Breaking News

తాజా వార్తలు

నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కామారెడ్డి నూతన అధ్యక్షుడు ముప్పారపు ఆనంద్‌ గుప్త, కామారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు యాద నాగేశ్వర్‌ రావు, కామారెడ్డి జిల్లా పిఆర్‌ఓ విశ్వనాధుల మహేష్‌ గుప్త, అడ్మినిస్ట్రేషన్‌ సెక్రటరీ గారిపల్లి శ్రీధర్‌ గుప్త ఎమ్మెల్యేను సన్మానించారు. నూతన కార్యవర్గ సభ్యులకు ఎమ్మెల్యే గోవర్ధన్‌ అభినందనలు తెలిపారు. సంఘం అభివృద్దికి తోడ్పడతామని ...

Read More »

రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుంది

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను టిఆర్‌ఎస్‌ పార్టీలో చేర్చుకుని కాంగ్రెస్‌ పార్టీని టిఆర్‌ఎస్‌లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ, అసెంబ్లీ పక్ష నేత బట్టి విక్రమార్క తదితరులు అసెంబ్లీ ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్‌ నియంత పాలన కొనసాగుతుందని, ప్రతిపక్షం లేకుండా చేయాలని సీఎం కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. ...

Read More »

ప్యానల్‌ స్పీకర్‌ను కలిసిన నిజాంసాగర్‌ ఎంపిటిసిలు

నిజాంసాగర్‌, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని ఆయా గ్రామాల తెరాస ఎంపీటీసీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలవడంతో అసెంబ్లీ ప్యానల్‌ స్పీకర్‌ హన్మంత్‌ షిండే నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. టిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించడంతో అభినందనలు తెలిపారు. అనంతరం హన్మంత్‌షిండే మాట్లాడుతూ సిఎం కేసీఆర్‌తోనే తెలంగాణ అభివద్ధి సాధ్యమన్నారు. టిఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించడంతో గ్రామాల అభివద్ధి పట్టణాలు అభివద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. నిరుపేద ఆడపడుచుల కోసం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను ...

Read More »

ఎంపీ బీబీపాటిల్‌ను కలిసిన ఎంపిటిసిలు

నిజాంసాగర్‌, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని ఆయా గ్రామల టీఆర్‌ఎస్‌ ఎంపిటిసిలు పట్లోళ్ల లక్ష్మి దుర్గారెడ్డి, చాకలి సుజాత రమేష్‌, ఎంపీ బీబీ పాటిల్‌ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ తెలంగాణ అభివద్ధి కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు. ఏ ప్రభుత్వాలు కూడా అభివద్ధి జరగలేదని కెసిఆర్‌ పాలనలో అభివద్ధి జరుగుతుందన్నారు. వారి వెంట సర్పంచ్‌ రమేష్‌ గౌడ్‌, ఎయంసి వైస్‌ చైర్మన్‌ గైని విట్ఠల్‌, యటకరి నారాయణ, నాయకులు శ్రీకాంత్‌ ...

Read More »

అక్కా చెల్లెళ్ళ అదశ్యం

బీర్కూర్‌, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని బొమ్మన్‌దేవుపల్లి గ్రామంలో అక్కా చెల్లెళ్ళు అదశ్యమయ్యారని ఎస్‌ఐ సందీప్‌ తెలిపారు. పోలిసుల కథనం ప్రకారం బోమన్‌ దేవ్‌పల్లి గ్రామానికి చెందిన కుర్మా మల్లయ్య, సాయవ్వ దంపతులకు సంధ్యారాణీ, మౌనిక ఇద్దరు కుమార్తెలు. వీరు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో సంధ్య రాణి 9వ తరగతి, మౌనిక 8వ తరగతి చదువుతున్నారు. తండ్రి మల్లయ్య ఉపాధి కొరకు దుబాయ్‌ వెళ్ళగా ఈ క్రమంలో ఈ నెల 3వ తేదీన ఉదయం తల్లి సాయవ ...

