Breaking News

Nizamabad

ప్రజల వద్దకే సరుకులు

కామారెడ్డి, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కిరాణ వర్తక సంఘం ఆధ్వర్యంలో ప్రజల‌ వద్దకే నిత్యావసర సరుకులు సంచార వాహనం ద్వారా అందించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ శరత్‌ తెలిపారు. రూ. 500, రూ 1000 రెండు రకాల‌ కిట్లను వ్యాపారులు ఏర్పాటు చేశారని చెప్పారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. వారి కోసం సంచార వాహనంలో నిత్యావసర వస్తువుల‌ కిట్లను అందజేయనున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు.

Read More »

82 వాహనాలు సీజ్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి చట్టవిరుద్దంగా రోడ్లపై తిరుగుతున్న మొత్తం 82 వాహనాలు సీజ్‌ చేయడం జరిగిందని నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ తెలిపారు. సీజ్‌ చేసిన వాటిలో 78 ద్విచక్ర వాహనాలు, ఆటోలు 4 ఉన్నాయన్నారు. లాక్‌డౌన్‌ పరిశీలించేందుకు గురువారం రాత్రి కమీషనరేట్‌ పరిధిలో ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, ప్రజలందరు స్వీయ నిర్బంధంలో ఉంటూ సహకరించాల‌ని పేర్కొన్నారు. రాత్రి ...

Read More »

ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో రైతు పండిరచిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందని సంయుక్త కలెక్టర్‌ చంద్రశేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 547 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో సహకార సంఘాలు 472, మెప్మా 7, ఐసిడి ఎం ఎస్‌ 11, ఐకెపి 57 ధాన్యం కొనుగోలు కేంద్రాల‌ను ఏర్పాటు చేస్తున్నాయని, మొదటి రకం ఏ గ్రేడ్‌ ధాన్యానికి రూ. 1835 సాధారణ రకం ధాన్యానికి రూ. ...

Read More »

గురువారం వరకు కొత్త కేసు నమోదు కాలేదు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఢల్లీికి వెళ్లి వచ్చిన వారిలో 57 మందికి గాను 42 మందికి శాంపిల్స్‌ తీసుకొని పరీక్షల‌ కోసం గురువారం పంపించామని వాటి నివేదికలు శుక్రవారం రావచ్చని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మిగతా వారి శాంపిల్స్‌ కూడా శుక్రవారం పంపిస్తామని పేర్కొన్నారు. గురువారం వరకు ప్రభుత్వ క్వారంటైన్‌లో 174 మంది ఉంటున్నారని, వీరికి అవసరమైన అన్ని రకాల‌ సదుపాయాలు, వైద్య పరీక్ష ఏర్పాట్లు చేశామన్నారు. ఇప్పటివరకు జిల్లాలో వచ్చిన 2 ...

Read More »

టోకెన్లు ఉన్నవారే కంట్రోల్‌ దుకాణానికి రావాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల‌ ప్రకారం ఆహార భద్రత కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి బియ్యం పంపిణీ చేస్తామని వరుస క్రమంలో అందరికీ టోకెన్లు జారీ చేస్తామని సంయుక్త కలెక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. గురువారం ఆయన బియ్యం పంపిణీ జరుగుతున్న నగరంలోని పలు కంట్రోల్‌ దుకాణాల్లో ఆర్‌డివో వెంకటయ్యతో కలిసి పరిశీలించారు. అక్కడక్కడ ప్రజలు రేషన్‌ కోసం గుమి కూడి ఉండడం చూశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికే ...

Read More »

18 వేల‌ ఇళ్లలో సర్వే పూర్తి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొందరు వ్యక్తులు ఢల్లీి వెళ్లి రావడంతో వారిలో ఒకరికి కరోనా వైరస్‌ పాజిటివ్‌ రావడంతో ఢల్లీి వెళ్లి వచ్చిన వారు తిరిగిన ప్రాంతాల్లో ఇప్పటికీ 18 వే ఇళ్లల్లో సర్వే పూర్తి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల‌ చేస్తూ పట్టణంలో ఖిల్లా, మాల‌పల్లి ఆటోనగర్‌, తదితర చుట్టుపక్కల‌ ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, పోలీస్‌, మున్సిపల్‌ తదితర శాఖల‌ ...

