Breaking News

Renjal

బాధిత కుటుంబాల‌ను ఆదుకుంటాం

రెంజల్‌, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చనిపోయిన గేదెలు, ఎడ్ల కుటుంబాల‌ను ఆదుకునేందుకు తమ వంతు కృషి చేస్తానని పశు సంవర్దక శాఖాధికారి బాలీక్‌ హైమద్‌ అన్నారు. మండలంలోని నీలా క్యాంపు గ్రామంలో గురువారం తెల్ల‌వారుజామున పలు కుటుంబాల‌ రైతుల‌కు సంబంధించిన మూగజీవులు తీవ్ర అస్వస్థతకు గురై మరణించాయి. విషయాన్ని రైతులు స్థానిక పశు వైద్యాధికారికి వివరించారు. దీంతో గ్రామానికి వైద్య సిబ్బందిని పంపించి శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పరిస్థితిని స్థానిక పశు వైద్యాధికారులు జిల్లా పశు సంవర్ధక శాఖాధికారికి ...

Read More »

ఘనంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదిన వేడుకలు

రెంజల్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ దార్శనికుడు, బంగారు తెలంగాణ నిర్మాణ ప్రదాత, రాష్ట్ర ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖర్‌ రావు జన్మదిన వేడుకల‌ను మండలంలో అధికారులు , ప్రజా ప్రతినిధులు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాల‌యాల‌తో పాటు పంచాయతీ కార్యాల‌యాల‌లో అధికారులు మొక్కలు నాటారు. తహశీల్దార్‌ కార్యాయంలో తహసీల్దార్‌ అసాదుల్లా ఖాన్‌, పంచాయతీ కార్యాల‌యంలో సర్పంచ్‌ సాయరెడ్డి మొక్కలు నాటారు. రెంజల్‌ మండల‌ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టి.ఆర్‌.యస్‌ నాయకులు ముఖ్యమంత్రి 66 వ జన్మదిన వేడుకల‌ను ...

Read More »

రెంజల్‌, నీలా సొసైటీలు టిఆర్‌ఎస్‌ కైవసం

రెంజల్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలో ఆదివారం వాయిదా పడిన రెంజల్‌, నీల‌ సహకార సంఘం చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ల‌ ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. నిర్ణిత సమయానికి చేరుకున్న డైరెక్టర్‌లు ముందుగానే నిర్ణయించుకున్న చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవుల‌కు అభ్యర్థుల‌ నామినేషన్లను దాఖలు చేశారు. రెండు విండోల్లో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవుల‌కు పోటీ ఏర్పడడంతో ఎన్నికల అధికారులు మద్యాహ్నం రెండు గంటల‌కు ఓటింగ్‌ ప్రక్రియ ప్రారంభించారు. rbt రెంజల్‌ చైర్మెన్‌గా తెరాస మద్దత్తు దారుడు ...

Read More »

రెంజల్‌ మండలంలో 86.03 శాతం పోలింగ్‌

రెంజల్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలో నిర్వహించిన సహకార సంఘాల‌ ఎన్నికల‌కు సంబంధించిన పోలింగ్‌ ముగిసిన సమయానికి 86.03 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు తెలిపారు. మండలంలో 3 సహకార సంఘాల‌కు 39 డైరెక్టర్‌ల‌కు గాను 12 డైరెక్టర్‌లు ఏకగ్రీవం కాగా 27 డైరెక్టర్‌ స్థానాల‌కు శనివారం ఎన్నికలు నిర్వహించారు. 66మంది డైరెక్టర్‌లు పోటీచేయగా 27 మంది డైరెక్టర్‌లు ఎన్నికయ్యారు. రెంజల్‌ సహకార సంఘం డైరక్టర్లుగా, 1, గోపాల్‌ రెడ్డి, 2,నారాయణ, 3,గంగామణి, 4,ప్రశాంత్‌, 5,సాయిులు, 6,సాయరెడ్డి, ...

Read More »

పోలింగ్‌ కేంద్రాల‌ను పరిశీలించిన ఆర్డివో

రెంజల్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలో సహకార సంఘాల‌కు జరుగుతున్న పోలింగ్‌ సరళిని బోధన్‌ ఆర్డీవో గోపిరామ్‌ పరిశీలించారు. మండలంలోని దూపల్లి, రెంజల్‌, నీలా గ్రామాల్లోని ఉన్నత పాఠశాల‌లో కొనసాగుతున్న పోలింగ్‌ వివరాల‌ను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు పోలింగ్‌ కేంద్రాల్లో 66 శాతం వరకు పోలింగ్‌ నమోదైనట్లు సంబంధిత ఎన్నికల‌ సిబ్బంది ఆర్డీవోకు వివరించారు. ఆయన వెంట ఎంపీడీఓ గోపాల‌కృష్ణ, ఎంపీఓ గౌస్‌, ఎన్నికల అధికారి ఉన్నారు.

