Breaking News

Renjal

ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

రెంజల్‌, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో మంగళవారం ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తీరొక్క పూల రంగులతో బతుకమ్మను పేర్చి పూజలు చేశారు. అనంతరం బతుకమ్మ ఆటపాటలతో దాండియా ఆడారు. అంగన్‌వాడి టీచర్లు, ఎంపీపీ రజినీ, జడ్పీటీసీ విజయ, ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్‌ ప్రమీల, పంచాయతీ రాజ్‌ ఏఈ లిఖిత తీరొక్క పూలతో బతుకమ్మలను చేర్చి ఒకచోట ఉంచి బతుకమ్మ ఆడారు. బతుకమ్మలను గ్రామ శివారులోని చెరువులో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో ...

Read More »

ఘనంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

రెంజల్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని పలు గ్రామాలలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దుర్గాదేవి విగ్రహంతో తొమ్మిది రోజులు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆదివారం మొదటిరోజు అమ్మవారిని మండపాల్లో ప్రతిష్టించారు. రెంజల్‌ మండలంలోని తాడ్‌బిలోలి గ్రామంలో మొదటి సారి దుర్గామాతని ప్రతిష్టించారు. ఊరి పొలిమేర నుండి మహిళలు, గ్రామస్తులు యువకులు అధిక సంఖ్యలో పాల్గొని మంగళ హారతులతో బాజాభజంత్రీలతో అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి గ్రామంలో ప్రతిష్టించారు. దేవి ...

Read More »

నేడు మహాజన సభ

రెంజల్‌, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం రెంజల్‌ మండల ప్రాథమిక సహకార సంఘం మహాజన సభను చైర్మన్‌ మోహీనోద్దీన్‌ అధ్యక్షతన నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి రాందాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మహాజన సభకు డైరెక్టర్లు, రైతులు సకాలంలో హాజరుకావాలన్నారు.

Read More »

మహిళలకు పోషకలోపాలు లేకుండా చూడాలి

రెంజల్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిల్లలకు, మహిళలకు పోషకలోపాలు లేకుండా చూడాలని సిడిపివో లలిత కుమారి అన్నారు. శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషన్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని మండలప్రజాపరిషత్‌ కార్యాలయంలో నిర్వహించారు. తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉండేందుకు గర్భిణీ స్త్రీలు తప్పక పౌష్టికాహారాన్ని తీసుకోవాలన్నారు. ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందజేస్తుందన్నారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు బాలింతలకు అందించే వివిధ రకాల వంటకాలను తయారు చేసిన స్టాల్‌ను తహశీల్దార్‌ అసాదుల్లా ఖాన్‌, ఎంపీడీఓ ...

Read More »

టిఆర్‌ఎస్‌ నూతన కమిటీ ఎన్నిక

రెంజల్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల టిఆర్‌ఎస్‌ నూతన కార్యవర్గాన్ని మండల ఇంచార్జ్‌ బుద్దె రాజేశ్వర్‌ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా భూమారెడ్డి, ఉపాధ్యక్షుడిగా మోసీన్‌, ప్రధాన కార్యదర్శిగా రవీందర్‌ గౌడ్‌ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మహిళా విభాగం అధ్యక్షురాలిగా చందూరు సవిత, ప్రధానకార్యదర్శిగా మల్లారి మానస, బిసి విభాగం అధ్యక్షుడుగా అసాని నరేంధర్‌, ప్రధాన కార్యదర్శిగా రాజు, ఎస్సి విభాగం అధ్యక్షుడిగా మల్ల సాయిలు, ప్రధానకార్యదర్శి ప్రభాకర్‌, ఎస్‌టి విభాగం అధ్యక్షుడిగా జాదవ్‌ గణేష్‌, ప్రధానకార్యదర్శి ...

