Breaking News

nizamsagar

కొనుగోలు కేంద్రాల‌ను పరిశీలించిన ఎమ్మెల్యే

నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిచ్కుంద మండలంలోని పాత్లపూర్‌ గ్రామంలో కొనసాగుతున్న శనగ కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర అసెంబ్లీ ప్యానల్‌ స్పీకర్‌ జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే శనివారం పరిశీలించారు. కొనుగోలు తీరు, రైతుల‌కు కల్పిస్తున్న సౌకర్యాల‌పై ఎమ్మెల్యే రైతుల‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతుల‌తో మాట్లాడుతూ కరోనా మహమ్మారి భయంకరమైనదని దాని పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాల‌న్నారు. కనపడని శత్రువుతో మనం పోరాటం చేస్తున్నామని, ప్రతి ఒక్కరూ దూరం పాటించి ఇంటి నుండి బయటకు రాకుండా ఉండాల‌న్నారు. ...

Read More »

ఉచితంగా మాస్కుల‌ పంపిణీ

నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని గోర్గల్‌ గ్రామంలో ఎంపీపీ పట్లోళ్ల జ్యోతి, దుర్గా రెడ్డి చేతుల‌ మీదుగా స్వచ్ఛంద సంస్థ డిఆర్‌ ఫౌండేషన్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో గ్రామస్తుల‌కు ఉచితంగా మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రజలు ఎవరూ కూడా ఇంటి నుంచి బయటకు రావొద్దని సూచించారు. ఎవరైనా అత్యవసర పరిస్థితుల‌లో బయటకు రావాల్సి వస్తే తప్పకుండా మాస్కు ధరించి రావాల‌ని, వీలైనంత మటుకు ఇంట్లోనే ఉండడానికి ప్రయత్నం చేయాల‌న్నారు. కార్యక్రమంలో ...

Read More »

ఉచిత బియ్యం పంపిణీ

నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని గోర్గల్‌ గ్రామంలో రేషన్‌ షాపులో ఉచిత బియ్యాన్ని ఎంపీపీ పట్లోళ్ల జ్యోతి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రజలు ఎవరూ కూడా ఇంటి నుంచి బయటకు రావద్దనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతి రేషన్‌ కార్డు ప్రతి ఒక్కరికి 12 కిలోల‌ ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. రేషన్‌ షాపు వద్ద ల‌బ్దిదారులు గుమిగూడకుండా ప్రతి ఒక్కరు ఒక మీటరు ...

Read More »

ప్రతి కార్యకర్త తోచినంత సహాయం చేయాలి

నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్‌ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు బాణాల ల‌క్ష్మారెడ్డి శుక్రవారం సందర్శించారు. పేదల‌కు పులిహోర పంపిణీ చేశారు. అలాగే పిఎం ఫండ్‌ క్రింద జిల్లాలోని మూడు మున్సిపల్‌ పరిధిల‌ కోసం ల‌క్ష రూపాయల‌ చెక్‌ అందచేశారు. కరోన వ్యాధి బారిన పడకుండా ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించాల‌ని, చుట్టుపక్కల‌ వాతావరణం పరిశుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాల‌న్నారు. ఇంటికి వెళ్లి శానిటైజర్‌ లేదా సబ్బుతో ...

Read More »

కరోనాపై రాష్ట్ర శాసనసభాపతి అవగాహన

నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా వైరస్‌ నివారణకు ప్రజల‌కు మరింతగా అవగాహన కలిగించడానికి రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. గురువారం ఉదయం బాన్సువాడ పట్టణంతో పాటు నియోజకవర్గ పరిధిలోని బీర్కూర్‌, కోటగిరి, రుద్రూర్‌, వర్ని, నసరుల్లాబాద్‌ మండ\ కేంద్రాలు, రాంపూర్‌ తండా, ఇబ్రహీంపేట, పోచారం గ్రామాల‌లో పర్యటించి మైక్‌ ద్వారా స్వయంగా నివారణ చర్యల‌ను ప్రజల‌కు వివరించారు. కరోనా మహమ్మారికి మందు లేదని, నివారణే మార్గమని పేర్కొన్నారు. మొదట్లో సరిjైున చర్యలు ...

