Breaking News

తాజా వార్తలు

ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ లో ఓక కేసు పరిష్కారం

ఆర్మూర్ నవంబర్ 22 ప్రతి శనివారం ఆర్మూర్ పట్టణంలోని డిఏస్పీ కార్యాలయంలో నిర్వహించే ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ లో ఈ వారం ఎకకేసు పరిష్కారం అయినట్లు డిఏస్పీ ఆకుల రాంరెడ్డి తెలిపారు. మరో 3 కేసులను వచ్చే వారానికి వాయిదా వేసినట్లు ఆయన పేర్కోన్నారు.

Read More »

కస్తూభ గాంధీ విద్యార్థుల ప్రతిభ

బోధన్‌, నవంబర్‌22: 47వ గ్రంథలయ వార్షికోత్సవ సందర్బంగా నిర్వహించిన పోటీలలో బోధన్‌ పట్టణంలోని శక్కర్‌నగర్‌ కస్తూర్భా గాంధీ పాఠశాలకు చెందిన విద్యార్థులు పలు బహుమతులను గెలుపోంది తమ ప్రతిభను చాటరని పాఠశాల ప్రత్యేకాధికారి హిమబిందు తెలిపారు. వ్యాసరచన పోటీలలో ప్రథమ బహుమతిని యం.గీతాంజలి గెలుపోందారు. అలాగే దేశభక్తి పాటలలో యం.డీ తన్వీర్‌(ప్రథమ), ముగ్గుల పోటీల్లో బి.అఖిల(తృతీయ),పద్యపఠన పోటీలో ఎన్‌.కళ్యాణీ(తృతీయ), డ్యాన్స్‌ పోటీలో నిఖిత గృప్‌ (ప్రథమ), విచిత్ర వేషధారణలో శిల్ప (ప్రథమ) బహుమతులు గెలుపోందినట్లు ఆమె తెలిపారు. దీంతో పాఠశాల ఉపాద్యాయులు విద్యార్థులను అభినందించారు.

Read More »

సేంద్రియ ఎరువులపై రైతులు అవగాహన

బోధన్‌, నవంబర్‌22: సేంద్రియ ఎరువులతో పంటలు పండించాలని ఐకెపీ ఎన్‌పీయంలు రాధిక, శాంతి, బదురిన్నిసాలు సూచించారు. శనివారం బోధన్‌ మండలంలోని శ్రీనివాసనగర్‌, ఏరాజ్‌పల్లి, చెక్కిక్యాంప్‌ గ్రామాలలో సేంద్రియ ఎరువులతో పండిస్తున్నా పంటలను పరిశీలించారు. గ్రామీణ ప్రాంతాలలోని రైతులు సేంద్రియ ఎరువులతో పంటలు పండించాలని సూచించారు. సేంద్రియ ఎరువులు తయారు చేసుకునే విధానాన్ని రైతులకు వివరించారు. సేంద్రియ ఎరువులతో అధిక దిగుబడి వస్తుందన్నారు. రసాయని ఎరువులతో పంటలు పండించడంతో గ్రామీణ ప్రజలు రోగాల బారిన పడుతున్నరని తెలిపారు. మండలంలోని ఊట్‌పల్లి, నాగన్‌పల్లి, ఆచన్‌పల్లి, ఏరాజ్‌పల్లి, బెల్లాల్‌, ...

Read More »

బీడి కార్మికులకు వేయ్యి రూపాయాల భృతిని చెల్లించాలి ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా, ర్యాలీ

బోదన్‌, నవంబర్‌22: బీడీ కార్మికులకు ప్రతినెల వేయ్యి రూపాయాల భృతిని చెల్లించాలని కోరుతూ తెలంగాణ ప్రగతిశీల బీడి వర్క్‌ర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో శనివారం ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. బోధన్‌ మండలంలోని వివిధ గ్రామాలు, పట్టణానికి చెందిన బీడి కార్మికులు పట్టణంలోని మహాలక్ష్మి మందిరం నుంచి శర్బతికెనాల్‌, అంబేద్కర్‌ చౌరస్తా మీదుగా మహిళలు భారీ ర్యాలీని నిర్వహించి ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. ఆర్డీఓ కార్యాలయం ముందు గంటపాటు ధర్నా నిర్వహించి, వేయ్యి రూపాయాల భృతిని చెల్లించాలని, బీడీ కార్మికులకు ఆదుకోవాలని నినాదాలు చేశారు. ...

