Breaking News

Nizamabad

అంగన్‌వాడి పోస్టులకు ఫైరవీలు షూర్‌…. 493 పోస్టులు ఖాళీలు

ఎమ్మేల్యేల చేతికి పగ్గాలు కుప్పలు తెప్పలుగా ధరఖాస్తులు నిజామాబాద్‌ ప్రతినిధి, నవంబరు 15, జిల్లాలో అంగన్‌వాడిల పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ కావడంతో ఫైరవీలకు జోరుగా తెర లేసింది. ఈ నియమాకాలలో ప్రథానంగా స్థానిక ఎమ్మేల్యేల చేతిలో ఉండటంతో స్థానిక అదికారి పార్టీ నాయకులు ఇప్పటి నుంచి ముమ్మరంగా ఫైరవీలకు సిద్దం అవుతున్నారు. జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు ఈనెల 13న జిల్లాలో అంగన్‌వాడిలలో ఖాళీగా ఉన్న 493 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. 36 అంగన్‌వాడి ...

Read More »

20న వైద్య ఉద్యోగుల చలో హైదరాబాద్‌

నిజామాబాద్‌, నవంబరు 14, వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న శాశ్వత ఉద్యోగుల అపరిష్కత సమస్యలతో పాటు, ఒప్పంద, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, కార్మికుల సమస్యలను పరిష్కారించాలని కోరుతూ ఈ నెల 20న చలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలంగాణ యూనైటెడ్‌ మెడికల్‌ హెల్త్‌, ఎంప్లాయిస్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జార్జు తెలిపారు.

Read More »

15న అండర్‌ 20 కబడ్డి జట్ల ఎంపిక

నిజామాబాద్‌, నవంబరు 14, జిల్లా కబడ్డి సంఘం ఆధ్వర్యంలో ఈనెల 15న జూనియర్‌ (అండర్‌ 20) బాల బాలికల కబడ్డి జట్లను ఎంపిక చేయనున్నట్లు అసోసియేషన్‌ కార్యదర్శి లింగయ్య తెలిపారు. డి.ఎస్‌.ఎ మిని స్టేడియంలో ఉదయం 11 గంటలకు ఎంపిక జరుగుతందున్నారు,

Read More »

16న దళిత మహాసభ సమావేశం

నిజామాబాద్‌, నవంబరు 14, ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంద ఆసుపత్రికి అంబేద్కర్‌ పేరు పెట్టాలని కోరుతూ ఈనెల 16న దళిత మహాసభ ఆధ్వర్యంలో న్యూ అంబేద్కర్‌ భవన్‌లో నిర్వహించనున్నట్లు కార్యదర్శి గంగాధర్‌గౌడ్‌ తెలిపారు.

Read More »

15న నిశిత కళాశాలలో క్యాంపస్‌ ఇంటార్వుస్‌…. అన్ని డిగ్రీ కళాశాలల విద్యార్థులకు అవకాశం

నిజామాబాద్‌, నవంబరు 14 జిల్లాలోని అన్ని డిగ్రీ కళాశాలలకు ఈనెల 15న నిజామాబాద్‌లోని నిశిత డిగ్రీ కళాశాలలో క్యాంపస్‌ ఇంటార్వులను నిర్వహించనున్నట్లు కళాశాల నిర్వహకులు తెలిపారు. ఉదయం పది గంటలకు క్యాంపస్‌ ఇంటార్వుకు హాజరు కవాలని, విప్రో, విస్టా కంపనీల ప్రతినిధులు ఇంటార్వులు నిర్వహిస్తారన్నారు. అర్హత కలిగిన ప్రతి విద్యార్థి ఈ ఇంటార్వులకు హాజరు కావచ్చని తెలిపారు.

Read More »

16న సివిల్స్‌ ఉచిత శిక్షణకు అన్‌లైన్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌

నిజామాబాద్‌, నవంబరు 14, యుపిఎస్సీ సివిల్‌ సర్విసెస్‌ ప్రిలిమినరీ పరీక్ష -2014కు ఉచిత శిక్షణకు హాజరు అయ్యే వారు ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ టెస్టును ఈనెల 16న నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రాసు తెలిపారు. ధరఖాస్తు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ, బిసి అభ్యర్థులు www.tsbcstudycircles.gov.in వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు.స్క్రీనింగ్‌ టెస్టును ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని వివరాల కోసం 08462 245055, 8985883830లకు సంప్రదించాలని సూచించారు.