Read More »

హసన్‌పల్లిలో రేషన్‌ బియ్యం పంపిణీ

నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని హసన్‌ పల్లి గ్రామంలో ప్రతి రేషన్‌ కార్డుకు ఒక వ్యక్తికి 12 కిలో బియ్యాన్ని పంపిణీ చేయడం జరుగుతుందని పంచాయతీ కార్యదర్శి రవికుమార్‌ రాథోడ్‌, రేషన్ డీల‌ర్‌ ఆగయ్య తెలిపారు. రేషన్‌ షాప్‌కు వచ్చే వారు ప్రతి ఒక్కరు ఒక మీటరు దూరం పాటించి రేషన్‌ బియ్యాన్ని తీసుకెళ్ళాల‌ని సూచించారు. ప్రజలు ఎవరూ కూడా ఇంటి నుంచి బయటకు రాకూడదన్నారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాల‌న్నారు. రేషన్‌ షాప్‌కి ...

Read More »

ఆత్యవసరమైతేనే బ్యాంక్‌ల‌కు రండి

నిజాంసాగర్‌, మార్చ్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అత్యవసమైతేనె బ్యాంక్‌ల‌కు రావాల‌ని ఆంధ్రబ్యాంక్‌ మేనేజర్‌ బన్సీ లాల్‌ అన్నారు. మంగళవారం ఆయన విలేకరుల‌తో మాట్లాడారు. కరోనా దృష్ట్యా బ్యాంక్‌ ఖాతాదారులు ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ బాంకింగ్‌ లాంటి సేవ‌లు ఉపయోగించుకోవాల‌ని తెలిపారు. బ్యాంక్‌నకు వచ్చినవారు కచ్చితంగా సామాజికదూరం పాటించాల‌ని కోరారు. అలాగే బ్యాంకు గుమ్మం వద్ద బకెట్‌లో నీరు, శానిటయిజర్‌ ఉంచామని తెలిపారు. శానిటయిజర్‌తో చేతులు కడుక్కుని బ్యాంక్‌ లోకి రావాల‌ని తెలిపారు. అత్యవసరం కాని పాస్‌బుక్‌ ప్రింటింగ్‌, బాలెన్సు విచారణ ...

Read More »

పాడి రైతు కుటుంబానికి ఇన్సూరెన్స్‌ చెక్కు అందజేత

నిజాంసాగర్‌, మార్చ్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హెరిటేజ్ పాల‌ సేకరణ కేంద్రంలో పాల‌ ఉత్పత్తి చేసే ఆరేడు గ్రామానికి చెందిన రైతు గూల‌ రమేష్‌ ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోయాడు. పాడి రైతు పాల‌ సేకరణ కేంద్రంలోని హెరిటేజ్‌ ఫార్మర్‌ వెల్ఫేర్‌ ట్రస్టులో సభ్యుడై ఉన్నందున రైతు ప్రమాద బీమా క్రింద నామినిగా ఉన్న అతని తల్లి గూల‌ పద్మకు రూ. రెండు ల‌క్షల‌ 2 వేల‌ 500 చెక్కును పిట్లం హెరిటేజ్‌ డైరీ మేనేజర్‌ ఆర్‌.సాయిలు అందజేశారు. అనంతరం ...

Read More »

శనగ కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మంత్రి

నిజాంసాగర్‌, మార్చ్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కల్హేర్‌ మండలంలోని బాచేపల్లి గ్రామంలో శనగ కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు, నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్‌ కలిసి శనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటే వ్యక్తిగత పరిశుభ్రత పాటించాల‌న్నారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని సూచించారు. దళారుల‌ను నమ్మి రైతులు ...

Read More »

వరి పంటలు పరిశీలించిన ఏవో

నిజాంసాగర్‌, మార్చ్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అగ్గి తెగులు నివారణకు వ్యవసాయ అధికారుల సల‌హాలు సూచనల‌ను పాటించాల‌ని మండల‌ వ్యవసాయ విస్తీర్ణ అధికారి అమర్‌ ప్రసాద్‌ అన్నారు. నిజాంసాగర్‌ మండలంలోని హసన్‌ పల్లి గ్రామ శివారులో వరి పంటల‌ను ఏవో అమర్‌ ప్రసాద్‌, ఏఈవో మధుసూదన్‌ రావు కలిసి పరిశీలించారు. అనంతరం ఏవో మాట్లాడుతూ వ్యవసాయ అధికారుల సల‌హాలు సూచన మేరకు రైతు వరి పంటకు మందు వేయాల‌న్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రవికుమార్‌ రాథోడ్‌, విద్యా కమిటీ చైర్మన్‌ ...

