గాంధారి, డిసెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇటీవల అగ్నిప్రమాదంలో ఇల్లు కోల్పోయిన బాధితునికి కాంగ్రెస్ నాయకులు సహాయం అందించారు. గాంధారి మండల కేంద్రానికి చెందిన మద్దెల కాశయ్య ఇల్లు అగ్నిప్రమాదానికి గురై పూర్తిగా కాలిపోయింది. విషయం తెలుసుకున్న గాంధారి మండల కాంగ్రెస్ నాయకులు తగిన సహాయం అందించారు. బాధితునికి, కుటుంబానికి దుస్తులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ బాలరాజ్, కాంగ్రెస్ నాయకులు మదార్, లైన్ రమేష్, గడ రాజు, పోచయ్య తదితరులు పాల్గొన్నారు.
Read More »ఖాళీ పోస్టులు భర్తీచేయాలి… నిరుద్యోగ భృతి చెల్లించాలి
కామారెడ్డి, డిసెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ యువ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, నిరుద్యోగ భతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారుల దిగ్బంధనం కార్యక్రమంలో భాగంగా టెక్రియల్ చౌరస్తా వద్ద రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు 22 మంది కార్యకర్తలను అరెస్టు చేసి దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌కి తరలించారు. ఈ సందర్భంగా బిజెవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల ఆనంతకష్ణ మాట్లాడుతూ ఉద్యోగాలకై కొట్లాడి ...
Read More »23వ వార్డు వాసులు బిజెపిలోకి
కామారెడ్డి, డిసెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం కామారెడ్డి పట్టణంలో 23వ వార్డ్‌కు సంబందించిన 30 మంది మహిళలతో సహా 68 మందికి కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీ కాటిపాల్లి వెంకటరమణ రెడ్డి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పక్కనున్న సిద్దిపేట, సిరిసిల్ల పట్టణాలు అభివద్ధిలో దూసుకు పోతుంటే కామారెడ్డి పట్టణం మాత్రం అభివద్ధికి ఆమడ దూరంలో ఆగిపోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వం పట్టణ అభివద్ధికి నిధులు కేటాయిస్తున్నప్పటికీ పట్టణంలో కేవలం మూడు నాలుగు వార్డుల్లో ...
Read More »ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి
నిజామాబాద్, డిసెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మి నర్సయ్య మాట్లాడారు. ఐదు సంవత్సరాలకు ఒకసారి వర్తింప చేయవలసిన పిఆర్సి గడువు 01-07-2018న ముగిసినప్పటికీ మూడు సంవత్సరాలు సమీపిస్తున్నా ప్రక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు సంవత్సరాల నుండి 27% ఐఆర్ ఇస్తున్నప్పటికీ పిఆర్సి అమలు చేయనందుకు వెంటనే పిఆర్సి ...
Read More »పిఎం మోడీతో జగన్ బేటీ…
– మంత్రి వర్గంలో చోటు – మోడీతో భేటీకేనా జగన్ ఢిల్లీలో పాగా – ఏ క్షణాన్నైనా కేంద్రంలో అనూహ్య పరిణామాలు – ఇదే సమయంలో బిజెపి కేంద్ర మంత్రి వర్గంలో మార్పులు హైదరాబాద్, అక్టోబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇటీవల బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన అత్యంత కీలకమైన, ప్రభావ శీలమైన వ్యవసాయ రంగంలో సమూల మార్పుల కొరకు తీసుకువచ్చిన చట్టాలు రాజ్యసభను దాటి, రాష్ట్రపతి ఆమోద ముద్ర పడ్డ విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ విషయమై పంజాబ్, ...
Read More »ప్రపంచం ముందు తలెత్తుకుని బ్రతకాలన్న ఉద్దేశంతోనే ….
ఆర్మూర్, సెప్టెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మెండోరా మండలం సావేల్ గ్రామంలో బిటి రోడ్డు పనులకు ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన చేసిన రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. శనివారం సావేల్ గ్రామంలో 2 కోట్ల 76 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న బిటి రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడారు. 2 కోట్ల 76 లక్షల రూపాయలతో పుష్కర ఘాట్ నుంచి మెండోరా మండల కేంద్రం వరకు ప్రధాన మంత్రి సడక్ ...