Read More »

క్వారంటైన్‌ సెంటర్ల తనిఖీ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌, డిచ్‌పల్లిలో గల‌ ప్రభుత్వ క్వారంటైన్‌ సెంటర్లను సందర్శించిన జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి వారితో మాట్లాడారు. వారికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తాహసిల్దార్‌కు లేదా నేరుగా తనకు తెలియచేయాల‌న్నారు. క్వారంటైన్‌లో ఉన్నవారితో ఆయన మాట్లాడుతూ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. అందుకు వారు ఇంటి దగ్గర కన్నా చాలా బాగున్నవి అని తెలియజేశారు. 14 రోజులు పూర్తయిన వారిని వైద్యపరీక్షల‌ అనంతరం కరోనా ల‌క్షణాలు లేని వారిని డిశ్చార్జి చేయాల‌ని ...

Read More »

ముజీబ్‌ కుటుంబ సభ్యుల్లో ఒకరికి పాజిటివ్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిల్లీ వెళ్లి వచ్చిన షేక్‌ ముజీబ్‌ కుటుంబ సభ్యుల‌లో ఒకరికి కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చినట్లు జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం కలెక్టర్‌ ఒక ప్రకటనలో వివరిస్తూ, ఢల్లీి వెళ్లి వచ్చిన షేక్‌ ముజీబ్‌కు పరీక్ష ద్వారా ఆయనకు కరోనా వైరస్‌ వ్యాప్తి చెందినట్లు అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యుల‌కు పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్‌ వచ్చినట్లు నివేదికల‌ ద్వారా తెలిసిందన్నారు. కుటుంబ ...

Read More »

జివో 27 ఉపసంహరించుకోవాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనవైరస్‌ బారి నుండి ప్రజల‌ ప్రాణాల‌ను కాపాడటానికి తమ ప్రాణాల‌ను ఫణంగా పెట్టి పనిచేస్తున్న మెడికల్‌, మున్సిపల్‌, వాటర్‌ వర్స్క్‌ కార్మికుల‌కు వారి సేవల‌ను, త్యాగాల‌ను గుర్తిస్తూ రెండు నెలల‌ వేతనాల‌ను బోనస్‌గా చెల్లించాల‌ని కోరుతుంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ అందరితో పాటు వారి వేతనాల‌లో 10 శాతం కోత విధించటం శోచనీయమని ఏఐటియుసి నిజామాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.ఓమయ్య అన్నారు. ఇప్పటికే తక్కువ వేతనాల‌కు పని చేసే ...

Read More »

చేతులెత్తి నమస్కరిస్తున్న వారం రోజులు ఇంట్లోనే ఉండండి

నిజామాబాద్‌, మార్చ్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా వైరస్‌ తదనంతర లాక్‌ డౌన్‌ చర్యల‌కు జిల్లా ప్రజలు సంపూర్ణంగా సహకరిస్తున్నారని అధికారుల‌ కృషి అభినందనీయంగా ఉన్నదని రాష్ట్ర రోడ్లు భవనాల‌ శాఖ, శాసనసభ వ్యవహారాల‌ శాఖా మాత్యులు వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి తెలిపారు. మంగళవారం మంత్రి కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి, సిపి కార్తికేయతో కలిసి జిల్లా అధికారుల‌తో కరోనా వైరస్‌ తదనంతర చర్యలు, ధాన్యం కొనుగోలు తదితర విషయాల‌పై సమీక్ష నిర్వహించిన అనంతరం మీడియా ప్రతినిధుల‌తో మాట్లాడారు. మార్చి ...

Read More »

వల‌స కూలీల‌కు రేషన్‌ బియ్యం నగదు పంపిణీ

నిజామాబాద్‌, మార్చ్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇతర రాష్ట్రాల వల‌స కూలీల‌ను ఆదుకునేందుకు ప్రభుత్వం ఆదేశాల‌ ప్రకారం మంగళవారం నిజామాబాద్‌ కలెక్టరేట్‌ నందు అడిషనల్‌ కలెక్టర్ ల‌త, అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రశేఖర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్ వల‌స కూలీల‌కు ఒక్కొక్కరికి 12 కేజీల‌ బియ్యం, 500 రూపాయల‌ నగదు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆరవ డివిజన్‌ కార్పొరేటర్‌ ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.

