Breaking News

Nizamabad

లాక్‌డౌన్‌ పర్యవేక్షణకు ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌

నిజామాబాద్‌, మే 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో లాక్‌ డౌన్‌ నిబంధనల అమలును పర్యవేక్షించడానికి మున్సిపాలిటీ పరిధిలో ఫ్లైయింగ్‌ స్క్వాడ్్స‌ను నియమించామని, ఎటువంటి ఉల్లంఘనకు పాల్ప‌డినా జరిమానాలు విధించడానికి ఫ్లైయింగ్‌ స్క్వాడ్్స‌కు అధికారాలు జారీచేయడం జరిగిందని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా వ్యాధి కట్టడికై విధించిన లాక్‌ డౌన్‌ నిబంధనల‌ను బుధవారం నుండి కొంత వరకు సడలించి మార్గదర్శకాలు జారీచేసినందున, మార్గదర్శకాల‌కు అనుగుణంగా జిల్లాలోని ప్రజలంతా నడుచుకోవాల‌ని, ఎటువంటి ...

Read More »

మద్యం కొనుగోలుదారులు జాగ్రత్తలు పాటించాలి

నిజామాబాద్‌, మే 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి జిల్లాలో బుధవారం నుండి ప్రారంభమైన మద్యం అమ్మకాల‌ తీరును క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల‌కు అనుగుణంగానే భౌతిక దూరం పాటిస్తూ కొనుగోలు చేస్తున్నారా అని వాకబు చేశారు. మద్యం కొనుగోలు చేసేవారు భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాల‌ని, చేతుల్ని శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాల‌ని సూచించారు. పట్టణంలోని పెద్ద బజార్‌, శివాజీ నగర్‌, వర్ని రోడ్డు, పూలాంగ్‌ చౌరస్తా, వినాయక్‌ నగర్‌, కంటేశ్వర్‌, కంటేశ్వర్‌ ...

Read More »

ఎరువులు, యూరియా కొరత లేకుండా ప్రణాళికలు రూపొందించాలి

నిజామాబాద్‌, మే 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రానున్న వర్షాకాంలో ఎరువులు, ఫర్టిలైజర్‌ యూరియా కొరత లేకుండా ప్రణాళిక రూపొందించాల‌ని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి అన్నారు. బుధవారం తన ఛాంబర్లో సంబంధిత అధికారుల‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రానున్న వర్షాకాలంలో రైతుల‌కు ఫర్టిలైజర్‌ యూరియా కొరత లేకుండా చూడాల‌ని, ప్రభుత్వ ఆదేశాల‌ మేరకు వచ్చినటువంటి ఎరువుల‌ను యూరియాను అన్ని హోల్‌సేల్‌, రిటైల్‌, ఫాక్స్‌ సొసైటీల‌కు సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాల‌ని ...

Read More »

148 వాహనాలు సీజ్‌

నిజామాబాద్‌, మే 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి చట్టవిరుద్దంగా రోడ్లపై తిరుగుతున్న మొత్తం 148 వాహనాలు సీజ్‌ చేసి కేసులు నమోదు చేయడం జరిగిందని నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ తెలిపారు. సీజ్‌ చేసిన వాటిలో ద్విచక్ర వాహనాలు 132, ఆటోలు 15, ఫోర్ వీల‌ర్స్‌ 1 ఉన్నాయన్నారు. లాక్‌డౌన్‌ పరిశీలించేందుకు మంగళవారం కమీషనరేట్‌ పరిధిలో ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, ప్రజలందరు స్వీయ ...

Read More »

నర్సరీలో నూరుశాతం మొక్కలు పెంచాలి

నిజామాబాద్‌, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పని కావాల‌ని కోరిక ప్రతి కూలీకి పని కల్పించాల‌ని, పనుల క‌ల్ప‌నలో ఎలాంటి అల‌సత్వం వహించవద్దని నిజామాబాద్‌ జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి అన్నారు. ఈ మేరకు మంగళవారం మండల‌ ఉపాధి హామీ సిబ్బందితో గ్రామాల్లో కూలీల‌కు పని కల్పించే విషయంలో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ముప్కాల్‌, డిచ్‌పల్లి, సిరికొండ, ధర్పల్లి, ఇందల్‌ వాయి, మొస్రా మండలాల్లో కూలీలు చాలా తక్కువ సంఖ్యలో హాజరవుతున్నందున, కూలీల‌ హాజరు శాతం పెంచాల‌ని కోరారు. కొల‌తల‌ ...