Read More »

షాదీముబారక్‌ చెక్కు అందజేత

రెంజల్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో బుధవారం షాదీముబారక్‌ చెక్కులను లబ్దిదారులకు తహసీల్దార్‌ అసాదుల్లా ఖాన్‌ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలానికి 35 షాదీముబారక్‌, 22 కళ్యాణలక్ష్మి చెక్కులు మంజూరయ్యాయని వాటిని లబ్దిదారులకు అందజేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ గంగాసాగర్‌, రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌ సాయిలు, నాయకులు నర్సయ్య, కుద్దుస్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

పచ్చదనమే లక్ష్యంగా పనిచేయాలి

రెంజల్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కరించినప్పుడే గ్రామాలు అభివద్ధి చెందుతాయని మండల అభివద్ధి అధికారి గోపాలకష్ణ అన్నారు. ముప్పై రోజుల ప్రణాళికలో భాగంగా బుధవారం మండలంలోని తాడ్‌బిలోలి గ్రామంలో పర్యటించి పనులను పరిశీలించారు. మురుగుకాలువలు, పిచ్చిమొక్కల తొలగింపు, రోడ్డుకు ఇరువైపులా మట్టిని తొలగిస్తున్న పనులను పరిశీలించారు. అనంతరం మండల అభివద్ధి అధికారి గోపాలకష్ణ, సర్పంచ్‌ సునీతలు స్వయంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న మట్టిని పారా చేతబట్టి తట్టబుట్టతో తొలగించారు. శుభ్రం చేశారు. ఈ ...

Read More »

ఏబీవీపీ ఆధ్వర్యంలో మానవహారం

రెంజల్‌, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెండింగులో ఉన్న 3500 కోట్ల ఫీజు రీయంబర్స్‌మెంట్‌ వెంటనే విడుదల చేయాలని, మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల విద్యార్థులతో కలిసి ఏబీవీపీ నాయకులు మానవహారం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌ నవీన్‌ మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేసి ఎయిడెడ్‌ కళాశాలలను పరిరక్షించాలని డిమాండ్‌ చేశారు. పెండింగులో ఉన్న రియంబర్స్‌మెంట్‌ వెంటనే విడుదల చేయాలని, లేనియెడల ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. ...

Read More »

ముప్పై రోజుల ప్రణాళికలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి

రెంజల్‌, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణకు మణిహారంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశ పెట్టిన 30 రోజుల ప్రణాళికలో భాగంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని మండల ప్రత్యేకాధికారి విజయ్‌ కుమార్‌ అన్నారు. మంగళవారం మండలంలోని సాటాపూర్‌ గ్రామంలో 30 రోజుల ప్రణాళికలో భాగంగా చేపడుతున్న పనులను పరిశీలించారు. గ్రామంలో చేపట్టిన పనులను చూసి సర్పంచ్‌ వికార్‌ పాషా, పంచాయతీ కార్యదర్శి రఘురామ్‌లను అభినందించారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చిమొక్కలను తొలగించి రోడ్డు వెడల్పు పనులు, ...

Read More »

పార చేత పట్టి పారిశుద్ధ్య పనులు చేపట్టిన సర్పంచ్‌

రెంజల్‌, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పచ్చని పల్లెల స్వచ్చతే ధ్యేయంగా గ్రామం అభివద్ధి కావాలంటే గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించినప్పుడే గ్రామ అభివ ద్ధి సాధ్యమవుతుందని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ కార్యరూపం దాల్చిన 30 రోజుల ప్రణాళికలో భాగంగా మంగళవారం మండలంలోని తాడ్‌ బిలోలి గ్రామంలో సర్పంచ్‌ వెల్మల సునీత గ్రామంలో స్వయంగా డ్రైనేజీ పనులను చేపట్టారు. గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను నేరుగా పరిశీలించి దగ్గరుండి పనులను చేపడతామని అన్నారు. గ్రామ అభివద్ధికి ఎల్లవేళల కషి చేస్తామని, ...