Read More »

ప్రభుత్వం ప్రతిపక్షాల నోరు నొక్కెస్తోంది…తమ్మినేని వీరభద్రం

నిజామాబాద్‌, నవంబరు 14, ప్రభుత్వం ప్రతిపక్షాల నోరు నొక్కేస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. నగరంలోని ఆర్‌ అండ్‌ బి గెస్ట్‌ హౌజ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ బడ్జెట్‌ సమావేశాలలో అధికార పక్షం ప్రతిపక్షాల గోంతు నొక్కుతోందని ధ్వజమెత్తారు. ప్రజాసమస్యలపై మాట్లాడటానికి అవకాశం ఇవ్వడం లేదని. సభ్యులు మాట్లాడుతుంటే మధ్యలోనే మైక్‌ కట్‌ చేస్తున్నారని అన్నారు. సభలో మాట్లాడే అవకాశం అందరికి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా దాట ...

Read More »

సి.ఐ.టి.యు ఆధ్వర్యంలో ధర్నా

నిజామాబాద్‌, నవంబరు 14, మున్సిపల్‌ కార్మికులను వెంటనే రెగ్యులరైజ్‌ చేయాలని సి.ఐ.టి.యు ఆధ్వర్యంలో నగర మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. చాలా సంవత్సరాలుగా విధులు నివ్వహిస్తున్న మున్సిపల్‌ కార్మికులను వెంటనే రెగ్యులరైజ్‌ చేయిలపి మరియు వారికి ఆరోగ్య భద్రత కల్పించాలని వేతనాలను పెంచి సకాలంలో చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి, రాత్రింబవళ్ళు ప్రజా సేవ కొరకు పాటు పడుతున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించకపోవడం చాలా శోచనీయం అని అన్నారు. వెంటనే వారి న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని డిమాండ్‌ ...

Read More »

రేవంత్‌ రెడ్డి దిష్టి బొమ్మ దహనం.

నిజామాబాద్‌, నవంబరు 14, టీ-టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి దిష్లిబొమ్మను శుక్రవారం నగర టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో దహనం చేశారు. ఏ.పీ. సీఎం. మెప్పు పొందేందుకు రేవంత్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌ ఎం.పి. కవితపై సమగ్ర సర్వే లో రెండు చోట్ల పేరు నమోదు చేనుకున్నట్లు తప్పుడు ఆరోపణలు చేశాడని విద్యార్థులు విమర్శించారు. రేవంత్‌ రెడ్డి ఇకనైనా తన వైఖరిని మార్చుకోవాలని అన్నారు. నగరంలోని పూలాంగ్‌ చైరస్తాలో రాస్తారోకో నిర్యహించి, దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో నగర టీఆర్‌ఎస్‌ నాయకులు చింత మహేష్‌ మరియు ...

Read More »

టిడీపీ కార్యకర్తల రాస్తారోకో

నిజామాబాద్‌, నవంబరు 14, నగరంలోని బస్టాండ్‌ ఎదుట టిడీపీ ఆధ్వర్యంలో కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. తెలంగాణా రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా తెలుగుదేశం నాయకులు, ఎమ్మెల్యేలు రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలకు దిగడంతో వారిని వారం రోజుల పాటు సస్పెండ్‌ చేసిన విషయం విదితమే. ప్రజాస్వామ్యంలో అందరికి నిరసన తెలిపే హక్కు ఉందని, దానికి విరుద్ధంగా అప్రజాస్వామ్యంగా టిడీపీ ఎమ్మెల్యేలను శాసన సభనుండి సస్పెండ్‌ చేశారని, దానికి నిరసనగా టిడీపీ నాయకులు, కార్యకర్తలు బస్టాండ్‌ ఎదుట రాస్తారోకో చేశారు. ఈకార్యక్రమంలో ...

Read More »

ర్యాలీని ప్రారంభించిన ఎస్‌.పి.

నిజామాబాద్‌, నవంబరు 14, బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక కలెక్టర్‌ గ్రౌండ్‌ ఆవరణలో ఐ.సీ.డీ.ఎస్‌ మరియు విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన ఎస్‌.పి. జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జవహర్‌ లాల్‌ నెహ్రూ 125 వ జన్మదినం సందర్భంగా ఈ రోజు జరుపుకుంటున్న బాలల దినోత్సవంలో పిల్లలు పెద్దలు అందరూ పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. సమాజంలో ఉన్న బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలని మరియు బాల్య వివాహాలను అరికట్టాలని ఆయన సూచించారు. తదనంతరం పిల్లలు ...