Read More »

తెయూలో రాజకీయాలకు విద్యార్థులు బలి

నిిజామాబాద్‌, నవంబర్‌ 22. -ప్రొఫెసర్‌ల మధ్య అంతర్గత విభేదాలు. -ఉన్నత విద్యా అవకాశాలను కోల్పోతున్న విద్యార్ధులు. -నిజాలను బయట పెట్టాలని అంటున్న విద్యార్థి సంఘాలు తెలంగాణా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌ల మధ్య ఏర్పడిన అంతర్గత విభేదాలు తారాస్థాయుకి చేరాయు. దీనికి రాజకీయాలు తోడవడంతో విద్యార్థులు నష్టపోతున్నారు. దీనికి పిహెచ్‌డి అడ్మిషన్లలో జరిగిన గందరగోళం ఒక ఉదాహరణ. అసలు ఏమి జరిగిందని పరిశీలిస్తే 2013-14 విద్యాసంవత్సరానికి గాను 2013లో పిహెచ్‌డి అడ్మిషన్లకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఎంట్రెన్స్‌ పరీక్ష జరిగిన ఆరు నెలల తరువాత ఫలితాలు విడుదల ...

Read More »

డిపిఓగా కృష్ణమూర్తి నియామకం

  నిజామాబాద్‌, నవంబర్‌ 22. జిల్లా పంచాయుతీ అధికారి బదిలీ అయ్యారు. ఆయనను నల్గొండ జిల్లా కు బదిలీ చేస్తూ పంచాయుతీరాజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ రేమండ్‌ పీటర్‌ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్‌ జిల్లా కు నల్గొండ డిపిఓగా పనిచేస్తున్న కృష్ణమూర్తిని నియమించారు. జిల్లా కలెక్టర్‌ సెలవులపై వెల్లడం, అతను ఇంచార్జీగా ఎవరిని నియమించక పోవడంతో కలెక్టర్‌ వచ్చె వరకు డిపిఒగా సురెష్‌ బాబు కొనసాగుతారు. కలెక్టర్‌ రోనాల్డ్‌రాస్‌ విధుల్లో చేరిన తరువాత సురేష్‌ బాబు రిలీవ్‌ అవుతారు. కొత్త డిపిఓగా ...

Read More »

ఈనెల 24న కలెక్టర్‌ రెట్‌ అమరణనిరహారదీక్ష

నిజామాబాద్‌,నవంబర్‌22 ఈనెల 24న తెలంగాణ కుమ్మరి శాలివాహన సంఘం అధ్వర్యంలో అమరణ నిరాహార దీక్ష చేపడుతున్నట్లు తెలంగాణ కుమ్మర శాలివాహన సంఘం అధ్యక్షులు అరెపల్లిసాయిలు,ఉపాధ్యక్షులు బుచ్చన్న తెలిపారు.శనివారం ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రముఖ్యమంత్రి 5-11-2014 తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం ఇవ్వడం జరిగిందని తమ డిమాండ్లు సానుకూలంగా కాకపోతే జిల్లా కమిటి అధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట అమరణ నిరాహారదీక్ష చేయనున్నట్లు తెలలియజేశారు. గత అరు నెలల నుండి కుమ్మర్లుకు సంబంధించిన 17 డిమాండ్లపై ...