Read More »

రైతులు తీసుకోవాల్సిన సూచనలు

నిజాంసాగర్‌, మార్చ్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని హసన్‌ పల్లి గ్రామపంచాయతీ నోటీసు బోర్డుపై మండల‌ వ్యవసాయ అధికారి అమర్‌ ప్రసాద్‌ రైతుల‌కు పలు సూచనలు రాసిపెట్టారు. అగ్గి తెగులు నివారణకు మొదటి దశ- ట్రైసైక్లజోర్‌ -120 గ్రాములు,( ఏకరానికి), రెండవ దశ – ఐసోప్రొథమెలిన్‌ 300 మిల్లీ లీటర్లు (ఎకరానికి) పిచికారీ చేయాల‌న్నారు.

Read More »

కళ్యాణల‌క్ష్మి చెక్కుల‌ పంపిణీ

నిజాంసాగర్‌, మార్చ్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెద్దకొడప్‌గల్‌ పిఎసిఎస్‌ నూతన చైర్మన్‌గా ఎన్నికైన హనుమంత్‌ రెడ్డి మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా జుక్కల్‌ శాసన సభ్యులు హనుమంత్‌ షిండే, ఎన్‌డిసిసిబి చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. కల్యాణ ల‌క్ష్మి చెక్కుల‌ను అర్హుల‌కు అందజేశారు. అదేవిధంగా డైరెక్టర్లు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం పోచారం భాస్కర్‌ రెడ్డికి సన్మానం చేశారు. కార్యక్రమంలో రైతులు, స్థానిక మండల‌ ప్రజా ప్రతినిధులు, బాన్సువాడ నియోజకవర్గ ...

Read More »

గ్రామ పంచాయతీల‌కు ట్రాక్టర్ల అందజేత

నిజాంసాగర్‌, మార్చ్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్‌ను అందజేయడం జరుగుతుందని రాష్ట్ర అసెంబ్లీ ప్యానల్‌ స్పీకర్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే, డిసిసిబి చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి అన్నారు. జుక్కల్‌ మండల‌ కేంద్రంలోని ఎంపీపీ కార్యాల‌యం వద్ద పలు గ్రామాల‌ సర్పంచుల‌కు టాక్టర్లను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీ పరిశుభ్రతలో భాగంగా ట్రాక్టర్ల అవసరం ఉంటుందని తద్వారా పరిశుభ్రత పాటించాల‌ని అన్నారు, కార్యక్రమంలో ఎంపిపి యశోద, ...

Read More »

మహిళ కడుపులో ఐదు కిలోల‌ కంతి

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్‌ కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో గురువారం ఉదయం ఓ మహిళ కడుపు నుండి 5 కిలోల‌ కంతిని శస్త్రచికిత్స చేసి తీసినట్టు ప్రముఖ సర్జన్‌ ఆసుపత్రి మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌. బి.నాగేశ్వరరావు తెలిపారు.

Read More »

ఘనంగా జడ్పి ఛైర్మన్‌ జన్మదిన వేడుకలు

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా పరిషత్‌ చైర్పర్సన్‌ ధపెదర్‌ శోభ జన్మదిన వేడుకల‌ను ఘనంగా నిర్వహించారు. నిజాంసాగర్‌ మండల‌ కేంద్రంలోని ఎంపీడీవో కార్యాయంలో ఎంపీపీ పట్లోళ్ల జ్యోతి కేకు కట్‌ చేసి పంచి పెట్టారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ జెడ్పి చైర్‌ పర్సన్‌ శోభ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాల‌ని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎయంసి ఉపాధ్యక్షుడు గైని విఠల్‌, వైస్‌ ఎంపీపీ మనోహర్‌, మాజీ సీడీసీ చైర్మన్‌ దుర్గరెడ్డి, టిఆర్‌ఎస్‌ పార్టీ మండల‌ అధ్యక్షుడు ...

