Breaking News

Nizamabad

మహిళ అభ్యున్నతికి పాటుపడిన వారందరికీ ధన్యవాదాలు

నిజామాబాద్‌, మార్చ్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీసీ మహిళా సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షురాలు పొదిల‌ శోభ సభాధ్యక్షతన ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ వేడుకల్లో మేయర్‌ దండు నీతూ కిరణ్‌, జడ్పి వైస్‌ చైర్మన్‌ రజిత యాదవ్‌ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. బుధవారం స్థానిక కేర్‌ డిగ్రీ కళాశాల‌లో మహిళా దినోత్సవ వేడుకల‌ను బిసి మహిళా సంక్షేమ సంఘం ఆద్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్‌, జడ్పి వైస్‌ ఛైర్మన్‌లు మాట్లాడుతూ ఈ భూమిపైన మహిళ ఎదుర్కొన్నన్ని వివక్షలు ...

Read More »

వీడియో సిడి ఆవిష్కరణ

నిజామాబాద్‌, మార్చ్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ సంప్రదాయాల‌ను ఉద్యమ రూపంలో తీసుకొచ్చి చైతన్య పరిచిన నాయకురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు క‌ల్వ‌కుంట్ల కవిత అని, పార్లమెంటు సభ్యురాలిగా తెలంగాణ వాణిని బలంగా వినిపించిన ప్రజా నాయకురాలు అని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డాక్టర్‌ నందిని సిద్ధారెడ్డి అన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు క‌ల్వ‌కుంట్ల కవిత జన్మదినాన్ని పురస్కరించుకొని నిజామాబాద్‌ కవి నరాల‌ సుధాకర్‌ రూపొందించిన వీడియో సిడిని బుధవారం ఆయన రవీంద్రభారతిలో ఆవిష్కరించారు. అభిమానం ఏర్పడాలంటే వారి ...

Read More »

సావిత్రిబాయి జీవితం స్ఫూర్తిదాయకం

నిజామాబాద్‌, మార్చ్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, రచయిత సావిత్రి బాయి పూలే 123 వ వర్ధంతి సందర్భంగా ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్‌యు) నాయకులు నగరంలోని అంబేద్కర్ కాల‌నీలో గల‌ సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూల‌మాల‌వేసి నివాళుర్పించారు. ఈ సందర్భంగా పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షురాలు క‌ల్ప‌న మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జీవితం మహిళల‌కు, విద్యార్థుల‌కు స్ఫూర్తిదాయకమన్నారు. మనువాదం, పితృస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి మహిళల‌ కోసమే విద్యా సంస్థలు నెల‌కొల్ప‌డం గొప్ప విషయమన్నారు. కుల‌ ...

Read More »

మొక్కల‌ సంరక్షణలో నిర్లక్ష్యం సహించను

నిజామాబాద్‌, మార్చ్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మొక్కల‌ సంరక్షణలో నిర్లక్ష్యం చేయొద్దని, పబ్లిక్‌ టాయిలెట్స్‌లో మూత్రవిసర్జనకు డబ్బు వసూలు చేయవద్దని ఎక్కడైనా చేస్తే చర్య‌లుంటాయని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అన్నారు. పట్టణ ప్రగతిపై రివ్యూ మీటింగ్‌లో భాగంగా జిల్లా కలెక్టర్‌ మంగళవారం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో అడిషనల్‌ కలెక్టర్‌ బిఎస్ ల‌తా, నిజామాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌తో కలిసి ప్లాంటేషన్‌, శానిటేషన్‌ డ్రైనేజీ క్లీనింగ్‌, ఓపెన్‌ ప్లాట్‌ క్లీన్‌పై అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ ...

Read More »

హోలీ సందర్భంగా మట్టి స్నానం

నిజామాబాద్‌, మార్చ్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇందూరు యోగ సాధకులు వినూత్నంగా హోలీ వేడుకలు జరుపుకున్నారు. యోగ సిద్దిరాములు ఆధ్వర్యంలో మట్టి స్నానం చేశారు. ప్రతి సంవత్సరం లాగే ఈయేడు కూడా సోమ, మంగళవారాల్లో స్తానిక కంచన్‌ భాగ్‌లో కార్యక్రమం ఏర్పాటు చేశారు. పుట్టమట్టి, చెరువు మట్టి, గోమూత్రం, వేప ఆకులు, తుల‌సీ ఆకులు, ఆవు పేడ తదితర మిశ్రమాల‌ను శరీరమంత పూసుకొని సాధన చేశారు. తద్వారా ఆరోగ్యం, మానసిక ప్రశాంతత చేకూరుతుందని సిద్దిరాములు పేర్కొన్నారు. కార్యక్రమంలో యోగ ప్రచారక్‌ ...

