Breaking News

Varni

నేడు తెలంగాణ హరితహారం కార్యాచరణ సమావేశం

  వర్ని, మార్చి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ హరితహారం 2017-18 సంవత్సరానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక తయారుచేసేందుకు గాను ఈనెల 15న బుధవారం మండల స్తాయి అధికారులతో సమీక్ష సమావేశం ఉంటుందని వర్ని మండల ఎంపిడివో బి.సురేందర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు మండల పరిషత్‌ కార్యాలయంలో సమావేశం ఉంటుందని మండలంలోని అన్ని శాఖల అధికారులు సకాలంలో హాజరు కావాలని ఆయన సూచించారు.

Read More »

మైనార్టీ గురుకులాలలో ప్రవేశాలు

  వర్ని, మార్చి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని మైనార్టీ గురుకులాల్లో బాల, బాలికలు 5వ, 6వ, 7వ తరగతిలో ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఎంపిడిఓ సురేందర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బిసిలలో ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఈనెల 15వ తేదీ దరఖాస్తు చేసుకోవడానికి చివరి గడువుగా ఎంపిడివో సూచించారు.

Read More »

పారిశుద్య కమిటీ సభ్యులకు శిక్షణ

  వర్ని, మార్చి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్ని, రుద్రూర్‌ మండలాల గ్రామ పారిశుద్య కమిటీ సభ్యులకు ఈనెల 8న బుధవారం ఉదయం 10 గంటలకు శిక్షణ ఇవ్వబడుతుందని ఎంపిడివో సురేందర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మండల పరిషత్‌ కార్యాలయంలో జరిగే శిక్షణ కార్యక్రమానికి గ్రామానికి ఇద్దరు చొప్పున సభ్యులు తప్పకుండా హాజరయ్యేట్టు చూడాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. సభ్యులు సకాలంలో సమావేశానికి హాజరు కావాలన్నారు.

Read More »

డ్రైవింగ్‌లో శిక్షణ

  వర్ని, మార్చి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 21 నుంచి 40 సంవత్సరాల మధ్యవయసుగల యువకులు డ్రైవింగ్‌లో శిక్షణ కొరకు మైనార్టీ కార్పొరేషన్‌, ఎస్సీ కార్పొరేషన్‌, నిజామాబాద్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఎంపిడివో సురేందర్‌ అన్నారు. దరఖాస్తు దారులు ఎస్‌ఎస్‌సి లేదా 8వ తరగతి పాస్‌ లేదా ఫెయిల్‌ అయిన వారు అర్హులన్నారు. ఈనెల 15వ తేదీ దరఖాస్తు చేసుకోవడానికి చివరి గడువు అని ఆయన సూచించారు.

Read More »

వర్నిలో స్పెషల్‌డ్రైవ్‌

  వర్ని, ఫిబవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెండింగ్‌లో ఉన్న బకాయిలన్ని చెల్లించి గ్రామాభివృద్దికి సహకరించాలని పంచాయతీ కార్యదర్శులు అన్నారు. ఈ మేరకు వర్ని మండలంలోని శ్రీనగర్‌ కాలనీలో మంగళవారం కార్యదర్శులు ఇంటింటికి తిరుగుతూ ఇంటిపన్ను, నీటికుళాయి పన్నులు వసూలు చేశారు. ఈ సందర్భంగా రూ. 17,500 వరకు పన్ను వసూలైనట్టు తెలిపారు. స్పెషల్‌ డ్రైవ్‌ కార్యక్రమంలో కార్యదర్శులు అబ్బాగౌడ్‌, రాజేశ్‌, భాస్కర్‌, దీపిక, మోహన్‌రెడ్డి, పరిపూర్ణ పాల్గొన్నారు.

Read More »

కెసిఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

  వర్ని, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో అంగన్‌వాడి టీచర్లకు వేతనాలు పెంచడాన్ని హర్షిస్తూ వర్ని మండల కేంద్రంలోని తహసీల్‌ కార్యాలయంలో మంగళవారం తెలంగాణ సిఎం కెసిఆర్‌ చిత్రపటానికి అంగన్‌వాడి టీచర్లు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ శ్రమను గుర్తించి 7 వేలుగా ఉన్న వేతనాన్ని రూ. 10,500 లకు పెంచడం సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా తమను కార్యకర్తలుగా కాకుండా టీచర్లుగా పిలవడం హర్షనీయమన్నారు. గత ప్రభుత్వాలు తమ సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యాయని, తెలంగాణ ...

Read More »

హెల్త్‌ సూపర్‌వైజర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్‌

  వర్ని, జూలై 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య సంరక్షణ అంశాలపై ప్రాథమిక అవగాహన లేకుండా 25 సంవత్సరాల సర్వీసు కలిగిన వర్ని పిహెచ్‌సి హెల్త్‌ సూపర్‌వైజర్‌ సావిత్రిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా ప్రకటించారు. డ్రై డే, ఐరన్‌ పోలిక్‌ మాత్రలు ప్రాధాన్యతపై అడిగిన ప్రశ్నలకు సంబంధం లేని సమాధానాలు ఇచ్చిన హెల్త్‌ సూపర్‌వైజర్‌ సావిత్రికి సంబంధించిన జూలై నెల పర్యటన డైరీని తనికీచేసి నివేదించాలని ఐకెపి ఎపిఎంను కలెక్టర్‌ ఆదేశించారు. పై ...