Read More »

శ్రీవెంకటసాయి టైర్‌ రీట్రేడింగ్‌లో దొంగలించిన వారిపై చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌ నవంబర్‌22 నగర శివారులో ముబారక్‌నగర్‌లో గల ఎం.రాజగంగారెడ్డి చెందిన శ్రీవెంకటసాయి టైర్‌ రేట్రేడింగ్‌ ప్యాక్టరిలో శుక్రవారం దొంగలు పడి వస్తువులను దొంగలిచ్చారని దొంగలిచ్చిన వారిపై పోలీసుధికారులు చర్యలు తీసుకోవాలని యాజమాని ఎం.రాజగంగారెడ్డి అరోపించారు.శనివారం ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ తమ దుకాణంలో ఉదయం శుక్రవారం 7:30 నుండి మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో తమకు సమాచారం ఇవ్వకుండా తమ షాప్‌ వద్దనుండి మిషనరి, రమామెటీరియల్‌,బుకేలతో సహ వస్తువులను నగదు డబ్బులను నగరానికి చెందిన జి.శ్రావన్‌కుమార్‌రెడ్డి,తండ్రి,లక్ష్మారెడ్డి మరియు లక్ష్మారెడ్డి,రాజరెడ్డిలు ...

Read More »

డిసెంబర్‌ 3న ఓలింపిక్‌ ఎన్నికలు

నిజామాబాద్‌,నవంబర్‌ 22 వచ్చేనెల డిసెంబర్‌ నెలలో ఓలిపింక్‌ ఎన్నికలను నిర్వహించడం జరుగుతుందని ఓలంపిక్‌ జిల్లా అధ్యక్షులు బాగారెడ్డి తెలిపారు. శనివారం కలెక్టర్‌గ్రౌండ్‌ స్ప్రోర్ట్‌మైదానంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ తమ ఎన్నికలు ఐదు సంవత్సరాల ఒకసారి జరుగుతాయని క్రీడాకారులందరు మరిచిపోకుండా ఎన్నికల్లో హాజరుకావాలని సూచించారు.క్రీడాకారులకు కొరకు తాము ఎల్లప్పుడు వెన్నంటు ఉంటామని క్రీడాకారుల భవనిర్మాణం కోసం తొడ్పుడుతున్నామని నగరంలోని గంగాస్ధాన్‌లో పనులు జరగుతున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో క్రీడారులు పిఈటిలు సీనియర్‌ క్రీడాకరులు సినియర్‌ జర్నలిస్టు బొబ్బలినర్సయ్య,లక్ష్మన్‌,కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More »

యోగా తో అన్ని స‌మ‌స్య‌లు దూరం

ఆర్మూర్, న‌వంబ‌ర్22 : నిత్యం మోగా చేయండి ఆరోగ్యంగా నిల‌వండి అనే రాందేవ్ బాబా నినాదాన్ని అమ‌లు చేయ‌డానికి ఆయ‌న శిశ్యుడు రాజేంధ‌ర్ ఈ నెల 23, 24వ తేదిల‌లో సాయంత్రం ఆర్మూర్ మండ‌లంలోని పెర్కిట్ గ్రామంలోని ఎంఆర్ గార్డెన్స్ లో ఉచిత యోగా శిక్ష‌ణ శిభిరాన్ని ప్రారంబిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఈ శిబిరం రెండు బ్యాచులుగా నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంత‌న్నారు. ఉద‌యం 6గంట‌ల నుండి 7గంట‌ల 30 నిమిశాల వ‌ర‌కు, సాయంత్రం 6 గంట‌ల నుండి 7 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని ఆయ‌న అన్నారు. ...

Read More »

సిద్దుల‌గుట్ట‌ను సంద‌ర్శిచిన ఎన్ సిసి క‌మాండ‌ర్ రోహిత్ కుమార్

ఆర్మూర్, న‌వంబ‌ర్22 : ఆర్మూర్ స‌వ‌నాత‌పురం సిద్దుల గుట్ట‌ను 12ఎ బెటాలియ‌న్ ఎన్ సీసీ క‌మాండ‌ర్ ఆఫీస‌ర్ క‌ల్నల్ రోహితాష్ కుమార్ శ‌నివారం ఎన్సీసీ కార్య‌క‌ర్త‌ల‌తో సంద‌ర్శించి గుట్ట పై ఉన్న శివాల‌యం, రామాల‌యం, హ‌నుమాన్ మందిరాల‌ను ద‌ర్శించి గుట్ట‌యొక్క మ‌హ‌త్యాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆయ‌న వెంట సుద‌ర్శ‌న్, విజ‌య్, మల్లేష్, ఎన్ సీసీ కార్య‌క‌ర్త‌లు త‌దీత‌రులు పాల్గ‌న్నారు.