Read More »

ఘనంగా సేవాలాల్‌ జయంతి

రెంజల్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని వీరన్న గుట్ట తండా, మౌలాలితండా గ్రామాల‌లో శనివారం సంత్‌ శ్రీ సేవాలాల్‌ మహారాజ్‌ జయంతి వేడుకల‌ను ఘనంగా నిర్వహించారు. సేవలాల్‌ మహారాజ్‌ విగ్రహాల‌కు, చిత్రపటాల‌కు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తుల‌కు అన్నదానం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు జాదవ్‌ గణేష్‌, జాదవ్‌ సునీత బాబునాయక్‌, రావన్‌, జాదవ్‌ రాజు, బన్సీలాల్‌, జీవన్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

స్థానికంగా సమస్యను పరిష్కరించుకోవాలి

రెంజల్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండంలోని దండిగుట్ట గ్రామంలో నిర్మించతపెట్టిన వైకుంఠ ధామం పనుల‌ను గ్రామస్థులందరూ కలిసి స్థానికంగా పరిష్కరించుకోవాల‌ని ఆర్డీవో గోపిరామ్‌ అన్నారు. దండిగుట్ట గ్రామంలో నిర్మిస్తున్న వైకుంఠ ధామం పనుల‌ను నిలిపివేయాని కొందరు గ్రామస్థులు శుక్రవారం ఆర్డీవోని కలిసి వినతిపత్రం అందజేయగా శనివారం విచారణకు వచ్చిన ఆర్డీవో వైకుంఠ ధామం పనుల‌ను పరిశీలించారు. స్థానిక సర్పంచ్‌, గ్రామస్థుల‌తో కలిసి మాట్లాడుతూ ఆర్డీవో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో అందరూ కలిసి సమస్యను స్థానికంగానే పరిష్కరించుకోవాల‌ని సూచించారు. కార్యక్రమంలో ...

Read More »

ఎల‌క్షన్‌ ఏజెంట్‌గా ఫీల్డ్‌ అసిస్టెంట్‌

రెంజల్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ ప్రభుత్వ పథకం ద్వారా కూలీల‌కు ఉపాధి పనుల‌ను చూపించాల్సిన క్షేత్ర సహాయకుడు ఒక రాజకీయ పార్టీకి వత్తాసు పలుకుతున్నాడు. రెంజల్‌ మండలంలో శనివారం జరిగిన సహకార సంఘం ఎన్నికల్లో పూర్తిస్థాయి ఏజెంట్‌గా తాడ్‌బిలోలి గ్రామానికి చెందిన ఉపాధిహామీ క్షేత్ర సహాయకుడు మధు ఒక రాజకీయ పార్టీ అభ్యర్థికి ఏజెంట్‌గా పని చేశాడు. తాడ్‌ బిలోలి 11వ టిసికి డైరెక్టర్‌గా పోటీచేసిన అభ్యర్థికి మధు ఏజెంట్‌గా వ్యవరించారు. ఎన్నికల్లో సైతం పార్టీకి ...

Read More »

అంగన్‌ వాడి కేంద్రాల‌ తనిఖీ

రెంజల్‌, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండంలోని పేపరిమిల్‌, కందకుర్తి గ్రామాల్లోని అంగన్‌వాడి కేద్రాల‌ను బుధవారం ఐసీడీఎస్‌ సూపర్‌ వైజర్‌ ప్రమీల‌రాణి తనిఖీ చేశారు. అంగన్‌వాడి కేంద్రాల‌కు వచ్చే పిల్ల‌ల‌కు, గర్భిణిల‌కు, బాలింతల‌కు ప్రభుత్వం అందజేస్తున్న పౌష్టికాహారం ఏ మేరకు అందుతుందని వారిని అడిగి తెలుసుకున్నారు. పోషక విలువల‌తో కూడిన ఆహార పదార్థాల‌ను అందిస్తూ వాటి ప్రాముఖ్యత తెల‌పాల‌ని, అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్ల‌ల‌కు ప్రతి నెల‌ బరువు సూచిక తోపాటు క్రీడల‌ను పోషకాహార పదార్థాల‌ను అందిస్తూ వారి ఎదుగుదల‌కు కృషి ...