Read More »

వేళ్లు నరికి, గొంతు కోసి…

నిజామాబాద్‌, మార్చ్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని ఆర్యనగర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. వరల‌క్ష్మీ అనే గృహిణిని గుర్తు తెలియని దుండగులు కాలి మట్టెలు ఉన్న వేళ్లు నరికి, గొంతుకోసి హత్య చేసిన ఆనవాళ్లు ఉన్నాయి. సోమవారం పగలు ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. రాత్రి 11 గంటల‌ సమయంలో భర్త ఇంటికి వచ్చి చూడగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో నుంచి ఐదు తులాల‌ బంగారం, రూ.10 వేల‌ నగదు చోరీకి గురి అయ్యాయి. ...

Read More »

సమ సమాజాన్ని కాంక్షించిన రాయల‌

నిజామాబాద్‌, మార్చ్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీపీఐ (ఎం.ఎల్‌) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ నాయకుడు, రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ అమరుడైన కామ్రేడ్‌ రాయల‌ సుభాష్‌ చంద్రబోస్‌ (రవి) 4వ వర్ధంతి సభ కోటగల్లి ఎన్‌.ఆర్‌ భవన్‌లో జరిగింది. ముందుగా రాయల‌ రవి చిత్రపటానికి నాయకులు పూల‌మాల‌లువేసి నివాళుర్పించారు. ఈ సందర్భంగా న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు ఎం.వెంకన్న మాట్లాడుతూ దేశంలో దోపిడీ, పీడన లేని సమ సమాజాన్ని కాంక్షిస్తూ జీవితమంతా ప్రజాయుద్ధ పంథాలో పోరాడిన వీరుడు కామ్రేడ్‌ రాయల‌ సుభాష్‌ చంద్రబోస్‌ ...

Read More »

ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్థానిక సంస్థ ఎమ్మెల్సీ ఎన్నికల‌కు షెడ్యూలు వచ్చినందున రాజకీయ పార్టీలు ప్రవర్తన నియమావళి పాటించాల‌ని, అదేవిధంగా అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం కలెక్టర్‌ చాంబర్‌లో నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లా రాజకీయ పార్టీల‌ ప్రతినిధులు, సంబంధిత అధికారుల‌తో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శనివారం రాత్రి కల్లా ఓటర్ల జాబితా పూర్తిచేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. జాబితాలో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్‌ ...

Read More »

సృష్టికర్త మహిళ

నిజామాబాద్‌, మార్చ్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సృష్టిని సృష్టించేది మహిళలేనని ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ ఎస్‌.ఐ. ఆర్‌. సృజన అన్నారు. జె.సి.ఐ ఇందూరు ఆధ్వర్యంలో నిజామాబాద్‌ నగరంలోని సాయినగర్‌ వి.యన్‌.ఆర్‌ పాఠశాల‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి సృజన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. నేడు మహిళలు అన్ని రంగాల‌లో గొప్పగా రాణిస్తున్నారని అన్నారు. మాల‌వత్‌ పూర్ణ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారని, పివి సిందు బ్యాడ్మింటన్‌లో రాకెట్‌ లాగా దూసుకెళ్తున్నారని గుర్తు చేశారు. విద్య, వైద్య, ఆర్థిక ...

Read More »

మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు

నిజామాబాద్‌, మార్చ్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళలు చాలా విషయాల‌లో పురుషుల‌ కన్నా బాగా పని చేస్తున్నారని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డిఅన్నారు. ఈనెల‌ 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఎన్‌జివోస్‌ ఆధ్వర్యంలో టిఎన్‌జివో భవన్‌లో సంఘం అధ్యక్షుడు అల‌క కిషన్‌ అధ్యక్షతన మహిళా దినోత్సవం జరిపారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్‌ మాట్లాడుతూ మహిళల‌కు భూదేవత సహనం అని అన్నారు. పెళ్లి అయ్యేంత వరకు తల్లి గారింట్లో ఉండి పెళ్లయ్యాక భర్త ఇంటికి రావడం తన భర్త ...