Read More »పదవి చేపట్టిన నాటి నుండి ప్రణాళికా బద్దంగా చేస్తున్నారు
ఆర్మూర్, సెప్టెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్కొండ మండలం చిట్టాపూర్ మరియు నాగపూర్ గ్రామాలలో బిటి రోడ్డు పనులకు రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, శాసనసభ వ్యవహారాలు, హౌసింగ్ శాఖల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. శనివారం బాల్కొండ మండలంలోని చిట్టాపూర్ గ్రామంలో 336.09 లక్షలు నాగపూర్ గ్రామంలో కోటి 60 లక్షలతో బిటి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కిసాన్ నగర్ రోడ్ నుండి నరసాపూర్ రోడ్డు మంజూరు చేసుకొని ...
Read More »ఎంఐఎం మెప్పు కోసమే…
కామారెడ్డి, సెప్టెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ విమోచన దినోత్సవం సందర్బంగా అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయం వద్ద జాతీయ జండా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ తెలు శ్రీనివాస్ మాట్లాడుతూ భారత దేశానికి స్వతంత్రం వచ్చాక కూడా తెలంగాణ ప్రాంతం నిజాం ఆధీనంలోనే ఉండిపోయిందని, రజాకార్ల ఆగడాలను తట్టుకోలేక ఎంతో మంది సాయుధ పోరాటం చేశారని, సర్ధార్ వల్లభాయ్ పటేల్ సైనిక చర్య కారణంగా సెప్టెంబర్ 17, ...
Read More »హిందూ పండుగలపై ఆంక్షలు తగదు – న్యాయవాది సురేందర్ రెడ్డి
కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా మహమ్మారి ప్రబలిన నేపథ్యంలో, కరోనాను అడ్డుపెట్టుకొని హిందూ పండుగలపై ఆంక్షలు పెట్టడం తగదని న్యాయవాది సురేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఏమతం వారికైనా వారి వారి పండగలను స్వేచ్చగా జరుపుకోవడానికి రాజ్యాంగం హక్కు కల్పించిందని, హక్కులను కాలరాయడానికి ఎటువంటివారికైనా అధికారాలు లేవని స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో కరోనా మహమ్మారి పెరిగిన తర్వాత కొన్ని గ్రామాల్లో గణేష్ ఉత్సవాలపై ఆంక్షలు విధిస్తున్నట్టు కొన్ని వార్తలు వచ్చాయన్నారు. అయితే కొన్ని ...
Read More »ప్రభుత్వాలు అలా సూచించలేదు…
కామారెడ్డి, ఆగష్టు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ కార్యాలయంలో బుధవారం రాబోయే వినాయక ఉత్సవాల గురించి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో కరోనా కేసులు ఎక్కువ నమోదవుతున్న నేపథ్యంలో విశ్వ హిందూ పరిషత్ సూచన మేరకు గత సంవత్సరం లాగానే ప్రతి యువజన సంఘం వాళ్ళు తక్కువ ఎత్తు గల వినాయకులను ప్రతిష్టించి, భక్తి శ్రద్దలతో పూజలు ...
Read More »శతాబ్దాల కల సాకారమైంది
కామారెడ్డి, ఆగష్టు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో అయోద్యలో భవ్య రామ మందిర నిర్మాణానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేసిన సందర్బంగా పార్టీ కార్యాలయంలో మిఠాయిలు పంచుకొని, టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ తేలు శ్రీనివాస్ మాట్లాడుతూ హిందువుల 5 శతాబ్దాల కల నెరవేరిందని యుగ పురుషునికి ఆలయం నిర్మితం కాబోతోందని ఎన్నో పోరాటాలు, ఎన్నో ఆటు పోట్లు ఎంతోమంది కరసేవకుల ...
Read More »ఘనంగా పి.వి. శతజయంతి ఉత్సవాలు
కామారెడ్డి, జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ పి. వి నర్సింహారావు శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించినట్టు డిసిసి అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు అన్నారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆదేశాల మేరకు శతజయంతి కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. మాజీ ప్రధానమంత్రి, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు పి వి నర్సింహారావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ ...
Read More »జన్మదిన శుభాకాంక్షలు
హైదరాబాద్, జూలై 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి గురువారం తన జన్మదినం పురస్కరించుకుని మినిస్టర్ క్వార్టర్స్‌లో రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆయనకు పుష్పగుచ్ఛం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో నిరంతరం ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పోచారం భాస్కర్ రెడ్డి మంత్రి వేములకు మొక్కను బహుకరించారు.