Read More »

గ్రామపంచాయతీల‌కు ట్రాక్టర్‌ల అందజేత

రెంజల్‌, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామపంచాయతీకి సొంత ట్రాక్టర్‌ కలిగి ఉండాల‌నే ల‌క్ష్యంతో ట్రాక్టర్‌ల‌ను కొనుగోలు చేయడం జరుగుతుందని మండల‌ ప్రజాపరిషత్‌ అభివృద్ధి అధికారి గోపాల‌కృష్ణ అన్నారు. మండల‌ ప్రజాపరిషత్‌ కార్యాల‌యంలో బుధవారం వీరన్నగుట్ట, అంబేద్కర్‌ నగర్‌, పేపర్‌మిల్‌ గ్రామాల‌కు మంజూరైన ట్రాక్టర్‌ల‌ను తహసీల్దార్‌ అసాదుల్లా ఖాన్‌, ఎంపీడీఓ గోపాల‌కృష్ణ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల‌ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రతి పంచాయతీల‌కు ట్రాక్టర్‌ను అందజేయడం అభినందనీయమని ట్రాక్టర్‌ల‌తో పాటు ...

Read More »

కుక్కల దాడిలో గొర్రెలు మృతి

రెంజల్‌, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని బొర్గం గ్రామానికి చెందిన చిక్కే గంగారాం, కశిగొండకు చెందిన 30 గొర్రెల‌పై కుక్కలు దాడి చేయడంతో మృత్యువాత పడ్డాయి. రోజు మాదిరిగానే గొర్రెలు షెడ్డులో నిద్రిస్తున్న సమయంలో కుక్క‌లు దాడి చేయడంతో కొన్ని చనిపోయాయి. మరికొన్ని గాయాల‌తో కొట్టుమిట్టాడుతున్నట్లు గమనించిన పెంపకం దారులు వెంటనే పశువైద్యాధికారుల‌కు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న వైద్యాధికారులు చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. దీంతో పెంపకం దారులు ఆవేదనకు గురయ్యారు. ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చిన గోర్లు ...

Read More »

వరి పంట సందర్శించిన శాస్త్రవేత్తు

రెంజల్‌, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండంలోని నీలా, బోర్గాం, తాడ్‌బిలోలి గ్రామాల్లోని రైతు పండిస్తున్న వరి పంటను మంగళవారం ప్రాంతీయ చెరుకు, వరి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త బృందం సభ్యు సందర్శించారు. క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించిన శాస్త్రవేత్తు పంటకు అగ్గు తెగును గుర్తించారు. ఈ సందర్భంగా రుద్రూర్‌ పరిశోధన కేంద్రం సభ్యు జలెందర్‌ నాయక్‌, వై.స్వాతి, రమ్య రాథోడ్‌ మాట్లాడారు. పంటకు అగ్గి తెగు సోకినందువ్ల రైతు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఆకుపై ...

Read More »

ఉచిత కంటి వైద్య శిబిరం

రెంజల్‌, ఫిబ్రవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండంలోని వీరన్నగుట్ట తండా గ్రామంలో సోమవారం నిజామాబాద్‌ గౌతమి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సర్పంచ్‌ జాదవ్‌ గణేష్‌ నాయక్‌ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వీరన్నగుట్ట తండా గ్రామంలో ఉచిత కంటి శిబిరాన్ని ఏర్పాటు చేసి రోగుకు ఉచితంగా మందు పంపిణీ చేయడం అభినదనీయమని అన్నారు. కంటి వైద్యుడు భీంసింగ్‌ రోగును పరీక్షించి ఉచిత మందును అందించారు. కార్యక్రమంలో గ్రామస్థు, తదితయి పాల్గొన్నారు.

Read More »

సమాజంలో గురువులే మార్గదర్శకులు

రెంజల్‌, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమాజంలో గురువుల కషి వలనే విద్యార్థుల భవిష్యత్తు బంగారు మయమౌతుందని ప్రధానోపాధ్యాయురాలు వెంకటలక్ష్మి, పిఆర్‌టియు మండల అధ్యక్షుడు సోమలింగం గౌడ్‌ అన్నారు. మండలంలోని దూపల్లి ప్రజాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో మంగళవారం స్వయంపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో గురువుల కషి వల్లనే విద్యార్థులకు మార్గనిర్దేశం జరుగుతుందని, విద్యార్థులకు తల్లిదండ్రులు జన్మనిస్తే ఉపాధ్యాయులు మార్గనిర్దేశం చేసి ఉత్తములుగా తీర్చిదిద్దుతారన్నారు. పదవతరగతి విద్యార్థులు ఉపాధ్యాయుల అవతారమెత్తి తరగతి గదిలో వివిధ ...