Read More »

యుద్ధంలో చివరి అంకంలో ఉన్నాం- ఈ కొద్ది రోజులు ఇదే దీక్షతో పని చేస్తే విజయం మన సొంతం – కలెక్టర్‌

నిజామాబాద్‌, మార్చ్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా వైరస్‌ మహమ్మారిని మన దరిచేరనీయకుండా చేసిన యుద్ధంలో చాలా వరకు విజయం సాధించామని యుద్ధంలో గెల‌వడానికి చివరి అంకంలో ఉన్నామని ఈ కొద్ది రోజులు ఇదే దీక్ష పట్టుదల‌తో పని చేస్తే 100 శాతం విజయం మనదేనని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి అధికారుల‌కు ఉద్బోధించారు. సోమవారం ఉదయం క్యాంప్‌ కార్యాల‌యం నుండి కరోనా వైరస్‌ కట్టడికి పకడ్బందీగా విధులు నిర్వహిస్తున్న అధికారులు, ఉద్యోగుల‌తో సెల్‌ కాన్ఫరెన్స్‌ లో మాట్లాడారు. ఒకటి-రెండు పాజిటివ్‌ కేసులు ...

Read More »

హక్కుల‌ గురించి అవగాహన కలిగి ఉండాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి వినియోగదారుడు తమ హక్కుల‌ గురించి అవగాహన కలిగి ఉండాల‌ని జిల్లా వినియోగదారుల‌ ఫోరం చైర్మెన్‌ జయశ్రీ అన్నారు. కొత్తగా వచ్చిన వినియోగదారుల‌ హక్కు చట్టం 2019 వినియోగదారులు మోసపోకుండా రక్షిస్తుందన్నారు. వినియోగదారుల‌ హక్కుల‌ చట్టం 2019 గురించి ప్రజల‌కు అవగాహన కల్పించేందుకు గౌతమి వినియోగదారుల‌ సంఘం కరపత్రాలు ముద్రించగా వాటిని శుక్రవారం నిజామాబాదులో వినియోగదారుల‌ ఫోరం చైర్మెన్‌ జయశ్రీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొత్తగా వచ్చిన వినియోగదారుల‌ చట్టం ...

Read More »

ఎన్నికకు అన్ని చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఎక్కడ కూడా కోడ్ ఉల్లంఘన జరగకుండా మండల‌ స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లో ఎన్‌ఐసీ నుండి మండల‌ స్థాయి అధికారుల‌తో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, హరితహారం, టెన్త్‌ పరీక్షలు, శిక్షణ సివిల్‌ సర్వీస్‌ అధికారుల‌ పర్యటన, తదితర అంశాల‌పై ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉప ఎన్నిక ...

Read More »

ఎన్నికల‌ నిబంధనావళికి కట్టుబడి ఉండాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా నిర్వహించడానికి రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సహకరించాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి కోరారు. స్థానిక సంస్థ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసినందున ఎన్నికల‌ కమిషన్‌ ఆదేశాల‌ మేరకు శుక్రవారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల‌ ప్రతినిధుల‌తో కలెక్టర్‌ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నోటిఫికేషన్‌ జారీ చేసినందున నిన్నటి నుండి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైందని ...

Read More »

13న రాజకీయ పార్టీల‌ ప్రతినిధుల‌తో సమావేశం

నిజామాబాద్‌, మార్చ్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏప్రిల్‌ 7న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల‌ను పురస్కరించుకుని రాజకీయ పార్టీల‌ ప్రతినిధుల‌తో ఈ నెల‌ 13న సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 13వ తేదీన ఉదయం పదిన్నర గంటల‌కు కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల‌కు చెందిన రాజకీయ పార్టీ ల ప్రతినిధుల‌ సమావేశానికి నిర్ణీత సమయానికి హాజరుకావాల‌ని ఆయన కోరారు.