Read More »

రైలుకింద పడి వ్యక్తి ఆత్మహత్య

కామారెడ్డి, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వడియారం-మాసాయిపేట రైల్వేస్టేషన్‌ల మధ్య బుధవారం గుర్తు తెలియని వ్యక్తి (60) రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్టు కామారెడ్డి ఎస్‌ఐఆర్‌టి థావూనాయక్‌ తెలిపారు. మృతుని కాళ్లు, చేతులు, తల తెగిపడ్డాయని, సంఘటన స్థలంలోనే మృతి చెందాడని పేర్కొన్నారు. మృతుని షర్టుపై డిఆర్‌కె సికింద్రాబాద్‌ టైలర్‌ మార్కు ఉందన్నారు. మృతునికి తెలుపు గడ్డం, తెలుపు మీసాలు, సుంతి చేయబడి ఉందని వివరించారు. మృతుని గుర్తిస్తే 94407 00034 నెంబర్‌కు ఫోన్‌ చేయాలని పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం ...

Read More »

అక్రమంగా తరలిస్తున్న బియ్యం పట్టివేత

కామారెడ్డి, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహబూబ్‌నగర్‌ నుంచి బీదర్‌కు అక్రమంగా తరలిస్తున్న 250.60 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని బుధవారం స్పెషల్‌ టాస్క్‌పోర్సు, విజిలెన్సు అదికారులు పట్టుకున్నారు. పక్కా సమాచారం మేరకు దాడులు నిర్వహించి రామారెడ్డి రోడ్డులోగల గ్యాలక్సీ గార్డెన్‌ వద్ద లారీలో తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకున్నట్టు తెలిపారు. లారీని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు. దాడుల్లో హైదరాబాద్‌ స్పెషల్‌ ఫోర్సు శ్రీనివాస్‌, ఎన్‌ఫోర్సు మెంట్‌ డిటి చంద్ర రాజేశ్వర్‌, విజిలెన్సు ఏఎస్‌వో సుదర్శన్‌ తదితరులు పాల్గొన్నారు. The following ...

Read More »

పేద కుటుంబాలకు ఉచిత సామాగ్రి పంపిణీ

కామారెడ్డి, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో శాసనమండలి మాజీ ప్రతిపక్షనేత షబ్బీర్‌ అలీ కుల, మతాలకు అతీతంగా పేదలకు రంజాన్‌ పురస్కరించుకొని పండగ సామాగ్రి, బియ్యం, తదితరాలను ఉచితంగా 5 వేల కుటుంబాలకు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా షబ్బీర్‌ మాట్లాడుతూ రంజాన్‌ మాసం ముస్లింలకు పవిత్రమని, మాసంలో ప్రతి ఒక్కరు సాధ్యమైనంత వరకు పేదలు, వికలాంగులకు, అనాథలకు తమకు తోచిన దానం చేయాలని పేర్కొన్నారు. రంజాన్‌ మాసంలో ఉపవాసముంటే ఆకలిబాధ ...

Read More »

ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్‌, ఎస్‌పి

కామారెడ్డి, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని ఈద్గా వద్ద జరిపిన ప్రత్యేక ప్రార్థనల్లో ముస్లింలు పాల్గొన్నారు. మాజీ శాసనమండలి విపక్షనేత షబ్బీర్‌ అలీ సైతం అక్కడే ప్రార్థనలు చేశారు. జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, ఎస్‌పి శ్వేత, మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మతో పాటు ఇతర అధికారులు కలిసి పండగ శుభాకాంక్షలు తెలిపారు. పండగలను అందరు కలిసి నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని, కామారెడ్డి మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. అందరు సోదర భావంతో మెలగాలని ...

Read More »

ఘనంగా రంజాన్‌ వేడుకలు

కామారెడ్డి, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో బుధవారం ముస్లింలు రంజాన్‌ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పండగ పురస్కరించుకొని ఈద్గా వద్ద అధికారులు ముస్లింల ప్రార్థనల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముస్లింలు ఈద్గా వద్దకెళ్ళి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒకరినొకరు ఆలింగనం చేసుకొని పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. హిందువులు సైతం ఈద్గావద్ద కెళ్ళి ముస్లింలను కలిసి రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. మత సామరస్యాన్ని చాటుకున్నారు. పండగ చేసిన సందర్భంగా చేసిన ప్రత్యేక వంటకాలను ఆరగించారు. ...