Read More »

హరిత తెలంగాణ కై పాటుపడదాం

రెంజల్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ తలపెట్టిన తెలంగాణకు హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటి సంరక్షణకై పాటుపడినప్పుడే తెలంగాణ హరిత తెలంగాణగా మారుతుందని నిజామాబాద్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు అన్నారు. మండలంలోని సాటాపూర్‌ గ్రామంలో సోమవారం మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణకు మణిహారం హరితహారం గా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ఆరు ...

Read More »

ప్రజల మధ్య ఉండడమే నా ధ్యేయం

రెంజల్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదవి లేనప్పుడే ప్రజల మధ్య ఉన్న పదవులు శాశ్వతం కాదు, ప్రజలే శాశ్వతం అని జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌ రావ్‌ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తలపెట్టిన ముప్పై రోజుల ప్రణాళికలో భాగంగా రెంజల్‌ మండలంలోని కళ్యాపూర్‌ గ్రామంలో పర్యటించారు. గ్రామంలో చేపట్టిన పనులను పరిశీలించి గ్రామ పంచాయతీ ఆవరణలోని చెత్తను శుభ్రపరిచారు. గ్రామంలో మొక్కలు నాటి నీరుపోశారు. అనంతరం జడ్పీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి మొదటిసారి గ్రామానికి రావడంతో ...

Read More »

కార్యరూపం దాల్చిన కార్యాచరణ

రెంజల్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో ముప్పై రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా సోమవారం ఎంపీపీ లోలపు రజినీ, ఎంపీడీవో గోపాలకష్ణ, ప్రజాపరిషత్‌ సిబ్బంది ఆధ్వర్యంలో కార్యాలయ ఆవరణలో ఉన్న పిచ్చిమొక్కలను తొలగించి శుభ్రపరిచారు. తమ వంతు బాధ్యతగా కార్యాలయ ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలు తొలగించి శుభ్రపరచడం జరిగిందని ప్రతి ఒక్కరు కూడా తమ కార్యాలయాల్లో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి మొక్కలు నాటి ప్రభుత్వ కార్యాలయాలు పచ్చదనంతో కళకళలాడే విదంగా కషి ...

Read More »

చలో హైదరాబాద్‌ విజయవంతం చేయండి

రెంజల్‌, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమానపనికి సమనవేతనం చెల్లించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం వేతనాలు చెల్లించాలని, నిరసిస్తూ మండల కేంద్రంలోని కస్తూరిబా పాఠశాల ముందు మధ్యాహ్నం సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. 19న తలపెట్టిన ఛలో హైదరాబాద్‌ సభకు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కేజీబీవీ నాన్‌ టీచింగ్‌ వర్కర్స్‌ నాయకురాలు సుజాత పిలుపునిచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేస్తున్న నాన్‌ టీచింగ్‌ వర్కర్స్‌ అనేక రకాల ...

Read More »

విద్యార్ధులకు పండ్లు పంపిణీ

రెంజల్‌, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని కళ్యాపూర్‌ గ్రామంలో మంగళవారం భారత ప్రధాని నరేంద్రమోడీ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ సంయుక్త, బీజేపీ నాయకులు రవి కుమార్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశం గర్వించదగ్గ నాయకుడు ప్రధాని నరేంద్రమోదీ అని ఆయనను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు ముందుకు సాగాలని అన్నారు. కార్యక్రమంలో ఎంఈవో గణేష్‌ రావ్‌, బీజేపీ నాయకులు రవి కుమార్‌, రాజ్‌ కుమార్‌, ...

