Breaking News

NRI

అమెరికన్లు అందుకే హిల్లరీని వద్దనుకున్నారా?

న్యూయార్క్: నువ్వా నేనా అన్నట్టు సాగిన అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయంపై తుదికంటా ఆశలు నిలబెట్టుకున్న హిల్లరీ క్లింటన్ అనూహ్యంగా డీలాపడ్డారు. హిల్లరీ క్లింటన్ విజయం నల్లేరుమీద నడకేననీ… ప్రజలు ముఖ్యంగా మహిళలు ఆమె వైపే ఉన్నారని సర్వేలు హోరెత్తాయి. అయితే ట్రంప్ చేతిలో ఓటమి చవిచూడడం వెనుక కారణాలేమిటన్న దానిపై చర్చోపచర్చలు జరగుతున్నాయి. ఈ మెయిల్ కుంభకోణమే ప్రధాన కారణమంటూ చెబుతున్నప్పటికీ… ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా విజయావకాశాలను దెబ్బతీసినట్టు చెబుతున్నారు.  నామినేషన్‌కు ముందు పార్టీ ప్రత్యర్థి బెర్నీ శాండర్స్‌ ఆరోగ్యంపై ...

Read More »

డొనాల్డ్ ట్రంప్‌పై ఆరోపణలు.. నమ్ముతున్న అమెరికా జనం.. గెలుస్తారా?

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై వస్తున్న ఆరోపణలను జనం నమ్ముతున్నారని తాజా సర్వేలో తేలింది. మహిళలతో అనుచితంగా ప్రవర్తించారని వస్తున్న ఆరోపణలను ట్రంప్‌తో పాటు ఆయన ఫ్యామిలీ సభ్యులు ఖండిస్తున్న వేళ.. జనం మాత్రం ఆ ఆరోపణలను నిజమని నమ్ముతున్నారు. డొనాల్డ్ ట్రంప్‌పై వచ్చిన ఆరోపణలను అమెరికన్లు నమ్ముతున్నారని తాజా సర్వేలో వెల్లడైంది. డొనాల్డ్ ట్రంప్ పై మహిళలు చేసిన ఆరోపణలను విశ్వసిస్తున్నామని ఏపీ-జీఎఫ్‌ కే సర్వేలో 70 శాతం మందిపైగా అమెరికన్లు వెల్లడించారు. ట్రంప్ మద్దతుదారుల్లో 35 ...

Read More »

అమెరికాలో వైభవంగా బతుకమ్మ వేడుకలు

అమెరికాలోని నార్త్‌కరోలినాలో ట్రయాంగిల్ తెలంగాణ అసోసియేషన్ (టీటీజీఏ) ఆధ్వర్యంలో వైభవంగా బతుకమ్మ వేడుకలు జరిగాయి. ఆడబిడ్డలు జోర్డాన్ సరస్సు వద్ద బతుకమ్మ ఆడారు. అసోసియేషన్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్ చంద్ర యల్లపంతుల, ప్రసన్న చింతల, కృష్ణ పెడోటీ, సంపత్ పీచు, రేణుక గుర్రాల, పద్మజ నాగారం, శంకర్ రేపాల, హరి అప్పని, శ్రీకాంత్ మద్దోజు, సంతోష్ వరగంటి తదితరులు పాల్గొన్నారు.

Read More »

కెనడాలో బతుకమ్మ ఉత్సవాలు

తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ కాల్గరీ ఆధ్వర్యంలో కెనడాలో బతుకమ్మ ఉత్సవాలు కన్నుల పండువగా జరిగాయి. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ అల్బెర్టా ఈ వేడుకలకు ప్రోత్సాహం అందించింది. కార్యక్రమంలో వీరేశం, వీరారెడ్డి, పవన్‌కుమార్, సతీశ్, రవి, మహేంద్రారెడ్డి, తిరుమల్, వికాస్ తదితరులు పాల్గొన్నారు.