Read More »

రైతు కుటుంబానికి పరామర్శ

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాగిరెడ్డిపేట్‌ మండలం తాండూరు గ్రామంలో దివిటి రాజయ్య అనే రైతు ఇటీవల పొలంలో ప్రమాదవశాత్తు కరెంట్‌ షాక్‌తో మృతి చెందాడు. కాగా వారి కుటుంబాన్ని శనివారం కాంగ్రెస్‌ పార్టీ నాయకులు టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి వడ్డెపల్లి సుభాష్‌ రెడ్డి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట నాగిరెడ్డి పెట్‌ ఎంపీపీ రాజ్‌ దాస్‌, కాంగ్రెస్‌ నాయకులు దనుంజయ్‌, బాల‌య్య ఉన్నారు.

Read More »

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాల‌ని స్పీకర్‌కు వినతి

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ సమస్యలు పరిష్కరించాల‌ని కోరుతూ టియుడబ్ల్యుజె (ఐజెయు) ఆధ్వర్యంలో తెలంగాణ శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డికి జర్నలిస్టులు శనివారం వినతి పత్రం సమర్పించారు. తమ సమస్యల‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకుపోవాల‌ని స్పీకర్‌ను కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రజినీకాంత్‌ మాట్లాడుతూ తెంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతుగా ఉద్యమంలో పాల్గొన్నామని గుర్తుచేశారు. అన్ని ఉద్యోగ సంఘాల‌కు ముఖ్యమంత్రి హామీలు నెరవేర్చారని, జర్నలిస్టుల‌ సంక్షేమానికి ముఖ్యమంత్రి అనేక హామీలు ఇచ్చారని, ...

Read More »

గ్రామ పంచాయతీకి ట్రాక్టర్‌ అందజేత

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్ మండలం వెల్గ‌నూర్‌ గ్రామ పంచాయతీకి నూతన ట్రాక్టర్‌ను మండల‌ సర్పంచ్‌ల‌ సంఘం అధ్యక్షుడు రమేష్‌ గౌడ్‌ అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీకి టాక్టర్‌ను కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. గ్రామంలోని ప్రజలు చెత్తను ట్రాక్టర్‌లో వేసిన తర్వాత డంపింగ్‌ యాడ్‌కు తరలించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుధాకర్‌, ఎంపీటీసీ జనార్ధన్‌, మాగి సర్పంచ్‌ కమ్మరి కత్త ఆంజయ్య, నాయకులు ...

Read More »

మండల‌ జర్నలిస్టుల‌ కార్యవర్గం ఎన్నిక

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాయంలో జర్నలిస్టుల‌ సమావేశం నిర్వహించారు. జర్నలిస్టుల‌ మండల అధ్యక్షులుగా సీఎచ్‌ రమేష్‌ కుమార్‌-మనతెలంగాణ, ఉపాధ్యక్షులుగా మంగపాల్‌ దినాకర్‌-10టీవి, జెనరల్‌ సెక్రెటరీగా సయ్యద్‌ మెహ్రాజ్‌ ఒద్దిన్‌-ఎన్‌ టీవి, జాయింట్‌ సెక్రెటరీగా మొహమ్మద్‌ షరీఫ్‌-ఆంధ్రభూమి, కోశాధికారిగా సీహెచ్‌ కాశి -ఐఎన్‌ బి టివి, కార్యవర్గ సభ్యులుగా సంజీవ్‌, ల‌క్ష్మణ్‌ దాస్‌, హుల్లాస్‌, రాజమ్లయ్య, అబ్దుల్‌ రహీం, రఘు గౌడ్‌ నియమించబడ్డారు.

Read More »

హసన్‌ పల్లి రోడ్డు సొగసుచూడత‌రమా

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని హసన్‌ పల్లి గ్రామానికి వెళ్లే బిటి రోడ్డుకు అడుగడుగునా గుంతలు పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హసన్‌ పల్లి గ్రామం మీదుగా హెడ్్స‌లూస్ జల‌విద్యుత్‌ కేంద్రానికి వెళ్లేందుకు ఈ రహదారి గుండానే వెళుతుంటారు. జల‌విద్యుత్‌ కేంద్రానికి అనుసంధానంగా వున్న నిజాంసాగర్‌ ప్రాజెక్టు ప్రధాన కాలువ గేట్లను పరిశీలించేందుకు జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు సైతం ఈ రహదారి గుండా వెళుతుంటారు. చాలా సంవత్సరాల‌ తరువాత వేసిన బీటీ రోడ్డు గుంతల‌మయంగా ...

Read More »