Read More »

అన్ని రోగాలకు కూడలి డయాబేటిస్‌….. జేసి శేషాద్రి

నిజామామాబాద్‌, నవంబరు 14, మనిషికి వచ్చే అన్ని రోగాలకు కూడలి డయాబెటిస్‌ అని, దీని పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని జాయింట్‌ కలెక్టర్‌ శేషాద్రి అన్నారు. శుక్రవారం రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో ఎస్‌బిహెచ్‌, ఐఎంఎ ఆధ్వర్యంలో సంయుక్తంగా ప్రపంచ మధుమోహ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిఆగా హాజరైన జేసి శేషాద్రి కార్యక్రమ జ్యోతిని వెలిగించి, ప్రసంగించారు. ప్రపంచంలో ఈ వ్యాధి దృష్టిని మరల్చేందుకు ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ సంస్థలు ఏన్నో కార్యక్రమాలు చేపడుతున్నాయని అన్నారు. వీటిని ప్రతి ఒక్కరు సద్వినియోగించుకోవాలని సూచించారు. ...

Read More »

18 నుంచి జిల్లాలో ఎంపి కవిత పర్యటన

నిజామాబాద్‌, నవంబరు 14, నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఈనె 18 నుంచి మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నట్లు తెలిపారు. ఇటీవల లండన్‌లో పర్యటించి గురువారం రాష్ట్రనికి చెరుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మేరకు ఆమె జిల్లలో మూడు రోజుల పాటు పర్యటించేందుకు సన్నహాలె చేసుకున్నారు. మూడు రోజుల పాటు జిల్లాలోని వివిధ నియోజకవర్గాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆసరా పెన్కషన్‌ పథకం స్థానికుల అభిప్రాయలను తెలుసుకుంటారు. బోధన్‌, నిజామాబాద్‌ అర్బన్‌, ఆర్మూర్‌, బాల్కోండ, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గాలలో ...

Read More »

రైల్వే స్టేషన్లో ప్రైవేట్‌ బహుళ సముదాయాలు….నిజామాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఎంపిక

కసరత్తు ప్రారంభించిన ఆర్‌ఎల్‌డిఎ నిజామాబాద్‌ ప్రతినిధి, నవంబరు 14, నిజామాబాద్‌ రైల్వే స్టేషన్‌కు మహార్థశ రానుందా…. మోడల్‌ రేల్వే స్టేషన్లగా మారుస్తామన్న యుపిఏ ప్రభుత్వం ఇంటి ముఖం పట్టింది. మోడల్‌ సంగతి ఏలా ఉన్న స్టేషన్‌ మాత్రం ఎప్పటిలాగే అవస్థలతో డల్‌గా ఉంది. ఇప్పుడు ఎన్‌డిఎ ప్రభుత్వంలో రైల్వే శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. రైల్వే స్థలాల్లో బహుళ సముదాయాలను నిర్మించేందుకు పైవ్రేట్‌ భాగస్వామ్యన్ని కోరుతంది. ఇందుకు మోడల్‌గా నిజామాబాద్‌ రైల్వే స్టేషన్‌ను ఎంపిక చేసింది. నిజామాబాద్‌ నగరానికి నడి బోడ్డున ఉన్న రైల్వే ...

Read More »

ప్రభుత్వానికి జ్ఞానోదయం కలగాలి -టిఎన్‌ఎస్‌ఎఫ్‌ యజ్ఞం

డిచ్‌పల్లి, నవంబర్‌ 12 : తెలంగాణ యూనివర్సిటీకి తెలంగాణ ప్రభుత్వం 200 కోట్ల రూపాయలు కేటాయించాలని, నిధుల మంజూరిలో ప్రభుత్వానికి జ్ఞానోదయం కలగాలని కోరుతూ టిఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో బుధవారం యజ్ఞం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లో విశ్వవిద్యాలయానికి ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించకపోవడం విడ్డూరమన్నారు. వర్సిటీ అభివృద్ధి కోసం స్థానిక శాసనసభ్యుడు, జిల్లా మంత్రి, పార్మలెంటు సభ్యురాలు ప్రత్యేకంగా చొరవ చూపి తక్షణమే 200 కోట్ల రూపాయలు కేటాయించాలని టిఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు పుప్పాల రవి డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ...