Read More »సీనియర్ కాంగ్రెస్ నేత వెంకులు మృతి
నిజామాబాద్, జూలై 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఐఎన్టియుసి అధ్యక్షుడు వెంకులు మృతి అత్యంత బాధాకరమని మాజి ఎంపి మధుయాష్కీ గౌడ్ విచారం వ్యక్తం చేశారు. వెంకులు మృతి కాంగ్రెస్ పార్టీకీ, వ్యక్తిగతంగా తనకు తీరని లోటని అన్నారు. తను రాజకీయాలకు రాకమునుపే వెంకులు మంచి మిత్రుడని, రాజాకీయాలకు వచ్చిన నుండి ప్రతి ఎన్నికలో తనతో ఉంటూ తన గెలుపునకు అహర్నిశలు కృషి చేశారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఐఎన్టియుసి నేతగా కార్మికుల హక్కుల ...
Read More »ఆన్లైన్లో గళం విప్పండి
కామారెడ్డి, జూలై 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవిడ్ నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కామారెడ్డి డిసిసి అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు అన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆదేశాల మేరకు ఆన్లైన్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. రాష్ట్రం కరోనా టెస్టుల్లో లాస్ట్, పాజిటివ్ పర్సెంట్‌లో ఫస్ట్ అని ఎద్దేవా చేశారు. కరోనా వైద్య సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని, ...
Read More »వైద్యం అందక ప్రాణాలు వదులుతున్నారు
కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ వైఫ్యలం ప్రభుత్వ నిర్లక్ష్యంతో అమాయక ప్రజలు పిట్టల్లా రాలుతున్నారని మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ ఆందోళన వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కరోనా పాజిటివ్ ఉన్న నిండు గర్భిణీ పురిటి నొప్పులతో నరక యాతన అనుభవించి తల్లి, పాప మృతి చెందారని, కామారెడ్డి పట్టణంలో ఇస్లాంపూర కాలనికి చెందిన ఒకే కుటుంబంలో ఏడుగురికి కరోనా పాజిటివ్ రావడం జరిగిందన్నారు. అందులో ...
Read More »దేశ ద్రోహం కేసు నమోదు చేయాలి
కామారెడ్డి, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజభవనం ముంబయిలో మనువాద దుండగులు చేసిన దాడిని నిరసిస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, ఎంసిపిఐయు, ఎంఐఎం పార్టీ, బీసీ సంఘం, అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టినట్టు ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు బాబు, ఎంసిపిఐయు జిల్లా కార్యదర్శి రాజలింగం, ఎంఐఎం పార్టీ నాయకులు రజాక్, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ నాయకులు మద్దెల రాజయ్య తెలిపారు. ...
Read More »బియ్యం, శనగలు పంపిణీ
నిజామాబాద్, జూలై 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం 23.వ డివిజన్లో డివిజన్ కార్పొరేటర్ మల్లేష్ యాదవ్ 63 మంది వలస కూలీలకు కేంద్రప్రభుత్వం పంపిన 10 కిలోల బియ్యం, 2 కిలోల శనగలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ వలసకార్మికులను దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో ఎవరు కూడా తిండి లేకుండా ఉపవాసం ఉండకూడదని, ఒక్కొక్కరికి పది కిలోల బియ్యం, రెండు కిలోల శనగలు డివిజన్లోని వలసకూలీలకు పంపినందుకు ...
Read More »నవంబర్ వరకు గరీబ్ కళ్యాణ్ యోజన
నిజామాబాద్, జూలై 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశ ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని నవంబర్ నెల వరకు పొడిగిస్తూ ప్రతి ఒక్కరికి ఉచితంగా ఐదు కేజీల బియ్యం, ఒక కేజీ కందిపప్పు అందిస్తామని ప్రకటించారని ఆత్మ నిర్బర్ భారత్ జిల్లా కో ఆర్డినేటర్ పుప్పాల శివరాజ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు గురువారం మాక్లూర్ మండలంలో మీడియాతో మాట్లాడారు. ఉజ్వల పథకం లబ్ధిదారులకు మరో మూడు నెలలు ఎల్పిజి గ్యాస్ ఉచితంగా అందజేస్తామని తెలిపారన్నారు. కరోనా ...
Read More »పేద ప్రజల గుండె చప్పుడు వైఎస్ఆర్
కామారెడ్డి, జూలై 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తల ఆధ్వర్యంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు వై యస్ రాజశేఖరరెడ్డి అని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండు సార్లు బాధ్యతలు స్వీకరించి తన సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో ఇప్పటికి చెరగని ముద్ర వేసుకున్నారని, సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను తెలుసుకుని ఆ కష్టాలనే సంక్షేమ పథకాలుగా ...
Read More »