Read More »

టెకా ఆధ్వర్యంలో యూరోప్‌లోని బర్మింగ్‌హామ్‌లో బతుకమ్మ

తెలంగాణ యూరోప్ కల్చరల్ అసోసియేషన్ (టెకా) ఆధ్వర్యంలో యూరోప్‌లోని బర్మింగ్‌హామ్‌లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మాట్లాడుతున్న ప్రముఖ కవి నందిని సిధారెడ్డి. పట్టణంలోని వెంకటేశ్వరస్వామి మందిరంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకలకు నందిని సిధారెడ్డితోపాటు భారత కౌన్సిల్ జనరల్ జేకే శర్మ, సినీ నటుడు ఆకాశ్, ఎన్నారై టీఆర్‌ఎస్ సెల్ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, తెలంగాణ జాగృతి లండన్ అధ్యక్షుడు సంపత్, ప్రముఖ బిజినెస్‌మాన్ డాక్టర్ రాజా పప్పు తదితరులు హాజరయ్యారు. కార్యక్రమాన్ని టెకా కార్యదర్శి శేషేంద్ర శేషభట్టర్, కార్యదర్శి రమేశ్ తాటిశెట్టి, కోర్ ...

Read More »

ఆస్ట్రేలియాలో అల‌రించిన బ‌తుక‌మ్మ‌

బ‌తుక‌మ్మ ఉత్స‌వాల‌కు హాజ‌ర‌యిన ఎంపి క‌విత‌ సిడ్నీ న‌గ‌రం బ‌తుక‌మ్మ ఆటా-పాట‌తో పుల‌కించింది. బ‌తుక‌మ్మ‌ల చుట్టూ వ‌ల‌యాకారంలో తిరుగుతున్న మ‌హిళ‌ల కాలిఅందెల ర‌వ‌ళుల మ‌ధ్య బ‌తుక‌మ్మ పాట‌లు వీనుల‌విందు చేశాయి. బ‌తుక‌మ్మ త‌యారీ మొద‌లు కొని ఆట‌పూర్త‌య్యేంత వ‌ర‌కూ సిడ్నీ ప‌రిస‌రాలు కొత్త శోభ‌తో ప‌ర్యాట‌కుల‌ను అల‌రించాయి. సిడ్నీసైడ‌ర్స్ గా పిలువ‌బ‌డే సిడ్నీ వాసులు తెలంగాణ‌కే ప‌రిమితం అయిన పూల‌జాత‌ర‌తో ప‌ర‌వ‌శించిపోయారు. ఆస్ట్రేలియా తెలంగాణ స్టేట్ అసోసియేష‌న్ ఆహ్వానం మేర‌కు తెలంగాణ‌ జాగృతి అధ్య‌క్షురాలు, నిజామాబాద్ ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత ఆస్ట్రేలియా వెళ్లారు. సిడ్నీ ...

Read More »

బిచ్చగాడికి డబ్బులేయడమే ప్రధాని చేసిన తప్పా?

మెల్‌బోర్న్: ఒక చేత్తే దానం చేస్తే మరో చేతికి తెలియకూడదంటారు పెద్దలు. పాత్రత ఎరిగి దానం చేయమంటారు మరికొందరు. ఎవరేమన్నా సాటి మనిషికి చేతనైనంత దానం, ధర్మం చేయమంటారు విజ్ఞులు. వీధిలో అడుకున్నే ఓ బిచ్చగాడికి దానం చేసిన ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్ టర్న్‌బుల్ చిక్కుల్లో పడ్డారు. ఆస్ట్రేలియా ఆర్ధికాభివృద్ధి కమిటీలో ప్రసంగిచేందుకు మెల్‌బోర్న్ వచ్చిన టర్న్‌బుల్ అక్కడ ఓ రోడ్డుపై అడుక్కుంటున్న ఓ బిచ్చగాడి చేతిలో 5 డాలర్ల నోటు పెట్టారు. ఆ ఫోటో సోషల్ మీడియోలో రావడంతో ప్రధాని చర్యపై ప్రశంసలతో ...

Read More »

తెలంగాణ జాగృతి పదవ వార్షికోత్సవ ప్రతినిధుల సభ

తెలంగాణ జాగృతి పదవ వార్షికోత్సవ ప్రతినిధుల సభ నల్లగొండలో జరుగనుంది. ఆగస్టు 5, 6 తేదీలలో జరగబోయే ఈ ప్రతినిధుల సభకు రాష్ట్రం నుండి దేశం నుండి 2 వేల మంది ప్రతినిధులు హాజరవనున్నారు. ఈ సమావేశాల్లో జాగృతి పదేళ్ల ప్రస్థానం యొక్క సింహావలోకనం తో పాటు భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. ఆగస్టు 5 వ తేదీన నల్లగొండలో తెలంగాణ జాగృతి స్కిల్ డెవెలప్ మెంట్ సెంటర్ ను అధ్యక్షులు శ్రీమతి కల్వకుంట్ల కవిత ప్రారంభిస్తారు. అనంతరం రెండు రోజులపాటు జరిగే సమావేశాల్లో గత ...