Read More »

ప్రచారానికి ముందస్తు అనుమతి తప్పనిసరి

నిజామాబాద్‌, మార్చ్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్థానిక సంస్థ ఎమ్మెల్సీ ఎన్నికకు ప్రచారం నిర్వహించడానికి ముందస్తు అనుమతి తప్పనిసరి అని ఎంసిసి నోడల్‌ అధికారి సింహాచలం తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో ఆయన ఎంసి ఎంసి నోడల్‌ అధికారి రామ్మోహన్‌ రావుతో కలిసి ప్రింటింగ్‌ ప్రెస్‌, ఎమ్‌ఎస్‌వోల‌తో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభలు సమావేశాల‌కు అనుమతి తీసుకోవడంతోపాటు ప్రచార సామాగ్రి ముద్రణకు సంబంధించిన అన్ని విషయాలు ఖర్చులు నోడల్‌ అధికారికి సమర్పించాల‌ని ప్రింటింగ్‌ ప్రెస్‌ యాజమాన్యాల‌ను ...

Read More »

మీడియా కేంద్రం, ఎంసిసి కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మార్చ్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్థానిక సంస్థ ఎమ్మెల్సీ ఎన్నికను పురస్కరించుకుని కలెక్టరేట్‌లోని క్రీడ భవనంలో ఏర్పాటుచేసిన ఎన్నిక మీడియా కేంద్రాన్ని, ఎన్‌ఐసి వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో ప్రవర్తనా నియమావళి, ఎన్నిక ఖర్చు మానిటరింగ్‌ కమిటీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్సీ ఎన్నికకు గురువారం రిటర్నింగ్‌ అధికారి అయిన కలెక్టర్‌ నోటిఫికేషన్‌ విడుద చేశారు. ఎన్నిక కమిషన్‌ ఆదేశా మేరకు మీడియా కేంద్రాన్ని కలెక్టరేట్‌లో ఏర్పాటు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్నికకు ...

Read More »

ఎమ్మెల్సీ ఎన్నికల‌కు అన్ని ఏర్పాట్లు

నిజామాబాద్‌, మార్చ్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏప్రిల్‌ 7న జరిగే స్థానిక సంస్థ ఎమ్మెల్సీ ఎన్నికల‌కు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఎన్నికల కమిషన్‌ ఆదేశాల‌ను అనుసరించి పూర్తిచేయాల‌ని జిల్లా కలెక్టర్‌, రిటర్నింగ్‌ అధికారి నారాయణరెడ్డి సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. గురువారం తన ఛాంబర్‌లో ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లపై అధికారుల‌ సమావేశంలో మాట్లాడారు. అన్ని టీమ్‌ నోడల్‌ అధికాయి వెంటనే విధు ప్రారంభించి ఎక్కడ కూడా ఎన్నిక ప్రవర్తన నియమావళి అతిక్రమణ జరగకుండా అన్ని బందోబస్తు చర్యు తీసుకోవాన్నారు. ఎన్నికు పూర్తయ్యే ...

Read More »

విద్యార్థుల‌ను మాస్క్‌ల‌ కొరకు డిమాండ్‌ చేయొద్దు

నిజామాబాద్‌, మార్చ్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా వైరస్‌ గురించి విద్యార్థులు తప్పనిసరిగా మాస్కు ధరించి రావాల‌ని డిమాండ్‌ చేయవద్దని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి విద్యాసంస్థల‌ యాజమాన్యాల‌ను ఆదేశించారు. గురువారం తన ఛాంబర్‌లో డ్రగ్స్‌ కంట్రోల్‌ శాఖ అధికారుల‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యాలు విద్యార్థుల‌ను మాస్కు గురించి ఇబ్బందుల‌కు గురి చేయవద్దని, ఎవరైనా విద్యార్థుల‌కు దగ్గు, జ్వరం ఉన్నట్లయితే వారికి సెల‌వు మంజూరు చేసి ఇంటికి పంపించాల‌ని స్పష్టం చేశారు. అదేవిధంగా అన్ని మెడికల్‌ ...

Read More »