Read More »

ఘనంగా రంజాన్‌

నందిపేట్‌, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పవిత్ర రంజాన్‌ పండుగ వేడుకలను బుధవారం ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రమైన నందిపేట్‌తోపాటు ఖుదావన్‌పూర్‌, డొంకేశ్వర్‌, నూత్‌పల్లి, వన్నెల్‌, మల్లారం తదితర గ్రామాల్లో ముస్లింలు ఈద్‌గాలలో ప్రత్యేక ప్రార్తనలు నిర్వహించారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకొని రంజాన్‌ పండుగ శుభాక్షాంలు తెలుపుకున్నారు. వేడుకల్లో ముస్లిం మత పెద్దలతోపాటు పార్టీల నాయకులు, ఎస్‌ఐ రాఘవేందర్‌ తదితరులు పాల్గొన్నారు. The following two tabs change content below.BioLatest Posts Nizamabad News Latest ...

Read More »

సాటాపూర్‌ లో బడిబాట

రెంజల్‌, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన ఊరు మన అంగన్‌వాడి కార్యక్రమంలో భాగంగా బుధవారం సాటాపూర్‌ గ్రామంలో బడిబాట కార్యక్రమంపై అవగాహన ర్యాలీని ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్‌ ప్రమీల జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీలో పిల్లల తల్లిదండ్రులు, కిశోర బాలికలతో గ్రామంలోని ప్రధాన వీధులగుండా ర్యాలీ నిర్వహించి ఇంటింటికి తిరుగుతూ 30 నెలలు నిండిన పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాలలో చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. కార్యక్రమంలో తల్లులతో, కిశోర బాలికలతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు భాగ్య, సావిత్రి, ...

Read More »

ఘనంగా రంజాన్‌ వేడుకలు

రెంజల్‌, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పవిత్ర రంజాన్‌ పండుగ వేడుకలను బుధవారం ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రమైన రెంజల్‌ తోపాటు సాటాపూర్‌, నీలా, కందకుర్తి, బొర్గం, తాడ్‌ బిలోలి, వీరన్నగుట్ట తదితర గ్రామాల్లో ముస్లిం సోదరులు ఈద్గాహ్‌లలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరినొకరు అలింగనం చేసుకొని రంజాన్‌ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వేడుకల్లో ముస్లిం మత పెద్దలతోపాటు పలు పార్టీల నాయకులు, ఎస్‌ఐ శంకర్‌ పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. The following two ...

Read More »

ప్రజల సహకారంతోనే పర్యావరణ పరిరక్షణ

జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల సహకారంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. జూన్‌ 5 న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు, అటవీ శాఖ, జన విజ్ఞాన వేదిక, ఎన్జీవోస్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ నుండి బస్టాండ్‌ ద్వారా బాల్‌ భవన్‌ వరకు అవగాహన ర్యాలీ ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ ర్యాలీని ప్రారంభించిన అనంతరం బాలభవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రపంచీకరణ, నగరీకరణ, జనాభా ...

Read More »

ఘనంగా రంజాన్‌ వేడుకలు

బీర్కూర్‌, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పవిత్ర రంజాన్‌ పండుగ వేడుకలను బుధవారం ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రమైన నసురుల్లాబాద్‌తోపాటు దుర్కి, మిర్జాపూర్‌, మైలారం తదితర గ్రామాల్లో ముస్లిం సోదరులు ఈద్గాహ్‌లలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరినొకరు అలింగనం చేసుకొని రంజాన్‌ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వేడుకల్లో ముస్లిం మత పెద్దలతోపాటు పలు పార్టీల నాయకులు, ఎస్‌ఐ సందీప్‌ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. The following two tabs change content below.BioLatest Posts Nizamabad ...

Read More »

సినిమా

<img src="http://www.nizamabadnews.in/wp-content/uploads/2015/09/nzb-whatsapp1.jpg" alt="nzb news" height="330" width="660">