Read More »

జీతాలు చెల్లించని కంపెనీలు కోర్టుకు – యూఏఈ డిక్రీ

జీతాలు చెల్లించని కంపెనీలను కోర్టుకు ఈడ్చే దిశగా చర్యలు తీసుకోబడ్తాయని మినిస్ట్రీ ఆఫ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ అండ్‌ ఎమిరటైజేషన్‌ మంగళవారం వెల్లడించింది. మంగళవారం ఈ మేరకు ఓ డిక్రీని కూడా విడుదల చేసింది. 100 మందికి పైగా కార్మికులున్న ఏ సంస్థ అయినా ప్రతిపాదిత తేదీని దాటి 10 రోజుల్లోగా జీతాల చెల్లించకపోతే, ఆ సంస్థకు కొత్తగా వర్క్‌ పర్మిట్లు ఇచ్చే అవకాశం లేదని ఈ డిక్రీ చెబుతోంది. యూఏఈ మినిస్టర్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ అండ్‌ ఎమిరటైజేషన్‌ సక్ర్‌ ఘోబాష్‌ ఈ విషయాన్ని ...

Read More »

హిల్లరీ క్లింటన్ గెలవకపోతే అమెరికా నాశనం అవుతుంది…

ట్రంప్ గెలిస్తే అమెరికా నాశనం అవుతుందని, అదే హిల్లరీ క్లింటన్ విజయం సాధిస్తే అమెరికా దేశానికి అన్ని రకాలుగా చాలా బావుంటుందని డెమోక్రాట్ల తరపున హిల్లరీకి గట్టి పోటీ ఇచ్చిన బెర్నీ వ్యాఖ్యానించారు. ట్రంప్ వివాదస్పద వ్యాఖ్యల కంటే ఇప్పుడు బెర్నీ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. అమెరికా నాశనమవుతుందని ఆయన అనడంపై అంతా తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ట్రంప్ అధ్యక్షుడయితే ఆయన నోటి దూలతో ప్రమాదాలను కొనితెచ్చుకోవడమే అవుతుందని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఇకపోతే హిల్లరీ క్లింటన్‌ను బెర్నీ పొగడ్తలతో ముంచెత్తారు. ఆమె ఆలోచనా ...

Read More »

నేను కానీ.. అధ్యక్షుడిని కానీ అయ్యానంటే..: మరోమారు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

వాషింగ్టన్: రిపబ్లికన్ వైట్ హౌస్ నామినీ డొనాల్డ్ ట్రంప్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కనుక అధ్యక్షుడినైతే ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో) నుంచి బయటకు వస్తామని పేర్కొన్నారు. ఓ చానల్ నిర్వహించిన ‘మీట్ ద ప్రెస్’ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని పునస్సమీక్షించుకోవడమే లేకుంటే బయటకు రావడమో చేస్తామని గతంలో పేర్కొన్న ట్రంప్ తాజాగా ఆ వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు. విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహించేందుకు వెళ్లిన సంస్థలపై శిక్షార్హక దిగుమతి పన్ను కింద ...

Read More »

రష్యాకు అనుకూలంగా ట్రంప్ వ్యాఖ్యలు.. విరుచుకుపడుతున్న ప్రత్యర్థులు

క్లీవ్‌లాండ్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల తరపున పోటీపడుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోమారు రష్యాపై తన విధేయతను చాటుకున్నారు. నాటో దేశాలపై రష్యా దాడులకు దిగితే తాము జోక్యం చేసుకోబోమని వ్యాఖ్యానించారు. నాటో అంశంలో ట్రంప్, ఆయన సహచరుడు పరస్పర విరుద్ధ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఉపాధ్యక్ష ప్రసంగంలో ట్రంప్ సహచరుడు మైక్ పెన్స్ మాట్లాడుతూ ట్రంప్ అధ్యక్షుడైతే అమెరికా నాటోతోనే ఉంటుందని, మిలటరీని పునర్వ్యవస్థీకరిస్తారని పేర్కొన్నారు. ట్రంప్ మాత్రం అందుకు విరుద్ధ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. తాను ...

Read More »

ట్రంప్‌ను వ్యతిరేకిస్తూ మహిళల నగ్న ప్రదర్శన !