Read More »

ఎంపిడివోకు సన్మానం

రెంజల్‌, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల ఎంపిడివో గోపాలకష్ణ, ఎంపీవో గౌస్‌లను మంగళవారం వీరన్నగుట్ట తండా సర్పంచ్‌ జాదవ్‌ గణేష్‌ ఘనంగా సన్మానించారు. ఎంపిడిఓగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి మొదటి సారిగా గ్రామానికి విచ్చేయడంతో ఎంపిడిఓ గోపాలకష్ణ, ఎంపీవో గౌస్‌లను పూలమాల ి శాలువతో ఘనంగా సన్మానించారు. అనంతరం సర్పంచ్‌ గణేష్‌ మాట్లాడుతూ మండలాభివద్ధికి ప్రజాప్రతినిధులతో సమన్వయంగా ఉండి మండలాన్ని మరింత అభివద్ధి చేసి ఆదర్శంగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌, ప్రత్యేకాధికారి ప్రమీల, ...

Read More »

పార చేత పట్టి పారిశుద్ధ్య పనులు చేపట్టిన సర్పంచ్‌

రెంజల్‌, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ స్వచ్చతే ధ్యేయంగా గ్రామాభివద్ధి కావాలంటే గ్రామంలోని సమస్యలను పరిష్కరించినప్పుడే సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ భావించారు. ఇందుకు కార్యరూపం దాల్చిన 30 రోజుల ప్రణాళికలో భాగంగా మండలంలోని బొర్గం, బాగేపల్లి గ్రామాల్లో సర్పంచ్‌లు వాణి, పాముల సాయిలు నిరంతరం గ్రామంలో పర్యటిస్తూ సమస్యలను ముందుండి పరిష్కరిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మంగళవారం గ్రామంలో స్వయంగా డ్రైనేజీ పనులను చేపట్టారు. గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను నేరుగా పరిశీలించి దగ్గరుండి పనులను చేపడతామని అన్నారు. ...

Read More »

ఎంపిడివో, ఎంపీవోలకు సన్మానం

రెంజల్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల ఎంపిడివో గోపాలకష్ణ, ఎంపీవో గౌస్‌లు బాధ్యతలు చేపట్టిన నాటి నుండి సాటా పూర్‌, తాడ్‌ బిలోలి గ్రామాలకు మొదటి సారిగా విచ్చేయడంతో సర్పంచ్‌లు వికార్‌ పాషా, వెల్మల సునీతలు ఎంపిడిఓ గోపాలకష్ణ, ఎంపీవో గౌస్‌ లను పూలమాల, శాలువతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులతో సమన్వయంగా ఉండి మండల అభివద్ధికి కషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపిటిసి హైమద్‌, మాజీ ఎంపీటీసీ నర్సయ్య, టిఆర్‌ఎస్‌ నాయకులు ...

Read More »

ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి

రెంజల్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 30 రోజుల ప్రణాళికలో భాగంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఎంపిడిఓ గోపాలక ష్ణ అన్నారు. మండలంలోని బొర్గం, తాడ్‌ బిలోలి గ్రామంలో 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామాలను సందర్శించారు. ప్రణాళిక కార్యక్రమాలను రోజువారీగా నిర్వహించాలని, గ్రామాల పరిశుభ్రత పట్ల ఎలాంటి నిర్లక్ష్యం వహించారదని పంచాయతీ కార్యదర్శులు అమ్రీన్‌, శివచరణ్‌, సర్పంచ్లు వాణి, సునీత లకు సూచించారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చిమొక్కలను, మురుగుకాలువలను జేసీబీ సహాయంతో ...

Read More »

హెల్త్‌ కిట్ల పంపిణీ

రెంజల్‌, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఎంపీపీ రజినీ హెల్త్‌ కిట్‌లను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల కోసం ప్రభుత్వం హెల్త్‌ కిట్లను అందజేయడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో ఎంపిడివో గోపాలకష్ణ, మండల పరిషత్‌ అధికారి గౌస్‌, ఎంఈవో గణేష్‌ రావ్‌, వైద్యాధికారి క్రిస్టినా, హెచ్‌ఈవో వెంకటరమణ, వ్యాయమ ఉపాధ్యాయుడు క ష్ణమూర్తి ఉపాధ్యయులు తదితరులు పాల్గొన్నారు.

Read More »