Read More »

7గురు పేకాట రాయుల్ల అరెస్ట్

ఆర్మూర్, న‌వంబ‌ర్22 : ఆర్మూర్ మండ‌లం పెర్కిట్ గ్రామంలోని గ‌డి వ‌ద్ద శుక్ర‌వారం పేకాట ఆడుతున్న 7గురు వ్య‌క్తుల‌ను అరెస్ట్ చేసిన‌ట్లు ఆర్మూర్ ఎస్ హెచ్ఓ ర‌వి కుమార్ తెలిపారు. విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు పేకాట స్థావ‌రం పై దాడి చేసి పేకాట‌రాయుళ్ల‌ను అదుపులోకి తీసుకున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. వీరి వ‌ద్ద నుండి రూ. 50 వేయిల 560ల‌ను, పేకముక్క‌ల‌ను స్వాదీనం చేసుకున్న‌ట్లు ఎస్ హెచ్ఓ పేర్కొన్నారు. ఇంకా ఎక్క‌డైనా పేకాట‌, మ‌ట్కా ఆడుతున్నారన్న స‌మాచారం ఉంటే ప్ర‌జ‌లు ద‌గ్గ‌ర‌లో ఉన్న పోలీస్ స్టేష‌న్ ...

Read More »

సిద్దార్థ కళాశాలలో ఫ్రేషర్స్ డే సంబరాలు

ఆర్మూర్ నవంబర్ ఆర్మూర్ పట్టణంలోని స్థానిక సిద్దార్థ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల ఫ్రేషర్స్ డే కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా విద్యార్థుల ఆటపాటలు, కేరింతలతో కళాశాల ప్రాంగణం మారుమ్రోగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా విచ్చేసిన కళాశాల చైర్మన్ ఆర్మూర్ నియోజకవర్గ టిడిపి ఇంచార్జీ రాజారాం యాదవ్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు అంకితభావంతో అధ్యాపకులు చెప్పిన బోధనలను శ్రద్దగా విని అర్థం చేసుకోని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన సూచించారు. ఈ సందర్బంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ...

Read More »

జీపీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

ఆర్మూర్, నవంబర్ 21 గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ మండలంలోని గోవింద్ పేట్ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం గోవింద్ పేట్ జీపీ కార్మికులు పంచాయతీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి సర్పంచ్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా సిఐటియు ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్ మాట్లాడుతూ గ్రామ సఫాయి సిబ్బంది 6 గురు పని చేస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బందికి రూ.3.500 వేతనం ఇవ్వాలని తీర్మాణం చేసినప్పటికీ గత నాలుగు ...

Read More »

రాష్ర్టస్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్ కి విజయ్ విద్యార్థుల జట్టు

ఆర్మూర్ నవంబర్ 21 22వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ లో ఆర్మూర్ మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన విజయ్ హైస్కూల్ విద్యార్థుల జట్టు రాష్ర్టస్థాయికి ఎంపికైనట్లు పాఠశాల వైస్ ప్రిన్సిపల్ విజయలక్ష్మీ శుక్రవారం తెలిపారు. ఈ సందర్బంగ ఆమె మాట్లాడుతూ నిజామాబాద్ లోని దాస్ నగర్ లోని నవ్యభారతి గ్లోబస్ పాఠసాలలో నిర్వహించిన 22వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ లో వాతావరణం, శీతోష్ణస్థితి, సమాజసంస్కృతి అనే అంశాలపై ప్రాజేక్టును ప్రదర్శించిన టి. హనికా, ఎ. శివాణి, ఎస్. అనూష, ఎస్. వైష్ణవి, ...

Read More »

సినిమా

<img src="http://www.nizamabadnews.in/wp-content/uploads/2015/09/nzb-whatsapp1.jpg" alt="nzb news" height="330" width="660">