క్లీవ్‌లాండ్‌: కొంతకాలంగా ప్రపంచదృష్టిని విపరీతంగా ఆకర్షిస్తున్న వ్యక్తి డోనాల్డ్‌ ట్రంప్‌. అతనికి మద్ధతుదారులు ఎంత మంది ఉన్నారో, అతణ్ని వ్యతిరేకించేవారూ అంతమందే ఉన్నారు. తాజాగా ట్రంప్‌ వ్యతిరేక బృందం క్లీవ్‌లాండ్‌లో ఓ నగ్న ప్రదర్శన చేపట్టింది. వైట్‌హౌస్‌లోకి వెళ్లే అర్హత ట్రంప్‌కు లేదంటూ దాదాపు 130 మంది మహిళలు నగ్నంగా తమ నిరసన గళాన్ని వినిపించారు. రిపబ్లిక్‌ పార్టీ తమ అభ్యర్థిగా ట్రంప్‌ను ప్రకటించే వేదిక రిపబ్లికన్‌ నేషనల్‌ కన్వెన్షన్‌ హాల్‌ బయట దుస్తులన్నీ విప్పేసి అద్దాలను పట్టుకుని తమ నిరసనను తెలియజేశారు. నగ్నచిత్రాలు ...

Read More »

ప్రవాసాంధ్రులు గ్రామాలను దత్తత తీసుకోవాలి

అమెరికా, ఇతర ప్రాంతాల్లో నివశిస్తున్న ప్రవాసాంధ్రులు స్వగ్రామాలను దత్తత తీసుకోవాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సూచించారు. అమెరికా పర్యటనలో ఉన్న వెంకయ్యనాయుడు శనివారం ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్‌) అధ్యక్షుడు మన్నవ మోహన్‌ కృష్ణ బృందంతో చికాగాలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నాట్స్‌ అధ్యక్షుడు మోహన్‌ కృష్ణ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ సంస్థ పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం స్మార్ట్‌ విలేజ్‌, స్మార్ట్‌ వార్డు కార్యక్రమాలను ...

Read More »

ఏకంగా స్మార్ట్ ఫోన్‌నే పెళ్ళాడాడు

లాస్ ఏంజెల్స్: స్మార్ట్ ఫోన్.. ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఓ భాగమైంది. నిత్య జీవితంలో మమేకమైంది. అది పక్కన లేకపోతే ఆందోళన చెందేవారు ఎంతో మంది. దాన్ని కొనేందుకు శరీర భాగాలు అమ్ముకునేవారు కొందరైతే, ఆత్మహత్యకు పాల్పడే వారు మరి కొందరు. అలాంటి స్మార్ట్ ఫోన్‌ను ఓ వ్యక్తి తన జీవిత భాగస్వామిగా చేసుకున్నాడు. మన మాటల్లో చెప్పాలంటే ఏకంగా దాన్ని పెళ్లి చేసుకున్నాడు. వినడానికి విచిత్రంగా ఉన్న ఈ పెళ్లితంతు అమెరికాలో గ్రాండ్‌గా జరిగింది. ఆ పెళ్ళి కొడుకు పేరు ఆరోన్. ...

Read More »

అమెరికాలో ఉండబోనంటున్న టెక్సాస్!

టెక్సాస్: ‘బ్రెగ్జిట్‌’ ప్రకంపనలు ‘అగ్రరాజ్యం’ అమెరికానూ తాకాయి. ‘అమెరికా నుంచి మాకు స్వాతంత్య్రం కావాలి’ అంటూ టెక్సాస్‌లో ఇప్పటికే ఉన్న డిమాండ్‌ ఉద్యమ రూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది. డేనియల్‌ మిల్లర్‌ అధ్యక్షతన టెక్సాస్‌ నేషనలిస్ట్‌ మూమెంట్‌(టీఎన్‌ఎం) నడుస్తోంది. ‘టెక్సాస్‌కు స్వాతంత్య్రం’ అంశం ఈ ఏడాది మెల్లగా మొదలై.. ‘బ్రెగ్జిట్‌’ తర్వాత ఊపందుకుంది. టీఎన్‌ఎం ఫేస్‌బుక్‌ పేజీకి 2లక్షల మంది ఫాలోయర్లున్నారు. టెక్సాస్‌ ‘పతాకం’… దానిపై ‘టెక్సిట్‌’(బ్రిటన్‌ ఎగ్జిట్‌లాగా… టెక్సాస్‌ ఎగ్జిట్‌) అనే అక్షరాలతో ఈ ఫేస్‌బుక్‌ పేజీని రూపొందించారు. ఎస్‌ క్యాలిఫోర్నియా, న్యూహాంప్‌షైర్‌ ...