Read More »

ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నడియాడుతారు

నిజామాబాద్‌, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నడియాడుతారు అనేది సత్యమని నిజామాబాద్‌ నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ అన్నారు. ఇందూరు యువత అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం కేర్‌ డిగ్రీ కళాశాల‌లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. స్త్రీ లేనిదే జీవం లేదని, స్త్రీ లేనిదే గమనం లేదని, స్త్రీ లేనిదే సృష్టియే లేదన్నారు. స్త్రీల‌కు ల‌భించే గౌరవం బట్టే ఆ దేశం యొక్క విలువ‌లు ...

Read More »

8న మహిళల‌కు కళా ప్రతిభ ప్రదర్శన

నిజామాబాద్‌, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల‌ 8వ తేదీన శ్రీ విపంచి సంస్కృతి సంస్థ ఆధ్వర్యంలో మహిళల‌కు కళా ప్రతిభ ప్రదర్శన నిర్వహించబడుతుందని సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిజామాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో మధ్యాహ్నం 2 గంటల‌కు కార్యక్రమం ఉంటుందన్నారు. చిత్రలేఖనం, హస్తకళలు, శాస్త్రీయ నృత్యం, శాస్త్రీయ సంగీతం, కవితా పఠనం ఉంటాయన్నారు. పాల్గొన్న ప్రతి మహిళకు జ్ఞాపిక అందజేయబడుతుందన్నారు. కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా నిజామాబాద్‌ నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త అనంత ...

Read More »

వృద్ధుల‌కు ఉచిత సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎ్డర్‌ స్ప్రింగ్‌ పేరుతో 60 ఏండ్లు దాటిన వృద్ధుల‌కు పలురకాల‌ సేవలందిస్తున్నందుకు సంస్థ నిర్వాహకుల‌ను జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి ప్రశంసించారు. శుక్రవారం కలెక్టర్‌ చాంబర్‌లో సంస్థ ప్రతినిధులు కలెక్టర్‌ను కలిసి వారు నిర్వహిస్తున్న కార్యక్రమాల‌ను వివరించారు. ఆసుపత్రుల‌కు సంబంధించిన సమాచారం, వృద్ధాశ్రమాల‌కు సంబంధించిన సమాచారాన్ని అందించడంతోపాటు వారిని ఎవరైనా దుర్భాషలాడినా, శారీరకంగా హింసించినా ఎవరికి ఫిర్యాదు చేయాలో సహకరిస్తారు. అదేవిధంగా వారి పిల్ల‌లు అశ్రద్ధ చేసి పోషణ బాధ్యత నిర్వర్తించకుంటే ఆర్డీవోకు ఫిర్యాదు ...

Read More »

ఊరు బాగుంటే అందరం బాగుంటాం

నిజామాబాద్‌, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఊరు బాగుంటే ఊరిలో ఉన్న అందరం బాగుంటాం అని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి అన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా కోటగిరి మండలం టాక్లీ, సోన్‌పూర్‌ గ్రామాల‌లో శుక్రవారం సర్పంచ్‌లు విమ భాయ్‌, భాగ్యల‌క్ష్మి ద్వారా గ్రామంలో పరిశీలించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా ఊరు అభివృద్ధి కోసం పని చేసుకోవాల‌ని సూచించారు. గ్రామంలో తిరిగి వ్యక్తిగత మరుగుదొడ్లు వినియోగించడం లేదని గుర్తించామన్నారు. ఏప్రిల్‌ ఆరో ...

Read More »

ధాన్యం కొనుగోలులో అన్ని విభాగాలు పక్కాగా పని చేయాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మరో నెల‌ రోజుల్లో రబీ వరి ధాన్యం రానున్నందున ఏ స్థాయిలో కూడా రైతుల‌కు ఇబ్బంది రాకుండా చూడాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి సంబంధిత అధికారుల‌ను, రైస్ మిల్లుల‌ యాజమాన్యాల‌ను ఆదేశించారు. శుక్రవారం అదనపు కలెక్టర్‌ చాంబర్‌లో సంబంధిత అధికారులు, రైస్ మిల్ల‌ర్ల‌ ప్రతినిధుల‌తో రబీ వరి ధాన్యం కొనుగోలుపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంబంధిత వ్యవసాయ శాఖ ఏఈఓ ధ్రువీకరణ చేసిన తర్వాతనే ధాన్యాన్ని కొనుగోలు ...

