Breaking News

తాజా వార్తలు

అభ్యర్థులు ప్రవర్తన నియమావళి తప్పకుండా పాటించాలి

  కామారెడ్డి, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు మాడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ప్రవర్తన నియమావళిని తప్పకుండా పాటించాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు అభిషేక్‌ కృస్ణ సూచించారు. శుక్రవారం కామారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటైన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎటువంటి సందేహాలున్నా ఉదయం 11 నుంచి 1 గంట వరకు పరిశీలకులను సంప్రదించాలని, వాట్సాప్‌, ఫోన్‌ నెంబరు ద్వారా సైతం సంప్రదించవచ్చని చెప్పారు. ఈవిఎం, వీవీప్యాట్‌ యంత్రాల రెండవ ర్యాండమైజేషన్‌లో ...

Read More »

కాంగ్రెస్‌తోనే అభివృద్ది సాధ్యం

  రెంజల్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ పార్టీని అధిక మెజార్టీతో గెలిపించుకుని బోధన్‌ ఎమ్మెల్యే అభ్యర్థి సుదర్శన్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు సాయారెడ్డి, ఓబిసి జిల్లా అధ్యక్షుడు అసాని అనిల్‌ అన్నారు. మండలంలోని రెంజల్‌, బోర్గం గ్రామాల్లో శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో బోదన్‌ ఎమ్మెల్యే అభ్యర్థి సుదర్శన్‌రెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూత్‌ కాంగ్రెస్‌ ...

Read More »

నీలాలో పోలీసుల కవాతు

  రెంజల్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నీలా, పేపర్‌మిల్‌ గ్రామాల్లో శుక్రవారం పోలీసుల కవాతు నిర్వహించారు. గ్రామాల్లోని పలు వీధుల గుండా కవాతు నిర్వహించారు. త్వరలో జరగనున్న ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా ముందుగా ఈ ర్యాలీని బిఎస్‌ఎఫ్‌ జవాన్లతో నిర్వహించారు. ఈ కవాతులో ఏసిపి రఘు, సిఐ షకీర్‌ అలీ, ఎస్‌ఐ శంకర్‌ పాల్గొన్నారు.

Read More »

తెరాసలో చేరికలు

  కామరెడ్డి, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి తెరాస అసెంబ్లీ అభ్యర్థి గంప గోవర్దన్‌ సమక్షంలో శుక్రవారం పలు గ్రామాలకు చెందిన నాయకులు తెరాసలో చేరారు. ఇస్సానగర్‌ రెడ్డిసంఘం, పల్వంచ ఆటోయూనియన్‌ సభ్యులు, రామేశ్వర్‌పల్లి గ్రామస్తులు, మాచారెడ్డి మండలం ఫరీద్‌ పేట గ్రామస్తులు, పాతరాజంపేట మైనార్టీ సంఘం సభ్యులు, ఫ్రెండ్స్‌ యూత్‌ సభ్యులు, లింగాపూర్‌ యువజన సంఘం సభ్యులు, పట్టణ బిజెవైఎం నాయకులు తెరాస తీర్థం పుచ్చుకున్నారు. వీరితోపాటు సీనియర్‌ న్యాయవాది రమేశ్‌ చంద్‌, కౌన్సిలర్‌ అంజద్‌తోపాటు పలువురు ...

Read More »

కెసిఆర్‌ కుటుంబ పాలనను తరిమికొట్టండి

  కామరెడ్డి, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కెసిఆర్‌ కుటుంబ పాలనను తరిమికొట్టే సమయం ఆసన్నమైందని కామారెడ్డి శాసనసభ కాంగ్రెస్‌ అభ్యర్థి షబ్బీర్‌ అలీ అన్నారు. ఆయన శుక్రవారం బిక్కనూరు మండలం జంగంపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్‌ హయాంలో కట్టించిన ఇళ్ళు తప్ప రెండు పడక గదుల ఇళ్ళు ఎక్కడున్నాయో తెరాస నేతలు చూపాలని నిలదీశారు. మూడంతస్తుల భవనాన్ని గంప గోవర్ధన్‌ నిర్మించుకొని పేదల రెండు పడక గదుల ఇళ్లను పట్టించుకోలేదని ఆరోపించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ ...