Read More »

కళ్యాపూర్‌లో సీసీ కెమెరాలపై అవగాహన

రెంజల్‌, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఒక్కరు గ్రామంలోని ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సిఐ షాకిర్‌ ఆలీ సూచించారు. మండలంలోని కళ్యాపూర్‌ గ్రామంలో మంగళవారం గ్రామస్తులకు సిసి కెమెరాల ఏర్పాటుపై అవగాహన కల్పించారు. గ్రామంలోని ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు తప్పనిసరని, ఒక్కో సీసీ కెమెరా వందమందితో సమానమని అన్నారు. గ్రామంలో కొత్త వ్యక్తులు సంచరిస్తే తమ దష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సై శంకర్‌, ఉపసర్పంచ్‌ జలయ్య, రైసస మండల అధ్యక్షుడు ...

Read More »

ప్రభుత్వ పథకాల లక్ష్యం నెరవేరాలంటే గ్రామీణ ప్రాంతాలకు చేరాలి

రెంజల్‌, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల లక్ష్యం నెరవేరాలంటే ముందుగా గ్రామీణ ప్రాంతాలకు చేరాలని మండల ప్రజా పరిషత్‌ అధ్యక్షురాలు లోలపు రజినీ సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ఫీల్డ్‌ అవుట్‌ రిచ్‌ బ్యూరో ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. ప్రజాలసంక్షేమం కోసం ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నా, వాటిని ...

Read More »

కంపోస్ట్‌ షెడ్డు పనులకు భూమిపూజ

రెంజల్‌, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని సాటాపూర్‌, కునేపల్లి, బొర్గం, బాగేపల్లి, వీరన్నగుట్ట గ్రామాల్లో కంపోస్ట్‌ షెడ్డు పనులను ఎంపీడీవో గోపాలకష్ణ, సర్పంచ్‌ లు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో కంపోస్టు షెడ్డు నిర్మాణం తప్పనిసరిగా నిర్మించాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు సుమారు రెండు లక్షల వ్యయంతో తడిపొడి చెత్తలను వేరుచేస్తూ కంపోస్టు ఎరువులను చేసేందుకు షెడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీఓ గౌస్‌, సుపెరింటెండెంట్‌ శ్రీనివాస్‌, ...

Read More »

ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారు

రెంజల్‌, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండల కేంద్రానికి ఆనుకోని ఉన్న బాలికల గురుకుల పాఠశాలను ఆదివారం ఎంపిపి కే.శ్రీనివాస్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సంధర్బంగా పాఠశాలలో ఉన్న విద్యార్థునులకు మెనూ ప్రకారం ఆదివారం పూరి గాని, చపాతీ పెట్టాల్సింది పోయి కిచిడి చేసి అది కూడా పూర్తిగా మాడిపోయిన కిచిడి అందించడంతో పాటు పాడైపోయినటువంటి మాంసాన్ని వండుతుండటంతో పాఠశాల ఇంచార్జ్‌పై ఎంపిపి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి హాస్టల్‌ వార్డెన్‌ మాంసం 550 రూపాయలకు కిలో ...

Read More »

పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట

రెంజల్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని వీరన్నగుట్ట గ్రామానికి చెందిన మల్లెపల్లి ప్రశాంత్‌, శ్రీ చరణలు శనివారం నిజామాబాద్‌ ఏసీపీని కలిసి రక్షణ కల్పించాలని కోరారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఓ చర్చ్‌లో పెళ్లి చేసుకున్నామని, ఇద్దరం మేజర్లమని అమ్మాయి తరఫు వారి నుండి తమకు ప్రాణభయం ఉందని, రక్షణ కల్పించాలని కోరుతూ ఏసీపీని ఆశ్రయించినట్లు ప్రేమజంట పేర్కొన్నారు. వీరన్నగుట్ట గ్రామం రెంజల్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఉన్నందున రెంజల్‌ పోలీసుస్టేషన్‌లో సంప్రదించాలని ఏసీపీ వారికి సూచించారు.

Read More »

సిసి కాల్వల పనులు ప్రారంభం

రెంజల్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని బిసి కాలనీలోని రోడ్డుకిరువైపులా సిసి డ్రైనేజీ పనులను సర్పంచ్‌ రమేశ్‌ కుమార్‌ ప్రారంభించారు. 14వ ఆర్థిక సంఘం నిధులతో అభివృద్ది పనులు చేపడుతున్నామని చెప్పారు. ఎంపిడివో గోపాలకృష్ణ, ఎంపివో గౌస్‌ మోయినోద్దీన్‌, సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌, వార్డు సబ్యులు వెంకటి, స్థానికులు పోచయ్య, నారాయణ, కార్యదర్శి యాదగిరి పాల్గొన్నారు.

Read More »