Read More »

ఇతర రాష్ట్రాల‌ నుంచి వచ్చేవారిని స్క్రీనింగ్‌ చేయాలి

నిజామాబాద్‌, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇతర రాష్ట్రాల‌ నుంచి తెలంగాణకు చేరుకుంటున్న వారిని ఎప్పటికప్పుడు స్క్రీనింగ్‌ చేసి హోమ్‌ క్వారంటైన్‌కు పంపాల‌ని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా లోని అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌ పోస్టులు సాలూర, పోతంగల్‌ల‌ను కలెక్టర్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చెక్‌ పోస్టు వద్ద ప్రతి వ్యక్తిని స్క్రీనింగ్‌ చేయాల‌ని, వేరే జిల్లాల‌ వారు అయిన పక్షంలో ఆయా జిల్లాల‌ కంట్రోల్‌ రూంకు సమాచారం అందించాల‌ని, మహారాష్ట్రలోని ...

Read More »

169 వాహనాలు సీజ్‌

నిజామాబాద్‌, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి చట్టవిరుద్దంగా రోడ్లపై తిరుగుతున్న మొత్తం 169 వాహనాలు సీజ్‌ చేసి కేసు నమోదు చేయడం జరిగిందని నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ తెలిపారు. సీజ్‌ చేసిన వాటిలో ద్విచక్ర వాహనాలు 164, ఆటోలు 3, ఫోర్ వీల‌ర్స్‌ 2 ఉన్నాయన్నారు. లాక్‌డౌన్‌ పరిశీలించేందుకు సోమవారం కమీషనరేట్‌ పరిధిలో ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, ప్రజలందరు స్వీయ ...

Read More »

మంజీరా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిత్యవసరాల‌ పంపిణీ

నిజామాబాద్‌, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాందేడ్‌ నుంచి బతుకు దెరువు కోసం నిజామాబాద్‌ నగరానికి వల‌స వచ్చారు. దొరికిన కూలీ నాలి పని చేసుకుంటూ ఇన్నాళ్లు బతుకెళ్లదీశారు. కానీ కరోనా లాక్‌ డౌన్ వల‌స కార్మికుల‌కు కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది. చాలా కుటుంబాలు పనులు లేక పస్తులుంటున్నాయి. ఆర్యనగర్‌లో తల‌దాచుకుంటున్న పది కుటుంబాల‌ గురించి తెలుసుకున్న మంజీరా హెల్పింగ్‌ హార్ట్స్‌ ఫౌండేషన్‌ వారి అవసరాలు తీర్చే ప్రయత్నం చేసింది. కుటుంబాల‌కు బియ్యం, నిత్యావసర వస్తువుల‌ను అందించింది. సమస్యను గుర్తించడమే ...

Read More »

ప్రతి కుటుంబానికి రూ. 7 వేలు అందించాలి

నిజామాబాద్‌, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత 42 రోజులుగా ప్రజలు పనులులేక అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీరిని ఆర్థికంగా ఆదుకోవడంలో నామమాత్రపు చర్యలు చేస్తున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి కంజర భూమయ్య అన్నారు. ఇటీవల‌ కురిసిన వడగళ్ల వానతో పంట నష్టపోయిన రైతుల‌ను ఆదుకోవాల‌ని సోమవారం దీక్ష చేపట్టారు. వల‌స కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, చేతివృత్తుల‌ వారు, ప్రయివేటు విద్యా, వైద్య శాల‌ల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, వర్కర్లు పనులు లేక, నిత్యవసర వస్తువులు ...

Read More »

జర్నలిస్టుల‌కు టోపీల‌ పంపిణీ

నిజామాబాద్‌, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వైబ్రెంట్స్‌ ఆఫ్‌ కలాం సంస్థ ఆద్వర్యంలో సోమవారం నిజామాబాదు ప్రెస్‌క్లబ్‌లో జర్నలిస్టుల‌కు టోపీలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ జాతీయ సమన్వయకర్త తిరునగరి శ్రీహరి మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో పోలీసు వైద్య సిబ్బందితో పాటు జర్నలిస్టులు అవిశ్రాంతంగా పని చేస్తున్నారని అన్నారు. తమ సంస్థ ఆద్వర్యంలో పోలీసులు, వల‌సకూలీల‌కు ఈ పాటికే టోపీలు అందజేశామని అందులో భాగంగా సోమవారం జర్నలిస్టుల‌కు కూడా టోపీలు పంపిణీ చేశామన్నారు. వైబ్రెంట్స్‌ ఆఫ్‌ కలాం తెలుగు ...

