Breaking News

Yellareddy

బస్సు-లారీ ఢీకొన్న ప్రమాదంలో గాయపడిన డ్రైవర్ మృతి

ఎల్లారెడ్డి : మండలంలోని తిమ్మారెడ్డి శివారులో జరిగిన బస్సు-లారీ ఢీకొన్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బస్సు డ్రైవర్ మోహినొద్దీన్ గురువారం మృతి చెందినట్టు ఎల్లారెడ్డి సీఐ అనిల్ కుమార్ తెలిపారు. ఈ నెల 19న సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన డ్రైవర్‌కు తీవ్రగాయాలు కావడంతో చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించగా మృతి చెందినట్లు వెల్లడించారు. మరో ముగురు గాయపడ్డట్లు తెలిపారు. 33

Read More »

పోలీసులకే చుక్కలు చూపిస్తున్న యాహియా

ఎల్లారెడ్డి : ఆశ కాస్త అత్యాశగా మారి ఒక వైపు దొంగ పింఛన్ పొందుతూనే మరో పింఛన్ కోసం పన్నాగం పన్నిన యాహియా పోలీసులకు అవస్థలు పెడుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే కామారెడ్డి ఎస్‌టీవో పరిధిలో ఆరేళ్లుగా లేని ఉద్యోగాన్ని సృష్టించి పింఛన్ పొందుతున్న ఎల్లారెడ్డికి చెందిన యాహియా మరో సారి చేసిన ప్రయత్నం విఫలమైంది. ఎల్లారెడ్డి మండలంలోని వెల్లుట్ల పాఠశాలలో నైట్ వాచ్‌మెన్ ఉద్యోగాన్ని సృష్టించుకొని అధికారుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకున్న యాహియా వద్ద మొత్తం ఆరు సర్వీసు పుస్తకాలు ఉన్నట్లు కామారెడ్డిలోని అతని ...

Read More »

ఓమన్‌లో ఎల్లాపూర్‌తండా వాసి మృతి

తాడ్వాయి : మండలంలోని గుండారం గ్రామ శివారులో ఎల్లాపూర్‌తండాకు చెందిన గుగ్లూత్ దులియా(32) ఓమన్ దేశంలో రెండు రోజుల క్రితం విధులకు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని తండావాసులు తెలిపారు. లక్ష రూపాయలు అప్పు చేసి ఉపాధిని వెతుక్కుంటూ ఏడాది కిత్రం ఓమన్ వెళ్లాడని, అతడి మృతితో కుటుంబం వీధిన పడినట్లు తెలిపారు. ప్రభుత్వం స్పందించి దులియానాయక్ శవాన్ని ఇండియాకు తెప్పించి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. మృతుడికి భార్య లక్ష్మి, కుమారుడు సతీశ్, కూతుళ్లు స్వాతి, సుజిత ఉన్నారు.

Read More »

పుర్రె మనిషి ఆచూకీ చెప్పండి

ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి శివారులోని కొత్తకుంటలో ఐదు రోజుల క్రితం లభించిన పుర్రెకు సంబంధించిన సమాచారం కోసం ఫ్లెక్సీలు తయారు చేయించినట్లు సీఐ అనిల్ కుమార్ తెలిపారు. ఈ నెల 4న ఎల్లారెడ్డి సమీపంలోని కొత్తకుంటలో పుర్రెతో పాటు నల్లరంగు ప్యాంటు, ఆకు పచ్చని చెక్స్ షర్టు లభించిందన్నారు. మృతుడి వయస్సు 30 నుంచి 40 సంవత్సరాలు ఉంటుందని, ఆరు నెలల క్రితం చని పోయినట్లుగా తెలుస్తోందని అన్నారు. వివరాలు తెలిసిన వారు ఎల్లారెడ్డి ఎస్సై శ్రీధర్ రెడ్డి 9440795463 లేదా సీఐ అనిల్ కుమార్ ...

Read More »

బంగారం కోసమే మహిళ దారుణ హత్య?

ఎల్లారెడ్డి: లింగంపేట మండల కేంద్రంలో ఈ నెల 7న దారుణహత్యకు గురైన బండ లింగవ్వ హత్యకేసు ఛేదన కొలిక్కి వచ్చినట్లు సమాచారం. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పుటేజీ సహాయంతో కేసును పరిష్కరించడంలో ముందుకు వెళ్తున్నట్లు తెలిసింది. లింగవ్వ వద్ద ఉన్న బంగారం, వెండి కోసమే మరో ఇద్దరు మహిళలు కలిసి దారుణ హత్యకు ఒడిగట్టినట్లు సమాచారం. లింగంపేట మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన లింగవ్వకు ఎల్లారెడ్డి మండలం సబ్ధల్‌పూర్‌, దాల్‌మల్కపల్లి గ్రామాలకు చెందిన ఇద్దరు మహిళలతో సంబంధాలు ఉన్నట్లు సమాచారం. ...

