ మాట్లాడుతూ ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందని బిజెపిని ప్రజలు ఆదరిస్తు ఘన స్వాగతం పలుకుతున్నారని అన్నారు. బిజెపి గెలుపుపట్ల దీమా వ్యక్తం చేశారు. మార్కెట్‌ను సుందరీకరణ చేస్తామని, డ్రైనేజీ సమస్య పరిష్కరించి నగరాన్ని స్మార్ట్‌ సిటిగా మార్చడమే బిజెపి లక్ష్యమని అన్నారు. యువతకు ముద్ర పథకం ...

Read More »

చెక్‌పోస్టుల వద్ద పకడ్బందీగా తనిఖీలు చేపట్టాలి

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చెక్‌పోస్టుల వద్ద పకడ్బందీగా తనిఖీలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం నవీపేట మండలం యంచ, రెంజల్‌, కందకుర్తి వద్ద అంతర్‌జిల్లా చెక్‌పోస్టులను కలెక్టర్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల రోజు వరకు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. తనిఖీల సమయంలో వివరాలను అడిగి తెలుసుకోవాలని, నమోదు చేసి రిజిస్ట్రేషన్లు, ఇతర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్‌ సూచించారు. ...

Read More »

గుడిసెకు నిప్పంటుకొని ఇద్దరు చిన్నారుల మృతి

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని గూపన్‌పల్లి ప్రాంతంలో ఆర్మూర్‌ రోడ్డు పక్కన గుడిసె వేసుకొని బతుకు దెరువుకోసం అంజుమాన్‌ ఫారం నుంచి నిజామాబాద్‌ వచ్చి కూలి పనిచేస్తున్న కుటుంబం అగ్నిప్రమాదంతో చిన్నాభిన్నమైన సంఘటన జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… అంజుమన్‌ ఫారానికి చెందిన దేవిదాస్‌, భార్య, ఇద్దరు చిన్నారులతో పాటు గూపన్‌పల్లి పెట్రోల్‌పంపు వద్ద గుడిసెలో ఉంటూ కూలిపనిచేస్తు జీవనం సాగిస్తున్నారు. రోజువారిలాగే పనిపూర్తిచేసుకొని ఇద్దరు చిన్నారులతో కలిసి నిద్రకు ఉపక్రమించారు. నివాసముంటున్న ...

Read More »

తారక్ రామ్ నగర్ లో బాజిరెడ్డి జగన్ ముమ్మర ప్రచారం

రూరల్ trs అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ తనయుడు trs యువ నాయకులు బాజిరెడ్డి జగన్ సోమవారం రూరల్ నియోజకవర్గ పరిధిలో గల తారకరామ్ నగర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో trs విజయం ఖాయం అని అన్నారు కాంగ్రెస్ పార్టీ మహా కూటమి పేరుతో తెలంగాణాల ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.దేశంలో ఎ రాష్ట్రం లో లేని విదంగా సంక్షేమం పథకాలు రాష్ట్రంలో అమలు అవుతున్నాయి అని,ఇది చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ మహ కూటమి పేరుతో ...

Read More »

దివ్యాంగులపై వివక్షత వీడాలి

రెంజల్‌, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దివ్యాంగులపై చూపించాల్సింది సానుభూతి కాదని వారికి కావాల్సింది ప్రోత్సాహమని ఎంపిడివో చంద్రశేఖర్‌ అన్నారు. మండలంలోని సాటాపూర్‌ భవిత కేంద్రంలో సోమవారం దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందన్నారు. దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణిస్తు ఆట పాటల్లో విజయాలు సాధించాలని సూచించారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎంఇవో గణేవ్‌రావు, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్‌, ...

Read More »

షకీల్‌ అన్నను 50 వేల మెజార్టీతో గెలిపిస్తాం

రెంజల్‌, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస పార్టీ బోదన్‌ ఎమ్మెల్యే అభ్యర్థి షకీల్‌ అన్నను 50 వేల భారీ మెజార్టీతో గెలిపించుకుని బోధన్‌లో గులాబి జెండా ఎగురవేస్తామని జాగృతి జిల్లా నాయకులు వికార్‌ పాషా అన్నారు. మండలంలోని సాటాపూర్‌ గ్రామంలో సోమవారం తెరాస పార్టీ ఆద్వర్యంలో బోదన్‌ ఎమ్మెల్యే అభ్యర్థి షకీల్‌కు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తు కారు గుర్తుకు ఓటు వేసి షకీల్‌ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ...

Read More »

తెరాసకు ఓటు వేసి సంక్షేమానికి మద్దతు పలకాలి

కామారెడ్డి, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాసకు ఓటు వేసి సంక్షేమానికి మద్దతు పలకాలని కామారెడ్డి అసెంబ్లీ తెరాస అభ్యర్థి గంప గోవర్ధన్‌ అన్నారు. సోమవారం ఆయన లచ్చాపేట్‌, కాకులగుట్ట, రాజీవ్‌నగర్‌ కాలనీతో పాటు పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్‌ తెరాస ప్రభుత్వ హయాంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, బడుగు, బలహీన వర్గాలు రైతు శ్రేయస్సు కోసం ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. తెచ్చుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చుకునేందుకు ప్రగతి పనుల్లో ముందుకెళ్లేందుకు తెరాసను ...

Read More »

వెబ్‌కాస్ట్‌ కెమెరామెన్‌ ఓటరు ప్రవేశాన్ని రికార్డు చేయాలి

కామారెడ్డి, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వెబ్‌కాస్ట్‌ కెమెరామెన్‌ ఓటరు ప్రవేశాన్ని తప్పకుండా రికార్డు చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. సాధారణ ఎన్నికల్లో భాగంగా పోలింగ్‌ రోజున వెబ్‌కాస్టింగ్‌ కోసం 74 మంది విద్యార్థులకు సోమవారం స్థానిక ఆర్‌కె డిగ్రీ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఓటు వేసే కంపార్టుమెంటును రికార్డు చేయకూడదని తెలిపారు. పోలింగ్‌ ముందురోజు 6వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు 74 వెబ్‌కాస్టింగ్‌ స్క్రీనింగ్‌ ఉంటుందని, ఈ ...

Read More »