Read More »

తృటిలో తప్పిన ప్రమాదం

నిజామాబాద్‌, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాజధాని హైదరాబాద్‌ నుంచి రాజస్థాన్‌ వెళ్తున్న వల‌స కూలీలు పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. నిజామాబాద్‌ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్‌ జాతీయ రహదారి 44 వద్ద వారు ప్రయాణిస్తున్న ప్రైవేటు బస్సు సోమవారం తెల్ల‌వారుజామున అదుపుతప్పింది. దీంతో రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీక్కొంది. ప్రమాదంలో బస్సు డ్రైవర్‌కు గాయాల‌వగా, ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. తహసీల్దార్‌ ఇలియాస్‌ అహ్మద్‌ వారికి స్థానిక పాఠశాల‌లో ఆశ్రయం కల్పించి, అల్పాహారం అందించారు. అధికారులు ప్రత్యామ్నాయంగా ...

Read More »

చేనేత కార్మికుల‌కు నిత్యవసర సరుకుల‌ పంపిణీ

నిజామాబాద్‌, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పద్మశాలి ఆఫీషియల్స్‌ అండ్‌ ప్రొఫెషనల్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యములో నార్త్‌ అమెరికా పద్మశాలి అసోసియేషన్‌ ఆర్థిక సహకారంతో సోమవారం 22 మంది చేనేత కార్మికుల‌కు కూరగాయల‌తో పాటు నిత్యావసర సరుకులు, మాస్కులు పంపిణీ చేశారు. నిజామాబాదు నగరంలోని జిల్లా పద్మశాలి సంఘ భవనంలో కార్యక్రమం జరిగింది. పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు దీకొండ యాదగిరి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. లాక్‌ డౌన్‌తో చేనేత కార్మికులు పనులు లేక ఉపాధి కోల్పోయారని, ప్రభుత్వం చేనేత ...

Read More »

తెలుగులో తమిళ అక్షరాలా?

ఏప్రిల్‌ 30న యూనికోడ్‌ కన్‌సార్షియం వారు ఒక కబురు ట్విట్టర్‌లో పంచుకున్నారు. సారాంశం ఏంటంటే, తమిళంలోని రెండు అక్షరాల‌ను తెలుగులో విరివిగా వాడుతున్నందున, వాటిని తెలుగు అక్షరాల్లో చేర్చాల‌న్న ప్రతిపాదనను ఆమోదిస్తున్నట్టు. ఈ ప్రకటన వల‌న తెలుగు యూనికోడ్‌ లో తెలుగువారికి తెలియకుండానే, తెలుగువారి ఆమోదం లేకుండానే రెండు తమిళ అక్షరాలు వచ్చి చేరనున్నాయి. యూనికోడ్‌ కన్‌సార్షియం అనేది అన్ని భాష లిపుల‌ అక్షరాల‌కు కంప్యూటర్‌ / ఇతర ఉపకరణాల‌లో విశ్వవ్యాప్తంగా ఒకే రీతిగా ఉండే కోడ్లను (సంకేతాల‌ను) అందించడం చేసే అంతర్జాతీయ సంస్థ. ...

Read More »

అందరు నిబద్ధతతో పనిచేయడం వల్లే కరోనా పారద్రోల‌గలిగాము

నిజామాబాద్‌, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మొదట్లో నిజామాబాద్‌ జిల్లా కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల్లో హైదరాబాద్‌ తరువాత రెండవ స్థానంలో వుండిరది. ఆశా వర్కర్ల నుండి, హోం గార్డుల‌ నుండి పైస్థాయి అధికారుల‌ వరకు ప్రతి ఒక్కరు ప్రస్తుత పరిస్థితుల్లో నిబద్ధతతో పని చేయడం వ‌ల్ల‌ దాదాపు కరోనాను పారద్రోల‌గలిగామని, జిల్లాలో ఇప్పటివరకు 61 పాజిటీవ్‌ కేసులు రాగా 47 మంది నెగెటివ్‌ రిపోర్టుతో డిశ్చార్జ్‌ అయినారని, మిగిలిన 14 మంది త్వరలోనే డిశ్చార్జ్‌ అవబోతున్నారని రాష్ట్ర రోడ్లు మరియు ...