Read More »

బిఎల్‌ఎఫ్‌ అభ్యర్థులను ఆదరించి గెలిపించండి

  కామరెడ్డి, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిఎల్‌ఎఫ్‌ అభ్యర్థులను ఆదరించి గెలిపించాలని ఎంసిపిఐయు జిల్లా కార్యదర్శి రాజలింగం కోరారు. శుక్రవారం మద్దికుంట, రెడ్డిపేట గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాజన ప్రంట్‌ పునాదిగా ఏర్పడిన బిఎల్‌ఎఫ్‌ అభ్యర్థులను ప్రజలు ఆదరించి గెలిపించాలని కోరారు. రైతు నాగలి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని పేర్కొన్నారు. నూటికి 90 శాతం ఉన్న బహుజనులు ఏకమై బహుజన రాజ్యాన్ని నిర్మించుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు రాజు, ...

Read More »

అసెంబ్లీలో మాట్లాడలేనోళ్ళు అభివృద్ధి ఏం చేస్తారు

  కామరెడ్డి, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అసెంబ్లీలో గళమెత్తని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ శాసనమండలిలో గళమెత్తని విపక్షనేత షబ్బీర్‌ అలీ అభివృద్ది ఏం చేస్తారని కామరెడ్డి బిజెపి శాసనసభ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన దేవునిపల్లి, మద్దికుంట, భవానీపేట్‌, ముత్యంపేట్‌, బీబీపేట్‌, భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి, జనగామతో పాటు కామారెడ్డి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. ఎన్ని సార్లు ఎమ్మెల్యే అయి ఏం లాభం, గంప గోవర్ధన్‌ ఒక్కసారైనా తన అసెంబ్లీ ...

Read More »

వర్ని మండలంలో పోచారం ప్రచారం

  బాన్సువాడ, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల ప్రచారంలో భాగంగా బాన్సువాడ నియోజకవర్గ తెరాస అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం వర్ని మండలంలో ప్రచారం నిర్వహించారు. మండలంలోని పాత వర్ని, రాజీపేట, ఫారం, శ్రీనగర్‌, శంకోర తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం కొనసాగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ది, రైతు సంక్షేమం తెరాసతో సాధ్యమని మంత్రి వెల్లడించారు. రైతు సంక్షేమానికి పెద్దపీట వేసి సాగుపెట్టుబడి రైతులకు జీవితబీమా సౌకర్యం కల్పించిందని వివరించారు. గత ప్రభుత్వాలు చేయలేని అభివృద్ది, ...

Read More »

సంక్షేమ పథకాలకు పెద్దపీట

  బాన్సువాడ, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేసిందని, సంక్షేమ ఫలాలు కొనసాగాలంటే మరోసారి తెరాస ప్రభుత్వాన్ని గెలిపించాలని ఆపద్దర్మ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం బాన్సువాడ నియోజకవర్గంలోని కోటగిరి మండలంలో కల్లూరు, లింగాపూర్‌, గన్నారం, తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని పేర్కొన్నారు. సాగునీటి, తాగునీటి రంగాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసిందని వివరించారు. పింఛన్లను పెంచి వికలాంగులను, ...

Read More »

24న పాత్రికేయులకు కంటివెలుగు శిబిరం

  కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో ఈనెల 24న ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులకు కంటివెలుగు కంటి పరీక్ష శిబిరం నిర్వహించనున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి తెలిపారు. జనహిత సమావేశమందిరం కలెక్టరేట్‌ ప్రాంగణంలో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం వరకు శిబిరం ఉంటుందన్నారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులు శిబిరాన్ని వినియోగించుకోవాలని కోరారు.