Read More »

వామ్మో ఎన్‌ఆర్‌ఐ సంబంధం..

కట్నం వేధింపులపై బెంబేలు  మూడు రోజుల్లో నాలుగు కేసులు.. సిద్దిపేట : ఎన్‌ఆర్‌ఐ సంబంధాలంటేనే అమ్మాయిల తల్లిదండ్రులు భయపడుతున్నారు. అక్కడ వారికి ఆదాయం ఎంతున్నా అబ్బాయిల వైఖరి ఎలా ఉంటుందోనన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. సిద్దిపేటలో మూడురోజుల్లో నలుగురు ఎన్నారైలు అదనపు కట్నంకోసం వేధిస్తున్నారన్న కేసులు నమోదవ్వడం సంచలనం కలిగిస్తోంది. ఎన్‌ఆర్‌ఐ సంబంధాలైతే భార్యాభర్తల మధ్య విబేధాలు తలెత్తినపుడు కౌన్సెలింగ్‌ తదితర సర్దుబాటు చర్యలు తీసుకునే అవకాశాలు లేకపోవడం సమస్యగా మారుతుంది. సాధారణంగా భార్యాభర్తల మధ్య విబేధాలు తలెత్తినా, అదనపు కట్నంకోసం అత్తింటివారు వేధించినా ...

Read More »

ఆ 33 మంది ఎందుకు ఏడుస్తున్నారో తెలుసా?

సింగపూర్: భూమి మీద పెట్టుబడి పెడితే భవిష్యత్తుకు ఢోకా ఉండదని చాలామంది భావిస్తారు. వీరూ అలాగే అనుకున్నారు. భవిష్యత్తులో బోల్డంత అభివృద్ధి జరుగుతుందని, పెట్టుబడికి వందరెట్టు వస్తుందని చెప్పడంతో ఓ సంస్థ నుంచి పెద్దమొత్తంలో ప్లాట్లు కొనుగోలు చేశారు. కానీ సంవత్సరాలు గడుస్తున్నా అక్కడ అభివృద్ది కానరాకపోవడంతో ఇప్పుడు లబోదిబో మంటున్నారు. ఈ ప్లాట్లు మాకొద్దు మొర్రో మీరే తిరిగి తీసుకోండి అంటే కోర్టులో తేల్చుకోవాలని సదరు సంస్థ బెదిరిస్తుండడంతో ఏం చేయాలో తోచక పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారత సంతతికి చెందిన 33 ...

Read More »

విదేశీ కార్మికుడి హత్య..

షార్జా: బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కార్మికుడు ఒకరు షార్జాలో హత్యకు గురయ్యాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మువైలీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు అంబులెన్స్, పెట్రోలు, సీఐడీ పోలీసులను వెంటనే ఘటనా స్థలానికి పంపించారు. అప్పటికే అక్కడ చనిపోయి రక్తపుమడుగులో పడిఉన్న వ్యక్తిని ఓ పాకిస్థానీగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిలో ఒకరు పాకిస్థానీ కాగా మరొకరు బంగ్లాదేశీ. వెంటనే వారిద్దరినీ సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Read More »

కువైట్‌లో వారు కూడా వర్క్ పర్మిట్ల బదిలీకి అర్హులే..

కువైట్: వ్యవసాయ, పారిశ్రామిక, మత్స్య రంగాల కార్మికులతోపాటు కాపర్లుగా పనిచేస్తున్న వారి వర్క్ పర్మిట్లను వారి స్పాన్సర్ల అనుమతితో బదిలీచేసేందుకు అధికారులు యోచిస్తున్నారు. ఇందుకుగాను 300 కువైటీ దినార్లు వసూలు చేయాలని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ అధికారులు భావిస్తున్నారు. అయితే ఒక రంగం నుంచి మరో రంగంలోకి బదిలీలను అనుమతించేది లేదని, ప్రస్తుతం పనిచేస్తున్న రంగం నుంచి మళ్లీ అదే రంగానికి మాత్రమే ట్రాన్స్‌ఫర్లు వర్తిస్తాయని అధికారులు తెలిపారు. పైన పేర్కొన్న కార్మికులు తప్ప ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఏడాది సర్వీసు ...

Read More »