Read More »

49వ డివిజన్‌లో నిత్యవసర సరుకుల‌ పంపిణీ

నిజామాబాద్‌, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 49వ డివిజన్‌ లోని పేద ప్రజలు, రేషన్‌ కార్డు లేకుండా సరుకులు అందని నిరుపేదల‌ను గుర్తించి వారికి నిత్యవసర సరుకులు అందజేసినట్టు కార్పొరేటర్‌ మెట్టు విజయ్‌ తెలిపారు. పేద ప్రజల‌ ఆకలి తీర్చాల‌నే సంక్పంతో పార్టీ పెద్దలు ధన్‌పాల్‌ సూర్యనారాయణ, శ్యాం ఏజెన్సీస్‌ సోమాని వారి సహాయ సహకారాల‌తో నిత్యవసర వస్తువులు సేకరించి పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు. ఇందుకు 49వ డివిజన్‌ అభివృద్ది కమిటీ కూడా సహకారం అందిస్తుందన్నారు. ఇకముందు కూడా సహాయం ...

Read More »

బాటసారుల‌కు తినుబండారాలు అందజేసిన ఇందూరు న్యాయవాదులు

నిజామాబాద్‌, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ రహదారి ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద లాక్‌డౌన్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటూ తమ స్వస్థలాకు వెళ్లేందుకు కాలి నడక సాగిస్తున్న అంతరాష్ట్ర వల‌స కూలీల‌కు శనివారం ఇందూరు న్యాయవాదులు తినుబండారాలు అందజేశారు. కార్యక్రమంలో న్యాయవాది పరిషత్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్‌ మోహన్‌ గౌడ్‌, న్యాయవాది సిహెచ్‌ హరిహర, సామాజిక కార్యకర్త నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

249 వాహనాలు సీజ్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి చట్టవిరుద్దంగా రోడ్లపై తిరుగుతున్న మొత్తం 249 వాహనాలు సీజ్‌ చేసి కేసు నమోదు చేయడం జరిగిందని నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ తెలిపారు. సీజ్‌ చేసిన వాటిలో ద్విచక్ర వాహనాలు 222, ఆటోలు 26, ఫోర్ వీల‌ర్స్‌ 1 ఉన్నాయన్నారు. లాక్‌డౌన్‌ పరిశీలించేందుకు గురువారం కమీషనరేట్‌ పరిధిలో ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, ప్రజలందరు స్వీయ ...

Read More »

ఘనంగా మహాముని భగీరథ జయంతి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహా ముని భగీరథుని జయంతి సందర్భంగా నిజామాబాద్‌ కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో గురువారం బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి పాల్గొని మహా ముని భగీరథుడు చిత్రపటం వద్ద జ్యోతి వెలిగించి పూల మాల‌లు వేసి ఘనంగా నివాళుల‌ర్పించారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్లు ల‌తా, బి చంద్రశేఖర్‌, ఏవో సుదర్శన్‌, బిసి సంక్షేమ అధికారి బి శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

వేద సంస్కృతిలో ఎంగిలి దోషం…

మన పూర్వీకులు అందించిన ఆరోగ్య సూత్రాల‌లో ఒకటి ‘ఎంగిలి దోషం’ అంటకుండా జాగ్రత్త పడటం. ఇతరులు తినగా మిగిలినది, లేదా ఇతరులు తింటున్న సమయంలో వారి దగ్గరి నుంచి తీసుకుని తినడం ఎంగిలి. ఒకరి ఎంగిలి ఇంకొకరు తినడం మహాపాపం అన్నారు. ఎంగిలి చాలా ప్రమాదకరం, ఒకరి ఎంగిలి మరొకరు తినడం, తాగటం వల‌న సూక్ష్మక్రిములు వ్యాపించి అనేక రకాలైన జబ్బులు వచ్చే అవకాశం ముమ్మరంగా ఉంటుంది. ఒకే కంచంలోని ఆహారం ఇద్దరు ముగ్గురు కలిసి తినడం, ఓకే సీసాలోని నీటిని నలుగురైదుగురు ఒకరి ...

Read More »

జేసిఐ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకుల‌ పంపిణీ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లాక్‌ డౌన్ వ‌ల్ల వల‌స కూలీల‌తో పాటు అనేక మంది పేదలు అష్టకష్టాలు పడుతున్నారు. వారి కష్టాన్ని గుర్తించిన జేసిఐ ఇందూర్‌ సంస్థ ప్రతినిధులు వారికి గురువారం సహాయం చేశారు. లాక్‌ డౌన్ వ‌ల్ల‌ పని లేక ఇబ్బందుల పాల‌వుతున్న నిరుపేదల‌కు బియ్యం, పప్పు, కూరగాయలు, నూనె తదితర నిత్యావసర సరుకులు అందజేశారు. కోటగల్లి, వినాయక నగర్‌, సీతారాం నగర్‌, దుబ్బ, కంఠేశ్వర్‌ ప్రాంతాల్లో పేదల‌ను గుర్తించి నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ ...

Read More »