Read More »

అనుమానాస్పద స్థితిలో గృహిణి మృతి

వర్ని: మోస్రా గ్రామానికి చెందిన గృహిణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ అంజయ్య కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. జక్రాన్‌పల్లి మండలం సికింద్రాపూర్‌ గ్రామానికి చెందిన కంది లక్ష్మి(30) అనే యువతికి మోస్రా గ్రామానికి చెందిన హన్మాండ్లుతో 11 సంవత్సరాల క్రితం వివాహమైంది. కొన్నాళ్లు భార్యభర్తల కాపురం సజావుగా సాగింది. మూడు సంవత్సరాల క్రితం భర్త హన్మాండ్లు కుటుంబ పోషణ నిమిత్తం దుబాయ్‌ వెళ్లి వచ్చాడు. ఈ క్రమంలో అనుమానాలతో తరచుగా భార్యాభర్తల మధ్య గొడవలు ...

Read More »

‘ నిలువు’ దోపిడీ కళ్లారా వీక్షించిన డీఆర్వో

ప్రక్షాళన షురూ కలెక్టరుకు, వక్ఫ్‌ బోర్డు సీఈవోకు నివేదిక వర్ని గ్రామీణం :పవిత్ర పుణ్యక్షేత్రం బడాపహాడ్‌లో భక్తుల నుంచి ఆయా కార్యక్రమాలకు బలవంతంగా సొమ్ము వసూలు చేస్తున్న గుత్తేదారుల సంబంధీకులకు సంబంధించి ‘ఈనాడు’ వరుస కథనాలు సంచలనాలు సృష్టించాయి. ఈ నేపథ్యంలో డీఆర్వో మోహన్‌లాల్‌ బుధవారం బడాపహాడ్‌ వెళ్లి చేపట్టిన విచారణలో దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. గుత్తేదారుల ఏజెంట్లు వక్ఫ్‌ బోర్డు నిర్మించిన షెడ్ల చుట్టూ నిర్మాణాలు చేపట్టి ఇందులోకి భక్తులు వెళ్లకుండా అడ్డుతగులుతున్నట్లు గుర్తించారు. వీరి చర్యలను ఎందుకు అడ్డుకోలేదంటూ వక్ఫ్‌ ...

Read More »

ట్రాన్స్‌ఫార్మర్ ఆయిల్ చోరీ

వర్ని : గుర్తుతెలియని దుండగులు ట్రాన్స్‌ఫార్మర్ నుంచి ఆయిల్ చోరీకి పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి ఈ సంఘటన వర్ని మండలం కొత్తకాల సమీపంలో జరిగింది. రైతులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తకాల సమీపంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ ధ్వంసం చేసి ఆయిల్ చోరీ చేశారు. ఆయిల్ తోపాటు కాపర్‌వైర్‌ను సైతం అపహరించారు. విద్యుత్తు శాఖ అధికారులకు సమాచారం అందించినా స్పందించడం లేదని రైతులు ప్రభాకర్ దేశాయ్, కాసుల గోపి, తోట నరేందర్ ఆరోపించారు.

Read More »

రుద్రూర్‌లో వ్యక్తి ఆత్మహత్య

వర్ని: మండలంలోని రుద్రూర్ గ్రామంలో లింగాల సాయిలు (48) అనే వ్యక్తి ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆదివారం ఇంట్లో దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు ఏఎస్సై రజాక్ తెలిపారు. మృతుడి భార్య భూదేవి, పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం సాయిలు వ్యవసాయ కూలీగా పనిచేస్తు జీవనాన్ని సాగిస్తున్నాడు. కొంతకాలం క్రితం ఉన్న ఒక్క కూతురుకు అప్పు చేసి వివాహం జరిపించాడు. కుటుంబం భారం అధిక మవ్వడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు తోడవ్వడంతో కల్లుకు బానిసయ్యాడు. కొద్ది రోజులుగా కల్లులో కల్తీలేక పోవడంతో వింతగా ...

Read More »

దేవాదాయ శాఖ డిప్యూటీ కార్యదర్శికి సన్మానం

వర్ని: మండలంలోని రుద్రూర్ గ్రామ మార్కండేయ ఆలయాన్ని రెవె న్యు, దేవాదాయ శాఖ డిప్యూటీ కార్యదర్శి రమేశ్‌గౌడ్ సోమవారం సం దర్శించారు. నిర్మాణంలో ఉన్న ఆలయాల అభివృద్ధికి అందరూ సమ ష్ఠిగా కృషి చేయాలని సూచించారు. ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఎండోమెంట్ శాఖ ద్వారా ఆలయాలకు నిధులు మంజూరు చేస్తోందని తెలిపారు. రమేశ్ గౌడ్ రుద్రూర్ వాస్తవ్యుడు కావడంతో పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. తమ గ్రామస్తుడు రాష్ట్రస్థాయి అధికారి కావడం గర్వకారణంగా ఉం దన్నారు. గ్రామాభివృద్ధికి సహకరించాలని కోరారు. ...

Read More »

బండతో కొట్టి.. గొంతుకోసి.. ఒకరి దారుణ హత్య

-మృత దేహాన్ని పరిశీలించిన డీఎస్పీ -జాగిలంతో ఆధారాలు సేకరించిన పోలీసులు వర్ని: మండలంలోని రుద్రూర్ గ్రామానికి చెందిన సిరిగందం రాములు (58)అటెండర్ సోమవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం బోధన్ డీఎస్పీ వెంకటేశ్వర్లు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. రాములు పరిశోధన కేంద్రంలోని కృషి విజ్ఞాన్ కేంద్రంలో 31ఏళ్లుగా అటెండర్‌గా పనిచేస్తున్నాడు. రోజులాగే విధులకు వెళ్లిన రాములు సాయంత్రం తిరిగి ఇంటికి రాక పోవడంతో మృతుడి కుమారుడు సాయిలు తండ్రికి మంగళవారం ఉదయం 5గంటల ప్రాంతంలో ఫోన్ చేశాడు. ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో కుటుంబ ...

Read More »