Read More »

15న కార్మిక సంఘం జిల్లా సదస్సు

డిచ్‌పల్లి, నవంబర్‌ 12 : మోడీ ప్రభుత్వం చేస్తున్న కార్మిక చట్టాల సవరణలపై ఈనెల 15న జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్‌ భవన్‌లో సదస్సు నిర్వహించనున్నట్లు సిఐటియు డివిజన్‌ అధ్యక్షుడు సయ్యద్‌ తెలిపారు. బుధవారం ఆయన డిచ్‌పల్లిలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కార్మిక సంఘాలన్ని ఐక్యంగా వుండి కార్మిక వ్యతిరేక చట్టాలను ప్రతిఘటించాలని, ఈ సదస్సును విజయవంతం చేయాలని కార్మికులను కోరారు.

Read More »

ఎంఆర్‌పిఎస్‌ సదస్సుకు తరలిరావాలి

డిచ్‌పల్లి, 12 : ఎస్సీ వర్గీకరణ కోసం అలుపెరగని పోరాటం చేసర్తున్న ఎంఆర్‌పిఎస్‌ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద క్రిష్ణమాదిగ ఈనెల 16న నిజామాబాద్‌ రానున్నారని ఆ సంస్థ డిచ్‌పల్లి మండల అధ్యక్షుడు గురిజాల అనిల్‌కుమార్‌ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఎంఆర్‌పిఎస్‌ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అనిల్‌కుమార్‌ మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా ఆమోదం తెలపాలని డిమాండ్‌ చేశారు. కాగా నిజామాబాద్‌లో నిర్వహించే సదస్సుకు ఎంఆర్‌పిఎస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ...

Read More »

ఆశా వర్కర్ల ధర్నా, ముఖం చాటెసిన డియంహెచ్‌ఒ.

నిజామాబాద్‌, నవరబర్‌ 11; తమ సమస్యలను వెంటనె పరిష్కరించాలని జిల్లాలొని ఆశా వర్కర్లందరు మంగళవారం ఉదయం సిఐటియు ఆధ్వర్యంలొ డియంహెచ్‌ఒ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా సిఐటియు నాయకుడు సిద్దిరాములు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న ఆశా వర్కర్లని వెంటనే రెగ్యులరైజ్‌ చేయాలని, గత 27 నెలలుగా ఇవ్వని జీతాలను వెంటనే చెల్లించాలని, టిఎ, డిఎ లను కూడా వెంటనె చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసారు. మరియు రాష్ట్ర బడ్జెట్‌లొ కూడా వీరికి సముచితస్తానం కల్పించి ప్రత్యేక నిధులను కేటాయించాలని వారు ...

Read More »

కలకలం రెపిన నకిలీ కరెన్సి

నిజామాబాద్‌, నవరబర్‌ 11; నగరంలోని నాగారం కెనాల్‌లొ నకిలీ కరెన్సి కలకలం రేపింది. వివరాలలోకి వెలితె నగర శివారులోని నాగారం దగ్గర గల నిజాంసాగర్‌ కెనాల్‌లొ ఈరోజు ఉదయం 11 గంటల సమయంలొ ఎవరొ గుర్తు తెలియని వ్యక్తి నకిలీ కరెన్సి నోట్లని ఒక సంచిలొ తీసుకువచ్చి కెనాల్‌ నీటిలొ పారవెసి పారిపోయాడు. అది చూసిన స్తానికులు అవి నిజమైన నోట్లని భావించి వాటికొసం ఎగబడ్డారు. దీనితొ అక్కడ ట్రాఫిక్‌ జామ్‌ ఆయి బ్రిడ్జిపైన రాకపోకలకు అంతరాయం ఎర్పడింది. వెంటనె 5 టౌన్‌ పొలీసులు ...

Read More »

సర్వేల్లో ప్రథమ స్థానంలో నిజామాబాద్‌….. కలెక్టర్‌కు అభినందనలు

కలెక్టర్‌కు అభినందనలు నిజామాబాద్‌, నవంబరు 11, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సర్వేలు నిర్వహించడంలో నిజామాబాద్‌ జిల్లాకు మొదటి స్థానం దక్కింది. సామాజిక సర్వే నుంచి మొదలుకొని ఆసరా పించన్ల పంపిణి వరకు అన్ని సర్వేలను కలెక్టర్‌ రోనాల్డ్‌ రాసు ఆధ్వర్యంలో సకాలంలో పూర్తి చేసి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలబెట్టారు. ఈ మేరకు జిల్లా ప్రత్యేక అధికారి అయిన ప్రభుత్వ సలదారు స్మితసబర్వాల్‌ కలెక్టర్‌ రోనాల్డ్‌రాసును అభింనందిచారు.సామాజిక సమగ్ర సర్వే, ఇంటింటి సర్వే, ఆధార్‌ సిండింగ్‌ సర్వేల్లో జిల్లాలోని ప్రతి అధికారి కీలక ...

Read More »