Read More »

పందుల‌ పెంపకం దార్లను వేధిస్తే ఆందోళన

నిజామాబాద్‌, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో గత డెబ్బై సంవత్సరాలుగా మూడువందల‌ కుటుంబాలు పందుల‌ పెంపకంతో జీవనోపాధి పొందుతున్నాయని, వారి ఉపాధి దెబ్బతీసే చర్యల‌కు మున్సిపల్‌ కార్పోరేషన్‌ అధికారులు పూనుకోరాదని బిఎల్‌ఎఫ్‌ రాష్ట్ర నాయకుడు దండి వెంకట్‌ అన్నారు. ఈ మేరకు శుక్రవారం నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఉద్దేశపూర్వకంగానే స్థానిక ఎంఐఎం కార్పోరేటర్‌ ఇటీవల‌ కార్పోరేషన్‌ ఎన్నికల్లో ఓటెయ్యలేదనే దుగ్దతో పందుల‌తో కరోనా వ్యాది వస్తుందని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం మూలంగా ...

Read More »

ప్రభుత్వ అవసరాల‌కు ఇసుక కొరత రానీయొద్దు

నిజామాబాద్‌, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెవెన్యూ శాఖకు అత్యంత కీల‌కమైంది ఎల్‌ఆర్‌యుపి, భూ వివాదాలు ఎప్పటినుండో ఉన్నాయని, చాలా రికార్డులు అప్‌డేట్‌ అయ్యాయని, అధికారులు చాలా కష్టపడ్డారని, కొన్ని మాత్రమే పెండిరగ్‌లో ఉన్నాయి కానీ పాజిటివ్‌ కంటే నెగిటివ్‌కే బాగా ప్రచారం వచ్చిందని, దీనిని కూడా దూరం చేసుకోవడానికి రెవెన్యూ అధికారులు కృషిచేయాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి దిశానిర్దేశం చేశారు. శుక్రవారం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌తో కలిసి ఆర్‌డివోలు, తహసీల్దార్‌ల‌తో రెవెన్యూ అంశాల‌పై ...

Read More »

ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల‌

నిజామాబాద్‌, మార్చ్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ స్థానిక సంస్థల‌ కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్‌ విడుదలైంది. ఈ నెల‌ 12వ తేదీన దీనికి సంబంధించిన నోటిషికేషన్‌ విడుదల‌ కానుంది. మార్చి 19వ తేదీ వరకు అభ్యర్థుల‌ నామినేషన్లు వేయవచ్చు. 20వ తేదీ రోజు ఎన్నికల‌ అధికారులు నామినేషన్లను పరిశీలిస్తారు. ఏప్రిల్‌ 7వ తేదీన ఉదయం 8 గంటల‌ నుంచి సాయంత్రం 4 గంటల‌ వరకు పోలింగ్‌ జరగనుంది. ఏప్రిల్‌ 9వ తేదీ రోజు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఏప్రిల్‌ ...

Read More »

బాధిత కుటుంబానికి కాంగ్రెస్‌ సహాయం

నిజామాబాద్‌, మార్చ్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం వర్ని మండల కేంద్రంలోని సేవాలాల్‌ తాండ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త కరంటోడ్‌ వెంకటి కుటుంబానికి కాంగ్రెస్‌ పార్టీ నాయకులు రూ. 50 వేల‌ ఆర్థిక సహాయం అందజేశారు. వెంకటి గత జనవరి 9న చనిపోయిన పసికందును తీయడానికి వెళ్లి ఊబిలో ప్రాణాలు కోల్పోయాడు. సదరు కుటుంబానికి జహీరాబాద్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జ్‌ మదన్‌ మోహన్‌ రావు, రాష్ట్ర ఎంపీటీసీ ఫోరమ్‌ మాజీ అధ్యక్షుడు యల‌మంచిలి శ్రీనివాస్‌ రావు 50 వేల‌ ...

Read More »

పట్టణ ప్రగతిలో నేను సైతం

నిజామాబాద్‌, మార్చ్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణ ప్రగతిలో ’నేను సైతం’ కార్యక్రమంలో ప్రతిఒక వ్యాపారి పాలుపంచుకోవాల‌ని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి అన్నారు. గురువారం పట్టణ ప్రగతిలో నేను సైతం కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి. పాటిల్‌తో కలిసి పట్టణంలోని నిఖిల్‌ సాయి, వంశీ హోటల్‌, నెహ్రూ పార్క్‌, గాంధీ చౌక్‌లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పట్టణ ప్రగతిలో నేను సైతం కార్యక్రమంలో వ్యాపార సంస్థ ...

Read More »