Breaking News

Renjal

శ్రీనిధి ద్వారా వడ్డిలేని రుణాలు

  రెంజల్‌, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీనిధి ద్వారా వడ్డిలేని రుణాలను పొందవచ్చని ఏపిఎం చిన్నయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య సమావేశాన్ని మండల అధ్యక్షురాలు జమున అధ్యక్షతన నిర్వహించారు. గ్రామాల్లో మహిళా సంఘాలు అభివృద్ది చెందాలంటే ప్రతినెల సంఘాలతో సమావేశాలు ఏర్పరుచుకోవాలన్నారు. శ్రీనిధి రుణాలు పెండింగులో ఉన్నవాటిని వెంటనే పరిష్కరించుకోవాలని తిరిగి మళ్లీ వడ్డిలేని రుణాలు పొందవచ్చని ఏపిఎం చిన్నయ్య అన్నారు. కార్యక్రమంలో సిసిలు శ్యామల, కృష్ణ, రాములు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Read More »

ఇసుక ట్రాక్టర్‌ పట్టివేత

  రెంజల్‌, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని మొండివాగు నుండి ఎటువంటి అనుమతి లేకుండా అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్‌ను పట్టుకుని స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ శంకర్‌ తెలిపారు.

Read More »

ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో తెరాస విఫలం

  రెంజల్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామని గొప్పలు చెప్పడమే తప్ప ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో తెరాస పార్టీ విఫలమైందని మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి అన్నారు. మండలంలోని సాటాపూర్‌ గ్రామంలో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అడుగడుగునా ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదేనన్నారు. ఎన్నికలకు ముందు అదిచేస్తాం, ఇది చేస్తాం అని గొప్పలు చెప్పిన కెసిఆర్‌ చేసిందేమిలేదని అబద్దపు ...

Read More »

విద్యార్థులకు టై, బెల్టుల పంపిణీ

రెంజల్‌, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తాడ్‌బిలోలి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో సుమారు 250 మంది విద్యార్థులకు టై, బెల్టు, ఐడెంటి కార్డులను వితరణ చేశారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సాయిలు, ఆంజనేయులు, ఉపాధ్యాయులు రాజు, గంగారాం, శ్రీనివాస్‌రెడ్డి విద్యార్థులు పాల్గొన్నారు.

Read More »

షకీల్‌ అన్నను భారీ మెజార్టీతో గెలిపిస్తాం

రెంజల్‌, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోదన్‌ ఎమ్మెల్యే అభ్యర్తి షకీల్‌ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని మాజీ సర్పంచ్‌ తెలంగాణ శంకర్‌, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు మౌలానా అన్నారు. మండలంలోని తాడ్‌బిలోలి గ్రామంలో సోమవారం తెరాస పార్టీ ఆధ్వర్యంలో బోధన్‌ ఎమ్మెల్యే అభ్యర్తి షకీల్‌కు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు లింగారెడ్డి, రైతు సమన్వయ సమితి గ్రామ అధ్యక్షుడు దత్తుపటేల్‌, ...

Read More »

కదిలిన గులాబి దండు

రెంజల్‌, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ ఎమ్మెల్యే అభ్యర్థి షకీల్‌ను అధిక మెజార్టీతో గెలిపించుకుని తిరిగి తెరాస జెండా ఎగురవేస్తామని గులాబి దళం కదం తొక్కింది. మండలంలోని తాడ్‌బిలోలి, బోర్గాం గ్రామాలకు చెందిన తెరాస నాయకులు మాజీ సర్పంచ్‌ తెలంగాణ శంకర్‌, రైతు సమన్వయ సమితి జిల్లాసభ్యుడు మౌలానా ఆధ్వర్యంలో శనివారం బోధన్‌ ఎమ్మెల్యే అభ్యర్తి షకీల్‌ నామినేషన్‌కు భారీగా తరలివెళ్ళారు. అనంతరం వారు మాట్లాడుతూ అభివృద్దే ధ్యేయంగా అహర్నిశలు ప్రజల కోసం కృషి చేసే షకీల్‌ అన్నకు ...

Read More »

ఆదర్శపాఠశాలలో ఫుడ్‌మేళ

రెంజల్‌, నవంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో బాలల దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్తుల్లోని సృజనాత్మకతను వెలిసితీసేందుకు ఏర్పాటు చేసిన ఫుడ్‌ మేళాలో విద్యార్థులు స్వయంగా తయారుచేసిన తినుబండారాలను ప్రదర్శించారు. ఉపాధ్యాయ బృందం తిలకించారు. ఫుడ్‌ మేళలో పాల్గొన్న విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ బలరాం, వైస్‌ ప్రిన్సిపాల్‌ చెన్నప్ప, శ్రీనివాస్‌, ప్రవీణ్‌ సిబ్బంది ఉన్నారు.

Read More »

తాడ్‌బిలోలిలో కొనసాగుతున్న కంటి వెలుగు

రెంజల్‌, నవంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తాడ్‌బిలోలి గ్రామంలో కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరం బుధవారం కూడా కొనసాగింది. నిత్యం గ్రామస్తులు కంటి వెలుగు శిబిరానికి వెళ్ళి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు. గ్రామంలో మొత్తం 3409 మంది జనాభా ఉన్నారు. కాగా బుధవారం నాటికి 2578 మంది పరీక్షలు నిర్వహించుకోగా 224 మందికి శస్త్రచికిత్సలు, 108 మందికి అవసరాన్ని బట్టి కంటి అద్దాలు అందించినట్టు సూపర్‌వైజర్‌ విజయ్‌కుమార్‌, వైద్యులు హరిప్రసాద్‌, సాయినాథ్‌, ఏఎన్‌ఎంలు మధుమతి, మంజుల, కళావతి సిబ్బంది ...

Read More »

అమరుల ఆశయసాధనకు కృషి చేయాలి

రెంజల్‌, నవంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా పోరాటంలో అమరులైన అమరవీరుల ఆశయసాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సిపిఐ ఎంఎల్‌ జిల్లా అధ్యక్షుడు గంగన్న అన్నారు. మండలంలోని తాడ్‌బిలోలి గ్రామంలో మంగళవారం అమరవీరుల శత దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ప్రజా పోరాటంలో అమరులైన విప్లవ వీరులను స్మరిస్తు జోహారులు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమరవీరుల కుటుంబాలకు అండగా సిపిఐ ఎంఎల్‌ ఎప్పుడు ఉంటుందని బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం అలుపెరుగని పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా ...

Read More »

ఆదరించండి, అభివృద్ది చేసి చూపిస్తా

రెంజల్‌, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలు ఆశీర్వదించి ఆదరిస్తే అభివృద్ది చేసి చూపిస్తా అని మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి అన్నారు. రెంజల్‌ మండలంలోని పేపర్‌మిల్‌ గ్రామంలో సోమవారం పర్యటించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడంలో కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడు ముందుంటుందని ప్రజలు ఆశీర్వదించి తిరిగి కాంగ్రెస్‌ని గెలిపిస్తే మరింత అభివృద్ది చేసి చూపిస్తామన్నారు. తెరాస పార్టీ నాలుగున్నరేళ్ళలో ప్రజలకు మోసపూరిత మాటలు చెప్పి మోసం చేసిందని ఇపుడు ప్రజలు ...

Read More »