Read More »

నలభై ఏళ్ళు పాలించిన నాయకులు ఏం చేశారని ఓటేద్దాం

  కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిలో గత నలభై ఏళ్లుగా పాలించిన వివిద పార్టీల నాయకులకు ఏం అభివృద్ది చేశారని ఓటేయాలని కామారెడ్డి నియోజకవర్గ బిజెపి అభ్యర్తి కాటిపల్లి వెంకటరమణారెడ్డి నిలదీశారు. గురువారం ఆయన బీబీపేట మండలం మాందాపూర్‌, మాచారెడ్డి మండలం సోమార్‌పేట్‌, భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నలభై ఏళ్లుగా పాలించిన నాయకులు గాందీ విగ్రహం వద్ద తాము సంపాదించిన అక్రమ ఆస్తుల గురించి చర్చలు, డిబెట్లు పెట్టారు తప్ప ...

Read More »

హామీలు తప్ప ఏమీ చేయనివారికి ఎందుకు ఓటెయ్యాలి

  కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కెసిఆర్‌ అధికారంలోకి వచ్చాక 180 వాగ్దానాలు చేశారని, అందులో ఏ ఒక్కటి సంపూర్తిగా నెరవేర్చలేకపోయారని అలాంటి పార్టీ వ్యక్తులకు ఎందుకు ఓటెయ్యాలని కామారెడ్డి అసెంబ్లీ కాంగ్రెస్‌ అబ్యర్థి షబ్బీర్‌ అలీ నిలదీశారు. గురువారం ఆయన కామారెడ్డి మండలం లింగాపూర్‌తో పాటు పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. రెండు పడక గదుల ఇళ్ళు ఇస్తాం, అందమైన భవనాలు నిర్మించి ఇస్తామని కల్లిబొల్లి మాటలు చెప్పి ఎంతమందికి ఇచ్చారని ప్రశ్నించారు. తాము పింఛన్లు పెంచుతామంటే ...

Read More »

రాష్ట్రంలో జరిగిన సంక్షేమాన్ని చూసి తెరాసకు ఓటు వేయండి

  కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గడిచిన నాలుగున్నరేళ్ళలో తెరాస హయాంలో రాష్ట్రంలో జరిగిన సంక్షేమాన్ని చూసి ప్రజలు తిరిగి ఓటువేయాలని కామరెడ్డి అసెంబ్లీ తెరాస అభ్యర్థి గంప గోవర్ధన్‌ అన్నారు. గురువారం ఆయన భిక్కనూరు మండలం బాగిర్తిపల్లి, ఇసన్నపల్లి, ర్యాగట్లపల్లి, గుర్జకుంట, సిద్దిరామేశ్వరనగర్‌ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ కోసం నిర్విరామ పోరాటం చేసి తెలంగాణ తీసుకొచ్చిన కెసిఆర్‌ తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ సాధించుకునేందుకు అనేక సంక్షేమ ...

Read More »

24 నుంచి ఫోటో ఓటరు స్లిప్పులు పంపిణీ చేయాలి

  కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 24వ తేదీ నుంచి ఫోటో ఓటరు స్లిప్పులను డిసెంబరు 1వ తేదీలోగా బూత్‌ లెవల్‌ అధికారులతో పంపిణీ చేయాలని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకు జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ఆదేశించారు. గురువారం తన చాంబరు ద్వారా కామారెడ్డి, జుక్కల్‌, ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారులు, సహ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఎన్నికల నిర్వహణపై సమీక్షించారు. నూతనంగా ఓటు నమోదు చేయించుకున్నవారికి కార్డులు పంపిణీ చేయాలని తెలిపారు. పంపిణీ ...

Read More »

పోలింగ్‌ శాతం పెంచేలా చర్యలు

  కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నట్టు కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. కామారెడ్డి మునిసిపల్‌ కార్యాలయంలో గురువారం మునిసిపల్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాడల్‌ పోలింగ్‌ స్టేషన్‌ను కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్‌ 19నుంచి అన్ని గ్రామాల్లో ఈవిఎం, వీవీప్యాట్‌ యంత్రాల ద్వారా ఓటు నమోదు చేయువిధానంపై అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటి వరకు లక్ష 52 వేల 620 మంది ...

Read More »

సినిమా

<img src="http://www.nizamabadnews.in/wp-content/uploads/2015/09/nzb-whatsapp1.jpg" alt="nzb news" height="330" width="660">