Read More »

నిగనిగల్లో… నిజమెంత..!

కూరగాయలపై విషం చిమ్ముతున్నారు విచ్చలవిడిగా పురుగు మందుల వాడకం కూరగాయలపై రసాయన అవశేషాలు రోగాల భారిన పడుతున్న జనం పోచారం తండాకు చెందిన రమేష్‌. కూరగాయల మొక్కలకు చీడపీడలు వ్యాప్తి చెందాయి. వాటి నివారణకు వ్యవసాయాధికారులు మందులు తెలపడం లేదు. దీంతో పురుగు మందుల దుకాణా యజమానులు తెలిపిన మందులను పిచికారి చేస్తున్నారు. దేవునిపల్లి.మహిళా రైతులు తమ కూరగాయల పంటలకు పురుగు వస్తే ఏ మందులు వాడాలో ఎవరిని అడగాలో తెలియడం లేదు. దీంతో పురుగు మందులు విక్రయించేవారిని కూరగాయల మొక్కలకు రోగం వచ్చిందని ...

Read More »

మూడు నెలలుగా బిల్లులు అందలేదని నిరసన

ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మండలంలోని ఉపాధిహామీ కూలీలకు మూడు నెలలుగా కూలి డబ్బులు రావడం లేదని.. కూలి డబ్బులు ఇవ్వకుంటే కరవు కాలంలో ఏం తినాలని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట రాస్తారోకో చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. తమను ఆదుకోవాలని ఎంపీపీ నక్కగంగాధర్‌, ఏపీవో సాయిలుకు విన్నవించారు. కూలి డబ్బులు మూడు రోజుల్లో ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో కూలీలు శాంతించారు. మండలంలో రూ.1.30 కోట్ల ఉపాధి హామీ డబ్బులు బకాయి ...

Read More »

అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య

కొట్టాల్‌(ఎల్లారెడ్డి), : మండలంలోని కొట్టాల్‌ గ్రామంకు చెందిన బోదాసు నర్సింలు(30) అనే యువకుడు మంగళవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయమై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌.ఐ పూర్ణేశ్వర్‌ తెలిపారు. నర్సింలు మూడేళ్ల కిత్రం దుబాయ్‌కు వెళ్లినట్లు తెలిపారు. అక్కడ పని దొరకకపోవడంతో తిరిగి స్వగ్రామం చేరుకున్నాడు. ఇక్కడ వ్యవసాయం, కూలీ పనులు చేస్తున్న కాలం కలిసి రాకపోవడంతో చేసిన అప్పులు అధికమై జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. రైలు కింద పడి ...

Read More »

ఎల్లారెడ్డిలో నాలుగు షాపుల్లో చోరీ

ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డిలో శనివారం రాత్రి దొంగలు నాలుగు షాపుల తాళాలు తెరిచి దొంగతనం చేశారు. రాత్రి ఒంటి గంట తరువాత దొంగతనాలు జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. డైలీ బజార్‌లోని రెండు బంగారు నగల దుకాణాల షాపుల తాళాలు తెరిచిన దొంగలు అక్కడ ఏమీ లభించక పోవడంతో వాటి పక్కనే ఉన్న చికెన్ సెంటర్ తాళాలు పగులగొట్టి వాటిని పక్కనే పడేశారు. తరువాత క్లబ్ రోడ్డులో ఉన్న కిరాణా దుకాణం తాళాలు పగులగొట్టారు. అందులో ఉన్న సుమారు నాలుగు వేల రూపాయల నగదుతో పాటు ...

Read More »

నేడు ఎల్లారెడ్డికి మంత్రి హరీశ్‌రావు

ఎల్లారెడ్డి : మండల కేంద్రంలో నిర్మించిన పలు భవనాలను రాష్ట్ర మంత్రులు శనివారం ప్రారంభించనున్నారు. భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి ప్రారంభోత్సవం చేస్తారు. రూ.కోటీ 50 లక్షలతో నిర్మించిన గోదాంతో పాటు రూ.4కోట్లతో చేపట్టనున్న సిమెంటు రోడ్డు పనులు ఉన్నాయి. గ్రామీణ నీటి పారుదల శాఖ చేపట్టనున్న రూ.50 లక్షల పైపు లైన్ పనులు, అంబేద్కర్ చౌరస్తా నుంచి శివ్వానగర్ వరకు రూ.2కోట్లతో నిర్మించనున్న తారు రోడ్డు ...

Read More »